పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు – పీఎన్‌బీలో రూ.13,500 కోట్ల అవినీతి వ్యవహారంలో ప్రధాన నిందితుడు, దేశం నుంచి పారిపోయి విదేశాల్లో నక్కిన వజ్రాల వ్యాపారి మేహుల్‌ చోక్సీని బెల్జియంలో అధికారులు ఏప్రిల్‌ 12న అరెస్టు చేశారు. భారత ప్రభుత్వం అతడి అప్పగింత కోసం చేసుకున్న అభ్యర్థనకు స్పందనగా చోక్సీని అరెస్టు చేశారు. చోక్సీ తన భార్య ప్రీతితో కలసి బెల్జియంలో ఉంటున్నాడు. అక్కడే రెసిడెన్సీ కార్డును కూడా సంపాదించుకున్నాడు.

చోక్సీ అరెస్టు ఒక భారీ స్కాంకు సరైన ముగింపును ఇచ్చి, సత్వర న్యాయం అందించే దిశగా వేసిన ఒక కీలకమైన అడుగు అని చెప్పుకోవాలి. అదే సమయంలో స్కాం, తదనంతరం సంభవించిన పరిణామాలపై ప్రశ్నల తేనెతుట్టెను ఈ అరెస్టు మరోసారి కదలించింది. చోక్సీ దేశంలోనే అతి పెద్ద బ్యాంకింగ్‌ స్కాంకు ఎలా పాల్పడ్డాడు? అతడు అంత పెద్ద నేరం చేసినప్పటికీ దేశం నుంచి ఎలా తప్పించుకొని పారిపోగలిగాడు? ఈ కేసు మూలాల్లోకి వెళ్లడానికి ముందు ఈ స్కాం మూలాలు ఏ కాలంలో ఉన్నాయని వెదికితే అవి కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఉన్న కాలంలో, భారత రిజర్వ్‌ బ్యాంక్‌`ఆర్బీఐ గవర్నర్‌గా రఘురామ్‌ రాజన్‌ పనిచేస్తున్న కాలంలో వేళ్లూనుకున్నాయని తేలింది.

కాంగ్రెస్‌, ఆర్బీఐ మౌన ప్రేక్షక పాత్ర

మేహుల్‌ చోక్సీ, అతడి బంధువు ప్రమేయంతో ఈ భారీ స్కాం 2011లో మొదలైనప్పుడు కేంద్రంలో యూపీఏ కూటమి అధికారంలో ఉంది. సంబంధిత అధికారులు నెత్తీ నోరూ బాదుకొని మొత్తుకున్నప్పటికీ ఈ స్కాం ఏళ్ల తరబడి అడ్డూ అదుపూ లేకుండా సాగిపోయింది.

ఈ కాలంలోనే నానాటికి పెరిగిపోతున్న అవకతవకలను కాంగ్రెస్‌ నేతృత్వంలో ప్రభుత్వం చూసీచూడనట్టుగా వదిలేసింది. అంతకు సమానంగా లెటర్స్‌ ఆఫ్‌ అండర్‌టేకింగ్స్‌-ఎల్‌వోయూలు దుర్వినియోగాన్ని అడ్డుకోవడంలో గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ హయాంలో ఆర్బీఐ నిష్క్రియాపరత్వం ఆందోళన కలిగించే రీతిలో ఉంది. ఈ ఎల్‌వోయూలతో ఎలాంటి గ్యారంటీలు లేకుండా అదే పనిగా పెద్ద మొత్తంలో రుణాలను దక్కించుకున్నారు స్కాంలో నిందితులు. ఈ మోసపూరితమైన ఎల్‌వోయూలను అటు బ్యాంకు స్థాయిలో కానీ ఇటు ఆర్బీఐ స్థాయిలో కానీ గుర్తించకుండా జారీ చేస్తూ పోవడం అత్యంత దిగ్భ్రాంతికరం. ఇది సంస్థాగత నిర్లక్ష్యాన్ని, ఒక వ్యవస్థీకృత వైఫల్యాన్ని ఎత్తి చూపుతోంది.

చోక్సీ కోసమని 20:80 గోల్డ్‌ స్కీమ్‌!

మే 16, 2014న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. మోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. తదుపరి ప్రధాని ప్రమాణ స్వీకారం చేసేంతవరకు ఆపద్ధర్మ ప్రభుత్వంగా కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ కూటమి అధికారంలో ఉంది. సరిగ్గా ఆ సంధి కాలంలోనే అప్పటి ఆర్థిక మంత్రి పి.చిదంబరం అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నట్టుగా ఆఖరి నిమిషంలో అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ఇదేదో చూడబోతే అయినవారికి అప్పనంగా కావలసినవి కట్టబెడుతున్నట్టుంది. అందులో ఓ చోక్సీ అరెస్టు ఒక భారీ కుంభకోణానికి సరైన ముగింపును ఇచ్చి, సత్వర న్యాయం అందించే దిశగా వేసిన ఒక కీలకమైన అడుగు అని చెప్పుకోవాలి. అదే సమయంలో కుంభకోణం, తదనంతరం సంభవించిన పరిణామాలపై ప్రశ్నల తేనెతుట్టెను ఈ అరెస్టు మరోసారి కదలించింది. చోక్సీ దేశంలోనే అతి పెద్ద బ్యాంకింగ్‌ కుంభకోణానికి ఎలా పాల్పడ్డాడు? అతడు అంత పెద్ద నేరం చేసినప్పటికీ దేశం నుంచి ఎలా తప్పించుకొని పారిపోగలిగాడు? ఈ కేసు మూలాల్లోకి వెళ్లడానికి ముందు ఈ కుంభకోణం మూలాలు ఏ కాలంలో ఉన్నాయని వెదికితే అవి కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఉన్న కాలంలో, భారత రిజర్వ్‌ బ్యాంక్‌`ఆర్బీఐ గవర్నర్‌గా రఘురామ్‌ రాజన్‌ పనిచేస్తున్న కాలంలో వేళ్లూనుకున్నాయని తేలింది.

కాంగ్రెస్‌, ఆర్బీఐ మౌన ప్రేక్షక పాత్ర

మేహుల్‌ చోక్సీ, అతడి బంధువు ప్రమేయంతో ఈ భారీ కుంభకోణం 2011లో మొదలైనప్పుడు కేంద్రంలో యూపీఏ కూటమి అధికారంలో ఉంది. సంబంధిత అధికారులు నెత్తీ నోరూ బాదుకొని మొత్తుకున్నప్పటికీ ఈ కుంభకోణం ఏళ్ల తరబడి అడ్డూ అదుపూ లేకుండా సాగిపోయింది.

ఈ కాలంలోనే నానాటికి పెరిగిపోతున్న అవకతవకలను కాంగ్రెస్‌ నేతృత్వంలో ప్రభుత్వం చూసీచూడనట్టుగా వదిలేసింది. అంతకు సమానంగా లెటర్స్‌ ఆఫ్‌ అండర్‌టేకింగ్స్‌-ఎల్‌వోయూలు దుర్వినియోగాన్ని అడ్డుకోవడంలో గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ హయాంలో ఆర్బీఐ నిష్క్రియాపరత్వం ఆందోళన కలిగించే రీతిలో ఉంది. ఈ ఎల్‌వోయూలతో ఎలాంటి గ్యారంటీలు లేకుండా అదే పనిగా పెద్ద మొత్తంలో రుణాలను దక్కించుకున్నారు కుంభకోణంలో నిందితులు. ఈ మోసపూరితమైన ఎల్‌వోయూలను అటు బ్యాంకు స్థాయిలో కానీ ఇటు ఆర్బీఐ స్థాయిలో కానీ గుర్తించకుండా జారీ చేస్తూ పోవడం అత్యంత దిగ్భ్రాంతికరం. ఇది సంస్థాగత నిర్లక్ష్యాన్ని, ఒక వ్యవస్థీకృత వైఫల్యాన్ని ఎత్తి చూపుతోంది.

చోక్సీ కోసమని 20:80 గోల్డ్‌ స్కీమ్‌!

మే 16, 2014న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. మోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. తదుపరి ప్రధాని ప్రమాణ స్వీకారం చేసేంతవరకు ఆపద్ధర్మ ప్రభుత్వంగా కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ కూటమి అధికారంలో ఉంది. సరిగ్గా ఆ సంధి కాలంలోనే అప్పటి ఆర్థిక మంత్రి పి.చిదంబరం అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నట్టుగా ఆఖరి నిమిషంలో అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ఇదేదో చూడబోతే అయినవారికి అప్పనంగా కావలసినవి కట్టబెడుతున్నట్టుంది. అందులో ఓ భాగమే అన్నట్టుగా చోక్సీకి చెందిన గీతాంజలి జెమ్స్‌తో పాటుగా 13 కంపెనీలకు నేరుగా ప్రయోజనం చేకూరుస్తూ వివాదాస్పద 20:80 బంగారం దిగుమతి పథకం కింద ఒక ఉత్తర్వుపై చిదంబరం సంతకం పెట్టారు. ఈ పథకం కంపెనీలను దిగుమతి చేసుకున్న బంగారంలో 20 శాతాన్ని ఎగుమతి చేయడానికి, మిగిలిన 80 శాతం బంగారాన్ని దేశీయ మార్కెట్‌లో విక్రయించు కోవడానికి అనుమతిస్తుంది. ఇది బంగారం అక్రమ నిల్వలను ప్రోత్సహిస్తుందనే విమర్శలు అప్పట్లో వెల్లువెత్తాయి. ఇదే విషయమై పరిశ్రమ వర్గాలు హెచ్చరికలు చేసినప్పటికీ వాటిని పెడచెవిన పెట్టిన కాంగ్రెస్‌ ప్రభుత్వమూ, గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ ఏలుబడిలోని ఆర్బీఐ రెండూ కూడా చూసీ చూడనట్టుగా భారీ ఎత్తున ఆర్థిక అక్రమానికి ఓ వేదికను సిద్ధం చేశాయి.

స్కాంకి చోక్సీ బలిపశువా?

ఆగస్టు, 2018న మేహుల్‌ చోక్సీ లాయర్‌ డేవిడ్‌ డోర్‌సెట్‌ రిప్లబిక్‌ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో యావత్‌ స్కాంలో తన క్లయింట్‌ను బలిపశువును చేశారని చెప్పడం ద్వారా సంచలనానికి తెరతీశారు. స్కాం వెనుక పెద్ద పెద్ద రాజకీయ తలకాయ లున్నాయని తెలిపారు. చోక్సీకి గతంలో కాంగ్రెస్‌తో సంబంధాలు ఉన్న కారణంగానే అతడి పేరును స్కాంలోకి లాగారని ఆరోపించారు. ఆయన చెప్పినదాని ప్రకారం అందరూ అనుకున్న ట్టుగా చోక్సీ, నీరవ్‌ మోదీలు స్కాంకి సూత్రధారులు కాదు. వారిద్దరూ కూడా రాజకీయంగా ప్రేరేపితమైన ఒక కపటోపాయానికి బాధితులు మాత్రమే.

కాక్‌టైల్‌ పార్టీలో నీరవ్‌తో రాహుల్‌ భేటీ

స్కాం జరిగినప్పుడు కాంగ్రెస్‌ పార్టీలో ఉండి, తర్వాత బీజేపీ జాతీయ అధికార ప్రతినిధిగా అవతరించిన షెహజాద్‌ పూనావాలా స్కాంకి ఆసక్తికరమైన ఒక కొత్త సంగతిని చేర్చారు. 2013లో ఢల్లీిలో జరిగిన కాక్‌టైల్‌ పార్టీలో నీరవ్‌ మోదీని రాహుల్‌ గాంధీ కలుసుకున్నారని ఆయన ఆరోపిం చారు. పీఎన్‌బీ స్కాంన్ని బైటపెడతానన్న ఓ వ్యక్తి నోరు మూయించినప్పుడే ఈ భేటీ జరగడం విశేషం. అప్పట్లో ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉన్న రాజీవ్‌ టక్రు కనుసన్నల్లోనే ఎలాంటి అడ్డూ అదుపూ లేకుండా అక్రమంగా రుణాలను మంజూరు చేశారు. స్కాంన్ని బైటపెడతానన్న వ్యక్తికి ఊష్టింగ్‌ ఆర్డర్‌ ఇవ్వడానికి అప్పటి ఆర్థిక మంత్రి పి.చిదంబరం ఆమోదం తెలిపారు. చిదంబరం ఆమోదం కుంభకోణం గుట్టు రట్టు చేయకుండా ఉండటంలో రాజకీయ ప్రమేయాన్ని బట్టబయలు చేస్తోంది.

రాజీవ్‌ గాంధీ ఫౌండేషన్‌కు చోక్సీ విరాళాలు

2014`15 మధ్య కాలంలో చోక్సీ డైరెక్టర్‌గా ఉన్న నవీరాజ్‌ ఎస్టేట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సోనియా గాంధీ ఆధ్వర్యంలోని రాజీవ్‌గాంధీ ఫౌండేషన్‌కు ` ఆర్‌జీఎఫ్‌ విరాళాలు ఇచ్చింది. ఆర్‌జీఎఫ్‌ బోర్డులో రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా ఉన్నారు. సరిగ్గా ఆ సమయంలోనే చైనాతో పాటుగా విదేశీ ప్రభుత్వాల నుంచి అప్పటికే నిధులు అందుకున్న కాంగ్రెస్‌ పార్టీ యక్షప్రశ్నలను ఎదుర్కొంటున్నది. ఇదే ఆర్‌జీఎఫ్‌ యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు పర్యావరణం, అటవీ శాఖ, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, చిన్నతరహా పరిశ్రమలు, చివరకు హోమ్‌ మంత్రిత్వ శాఖలాంటి కేంద్ర మంత్రిత్వశాఖల నుంచి విరాళాలను అందుకున్నది. ఇది ప్రజాధనం దుర్వినియోగాన్ని వెలుగులోకి తెస్తోంది. రాజకీయ అధికారం, ప్రభుత్వ వ్యవస్థలు, ప్రైవేటు ప్రయోజ నాలు ఒకదానితో మరొకటి పెనవేసు కోవడంపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది.

ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా చోక్సీ న్యాయవాది

కాంగ్రెస్‌ పార్టీకి, చోక్సీకి మధ్య అనుబంధాన్ని మరింత బలపరుస్తున్నట్టుగా కాంగ్రెస్‌ పార్టీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా చోక్సీ న్యాయవాది హెచ్‌.ఎస్‌. రాజమౌళిని నిలబెట్టింది. ఇది కాంగ్రెస్‌ పార్టీ ఇంటా బయటా రచ్చకు దారి తీసింది.

బెల్జియంలో మేహుల్‌ చోక్సీ అరెస్టుతో అతడిని దేశానికి తీసుకురావడంలో ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో పురోగతి కనిపిస్తోంది. అదే సమయంలో రాజకీయ అధికారం, అక్రమ విధానాలు, ఆర్బీఐ ఉదాసీనతల ప్రమాదకరమైన కలబోత పీఎన్‌బీలో రూ.13,500 కోట్ల స్కాంన్ని సుసాధ్యం చేసింది. కాంగ్రెస్‌ పార్టీ ఏళ్ల తరబడి పాటించిన మౌనం, ప్రశ్నించడానికి అర్హమైన నిర్ణయాలు, రాజకీయ రక్షాకవచం ఇవ్వన్నీ కలిసి భారతదేశపు అతి పెద్ద బ్యాంకు స్కాంల్లో ఒకదానికి పునాది వేయడంలో సాయపడ్డాయి.

(‘ఆర్గనైజర్‌’ సౌజన్యంతో)

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE