ఆం‌ధప్రదేశ్‌లో ఫాస్టర్లు, ముస్లిం నాయకుల ముసుగులో సంఘ విద్రోహశక్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం హిందూ సమాజంపై నిందలు వేసి క్రోధాన్ని వెళ్లగక్కుతున్నారు. భౌతిక దాడులు చేస్తామని, ఊచకోత కోస్తామని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలను నిరసిస్తున్నట్లు నటిస్తూ ధ్వంస రచనకు పూనుకున్నట్లు ఇప్పటివరకు జరిగిన సంఘటనలను బట్టి కూటమి నాయకులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి మూకలకు విపక్షాలు అన్ని విధాలుగా సహకరిస్తున్నాయి. తమ ధర్మంపై శతాబ్దాల తరబడి జరుగుతున్న దాడులను భరించిన హిందూ సమాజంలో ప్రధానిగా మోదీ రాకతో మార్పు వచ్చింది. హిందూమతాన్ని అవమానించేవారిపై ప్రతివిమర్శలు చేస్తూ ఎదుర్కోవడం ప్రారంభించారు. ఈ మార్పు కారణంగా ఎలాగైనా వారిని మరింత ఇబ్బందిపెట్టాలని అన్యమతాలు భావిస్తున్నాయి. సీఏఏ, త్రిపుల్‌ ‌తలాక్‌, 370 ఆర్టికల్‌ ‌రద్దు వరకు ఏవీ ముస్లిం సమాజానికి వ్యతిరేకమైన చట్టాలు కావు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ ‌చట్టాన్ని సవరించడంతో ఈ వక్ఫ్‌ను అడ్డంపెట్టుకుని దోపిడీకి పాల్పడిన వారికి అడ్డుకట్టపడినట్లయింది. అయితే ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్‌ ‌దాని మిత్ర పక్షాలు పేద, అమాయక ముస్లిం యువతకు ప్రలోభాల ఎరవేసి నిరసనల పేరుతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు ధ్వంసం చేయించి మత కల్లోలాల సృష్టి లక్ష్యంగా కనిపిస్తోంది.

కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాలు ముస్లిం, క్రైస్తవ వ్యతిరేకులుగా నిందలువేసి ఆందోళనలతో సమాజాన్ని అస్ధిరపరచాలని వీరి ఆలోచన. ఇందులో భాగంగానే ఫాస్టర్‌ ‌ప్రవీణ్‌ ‌మరణానికి హిందువులు, కూటమి ప్రభుత్వం కారణమని ఫాస్టర్‌ ‌ముసుగు కప్పుకున్న కొందరు గుండాలచే తీవ్రమైన ఆరోపణలు చేయించారని ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు తిరుమలలో నెలకు వందలాది గోవుల మరణించి నట్లు అసత్యప్రచారం చేయిస్తున్నారు. దీని వెనుక వైసీపీ హస్తం ఉందనేది బహిరంగా ప్రజలు ఆరోపిస్తున్నారు. బెంగాల్‌, అస్సాంలలో హింసను ప్రేరేపిస్తున్న కాంగ్రెస్‌, ‌కమ్యూనిస్టు పార్టీలు ఇప్పుడు ఎపీలో వైకాపాను కలుపుకుని ఇదే తరహాలో ఆస్తుల ధ్వంసానికి  ప్రణాళిక వేసినట్లు కూటమి పార్టీల నాయకులు అనుమానిస్తున్నారు.

ఊచకోత కోస్తాడట

హైదరాబాదుకు చెందిన ఫాస్టర్‌ ‌ప్రవీణ్‌ ‌పగడాల పదిరోజుల క్రితం రాజమండ్రికి తమ ద్విచక్ర వాహనంపై వచ్చి రోడ్డుపక్క గుంతలో పడి మరణించాడు. దాంతో దీనిని తమ స్వార్ధానికి వాడుకోవాలని వైసీపీ, ఫాస్టర్లు భావించారు. క్రైస్తవులను పోగుచేసి ఫాస్టర్‌ను హత్యచేశారని దీనికి హిందువులు కారణమని, వారి అంతుచూస్తామని రెచ్చగొట్టసాగారు. అందులో బెన్నిలింగం అనే వ్యక్తి చేసిన అరుపులు దారుణంగా ఉన్నాయి. ‘‘పాస్టర్‌ ‌ప్రవీణ్‌ ‌పగడాలది కచ్చితంగా హత్యే.. అందులో ఎటువంటి అనుమానం లేదు.. ఒక్క క్షణం బైబిల్‌ ‌పక్కన పెడితే ఊచకోత కోస్తాం.. మమ్మల్ని కెలకొద్దు.. మేం మంచివాళ్లం కాదు మూర్ఖులం.. రౌడీయిజం, గూండాయిజం వదలిపెట్టి వచ్చాం. ప్రార్థనలు చేసే గుంపులున్నారు. యుద్దంచేసే గుంపులున్నాయి. ఎంతవరకైనా తెగిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవులు ఉద్యమిస్తారు. మాతో పెట్టుకోవద్దు.. మేం కన్నెర్రచేస్తే ఊచకోతే…ఖబడ్డార్‌’’ అం‌టూ రాజమహేంద్రవరం ఆసుపత్రి వద్ద జనాన్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసి రెచ్చిపోయిన వైసీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బెన్నిలింగం వైకాపా అధినేత జగన్‌ ‌కుటుంబానికి సన్నిహితుడు. ఇతనే కాదు ఫాస్టర్‌ అజయ్‌, ‌కేఏ పాల్‌, ‌మాజీ ఎంపీ హర్షకుమార్‌లు కూడా ఫాస్టర్‌ ‌ప్రవీణ్‌ది హత్యగా పేర్కొంటూ హిందువులను, కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు సంధిస్తూ క్రైస్తవ సమాజాన్ని రెచ్చగొట్టారు. రోజుల తరబడి రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు, నిరసనలు చేయించారు. కూటమి ప్రభుత్వమే అతన్ని హత్యచేయించినట్లు కూడా ఆరోపించారు. పోలీసు విచారణను తప్పుదోవ పట్టించేలా ఒత్తిడి తెచ్చారు. కాని పోలీసులు హైదరాబాదు నుంచి రాజమండ్రి వరకు ఫాస్టర్‌ ‌ప్రవీణ్‌ ‌ప్రయాణించిన దారిలో అతను మద్యం కొనుగోలుచేయడం మత్తులో డ్రైవింగ్‌ ‌చేయడం, రెండుసార్లు పడిపోవడం గుర్తించారు. పోస్టుమార్టం నివేదికను, తమ విచారణను సరిపోల్చుకుని, ఫాస్టర్‌ ‌మద్యం మత్తులో ప్రయాణిస్తూ రాజమండ్రి సమీపంలో గోతిలో పడి మరణించినట్లు తేల్చారు. అయినా వీరు అసత్య ప్రచారం మానడం లేదు. ఫాస్టర్‌ ‌ప్రవీణ్‌ ‌లా మరో డూప్‌ను తెచ్చి ఆడిస్తున్నారని ఆరోపించారు. రౌడీయిజం, గూండాయిజం చేస్తామని బహిరంగంగా ప్రగల్భాలు పలుకుతున్న బెన్నిలింగం వంటి వారు ఫాస్టర్లుగా ఉండటానికి అనర్హులని పలువురు అభ్యుదయ ఫాస్టర్లు విమర్శిస్తున్నారు. ఫాస్టర్‌ ‌ప్రవీణ్‌ ‌మాటలతో దైవాంశ సంభూతుడిగా భావించామని కాని మద్యం సేవించి అతడు పడిన పాట్లు చూశాక తమ అభిప్రాయం మార్చుకుంటున్నామని ఎంతోమంది క్రైస్తవులు పేర్కొంటున్నారు.

గోమరణాలపై రాజకీయం

మరోవైపు తిరుమలలోని గోశాలలో వందలాది గోవులు మరణించాయని, ఈ విషయం బయటకు రాకుండా తొక్కిపెట్టారని తితిదే పాలకమండలి మాజీ ఛైర్మన్‌, ‌జగన్‌ ‌బంధువ భూమన కరుణాకర్‌రెడ్డి ఆరోపించారు. గోవుల మృతిపై కరుణాకర్‌ ‌రెడ్డి ఎలాంటి ఆధారాలు బయటపెట్టలేదు. ఆరోపణలు చేశారు. టీటీడీ గోశాలలో గోవుల మృతి అనేది సున్నితమైన అంశం. ఇదే నిజమైతే హిందువులు వీటిని సహించరు. అలాగే, టీడీపీ నేతృత్వంలో కొనసాగు తున్న కూటమి ప్రభుత్వంలో హిందుత్వానికి ప్రాధాన్యత ఇచ్చే బీజేపీ, జనసేన పార్టీలు గోవులు మృతి చెందితే చూసి చూడనట్టు వదిలేస్తారా? కనీసం పది ఆవులు చనిపోగానే చర్యలు చేపట్టారా? అన్న భూమన ఆరోపణలతో ప్రజల్లో అనుమానం రాక మానదు. ఈ నేపథ్యంలోనే భూమన చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి నిజం లేదని టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్‌ ‌రెడ్డి స్పష్టం చేశారు. భూమన డేట్‌ , ‌టైం చెప్పాలని, గోశాలకు వచ్చి రికార్డులను పరిశీ లించాలని, ఆయన చెప్పింది అబద్దమని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటారా? అని సవాల్‌ ‌విసిరారు. భూమనకు దమ్ముంటే తన సవాల్‌ ‌స్వీకరించాలని భాను ప్రకాష్‌ ‌రెడ్డి ఛాలెంజ్‌ ‌చేశారు. వాస్తవానికి నెలకు 20 నుంచి 30 వరకు గోవులు మరణించడం సాధారణమే అని తితిదే అధికారులు వివరణ ఇచ్చారు.

వక్ఫ్ ‌సవరణ చట్టంపై ఆందోళనలు

వైకాపా, కాంగ్రెస్‌, ‌కమ్యూనిస్టు పార్టీలు వక్ఫ్ ‌సవరణ చట్టాన్ని ముస్లిం వ్యతిరేక చట్టంగా అభివర్ణిస్తూ ముస్లిం సమాజంలో భయాన్ని ప్రేరేపించి వారితో ఆందోళనలు చేయిస్తున్నారు. ఆంధప్రదేశ్‌లోని ముస్లిం సమాజంలో అత్యధికశాతం మంది పేదరికంలో మగ్గిపోతున్నారు. నిరక్షరాస్యులు ఎక్కువమంది. మోడీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ముస్లిం బాలికలను ప్రోత్సహించడంతో వారు చదువుతున్నారు. త్రిపుల్‌ ‌తలాక్‌ ‌రద్దు, పౌరసత్వ చట్ట సవరణ, ఆర్ధికల్‌ 370 ‌రద్దులతో పాటు ఇప్పుడు వక్ఫ్ ‌చట్టం కూడా సవరించడంతో ముస్లింలు పేదరికంలో మగ్గి పోవాలని భావించేవారు, వక్ఫ్‌ను అడ్డుపెట్టుకుని దోపిడీకి పాల్పడిన వారు ఖంగుతిన్నారు. దాంతో కూటమి ప్రభుత్వంపై ఆందోళనలు చేయాలని అమాయక ముస్లిం యువతను వీరు ప్రేరేపిస్తున్నారు. పైగా వైకాపా, కాంగ్రెస్‌, ‌కమ్యూనిస్టు పార్టీలు రాష్ట్రవ్యాప్తంగా సదస్సులు నిర్వహిస్తూ కూటమి ప్రభుత్వాన్ని మతతత్వ ప్రభుత్వాలుగా ఆరోపిస్తు న్నాయి. ముస్లింలను అణగదొక్కేందుకు, ముస్లింల భూములు ఆక్రమించేందుకు వక్ఫ్ ‌చట్టం సవరించినట్లు ఆరోపిస్తున్నాయి.

కూటమి ప్రభుత్వంపై కక్ష

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ వర్గాలు ఆడింది అట..పాడింది పాటగా ఉండేది. కాంగ్రెస్‌కు మొదటి నుంచి క్రైస్తవులు, ముస్లింలు ఓటు బ్యాంకుగా ఉన్నారు. కాంగ్రెస్‌ ‌నుంచి బయటకు వచ్చి పార్టీ పెట్టిన జగన్‌కు వీరంతా మద్దతు ఇచ్చారు. దాంతో వీరిని శాశ్వత ఓటు బ్యాంకుగా మార్చుకునేందుకు జగన్‌ ‌మత వివక్షకు పాల్పడ్డారు. హిందువులను అన్యమతాలు ద్వేషిస్తున్నా, అవమానిస్తున్నా, హిందూ ధర్మంపై దాడులు చేస్తున్నా పట్టించుకోలేదు. ముల్లాలు, ఫాస్టర్లకు నెలవారీ జీతాలు, చర్చిల నిర్మాణానికి నిధులిచ్చారు. అతివాద హిందువేతరులు కొందరు హిందూ దేవాలయాలపై దాడులు చేసినా, విగ్రహాలు, రథాలను ధ్వంసం చేయడాన్ని పిచ్చివాళ్ల చర్యలుగా చిత్రీకరించినా పట్టించుకోలేదు. మతమార్పిళ్లు తీవ్రంగా జరుగుతున్నా ప్రోత్సాహం తప్ప అడ్డుకోవడం లేదు. అడ్డుకుంటున్న వారిపై కేసులు పెట్టారు. దీంతో హిందూ సమాజం ఎన్నికల్లో  వైసీపీకి గట్టి బుద్ది చెప్పింది. 151 సీట్ల నుంచి 11కు తగ్గించింది. ఆ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు.

ఈ నేపథ్యంలో వైసీపీ ఓటమిని దానిని అభిమానిస్తున్న ఫాస్టర్లు, ముల్లాలు జీర్ణించుకోలేక పోతున్నారు. కూటమి ప్రభుత్వంపై అసహనం వెళ్లగక్కుతున్నారు. నిజానికి కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధికి పెద్ద పీట వేసింది. దళితులు, ముస్లింలు, వెనుకబడిన వర్గాల అభివృద్ధికి పలు పథకాలు అమలుచేస్తోంది. కాని తమ స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు ఫాస్టర్లు, ముస్లిం నాయకులు అమాయకులైన హిందువులను కూటమి ప్రభుత్వంపైకి ఎగదోస్తున్నారు. సమాజంలో అశాంతికి కారణమౌతున్నారు.

సంఘ విద్రోహశక్తుల బహిష్కరణ

బెన్నిలింగం, అజయ్‌, ‌కేఏ పాల్‌, ‌మాజీ ఎంపీ హర్షకుమార్‌లు క్రైస్తవులను తప్పుదోవ పట్టించేలా ప్రవర్తించారు. వీరి మాటలు విని రోడ్డెక్కిన వారంతా సంయమనం కోల్పోయి హిందువుల ఆస్తులపై దాడులకు దిగితే మతకల్లోలాలు జరిగేవి. పూడ్చలేని నష్టం జరిగేది. వక్ఫ్ ‌చట్టంపై నిసరనకు దిగిన అల్లరిమూక బెంగాల్‌లో చేసిన దాడులలో ముగ్గురు మరణించగా, పదుల సంఖ్యలో గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు ధ్వంసమయ్యాయి. ఇక్కడ కూడా ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఫాస్టర్లు, రాజకీయ నాయకులుగా ముసుగు వేసుకున్న ఇలాంటి సంఘవిద్రోహశక్తులను రాష్ట్ర బహిష్కరణ విధించాలి.

తురగా నాగభూషణం

సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE