ఉత్కళలో మరోసారి కూర్మావతార దర్శనమైంది. లక్షల సంఖ్యలో కూర్మాలు జన్మించాయి. ఇది ఆధ్యాత్మిక అద్భుతంగాను, శాస్త్రీయ సంభవంగాను కూడా చూస్తారు. ఓలివ్‌ ‌రిడ్లే తాబేళ్ల గురించి దేశమంతా ఎప్పుడూ ఆసక్తిగానే చూస్తుంది. ఒడిశాలోని గంజాం జిల్లా సాగరతీరంలో రుషికుల్య రూకెరీలో ఓలివ్‌ ‌రిడ్లే సముద్ర తాబేళ్లు ఏటా గుడ్లు పెడతాయి. అవి కూడా లక్షలలో. శ్రీ మహావిష్ణువు దశావతారాలలో రెండోది కృతయుగంలోని కూర్మావతారం. దేవదానవులు అమృతం కోసం పాలసముద్రాన్ని చిలికినప్పుడు కవ్వంగా ఉన్న మంధర పర్వతం సముద్రంలో మునిగిపోతుండగా, విష్ణుమూర్తి కూర్మరూపంలో దానిని భరిస్తాడు. సముద్రంలో ఏ ప్రాంతంలో కూర్మావతారం సంభవించినది ఇదమిత్థంగా చెప్పలేం కానీ, ఒడిశాలోని ‘బైతరకనిక’ లోని ఏకైక తాబేళ్ల జాతీయవనంలోనే ఓలివ్‌ ‌రీడ్‌ ‌తాబేళ్లు ఉండటం విశేషం. దీన్నే ఒడిశా తాబేళ్ల స్వర్గధామం అంటారు.

అమృతమథనం జరిగిన స్థలం గురించి కచ్చితంగా చెప్పలేకపోయినా అంచనాల ప్రకారం కటక్‌ ‌పరిసరాల్లోని సముద్రజలాల్లో జరిగి ఉండ వచ్చని నమ్ముతున్నారు. కాబట్టి ఒడిశాలోని రుషికుల్య తీరంలో ప్రతి సంవత్సరం జరిగే తాబేళ్ల జననాన్ని ఒక రకంగా కూర్మావతార ఘట్టాన్ని గుర్తు చేసే ఆధ్యాత్మిక విశేషంగా చెప్పుకోవచ్చునని పలువురి అభిప్రాయం.

అయితే కూర్మావతారానికి ఆంధప్రదేశ్‌లోని శ్రీకాకుళం దగ్గరి శ్రీకూర్మానికి, ఒడిశా రుషికుల్యా నది బంగాళాఖతంలో కలిసే చోటుకు ఎంతో ఆధ్యాత్మిక సంబంధం, ప్రాముఖ్యం ఉన్నట్లు అనిపిస్తుంది. బంగాళాఖాతం (లేదా చోళుల సరస్సు) తీరానికి చాలా దగ్గరగా ఉన్న శ్రీ కూర్మనాథస్వామి ఆలయం ఒడిశా తీరంలోని నగరాలకు దగ్గరగా ఉంది. ఇక్కడ మార్చిలో తాబేళ్లు గుడ్లు పెడతాయి. అవి అక్కడే ఎందుకు అంత పెద్ద సంఖ్యలో గుడ్లు పెడతాయి? గుడ్లు పెడుతున్నాయంటే తాబేళ్లను అవతరింపచేయడమే కదా! దీనికి శ్రీ కూర్మం ఆవిర్భావాన్ని ఆధారంగా తీసుకోవచ్చు.

 శ్రీకూర్మం ఆవిర్భావ గాథ

దక్షిణ సముద్రతీరంలోని శ్వేతపురమనే పట్టణాన్ని శ్వేతచక్రవర్తి పరిపాలించేవాడు. ఆయన భార్య విష్ణుప్రియ. మహా విష్ణు భక్తురాలు. ఆమె ఒకనాడు ఏకాదశివ్రత దీక్షలో ఉండగా శ్వేతమహారాజు కోరికతో దరిచేరాడు. ఆమె భర్తను సాదరంగా ఆహ్వానించి, కూర్చుండబెట్టి, పూజా మందిరానికి పోయి విష్ణువును ధ్యానించి, ‘స్వామీ! అటు నా భర్తను కాదనలేను. ఇటు వ్రతం భంగపడనివ్వలేను. నువ్వే నన్ను రక్షించాలి. స్వామీ! కూర్మరూపమున మంధర• గిరిని ధరించలేదా? అలాగే నన్ను ఆదుకో’ అని వేడుకొంది. శ్రీమన్నారాయణుడు దర్శనమిచ్చి, అక్కడనే గ••ంగను ఉద్భవింపజేశాడు.

అది మహా ఉధృతంగా మహారాజు వైపునకు రాగా ఆయన భయంతో ఒక పర్వతం మీదకు చేరాడు. అనంతరం సంగతి తెలిసిన రాజు ప•శ్చాతాపం చెంది తన పాపానికి మరణమే ప్రాయశ్చిత్తమని తలచి శ్రీమహా విష్ణువును ధ్యానించాడు. నారదుడు విషయం తెలుసుకొని రాజుకు శ్రీకూర్మ మంత్రం ఉపదేశించాడు. దీక్షతో ధ్యానించ వలసిందని, ఆ గంగా ప్రవాహం వంశధార పేరుతో సాగరంలో లీనమవుతుందని, అది సాగర సంగమ ప్రదేశమని చెప్పాడు. రాజు వంశధారలో స్నానమాచరించి, అక్కడి జ్ఞానేశ్వరుని, సోమేశ్వరుని పూజించి, తపస్సు ప్రారంభించాడు. అయినా శ్రీ మహావిష్ణువు కరుణించలేదు. నారదుడి విన్నపం మేరకు శ్రీహరి చక్రతీర్థగుండం నుంచి కూర్ముడిగా వెలువడి నాలుగు చేతులలో శంఖం, చక్రం, గద, పద్మం ధరించి శ్వేతమహారాజుకు దర్శనమిచ్చాడు. అక్కడే కొలువుదీరవలసిందిగా స్వామిని మహారాజు వేడుకున్నాడు. అంగీకరించిన శ్రీమహావిష్ణువు తగిన మంచి స్థానం కోసం అన్వేషిస్తూ, నారదునితో కలసి ఒక వటవృక్షం వద్దకు వచ్చి, దానిపై చక్రాయుధం ప్రయోగించాడు. అక్కడ క్షీర సమానమైన జలం ఉద్భవించింది. దానిని కూర్మగుండం లేదా శ్వేతగుండం అంటారు. చక్రం వెళ్లిన మార్గం నుంచి శ్రీమహాలక్ష్మి ప్రత్యక్షమై , స్వామివారి వామభాగాన్ని అధిష్టించింది. అలా శ్రీకూర్మనాథుడు లక్ష్మీ సమేతుడై అక్కడ స్థిరనివాసం ఏర్పరచుకున్నాడు.

పద్మపురాణంలోని శ్వేతగిరి మహాత్మ్యం, 30 అధ్యాయంలోని వివరాల ప్రకారం, వంశధార నదీతీరంలోని శ్రీకూర్మశైలంపై గల కూర్మనాథుడు విరాడ్రూపం. ఈ క్షేత్రానికి దక్షిణాన ప్రేతశిల అనే పర్వత ప్రాంతంలో కౌటిల్యతీర్థం ఉంది. అందులో స్నానం చేసి, ప్రేతశిలలోని విష్ణుపాదాలపై పిండ ప్రదానం, కౌటిల్య తీర్థం పితృతర్పణం చేస్తే, గయతో సమానంగా శ్రాద్ధ ఫలం దక్కుతుందని విశ్వాసం. ఇక్కడి చక్ర, నారద, కౌటిల్య, మాధవ, నరసింహ, కూర్మతీర్థాలు, వంశధార, లాంగలీనదుల్లో స్నానం చేసి, శ్రీకూర్మనాథుని కొలవడం ఆచారంగా వస్తోంది.

