విద్య అంటే నేడు మదిలో మొట్టమొదట కలిగే ఏకైక భావన- వ్యాపారం! విద్యార్థి అంటే కేవలం ఒక వినియోగదారుడు! కానీ మీకు తెలుసునా? పూర్వం నలందా, తక్షశిల వంటి ప్రాచీన విశ్వవిద్యాలయాల సరసన దక్షిణాదిన మనకూ ఒక విశ్వవిద్యాలయం తమిళనాట కంచిలో వెలుగొందినది. పేరు ‘ఘటికాస్థానం’. ఘటిక అంటే కుండ. వివిధ దేశాల నుంచి వచ్చే విద్యార్థులు ఛప్పన్నశాస్త్రాలలో తమ సందేహాలను తాళపత్రాలపై రాసి కుండలలో పెట్టేవారు. ఒక్కొక్క శాస్త్రానికి ఒక్కొక్క కుండ! ఆయా శాస్త్రాలలో నిష్ణాతులైన పండితులు విషయాలవారీగా కుండలలో సమాధానాలను రాసి ఉంచేవారు! పల్లవుల రాజధానిగా అప్పటికే ఎంతో ఖ్యాతిగడించిన కాంచీపురానికి ఈ ఘటికాస్థానం విద్యాభరణమై విలసిల్లింది. కాలానుగుణంగా అన్నిటితో పాటుగా అదీ కనుమరుగైంది.
రోజులు మారాయి. అనేక శతాబ్దాల బానిసత్వం తరువాత స్వాతంత్య్రం సిద్ధించింది. అయితే మానసిక దాస్యం పాశ్చాత్యవిద్యావ్యవస్థ పట్ల వ్యామోహం రోజురోజుకూ పెరుగుతూ పోతున్నది. 1980ల కాలం విద్యారంగంలో ఓ సంధిదశ. విలువలకు కాలం చెల్లి, యుటిలిటేరియన్ సిద్ధాంతం చదువులలోనూ ప్రవేశిస్తున్న దశ. ఇటువంటి పరిస్థితిలో ప్రాచీన భారతీయ పరంపరలోని విలువలను కొనసాగిస్తూ ఆధునిక విద్యలో అప్పుడప్పుడే అందివస్తున్న అన్ని అవకాశాలనూ విద్యార్థికి అందించాలని కంచికామకోటిపీఠం ఆచార్యులు భావించారు! సమాజానికి తమవంతు సేవగా నీతిమంతులైన పౌరులను అందించాలనుకున్నారు! చదువుల నెలవు ఖరీదైన వ్యవహారంగా కాక- భారతీయ సంప్రదాయాల ప్రకారం వ్యక్తిత్వ నిర్మాణకేంద్రంగా ఉండాలని కామకోటిపీఠాధిపతి బ్రహ్మలీనులు శ్రీ జయేంద్రసరస్వతీ స్వామివారు, ప్రస్తుత పీఠాధిపతులు శ్రీ శంకరవిజయేంద్ర సరస్వతీ స్వామివారు తపించారు. తమ గురువుల పేరిట ఒక విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు! విద్యార్థిని కేవలం చదువు ‘కొనే’ వాడుకదారుగా కాక సాధ్యమైనంత తక్కువఖర్చుతో చదువుకుని, విలువలతో కూడిన భావిభారత పౌరునిగా ఎదిగేలా, చదువుకునే మూడు-నాలుగు సంవత్సరాల కాలాన్ని సర్వతో ముఖాభివృద్ధికి సువర్ణావకాశంగా మలచుకునేలా కంచి విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పారు.
