– సింహంభట్ల సుబ్బారావు, 6300674054
మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం
బంధువులు, స్నేహితులతో తగాదాలు క్రమేపీ పరిష్కారమవుతాయి. ఆస్తుల ఒప్పందాలలో జాప్యం. కాంట్రాక్టులు దక్కే సూచనలు. గృహనిర్మాణ యత్నాలలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగులకు విధుల్లో బాధ్యతలు పెరుగుతాయి. కళాకారులు, రాజకీయవేత్తలకు కష్టానికి ఫలితం కనిపిస్తుంది. క్రీడాకారులు, పరిశోధకులకు కాస్త ఊరట లభిసుంది. 16,17 తేదీల్లో వృథా ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు.. ఆదిత్య హృదయం పఠించండి.
వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు
ఆత్మీయులతో వివాదాలు పరిష్కరించుకుం టారు. ప్రత్యర్థులు అనుకూలురుగా మారతారు. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. ఆదాయం సంతృప్తికరం. సమాజసేవలో భాగస్వాములవుతారు. ఇళ్ల నిర్మాణ యత్నాలు కలసివస్తాయి. వ్యాపారస్తులకు లాభాలు అందుతాయి. ఉద్యోగస్తులకు విధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. రాజకీయవేత్తలు, కళాకారులు, పరి శోధకుల కృషి ఫలిస్తుంది. 19,20 తేదీల్లో దూర ప్రయాణాలు. ఆంజనేయ దండకం పఠించండి.
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కొన్ని కార్యక్రమాలు కొంత నిదానించినా ఎట్టకేలకు పూర్తి కాగలవు. బంధువులతో వివాదాలు సర్దుకుంటాయి. వాహనాలు, భూములు కొనుగోలు. వ్యాపారస్తులు ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు మార్పులు జరిగే వీలుంది. రాజకీయవేత్తలు, కళా కారులు, రచయితలకు ఒక సంతోషకరమైన సమా చారం అందుతుంది. 14,15తేదీల్లో ఖర్చులు పెరుగుతాయి. స్నేహితులతో విభేదాలు. శివపంచాక్షరి పఠించండి.
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కొత్త కార్యక్రమాలు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. సమాజసేవలో పాల్గొంటారు. వాహనయోగం. వ్యాపారులకు గతం కంటే లాభాలు మెరుగు పడతాయి. ఉద్యోగులకు విధుల్లో అవాంత రాలు తొలగి ఊరట లభిస్తుంది. పారిశ్రామిక వేత్తలు, కళాకారులు, క్రీడాకారుల యత్నాలు సఫలమవుతాయి. 15,16 తేదీల్లో అనుకోని ఖర్చులు. కుటుంబసమస్యలు చికాకు పరుస్తాయి. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆదాయం గతం కంటే మెరుగ్గా ఉంటుంది. అప్పులు తీరి ఊరట, కొన్ని సమస్యల నుంచి బయట. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపారస్తులకు మరింతగా లాభాలు అందుతాయి. ఉద్యోగులకు అనుకూల మార్పులు ఉండవచ్చు. రాజకీయవేత్తలకు శుభవర్తమానాలు. రచయితలు, క్రీడాకారులకు కొత్త ఆశలు. 18,19తేదీల్లో సన్నిహితులతో తగాదాలు. శారీరక రుగ్మతలు. ఆంజనేయ దండకం పఠించండి.
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు
దృఢదీక్ష, చాకచక్యంతో ముందుకు సాగి కొన్ని సమస్యలనుంచి గట్టెక్కుతారు. నిరుద్యోగుల ప్రయత్నా లలో ప్రతిబంధకాలు ఎదురుకావుచ్చు. వ్యాపారస్తు లకు ఒత్తిడులు తప్పకపోవచ్చు. ఉద్యోగులు విధుల్లో సమర్థతను నిరూపించుకోవలసిన సమయం. రాజకీయవేత్తలు, కళాకారులు, రచయితలు నిర్ణయాలలో తొందరపడరాదు. 16,17తేదీల్లో శుభవార్తలు. వాహన యోగం. కనకధారాస్తోత్రాలు పఠించండి.
తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఆలోచనలు అంతగా కలసిరాక మదనపడతారు. స్థిరాస్తి వివాదాలు గందరగోళంగా మారవచ్చు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారులు లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు విధుల్లో మనశ్శాంతి చేకూరుతుంది. కాంట్రాక్టులు ఎట్టకేలకు లభిస్తాయి. 18,19 తేదీల్లో వృథా ఖర్చులు. బాధ్యతలు పెరుగుతాయి. అన్నపూర్ణాష్టకం పఠించండి.
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ
ముఖ్య కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేసి సత్తా చాటుకుంటారు. ఉద్యోగార్ధుల యత్నాలు కొలిక్కివస్తాయి. స్థిరాస్తి వ్యవహారాలలో చికాకులు కొంతమేర తొలగుతాయి. ఒక ఆహ్వానం మరింత సంతోషం కలిగిస్తుంది. ఉద్యోగులకు కొత్త అవకాశాలు లభి స్తాయి. రచయితలు, క్రీడాకారులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. 14,15 తేదీల్లో శ్రమాధిక్యం. శారీరక రుగ్మతలు. గణేశాష్టకం పఠించండి.
ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
ముఖ్యమైన కొన్ని కార్యక్రమాలు సజావుగా పూర్తి చేస్తారు. ఆదాయం మరింత మెరుగుపడుతుంది. వ్యాపారులకు విస్తరణ కార్యక్రమాలు సఫలమవు తాయి, అనుకున్నంత లాభాలు. ఉద్యోగులకు ఒత్తిడులు, సమస్యలు తొలగుతాయి. రాజకీయ వర్గాలకు శుభవార్తలు. క్రీడాకారులు, పరిశోధకుల యత్నాలలో పురోగతి కనిపిస్తుంది. 19,20తేదీల్లో దూరప్రయాణాలు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.
మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం , ధనిష్ఠ 1, 2 పాదాలు
స్థిరాస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. వాహన, గృహం కొనుగోలు ప్రయత్నాలు సఫలమవుతాయి. వ్యాపారులకు తగినంత పెట్టుబడులు సమకూరి లాభాలు అందుతాయి. ఉద్యో గులకు బాధ్యతల భారం నుంచి కొంత విముక్తి. పారిశ్రామిక, రాజకీయ వర్గాలకు కలసివస్తుంది. రచయితలు, క్రీడాకారులు లక్ష్యసాధనలో ముందడుగు వేస్తారు. 17,18తేదీల్లో స్నేహితులతో తగాదాలు. స్వల్ప శారీరక రుగ్మతలు. ఆకస్మిక ప్రయాణాలు శివాష్టకం పఠించండి.
కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
కొత్త విషయాలు గ్రహిస్తారు. ఆప్తుల సలహాలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. ఒక సమాచారం మీలో మార్పునకు దారితీస్తుంది. వ్యాపారస్తులకు ఉత్సాహ వంతమైన కాలం. ఉద్యోగస్తులకు కొత్త హోదాలు. పారిశ్రామిక, రాజకీయవేత్తలు, కళా కారులకు కొన్ని ఇబ్బందులు తొలగుతాయి. 15,16 తేదీల్లో బంధువు లతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. శ్రీకృష్ణాష్టకం పఠించండి.
మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. బంధువులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. విచిత్రమైన సంఘటనలు. జీవిత భాగస్వామి తరఫున ఆస్తిలాభం. కాంట్రాక్టర్లు, రియల్టర్లకు కలసివచ్చే కాలం. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులు పేరు సంపాదిస్తారు. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. రచయితలు అనుకున్నది సాధిస్తారు.17,18 తేదీలలో అనుకోని ప్రయాణాలు. ధనవ్యయం. కాలభైరావష్టకం పఠించండి.