శ్రీకూర్మం పంచలింగారాధ్యక్షేత్రం. తూర్పున వంశధార సాగర సంగమ ప్రదేశంలో క•ళింగ పట్టణంలో కర్పూరేశ్వరుడు, ఉత్తరాన సిందూర పర్వతంపై (సింగుపురపుకొండ) హటకేశ్వరుడు, ప••శ్చిమంలో నాగావళీ తీరం శ్రీకాకుళం పట్టణంలో కోటేశ్వరుడు, దక్షిణాన (పిప్పల) ఇప్పిలి గ్రామంలో సుందరేశ్వరుడు, శ్రీకూర్మంలో సుధాకుండ తీరంలో సిద్ధేశ్వరుడు క్షేత్రపాలకులుగా వేంచేసి ఉన్నారు. శ్రీకూర్మక్షేత్ర ముఖద్వారంలో భైరవుడు, ఆలయ ప్రాకారంలో అష్టదిక్పాలురు క్షేత్రపాలకులై స్వామిని సేవిస్తున్నారు. శ్రీహరి కూర్మావతారంలో పూలందు కుంటున్న ఆలయం ప్రపంచంలో శ్రీకూర్మ క్షేత్రం ఒకటే.

ఓలివ్‌ ‌రీడ్‌ ‌టర్టిల్‌ ‌తాబేళ్ల జననం శాస్ట్రీయ దృగ్విషయం (మీఱవఅ•ఱ•ఱమీ•శ్రీశ్రీ• అ••బతీ•శ్రీ జూష్ట్రవఅశీఎవఅశీఅ) మాత్రమే కాదు. ఒక ఆధ్యాత్మిక అద్భుతం. రుషి•కుల్య బీచ్‌లో ప్రతి ఏటా జరిగే తాబేళ్ల జననాన్ని ప్రకృతి సహజంగా జరిగే ఒక పక్రియగా (జూష్ట్రవఅశీఎవఅశీఅ) కొందరు పేర్కొంటున్నారు. రుషికుల్య బీచ్‌లోని సహజ, అనుకూల వాతావరణ పరిస్థితులు తాబేళ్లు పొదగడానికి కారణాలుగా చెబుతున్నారు. అయితే క్షీరసాగర మథనం, కూర్మావతార-శ్రీ కూర్మక్షేత్ర ఆవిర్భావం, ఏటా రుషికుల్య తీరంలో పెద్ద సంఖ్యలో తాబేళ్ల జననం… ఈ విశేషాలన్నీ ఒడిశా, ఆంధప్రదేశ్‌ని ఆనుకుని ఉన్న బంగాళాఖాత తీరంలో జరగడం ఒక ఆధ్యాత్మిక ఆధారిత ఘటనలుగానే కొందరు చెబుతున్నారు. సాక్షాత్తు విష్ణువు అవతారంగా జన్మిస్తున్న కూర్మాలాన్నీ ఎటువంటి పర్యావరణ ఒత్తిళ్లకు కాకుండా, ఇతర జంతువుల/వేటగాళ్ల బారిన పడకుండా సముద్రంలో సుఖమయ జీవనం సాగిస్తాయని ఆశిద్దాం.

‘‘సర్వే భద్రాణి పశ్యంతు’’ అన్న శ్రుతి వాక్యాన్ననుసరించి మానవులే కాక ఈ లోకం లోని ప్రతి జీవి సుఖమయ జీవితాన్ని గడపాలని ఆ భగవంతుణ్ణి మనసారా ప్రార్ధిద్దాం. వచ్చే ఏడాది మార్చిలో జరిగే ఈ అద్భుత కూర్మావతార ఘట్టాన్ని వీక్షించడానికై ఎదురుచూద్దాం.

మహావాది రామకృష్ణ

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE