అసలు ఆడవాళ్లకు ఉద్దేశించిన బ్యూటీ పార్లర్‌లలో ముస్లిం కుర్రాళ్లు ఎందుకు పని చేస్తున్నారంటే, అదీ హిందువుల పేర్లు పెట్టుకొని ఎందుకు పనిచేస్తున్నారంటే అక్కడికి వచ్చే యువతులకు మాయ మాటలు చెప్పి, మభ్యపెట్టి, పెళ్లి చేసుకుంటా మని నమ్మించి, నికృష్టమైన ‘లవ్‌జిహాద్‌’ ‌ను అమలు చేయడానికి, అలా పెళ్లి చేసుకున్న అమ్మాయిని అంగట్లో సరుకుగా అమ్మివేయడానికి. ఇవి ఎవరో ఊరూ పేరూ లేని దారినపోయే దానయ్య అంటున్న మాటలు కావు. సాక్షాత్తూ శ్రీకృష్ణ జన్మభూమి సంఘర్ష్ ‌న్యాస్‌ అధ్యక్షుడు, కృష్ణ జన్మభూమి కేసులో కక్షిదారు పండిట్‌ ‌దినేష్‌ ‌శర్మ ఫలహరి అన్న మాటలు ఇవి. ఈ మేరకు ఆయన ఉత్తరప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ఒక లేఖ రాశారు. పరమ పవిత్రమైన మథుర, బృందావనంలో ముస్లిం కుర్రాళ్లు పనిచేస్తున్న బ్యూటీపార్లర్‌లను మూసివేయించాలని డిమాండ్‌ ‌చేశారు.

ఆ లేఖలో ఆయన ‘‘ఇది కేవలం కాకతాళీయం కాదు. మన హిందూ కుటుంబాలను ముక్కలు ముక్కలు చేసి మన ఆడపడుచులను లక్ష్యంగా భారీ నిధులతో జరుగుతున్న పెద్ద కుట్ర. ముస్లిం కుర్రాళ్లు హిందువుల ముసుగులో మణికట్టుకు కలవా, నుదుటన తిలకం పెట్టుకొని బ్యూటీపార్లర్‌లలో అమాయకులైన అమ్మాయిల నమ్మకాన్ని చూరగొంటున్నారు’’ అని తెలిపారు.

ఈ పార్లర్‌లు ప్రస్తుతం లవ్‌ ‌జిహాద్‌ ‌నియామ కాలకు హాట్‌స్పాట్‌లుగా పనిచేస్తున్నాయని ఆరోపించారు. సరిగ్గా అక్కడే యువతులను భావోద్వేగ పరంగా వలలో వేసుకుంటారు. బలవంతంగా పెళ్లి చేసుకుంటారు. చాలా కేసుల్లో పెళ్లి ముసుగులో హిందూ అమ్మాయిలను నగరాలకు అక్రమంగా తరలించి అమ్మేస్తారు.

‘‘వాళ్లు (హిందువుల ముసుగులో ముస్లిం కుర్రాళ్లు) ఫేషియల్‌, ‌హెయిర్‌ ‌కట్‌, ‌స్కిన్‌ ‌ట్రీట్‌మెంట్‌ అప్పుడు యువతులకు శారీరకంగా దగ్గరవుతారు. అక్కడి నుంచి మాయమాటలు చెప్పి మభ్యపెడతారు. ఒకసారి యువతి వలలో పడిన తర్వాత ఆమెకు తన కుటుంబంతో, సమాజంతో సంబంధాలు తెగి పోతాయి’’ అని అన్నారు. లవ్‌ ‌జిహాద్‌ను రహస్యంగా నిర్వహించే యువకులకు ఇస్లాం సంస్థలు ఆర్థికంగా, అన్ని రకాలుగా మద్దతు ఇస్తున్నాయని ఆరోపించారు.

ఇదే విషయమై సంతుల సమాజంలో పేరొందిన రామ్‌ ‌కీ దాసి సాధ్వీ యుగేశ్వరి దేవి మాట్లాడుతూ గతంలో స్కూళ్లు, కాలేజీల దగ్గర ఆడపిల్లలకు వలవేసే ముస్లిం కుర్రాళ్లు ప్రస్తుతం మహిళలు ఎంతో నమ్మకం పెట్టుకునే బ్యూటీ పార్లర్‌లలోకి చొరబడు తున్నారని హెచ్చరించారు.

‘‘మనం మన ఆడపిల్లలకు స్కూలు బైట ముక్కూ ముఖం తెలియనివాళ్లతో మాట్లాడవద్దని చెప్పాము. కానీ ఇప్పుడు ఆ ప్రమాదం మనలో ఒకరు అవే ముసుగు వేసుకొని బ్యూటీపార్లర్‌లోకి చొరబడుతోంది. అక్కడి మహిళలతో ముచ్చట్లు పెడుతోంది’’ అని ఆమె అన్నారు.

ఇదే విషయమై పేరొందిన సంత్‌ ‌మహా మండలేశ్వర్‌ ‌రామ్‌దాస్‌ ‌జీ మహరాజ్‌ ‌హిందూ మహిళలు, బ్యూటీ పార్లర్‌ ఓనర్లకు బలమైన పిలుపు ఇస్తూ ‘‘సుందరీకరణ అవసరమైన పక్షంలో ఆ పనేదో సనాతన హిందువులు చేస్తారు. హిందువులకు సేవ చేయడానికి మాంసం తినే ముస్లిం కుర్రాళ్లను నియమించుకోవడంలో ఎలాంటి అర్థం లేదు. మనం మన ధర్మాన్ని కాపాడుకోవడానికి ఒక గీత గీసుకోవాలి. ముస్లిం కుర్రాళ్లు పనిచేసే బ్యూటీపార్లర్‌ ‌లను బహిష్కరించండి. సుందరీకరణ ఏదో సొంతంగా ఇంటి దగ్గరే చేసుకోండి. లేదా మీకు తెలిసిన సనాతన హిందూ సుందరీకరణ వృత్తి నిపుణులను ఆశ్రయించండి’’ అని అన్నారు.

ఇదేదో ఒక ప్రాంతానికే పరిమితమై విషయం కాదని దేశవ్యాప్తంగా జరుగుతున్న కుట్రలో ఇది ఒక భాగమని ఫలహరి అన్నారు. ‘‘కేరళ నుంచి కాన్పూర్‌ ‌వరకు ఒకటే తంతు.. నకిలీ గుర్తింపు, నకిలీ ప్రేమ, వెంటనే పెళ్లి చేసుకోవడం ఆ తర్వాత మాయమై పోవడం. కుటుంబాలు నిస్సహాయ స్థితిలో మిగిలి పోతున్నాయి. చాలా కేసుల్లో అమ్మాయిలు దిక్కూ మొక్కూ లేకుండా మిగిలిపోతున్నారు. వాళ్ల ముఖాన్ని మళ్లీ చూసేందుకు మనకు అవకాశం ఉండదు’’ అని ఆయన తెలిపారు.

సంఘర్ష్ ‌న్యాస్‌ ‌డిమాండ్లు

  • బ్యూటీపార్లర్‌లు ముస్లిం యువకులను నియమించుకోవడంపై రాష్ట్ర స్థాయి దర్యాప్తు జరపాలి.
  • తెలిసి కూడా ముస్లింలను పనిలో పెట్టుకుంటున్న పార్లర్‌ ఓనర్లపై క్రిమినల్‌ ‌కేసులు పెట్టాలి.
  • బ్యూటీపార్లర్‌లలో పనిచేసి సిబ్బంది ఎవరూ ఏమిటీ వారు ఏ మతానికి చెందినవారు అనే వివరాలను తనిఖీ చేయాలి
  • లవ్‌జిహాద్‌ ‌ఘటనల వెనుక ఉన్న భారీ నెట్‌వర్క్‌ను ఛేదించడానికి దర్యాప్తు ఏజెన్సీలను బరిలోకి దించాలి.

ఈ ప్రమాదాలపై మథుర, బృందావనంలో హిందూ మహిళలను అప్రమ్తతం చేయడం కోసమని పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమానికి సైతం ఫలహరి మద్దతుదారులు పిలుపునిచ్చారు.

 ఈ ప్రాంతంలోని ధార్మిక, సామాజిక వర్గాల్లో ఆగ్రహం వెల్లువెత్తుతున్నప్పటికీ ఇప్పటివరకు జిల్లా యంత్రాంగంలో ఎలాంటి కదలిక కనిపించలేదు. శ్రీకృష్ణభగవానుడి జన్మస్థలమైన మథుర నగరం మహోన్నతమైన ఆధ్యాత్మిక విలువలకు నిలయమైంది. అలాంటి చోట హిందూ మహిళల పట్ల గౌరవాన్ని, వారికి భద్రతను నెలకొల్పాల్సిన ఆవశ్యకత ఉందని సాధువులు అన్నారు.

ఇదే విషయమై ఫలహరి మాట్లాడుతూ ‘‘హెయిర్‌ ‌కట్‌తో మొదలైంది చివరకు నరకప్రాయమైన పీడ కతో ముగుస్తుంది. సీఎం యోగి దీనిపై వెంటనే చర్య తీసుకోని పక్షంలో వృత్తి నిపుణుల ముసుగులో జరుగుతున్న కంటికి కనిపించని యుద్ధంలో మనం మరింత మంది ఆడపడుచులను కోల్పోవచ్చు’’ అని హెచ్చరించారు.

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE