– సింహంభట్ల సుబ్బారావు, 6300674054
మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం
ఆశ్చర్యకరమైన నిర్ణయాలు తీసుకుని అందరి దష్టిని ఆకర్షిస్తారు. సోదరులతో విభేదాలు ప్రతి నిర్ణయంలోనూ ఆచితూచి ముందుకు సాగండి. వ్యాపారాలు సాదాసీదాగా కొన సాగుతాయి. ఆశించిన లాభాలు కనిపించక అయో మయంలో పడతారు. ఉద్యోగ విధి నిర్వహణ లో సహచరుల సహాయం కోరతారు. రచయితలు, కీడా కారులకు ఒత్తిడులు. 11,12 తేదీల్లో ధనలాభం. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. దేవీఖడ్గమాల పఠించండి.
వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు
ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులు, నిరుద్యోగులకు ఆశించిన అవకాశాలు కష్టసాధ్యమే. కొంత నలత చేసి ఇబ్బంది పడతారు. వ్యాపారాలు మొదట్లో కొంతమేర లాభించినా క్రమేపీ నిరాశ చెందుతారు. పారిశ్రామికవేత్తలు, కళా కారులకు గందరగోళంగా ఉంటుంది. వైద్యులు, క్రీడాకారులకు నిరాశ. 7,8 తేదీల్లో శుభవర్త మానాలు. స్వల్ప ధనలాభం. కార్యజయం. ఆదిత్య హృదయం పఠించండి.
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
సహనంతో మెలగడం మంచిది. శారీరక రుగ్మతలు బాధపెట్టవచ్చు. వ్యాపారాలు సామాన్యంగా కొనసాగుతాయి. ఉద్యోగులకు విధి నిర్వహణలో అవాంతరాలు ఎదురుకావచ్చు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు విదేశీ పర్యటనల్లో ఆటంకాలు. రచయితలు, వ్యవసాయదారులకు ఇబ్బందికరంగా గడుస్తుంది. 8,9 తేదీలలో ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. సంఘంలో గౌరవం. వాహనయోగం. శివాష్టకం పఠించండి.
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఆరోగ్యం గతం కంటే కొంత మెరుగ్గా ఉంటుంది. వ్యాపారులు లాభాలు గడిస్తారు. నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు .ఆశించిన విధంగా పదో న్నతులు రాగలవు. పైస్థాయి వారి ప్రశంసలు అందు తాయి. రాజకీయవేత్తలు, పరిశోధకులకు విశేష ఆదరణ లభిస్తుంది. సాంకేతిక నిపుణులు, పారిశ్రామికవేత్తల కృషి ఫలిస్తుంది. 7,8 తేదీల్లో దూరప్రయాణాలు. వృథా ఖర్చులు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
రావలసిన డబ్బు అందక ఇబ్బందులు పడతారు. రుణాలు సైతం సకాలంలో అందవు. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. వ్యాపారాలలో లాభనష్టాలు సమానంగా భరించాల్సి ఉంటుంది. ఉద్యోగులు విధుల్లో మరింత బ్యాధ్యతాయుతంగా మెలగడం మంచిది. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు విదేశీ పర్యటనలు వాయిదా. 9,10తేదీల్లో విందు వినోదాలు.ఆంజనేయ దండకం పఠించండి.
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు
వివాదాలను అత్యంత నేర్పుగా పరిష్కరించు కుంటారు. ఆరోగ్యం కొంత మెరుగుపడి ఊరట చెందుతారు. ఉద్యోగులకు పైస్థాయి వారి ప్రోత్సాహం పారిశ్రామికవేత్తలు, కళాకారులకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. క్రీడాకారులు, సాంకేతిక వర్గాల వారికి విదేశీపర్యటనలు. 8,9 తేదీలలో అయినవారితో వివాదాలు. చోరభయం. శ్రీ శివప్రాతఃస్మరణ స్తోత్రం పఠించండి.
తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కుటుంబంలో మీదే పైచేయిగా ఉంటుంది. అందరికీ ఆదర్శవంతంగా నిలుస్తారు. ఉద్యోగులకు కోరుకున్న అవకాశాలు దగ్గరకు వస్తాయి. ప్రమోషన్లు దక్కవచ్చు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు మరింత ఉత్సాహం. రచయితలు, సాంకేతిక వర్గాలకు శుభవర్తమానాలు. 11,12 తేదీలలో దూర ప్రయా ణాలు. కొన్ని చికాకులు ఎదురవుతాయి. ధనవ్యయం. శివాష్టకం పఠించండి.
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ
ముఖ్య కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. నూతన విద్య,ఉద్యోగావకాశాలు పొందుతారు. రెండు మూడువిధాలుగా ధనప్రాప్తి కలిగే అవకాశం. కుటుంబసభ్యుల ప్రేమను చూరగొంటారు. కొత్త పెట్టు బడులు సమకూరి విస్తరణ కార్యక్రమాలు చేపడతారు. రాజకీయవేత్తలు, కళాకారులకు విదేశీ పర్యటనలు. 7,8 తేదీల్లో అనుకోని ప్రయాణాలు. ఒప్పందాలలో ఆటంకాలు. అనారోగ్యం. విష్ణుధ్యానం చేయండి.
ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
ఆలోచనలు అంతగా కలసిరావు. కొంత సొమ్ము అందినా అవసరాలకు సరిపడక కొత్తగా అప్పులు చేస్తారు. లేనిపోని ఖర్చులు మీదపడవచ్చు, కొంత ఓపిక,సహనం అవసరం. లేనిపోని వివాదాల జోలికి వెళ్లవద్దు. వైద్యులు, రాజకీయవేత్తలకు ఇబ్బందులు ఎదురవుతాయి. 10,11 తేదీల్లో శుభవార్తా శ్రవణం. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.
మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం , ధనిష్ఠ 1, 2 పాదాలు
ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక అవసరాలుతీరక ఇబ్బందిపడతారు. భాగస్వాము లతో మాట పట్టింపుల వల్ల కొంత మందగిస్తాయి. ఉద్యోగులు ఆశించిన పదోన్నతులు దక్కక డీలా పడతారు. పారిశ్రామికవేత్తలు,కళాకారులు విదేశీ పర్యటనలు వాయిదా వేసుకుంటారు. రచయితలు, వ్యవసాయదారుల కృషి ఫలప్రదం కాకపోవచ్చు. 7,8 తేదీల్లో కీలక నిర్ణయాలు. ధనప్రాప్తి. . విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
ఆస్తుల విషయంలో ఒప్పందాలు కుదురుతాయి. విద్య, ఉద్యోగావకాశాలు దక్కించుకుంటారు. నూతన భాగస్వాములతో ఒప్పందాలు చేసుకుంటారు. ఉద్యోగాలలో ఆశించిన మేరకు పదోన్నతులు, ఇంక్రిమెంట్లు దక్కుతాయి. రాజకీయవేత్తలు, కళా కారులు, పరిశోధకులకు పట్టింది బంగారమే. 11,12 తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా లేదా రద్దు. ఖర్చులు. కాలభైరవాష్టకం పఠించండి.
మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
పెద్దల సూచనలు, సలహాల మేరకు నిర్ణయాలు తీసుకుంటారు. అనారోగ్యం కలిగినా ఉపశమనం పొందుతారు. వ్యాపారాలలో. క్రమేపీ లాభాల బాటలో నడుస్తారు. నూతన పెట్టుబడులకు సమయ మిదే. ఉద్యోగాలలో హోదాలు పారిశ్రామికవేత్తలు, కళాకారులకు విదేశీ పర్యటనలు. రచయితలు, క్రీడాకారుల ఆశలు నెరవేర తాయి. 7,8తేదీల్లో వృథాఖర్చులు. మానసిక ఆందో ళన. సోదరులతో కలహాలు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.