‘నడిచేదేవుని’ గా ప్రసిద్ధులై, యావత్ప్రపంచానికీ ఆధ్యాత్మికరంగ జ్యోతిగా వెలుగొందుతున్న పరమా చార్యుల పేరిట ‘శ్రీ చంద్రశేఖరేంద్రసరస్వతి విశ్వమహావిద్యాలయం’ 1976లో ఏర్పాటైంది. యూజీసీ యాక్ట్ 1956-బ/ 3 ప్రకారం తమిళనాడు రాష్ట్రంలో ఏర్పాటైన మొట్టమొదటి ప్రైవేటు (డీమ్డ్) విశ్వవిద్యాలయం ఇదే. శ్రీ కంచికామకోటి చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న ఈ సంస్థ విద్యకు విలువలను జోడిస్తూ ఉన్నత విద్య అన్ని వర్గాలకూ చేరాలనే ప్రాథమిక లక్ష్యంతో ప్రారంభమైంది. ఇంజనీరింగ్, ఆయుర్వేదం, సంస్కృతం, ప్రాచీన సంప్రదాయ కళలు, సంగీతం, శిల్పం, భారతీయ సంస్కృతి వంటి విషయాలను బోధించడంతో పాటు ఇతర ప్రజాప్రయోజన కార్యక్రమాల నిర్వహణ-అభివృద్ధి ఈ విశ్వవిద్యాలయ లక్ష్యం.
కంచి కామకోటిపీఠం ఆచార్యుల పరమ పవిత్రమైన ఆశీస్సులతో న్యాయ, వ్యాకరణ, వేదాంత, సాహిత్య శాస్త్రాల సంరక్షణ, బోధన లక్ష్యాలుగా కె.వి. దమాని కాలేజ్ ఆఫ్ ఓరియంటల్ స్టడీస్ పేరిట ‘మహావిద్యా లయ’ స్థాపించారు. అప్పట్లో ఇది రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్, న్యూఢిల్లీకి అనుబంధంగా ఉండేది. ఈ విద్యాలయం అప్పుడు ప్రాక్ శాస్త్రి (ఇంటర్మీడి యెట్), శాస్త్రి (బి.ఎ.) కోర్సులను అందించేది. 1978లో న్యాయ, సాహిత్య శాస్త్రాలలో ఆచార్య (ఎం.ఎ.) కోర్సులు నిర్వహించడానికి సంస్థ ఆమోదం పొందింది.
మే 26 వ తేదీ 1993 వ సంవత్సరంలో భారత ప్రభుత్వం ఈ సంస్థను అప్ గ్రేడ్ చేసి ‘శ్రీ చంద్రశేఖరేంద్రసరస్వతి విశ్వమహావిద్యాలయ’గా ఆమోదించి ‘డీమ్డ్ యూనివర్శిటీ’గా ప్రకటించింది. తద్వారా సాంకేతిక, ఆధునిక శాస్త్రాలలో వివిధ కోర్సులను అందించడానికి విశ్వవిద్యాలయానికి అనుమతి లభించింది. అప్పటినుంచి సాంప్రదాయ జ్ఞానాన్ని ఆధునిక శాస్త్రాలతో మిళితం చేస్తూ చదువుల వెలుగులు పంచడమే విశ్వవిద్యాలయ లక్ష్యం.
నిరాడంబరంగా ప్రారంభమై తొలిఅడుగులు వేసిన ఈ యూనివర్శిటీ దాదాపు మూడు దశాబ్దాల కాలంలో అనేక గత అనుభవాలు, ప్రయోగాల ద్వారా నిరంతరం రాటుదేలుతూ కాలపరీక్షకు తట్టుకుని ప్రగతిశీల సమగ్ర పద్ధతిలో తనను తాను తీర్చిదిద్దుకుంటూ అభివృద్ధి పథంలో అగ్రగామిగా ముందుకు సాగుతున్నది. విద్యార్థులలో పోటీతత్వాన్ని పెంచి, వారి యోగ్యత, సామర్థ్యాలకు అనుగుణంగా తీర్చిదిద్ది లక్ష్యం చేరేందుకు వారికి చేయూతనందిస్తూ అంచనాలకు అనుగుణంగా జీవించేలా విద్యార్థులను సమాయత్తపరచే అనుభవజ్ఞులైన ఆచార్య బృందం విశ్వవిద్యాలయంలో ఉన్నది. సుదీర్ఘకాలంలో సంస్థ పురోగతిని, స్థిరత్వాన్ని నిర్ధారించేది ఈ కార్య నిర్వాహణా సామర్థ్యమే! అధ్యాపకులు పాటించే క్రమశిక్షణ, అంకితభావం, అభిరుచి మా విద్యార్థుల ప్రవర్తనలో ప్రతిబింబిస్తాయి. విశ్వవిద్యాలయంలో పాదుకొల్పిన భారతీయ సనాతన సాంప్రదాయ విలువలు, సంస్కృతి- విద్యార్థులలో నైతికవిలువలను పొందుపరచడంలో ప్రధానపాత్ర పోషిస్తాయి. విద్యార్థులకు సంస్కృతి ఇంకా- సామాజికపరమైన సామరస్యం, మెరుగైన భావోద్వేగ వ్యక్తీకరణ వంటి నైపుణ్యాలను అందించటం కోసం అవసరమైన పునాదిని అందిస్తున్నది.
అకడెమిక్ సదుపాయాలు
శ్రీచంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వవిద్యాలయానికి సంబంధించినంత వరకూ అకడెమిక్ సదుపాయాలే అత్యంత ప్రధానమైన అంశం. ఎందుచేతనంటే ఇవే విద్యార్థులకు ‘యూనివర్సల్ లెర్నింగ్ స్పేస్’ను అందజేస్తాయి. మా విశ్వవిద్యాలయం విద్యార్థులకు సురక్షితమైన, ఉత్సాహ పూరితమైన వాతావరణంలో విద్యనందిస్తుంది. కోవిడ్ అనంతర పరిస్థితులలో పెరిగిన విద్యార్థుల డిమాండుకు అనుగుణంగా విశాలమైన తరగతిగదులు, ఇతర వసతి సదుపాయాలు నిర్మింపబడ్డాయి.
నిరంతరం నేర్చుకునే పక్రియ అనేది SCSVMV క్యాంపస్‌లో ఒక జీవన విధానం. మేము ప్రతి విద్యార్థికి తమ-తమ వ్యక్తిత్వాలకు అనుగుణంగా రాణించేలా విద్య, క్రీడలు, కళలమధ్య సమతుల్యత పాటిస్తాం. ప్రతిభావంతమైన సాధనకు మద్దతుగా నిలిచేందుకు కళలు, సైన్సు, క్రీడలలో అత్యాధునిక మౌలిక సదుపాయాలు విశ్వవిద్యాలయంలో అభివృద్ధి చేయబడుతున్నాయి. వీటితోపాటుగా కాలానికి అనుగుణంగా అత్యుత్తమ కోర్సులు SCSVMVలో అందుబాటులో ఉంటాయి.
విశ్వవిద్యాలయం అందరు విద్యార్థులకూ అత్యుత్తమ ప్రయోగాత్మక శిక్షణ అందించి వారిని శక్తిమంతులుగా తీర్చిదిద్దుతున్నది. పెరుగుతున్న సాంకేతికతను అందిపుచ్చుకుంటూ స్మార్ట్ క్లాస్ రూమ్స్, వర్చువల్ రియాలిటీ పరికరాలతో కూడిన ఐటీ ల్యాబులు, అధునాతనమైన డ్రోన్ ల్యాబులు, ఐఐటీ మద్రాసు, టీసీఎస్ వంటి సంస్థలతో కలసి ఏర్పాటు చేస్తున్న ఆధునిక శాస్త్రీయ ప్రయోగశాలలు, వర్క్‌షాప్‌ల వంటి సృజనాత్మక సదుపాయాల సాయంతో విద్యార్థి ప్రతిభకు సానబెట్టటం జరుగుతున్నది. సంక్షిప్తంగా చెప్పాలంటే SCSVMV విద్యార్థిలోకానికి వరం లాంటిది!
విద్యార్థులకు వసతి సదుపాయాలు
హాస్టల్‌లో గడపడం విద్యార్థి జీవితంలోని ముఖ్యమైన అంశాలలో ఒకటి. ఇది విద్యార్థులు విశ్రాంతి తీసుకోవడానికి, చదువుకోవడానికి, వ్యక్తిత్వనిర్మాణానికీ అనువైన ప్రదేశం. SCSVMVలో తలిదండ్రులకు వారి పిల్లలని సురక్షితమైన వాతావరణంలో ఉంచుతామనే భరోసా ఉంది. SCSVMVలో ఆధునికీకరించిన హాస్టళ్లలో విశాలమైన గదులు, స్టడీ ఫ్రెండ్లీ ఫర్నిచర్, స్టోరేజీ సదుపాయాలు, విశ్రాంతస్థలాలు, వినోద ప్రదేశాలు, వ్యాయామశాల, ధ్యానమందిరం, విశాలమైన డైనింగ్ హాళ్లు, ఆధునిక వంటగది, చదరంగం, క్యారమ్స్, టేబుల్ టెన్నిస్ సౌకర్యాలతో కూడిన ఆటస్థలాలు అలరిస్తాయి. పాజిటివ్ ఇంకా స్పోర్టివ్ దృక్పథం అలవరుచుకోవ డానికి వారికున్న అవకాశాలెన్నో!
అంతర్జాతీయ లైబ్రరీ- తాళపత్ర విభాగం
విశ్వవిద్యాలయ రథానికి ఇరుసుగా భావించే సుసంపన్నమైన అంతర్జాతీయ గ్రంథాలయం కంచి విశ్వవిద్యాలయం సొంతం. 1993లో ఈ గ్రంథాల యాన్ని నిర్మించారు. ఇందులో మూడు అంతస్తులలో విశాలమైన వసతితో కూడిన 12 విభాగాలు ఉన్నాయి. విశ్వవిద్యాలయానికే తలమానికమైన ఈ కట్టడం వాస్తు పరంగా చూస్తే పూర్వం కంచి రాజవం శీకులచే కంబోడియాలో స్థాపించిన వాస్తుశిల్పాన్ని సూచిస్తుంది. కంచి అంటేనే శక్తిపీఠం కామాక్షీ అమ్మవారికి నిలయం కదా! ఆ శక్తి విద్యార్థులకు సకారాత్మకంగా అందాలనే సంకల్పంతో శంకరాచార్య స్వామివారు శ్రీచక్రా కారంగా ఈ భవనాన్ని నిర్మింప జేశారు! ఈ భవనానికి ఎదురుగా యూనివర్శిటీ ఐకన్ (సాంస్కృతిక చిహ్నం) వంటి ఆదిశంకరుల 68 అడుగుల నిలువెత్తు ఏకశిలా విగ్రహం చూపుతిప్పుకో నివ్వదు!
లైబ్రరీ భవనంలో 5000కి మించిన మేన్యూస్క్రిప్ట్ (4000లకు పైగా తాళపత్రాలు, పదిహేనువందల ప్రాచీన గ్రంథాలు)లతో కూడిన తాళపత్ర భాండా గారం ఉన్నది. దేశవ్యాప్తంగా శ్రీ కంచి కామకోటిపీఠం ఆచార్యుల విజయయాత్రల సందర్భంగా అనేక తాళపత్రాలు సేకరించారు. వాటన్నింటినీ ఇక్కడ భద్రపరచి, భావితరాలకోసం నిరంతరం డీకోడ్ చేయడం జరుగుతున్నది. ఈ తాళపత్ర విభాగము కేవలం సంస్కృతశాఖకు సంబంధించి కాక, సమస్త ఇంజనీరింగ్ శాఖలలోని నైపుణ్యాలతో మేలిమి మేళవింపుగా ‘మల్టీ డిసిప్లినరీ’ పరిశోధనరంగానికి బాటలు వేస్తున్న విభాగం. మునుముందు కృత్రిమ మేథ (ఏ.ఐ.), మెషీన్ లెర్నింగ్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, స్టాండర్డైజేషన్ వంటి అంశాలలో ఇక్కడ చదువుకునే భావితరాల ఇంజనీరింగ్ విద్యార్థులకు ఒకవైపు ఇంజనీరింగ్‌లో అత్యాధునిక పరిశోధనా నైపుణ్యాలను అందిపుచ్చుకుంటూనే మరొకవైపు ప్రాచీన వారసత్వ పరిరక్షణకు తమ విజ్ఞానాన్ని ఉపయోగించే అవకాశాన్ని అందిస్తున్నది.
క్రీడా సదుపాయాలు
విద్యార్థుల వ్యక్తిత్వ సమగ్ర వికాసం క్రీడల ద్వారానే సాధ్యం. అందుచేతనే SCSVMV క్రీడలకు ఎంతో విలువనిస్తుంది. స్పోర్ట్-జిమ్, అథ్లెటిక్స్, టెన్నిస్, షటిల్, బ్యాడ్మింటన్, స్క్వాష్, రన్నింగ్/జాగింగ్/వాకింగ్ ట్రాక్‌లు, చదరంగం, క్యారమ్స్, టేబుల్ టెన్నిస్ వంటి ఇండోర్ గేమ్స్ ఇక్కడి సదుపాయాలు. SCSVMV లో అత్యాధునిక లైటింగ్ సౌకర్యాలతో కూడిన క్రికెట్ మైదానం, రెండు టెన్నిస్ కోర్టులు, (క్లే, సింథటిక్), బాస్కెట్ బాల్ కోర్ట్ (సింథటిక్), కబడ్డీ మైదానం, క్రికెట్ ప్రాక్టీస్ నెట్ (ఫాస్ట్/స్పిన్ బౌలర్ల శిక్షణ ప్రత్యేకం) వంటివాటితో పాటుగా విశ్వ విద్యాలయ సిబ్బంది, విద్యార్థులకు వారి ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వ్యాయామం, యోగా క్యాంపు వంటి అదనపు సౌకర్యాలు కూడా కల్పించారు.
- SCSVMV క్రీడా ప్రాంగణంలో భావి అథ్లెట్లను తయారుచేసే వాకింగ్ కమ్ జాగింగ్ ట్రాక్, అత్యాధునిక పరికరాలతో సిద్ధంగావించిన హనుమాన్ వ్యాయామశాల, ఆచార్యులు-విద్యార్థులందరి సకలవిధ శ్రేయస్సుకోసం ఆధునిక కార్డియో, శిక్షణ పరికరాలతో కూడిన జిమ్, యోగాకేంద్రం, నృత్యసాధనా కేంద్రం వంటివి ఉన్నాయి. బాలికల హాస్టల్ ప్రాంగణంలో ప్రత్యేక వ్యాయామశాల, ఇతర క్రీడలకు సంబంధించిన సౌకర్యాలు, ఒక ఓపెన్ జిమ్ ఉన్నాయి. SCSVMVకి గతం నుంచే అనేక ప్రతిష్ఠాత్మకమైన కప్‌లు గెలుచుకున్న ఘనమైన క్రీడారికార్డు సైతం ఉన్నది.
యూజీసీ యాక్ట్ 1956-యూనివర్శిటీ బ/ 3 ప్రకారం ఏర్పాటై, NAAC వారి A గ్రేడ్’ గుర్తింపు పొంది అన్నిరకాల వసతులతో రూపుదిద్దుకున్న ఈ విశ్వవిద్యాలయంలో వివిధ ఇంజనీరింగ్ మరియు ఇతర కోర్సులలో ప్రవేశాలకోసం www. kanchiuniv.ac.in వెబ్‌సైటును సందర్శించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.
మరిన్ని వివరాలకు సంప్రదించండి:
శ్రీచంద్రశేఖరేంద్రసరస్వతి విశ్వమహావిద్యా లయం (SCSVMV డీమ్డ్ యూనివర్శిటీ), ఏనాత్తూర్, కాంచీపురం, తమిళనాడు 631561. అడ్మిషన్లకు సంప్రదించవలసిన నెంబర్లు : 9629032323, 9629001144, 8098001630 (ఆయుర్వేదం)