భారతదేశాన్ని అఫ్ఘానిస్తాన్‌లా మార్చే ప్రయత్నం చాప కింద నీరులా సాగిపోతోంది. సార్వభౌమాధికారం కలిగిన భారత్‌లో వందలాది షరియా కోర్టులు నడుస్తున్నాయంటే నమ్మక తప్పదు. మొన్న పశ్చిమ బెంగాల్‌లో షరియా చట్టం మేరకు ఒక ముస్లిం వనితను నడిరోడ్డు మీదే కొరడాలతో కొట్టారు. నిన్న కర్ణాటకలోని దావణగెరె జిల్లాలో ఆరుగురు వీరాధివీర పురుషులు షరియా ఆదేశం మేరకు ఒక మహిళను చావగొట్టారు. ఇది భారతదేశంలో జడలు విప్పుతున్న ముస్లిం మతోన్మాదం స్వరూపానికి మచ్చుతునక. సంవత్సరం క్రితం పశ్చిమ బెంగాల్‌లో చోప్రా అనే చోట మసీదు పెద్దలే పంచాయతీ నిర్వహించి ఒక మహిళకు నడిరోడ్డు మీదే కొరడా డెబ్బల శిక్షను అమలు చేశారు. అక్కడ తీర్పరి తజ్మిల్ హక్. ఇతడు టీఎంసీ అనే పెద్ద సెక్యులర్ పార్టీ స్థానిక నాయకుడు. అంటే మమతా బెనర్జీ అనుచరుడు. దీనికి ఆనాడు టీఎంసీ ఎమ్మెల్యే హమీదుల్ రహమాన్ ఇచ్చిన వివరణ అందరినీ హతాశులను చేసింది. ఇలాంటి తీర్పులు, పంచాయతీలు చూసి ఆవేశ పడనవసరం లేదని, ‘‘ముస్లిం దేశం’’లో అనుసరించేది ఇదే న్యాయమని హమీదుల్ చాచికొట్టినట్టు చెప్పలేదా! ఆ దారుణం గురించి జాతి ఇంకా మరచిపోలేదు. ఇప్పుడు కర్ణాటకలో అదే తరహా కేసు బయటపడిరది. దావణగెరె జిల్లా తావరెకరె గ్రామంలో (చన్నగిరి తాలూకా)ని జామా మసీదు ఎదుటే పట్టపగలు ఈ దురంతం చోటు చేసుకుంది. పశ్చిమ బెంగాల్ మహిళకు కొరడా దెబ్బలు, దావణగెరె మహిళకు కర్రలు పైపుల దెబ్బలకు కారణం ఒక్కటే. వారి శీలాలను శంకించడమే.
ఈ వార్తకు ప్రాధాన్యం ఇచ్చి ఓ నాలుగు పంక్తులు రాస్తే భారత సెక్యులర్ వ్రతాన్ని భంగం చేసిన పాపం తగులుతుందేమోనని చాలా పత్రికలు వెంటనే వెల్లడిరచలేదు. పశుత్వానికి ఏ మాత్రం తక్కువకాని ఈ చర్య మొత్తానికి కొందరిని కదిలించింది. ఏప్రిల్ 7న జరిగిన దుర్ఘటన 15 తరువాత గాని బయటకు రాలేదు. వారం తరువాత ఎవరో ఆ వీడియోను బయటపెట్టారు. డొంకంతా కదిలింది.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో, సదా మైనారిటీల రక్షణ గురించి మాట్లాడే రాహుల్ పార్టీ రాజ్యంలో ఇది జరిగింది. అది వీడియోలో రికార్డయి సామాజిక మాధ్యమాల ద్వారా దేశవ్యాప్తమయింది. కాబట్టే కర్ణాటక కాంగ్రెస్ వీర సెక్యులర్ ప్రభుత్వం పెను నిద్దరను వదలవలసి వచ్చింది. ఇది ముందే దేశం మీదకు చేరింది కాబట్టి సరిపోయింది. లేకుంటే ఆ వీడియో తీసినవాడిని ఈ పాటికి జైల్లో కూర్చోబెట్టి ఉండేవారు. మసీదు పెద్దలని కాపాడేవారు.
పట్టపగలు అంతా చూస్తూ ఉండగానే 38 ఏళ్ల మహిళను ఆ ఆరుగురు కర్రలతో, పైపులతో చావగొట్టేశారు. ఇందుకు కారణం` గృహచ్ఛిద్రాల పేరుతో ఆమె భర్త మసీదులో ఇచ్చిన ఫిర్యాదు. ఇక్కడ వివాదాన్ని విచారించడానికీ, ఆలస్యం లేకుండా చావగొట్టే శిక్ష విధించడానికీ మసీదుకు ఏం హక్కు ఉందని ప్రశ్నించకండి! కనీసం స్పందించకండి! ఎందుకంటే` మీరు హిందూ మతోన్మాది అయిపోతారు. లేదా ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ వంత పాడేవారు కూడా అయిపోగలరు.
ఇంతకీ ఏం జరిగిందంటే` ఏప్రిల్ 7న షాబినా బాను అనే ఆ 38 ఏళ్ల మహిళ తన బంధువు నస్రీన్‌తో కలసి బయటకు వెళ్లింది. వారితో ఫయాజ్ అనే పురుషుడు కూడా ఉన్నాడు. వీరంతా తిరిగి వచ్చిన తరువాత షాబినా భర్త జమీల్ అహ్మద్ నస్రీన్‌ను, ఫయాజ్‌ను తన ఇంటిలో చూశాడు. అంతే, జమీల్‌కు కోపం తన్నుకు వచ్చింది. తావరెకరె జామా మసీదుకు వెళ్లి భార్య మీద, ఆ ఇద్దరి మీద ఫిర్యాదు చేశాడు. ఇంతకీ ఇతడికి భార్య తరఫు బంధువులు పురుషులు గాని, స్త్రీలు గాని తన ఇంటికి రావడం ఇష్టం ఉండదట. ఏప్రిల్ 9న షాబినా, నస్రీన్, ఫయాజ్‌లను తమ ముందు హాజరు కావలసిందిగా హుకుం జారీ చేసింది. ఆమె మసీదుకు చేరుకోగానే కొందరు కర్రలతో, పైపులతో షాబినా మీద దాడికి దిగారు. ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఆఖరికి వీడియో వైరల్ అయిన తరువాత ఆరుగురు మీద దాడి, కుట్ర, హత్యాయత్నం ఆరోపణలతో కేసు నమోదు చేశారు.
మసీదు వేసిన శిక్షను అమలు చేసిన వీర మతావలంబీకుల పేర్లు, వృత్తులు ఒకసారి చూద్దాం. మహమ్మద్ నియాజ్ (32) డ్రైవర్, మహమ్మద్ గౌస్ పీర్ (45) చెత్తాచెదారం అమ్ముకునే వాడు, చాంద్ బాషా (35) చెరుకురసం అమ్మేవాడు, దస్తగీర్ (24) బైక్ మెకానిక్, రసూల్ టీఆర్ (42) మత్స్యకారుడు, ఇనాయత్ ఉల్లా (51) స్థానికుడు. వీళ్లంతా కర్రలతో, పైపులతో కొట్టడమే కాకుండా, తనపై రాళ్లు విసిరి చంపేందుకు చూశారని కూడా షాబినా చన్నగిరి పోలీసుస్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నది. అంతేకాదు, తన పిల్లల మీద కూడా దాడి చేసి కొట్టారని ఆమె ఫిర్యాదు చేసింది. మసీదు నుంచి ఇంటికి వెళ్లిపోయానని, కానీ మనసు, శరీరం గాయాలతో తీవ్రంగా బాధపెట్టాయని ఆమె చెప్పారు. అందుకే భరించలేక పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినట్టు చెప్పారామె. ప్రస్తుతం ఆమె స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది. ఈ మత రక్షకులందరిపైనా భారతీయ న్యాయ సంహిత కింద కేసులు నమోదు చేశామని, ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కూడా నియమించామని పోలీసులు చెప్పారు.
ఎవరేమనుకున్నా ఈ దేశంలో షరియాయే తమకు ప్రధానమని చెబుతున్న ముస్లిం రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. ఇందుకు తాజా ఉదాహరణ ఏప్రిల్ 14న జరిగింది. జార్ఖండ్ మంత్రి హఫీజుల్ హసన్ తాను భారత రాజ్యాంగం కంటే షరియాకే మొదటి స్థానం ఇస్తానని చెప్పాడు. మేం ఖురాన్‌ను మా గుండెలలో మోస్తాం, రాజ్యాంగాన్ని మాత్రం చేత్తో పట్టుకుంటాం అని కూడా అన్నాడతడు.
కొన్ని నివేదికల ప్రకారం మన ‘సెక్యులర్’ భారతదేశంలో దాదాపు 100 షరియా కోర్టులు నడుస్తున్నాయి. ఈ విషయాన్ని 2023లోనే అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు చెప్పుకున్నది. ముస్లింలు ఎక్కువగా ఉన్న జిల్లాలలో వాటి సంఖ్య ఇంకా పెంచాలన్న ప్రతిపాదన కూడా ఉన్నట్టు బోర్డు వెల్లడిరచింది. దేశమంతటా దారుల్ ఖాజా (అంటే షరియా కోర్టులు) స్థాపించాలని 2018లోనే ఆ సంస్థ నిర్ణయించింది. కానీ ఈ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం త్రోసిపుచ్చింది. తమ తమ వివాదాల పరిష్కారానికి షరియా కోర్టులను ఆశ్రయించాలని 2020లో అఖిల భారత మజ్లిస్ ఇత్తేహాదుల్ ముస్లిమీన్ ముస్లింలకు సూచించింది. ఆశ్చర్యం కలిగించినా, భారత మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ కూడా ఇలాంటి సూచనే ముస్లింలకు చేశాడు. కేరళలో ఈ షరియా కోర్టుల, మసీదుల ఆధిపత్యం చాలా ఎక్కువ. వీళ్లు మాట వినని, సంప్రదాయోల్లంఘన చేసిన వాళ్ల కుటుంబాలనీ వెలి వేస్తారు. కేరళలోనే మల్లాపురంలో జాస్లీలా అనే ఒక ముస్లిం అమ్మాయి ఒక క్రైస్తవ యువకుడు టీసో థామస్‌ను పెళ్లి చేసుకుంది. దీనితో ఆమె కుటుంబాన్ని ముస్లిం పెద్దలు వెలేశారు. కేరళలోనే కీజత్తూర్ అనే చోట కున్నమ్మాళ్ యూసుఫ్ ఇలాంటి వెలినే ఎదుర్కొన్నాడు. ఇతడు తన కూతురిని వేరే వర్గం అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశాడు. దీనితో స్థానిక మసీదు పెద్దలు ఇతడి కుటుంబాన్ని వెలి వేస్తూ ప్రకటన జారీ చేశారు. 2019లో పాలక్కాడ్ జిల్లాలోను ఇలాంటిది జరిగింది. తిరితాలా అనే ముస్లిం కుటుంబంలో పెళ్లి జరిగింది. ఆ సమయంలో ఈ కుటుంబానికి చెందిన ఒక మహిళ బాహాటంగా ఫోటోల కోసం పోజులు ఇచ్చినందుకు ఆగ్రహించిన మసీదు పెద్దలు వెంటనే వెలివేశారు. ఫోటోలు తీయించుకోవడమే కాదు, సంగీత విభావరి పెట్టడం కూడా మసీదు పెద్దలకు ఆగ్రహం తెప్పించింది.
ఇది కేవలం షరియా కోర్టులు నిర్వహిస్తూ, భారత రాజ్యాంగం ఆధిపత్యాన్ని ప్రశ్నించడం మాత్రమే అనుకుంటే పొరపాటు. ఆ విధంగా ముస్లిం మతోన్మాదాన్ని దేశంలోకి తీసుకువస్తున్నారు. తాలిబన్ రాజ్యాన్ని, సూత్రాలను నెమ్మది నెమ్మదిగా అమలు చేస్తున్నారు. వీటితో ముస్లింలకు న్యాయం జరుగు తుందనుకుంటే శుద్ధ పొరపాటు. బెంగళూరులో, పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఉదంతాలే ఇందుకు నిదర్శనం. సెక్యులర్ భారత్‌లో కొన్నిచోట్ల పనిచేస్తున్న ముస్లిం న్యాయస్థానాలు తమ పరిధిలో లేదా ప్రాంతంలో ముస్లిం మతస్థులు మాత్రమే ఉండాలన్న సూత్రాన్ని కూడా అమలు చేస్తున్నారు. వీళ్లే ఔరంగజేబ్ వంటి ముస్లిం ఛాందసవాదులను కీర్తిస్తుంటారు. యువకులను రెచ్చగొట్టి హిందువుల ఉత్సవాల మీద దాడులు చేయిస్తుంటారు. అక్కడ ఏ విధమైన నిబంధన చెల్లుబాటు కాకుండా చేస్తారు. ఆఖరికి కరెంటు బిల్లు రీడిరగ్ చూడడానికి వచ్చిన ప్రభుత్వ ఉద్యోగులపైన కూడా దాడులకు దిగుతారు. ఇది కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సాగుతున్న దురాగతం.
ఫెమినిస్టులూ, ఉదారవాదులు, కమ్యూనిస్టులు, ప్రకాశ్‌రాజ్‌లు, స్వరా భాస్కర్‌లు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఎక్కడ బబ్బుంటారో తెలియదు. రాత్రి తీసుకున్న ద్రవ పదార్థం బాపతు ప్రభావం శరీరాన్ని వీడి వెళ్లి ఉండక పోవచ్చు. అందుకే వారం అయినా మాట్లాడడం లేదు. కునాల్ కమ్రా అనే చెత్త స్టాండప్ కమేడియన్‌ను వెళ్లి కలుసుకుని వాడి చేత భుజం మీద చేయి కూడా వేయించుకుని ఫోటోకి పోజు ఇచ్చిన ప్రకాశ్‌రాజ్! నీకు ఆ యువత ఆక్రందన వినిపించలేదా? ఆమె పిల్లలు చేసిన ఆర్తనాదాలు నీ చెవిని తాకలేదా? ఇక్కడ ముస్లిం అనవద్దు. ఒక మహిళను అలా నడిరోడ్డు మీద పెట్టి కర్రలతో బాదిన దుర్ఘటనను ఖండిరచాలని వీళ్లు ఎందుకు అనుకోరు! ప్రతి చిన్న విషయానికి కలగచేసుకునే బడా న్యాయస్థానాలకు ఇది పట్టకపోవడం మరీ విచిత్రం. ఇది బుద్ధీజ్ఞానం ఉండే మనుషులు చేయవలసిన పనేనా? భర్త ఫిర్యాదు చేశాడు. మసీదు పెద్దలు పిలిచారు. ఆమె వచ్చింది. ఓ విచారణ లేదు. ఒక ప్రశ్న లేదు. ఆమె వచ్చీ రావడంతోనే ఆ ఆరుగురు వీరులు ఆమె మీద దాడి చేశారే, దీని గురించి ఈ చచ్చు మేధావులు, పుచ్చు ఉదారవాదులు ఎందుకు నోరు విప్పరు? వీళ్లదీ ఒక మేధేనా? అసలు వీళ్లవీ ఒక బతుకులేనా? అని ప్రశ్నించాలి. వీళ్లు భారత రాజ్యాంగ రక్షణ గురించి మాట్లాడతారు. వీళ్లు భారతదేశంలో సెక్యులరిజం గురించి ఉపన్యాసాలు గుప్పిస్తారు.
ఈ ఫెమినిస్టులు, ఉదారవాదులు ఇప్పటికైనా మత్తు వీడితే మంచిది. మీరు సమర్ధిస్తున్న ముస్లిం మతోన్మాదులు, మీరు చంకలో వేసుకు తిరుగుతున్న ముస్లిం మతోన్మాదులు భారతదేశంలో తాలిబన్ రాజ్యాన్ని విస్తరించే పనిలో ఉన్నారు. ఈ దేశంలో మతోన్మాదం మెజారిటీ వర్గీయులది కానేకాదు. మైనారిటీలదే. అందులోను ముస్లింలలోని ఛాందసవాదులదే. మీ చెత్త ధోరణి వల్ల, కళ్లు మూసుకుపోయిన సెక్యులరిజం వల్ల షాబినా వంటి ఆడకూతుళ్లు నరకయాతన అనుభవిస్తున్నారు. బీజేపీ మీద కోపంతో ముస్లిం ఛాందసవాదాన్ని కౌగలించు కుంటున్న మీరంతా ఈ దేశానికి పట్టిన దౌర్భాగ్యం. మీ కళ, మీ రచనా వ్యాసంగం, మేధావులన్న మీ వీరతాళ్లు, వాటితో అప్పనంగా వస్తున్న కీర్తిప్రతిష్ఠలు ఇవన్నీ ముస్లిం ఛాందసవాదుల మతోన్మాదాన్ని రక్షించడానికి, పెంచి పోషించడానికి ఉపయోగిస్తున్న వాస్తవం మీకు ఎప్పటికి బోధపడుతుంది?
– జాగృతి డెస్క్