– సింహంభట్ల సుబ్బారావు, 6300674054
మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం
సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఇంతకాలంపడిన ఆర్థిక ఇబ్బందులు తీరతాయి. రావలసిన డబ్బు అందుతుంది. కుటుంబ సభ్యులు మీపై మరింత ప్రేమ చూపుతారు. వివాహాది శుభకార్యాలు నిర్వ హిస్తారు. ఆరోగ్యం కొంత మెరుగుదల. రాజకీయవేత్తలు, కళాకారులు అనుకున్న అవకాశాలు సాధిస్తారు. రచయితలు మంచి గుర్తింపు పొందుతారు. 25,26 తేదీల్లో స్నేహితులతో తగాదాలు. పంచముఖ ఆంజనేయ స్తోత్రాలు పఠించండి.
వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు
సమాజంలో విశేష గౌరవం పొందుతారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారులు మరింత లాభాలు అందుకుంటారు. ప్రారంభంలో కొంత నత్తనడకన సాగినా క్రమేపీ పుంజుకుంటాయి. ఉద్యోగులకు కొన్ని మార్పులు. పైస్థాయి వారి నుంచి అనుకూల సందేశం. పారిశ్రామికవేత్తలు, కళా కారులకు నూతనోత్సాహం.క్రీడాకారులు అనుకున్నది సాధిస్తారు. 21,22 తేదీల్లో స్నేహితులతో తగా దాలు. విష్ణుసహస్రనామ పారాయణం చేయండి.
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. పరిచయాలు పెరుగుతాయి. కుటుంబంలో అందరి ఆదరణ పొందుతారు. వ్యాపారులు క్రమేపీ లబ్ధి పొందుతారు. ఉద్యోగులకు ప్రత్యేక హోదలు రాగలవు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు అంచ నాలు నిజం కాగలవు. రచయితలు, క్రీడాకారులకు శుభవార్తలు. 22,23 తేదీల్లో వృథాఖర్చులు. దక్షిణా మూర్తి స్తోత్రాలు పఠించండి.
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
విద్యార్థులకు ఆశాజనకంగా ఉంటుంది. ఆస్తుల వ్యవహారాలలో చిక్కులు తొలగి లబ్ధి పొందుతారు. కుటుంబంలో పెద్దల సూచనలు, సలహాలు పాటి స్తారు. కొత్త పెట్టుబడులకు అనుకూల సమయం. ఉద్యోగులు అంచనాలు నిజం చేసుకుంటారు. పారి శ్రామిక వేత్తలు, కళాకారులకు మరింత ఉత్సాహం. రచయితలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. 24,25 తేదీలలో బంధువులతో తగాదాలు. ఆరోగ్యభంగం. గణేశ్ స్తోత్రాలు పఠించండి.
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. వివాహ యత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలలో అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. లాభాలవైపు సాగుతారు. ఉద్యోగులకు సమస్యలు తీరి మనశ్శాంతి చేకూరుతుంది. రాజకీయవేత్తలకు కొత్త ఆశలు. కళా కారులు, క్రీడాకారులు సమర్థతను చాటుకుంటారు. 24,25 తేదీలలో దూరప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు. శ్రీరామస్తోత్రాలు పఠించండి.
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు
రావలసిన సొమ్ము అందుకుంటారు. బంధువుల మధ్య వివాదాలు సర్దుబాటు కాగలవు. వ్యాపారులకు అనుకున్న లాభాలు దక్కుతాయి. పెట్టుబడులు సమ కూర్చుకుంటారు. ఉద్యోగులకు హోదాలు ఉత్సాహాన్నిస్తాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు అప్రయత్న కార్యసిద్ధి. రచయితలకు శుభవార్తలు. 26,27 తేదీల్లో వృథా ఖర్చులు. దూరప్రయాణాలు. రాఘవేంద్రస్వామి స్తోత్రాలు పఠించండి.
తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కుటుంబంలో కొన్ని వేడుకలు నిర్వహణలో బిజీగా గడుపుతారు. వ్యాపారులకు ఊహించని లాభాలు అందుతాయి. కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఉద్యోగులకు కోరుకున్న మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవేత్తలకు ఒత్తిడులు తొలగుతాయి. క్రీడాకారులు, పరిశోధకుల యత్నాలు సఫలం. 21, 22 తేదీలలో అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. శివారాధన మంచిది.
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ
గృహ నిర్మాణయత్నాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు అనుకూల ఫలితాలు రావచ్చు. భూముల క్రయవిక్రయాల సొమ్ము సమకూరుతుంది. ఉద్యోగులు కొత్త హోదాలు. విధి నిర్వహణలో ఆటంకాలు అధిగ మిస్తారు. రాజకీయ వేత్తలు, కళాకారులకు ప్రోత్సాహం. రచయితలకు నూతనోత్సాహం. 23, 24 తేదీల్లో ఆకస్మిక ప్రయా ణాలు. అనారోగ్యం.ఆదిత్య హృదయం పఠించండి.
ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
అనుకున్న కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురవుతాయి. శారీరక రుగ్మతలు కొంత ఇబ్బంది పెట్టవచ్చు. వ్యాపారులకు నిరాశాజనకం. ఉద్యోగులకు బాధ్యతలు మరింత పెరుగుతాయి. రాజకీయవేత్తలు, కళాకారులకు సమస్యలు తప్పకపోవచ్చు. క్రీడా కారులు, రచయితల యత్నాలు ముందుకు సాగవు. 22,23 తేదీల్లో శుభవార్తలు. ఆకస్మిక ధనలబ్ధి. వాహనయోగం. అన్నపూర్ణాష్టకం పఠించండి.
మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం , ధనిష్ఠ 1, 2 పాదాలు
ఆశించిన సొమ్ము అంది అవసరాలు తీరతాయి. శుభకార్యాలు జరుగుతాయి. వ్యాపారులు అనుకున్న లాభాలు రాబట్టుకుంటారు. పెట్టుబడులు ఊహించని విధంగా అందుతాయి. ఉద్యోగులు ఎంతటి బాధ్యత అప్పగించినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. పారిశ్రామిక, రాజకీయవేత్తలు సత్తా చాటుకుంటారు. కళాకారులు, క్రీడాకారుల సేవలు విస్తృతమవుతాయి. 26,27 తేదీలలో ఆకస్మిక ప్రయాణాలు. అప్పులు చేస్తారు. శివాష్టకం పఠించండి.
కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
సోదరుల నుంచి సమస్యలు తీరి ఉపశమనం పొందుతారు. నూతన పెట్టుబడులు అందుకుంటారు. ఉద్యోగులకు అనుకున్న హోదాలు రాగలవు. రాజకీయవేత్తలు, కళాకారులకు అవకాశాలు పెరుగుతాయి. రచయితలు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. 21,22 తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు. ఇంటిలో అకారణ వైరం. హనుమాన్ ఛాలీసా పఠించండి.
మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
విద్యార్థులు మరిన్ని అనుకూల ఫలితాలు సాధి స్తారు. తండ్రి తరఫు నుంచి ధనలాభం. కుటుంబంలో మీ ప్రతిభను అంతా గుర్తిస్తారు. సంతానపరంగా ఇబ్బందులు తొలగుతాయి. వ్యాపారాలు క్రమేపీ లాభించి వృద్ధి. భాగస్వాములతో తగాదాల పరి ష్కారం. ఉద్యోగులకు కోరుకున్న హోదాలు. క్రీడా కారులు, పరిశోధకుల కృషిఫలిస్తుంది. 24,25 తేదీల్లో అనుకోని ప్రయాణాలు. స్వల్పఅనారోగ్యం. శ్రీ రామరక్షా స్తోత్రాలు పఠించండి.