డేలైట్‌ సేవింగ్‌ టైమ్‌ మరో ప్రత్యామ్నాయం. ప్రస్తుతం మన దేశంలో ఎండాకాలంలో సూర్యోదయం సూర్యాస్తమయం ముందుగా జరుగుతుంది. దీనికి అనుగుణంగా ఏప్రిల్‌ నుండి సెప్టెంబర్‌ వరకు సమయాన్ని సెట్‌ చేసుకుంటే ఫలితం ఉంటుంది. ఉదయం, సాయంకాల వేళల్లో వెలుతురు ఎక్కువ సేపు ఉంటే విద్యుత్‌ ఆదా అవుతుంది. పర్యాటక రంగానికి కూడా ఇది అనుకూలంగా ఉంటుంది. బ్రిటన్‌లో వేసవి కాలం మార్చిలో సమయాన్ని గంట ముందుకు మారుస్తారు. అక్టోబర్‌లో తిగిరి పాత సమయానికి మారుతారు.

అన్ని అధ్యయనాలను పరిశీలించిన తర్వాత ఈశాన్య రాష్ట్రాలకు వేరే టైమ్‌ జోన్‌ ఉండాలనే డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది.

తాజాగా దేశ వ్యాప్తంగా ఒకే సమయాన్ని ప్రామాణీకరించే చర్యలో భాగంగా.. ఇక అన్ని రంగాల్లో భారత ప్రామాణిక సమయం (ఐఎస్‌టీ) వినియోగాన్ని తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ముసాయిదా నిబంధనలు రూపొందించింది. వీటిపై వచ్చే నెల 14లోపు ప్రజలు తమ అభిప్రాయా లను తెలపాల్సి ఉంటుంది.

ఇందుకోసం తూనికలు కొలతలు (భారత ప్రామాణిక సమయం) నిబంధనలు, 2024లో చట్టపరమైన విధివిధానాలు ఏర్పాటు చేశారు. ఇవి అమల్లోకి వస్తే.. చట్ట, పాలన, వాణిజ్య, ఆర్థికరంగా లతో పాటు..అధికారిక పత్రాల్లోనూ ఇక ఐఎస్‌టీ తప్పనిసరి. ఈ చట్టంలోని ముసాయిదా నిబంధనల ప్రకారం.. ఐఎస్‌టీ కాకుండా ఇతర టైమ్‌ జోన్లను ప్రస్తావించడం నిషేధం. అంతరిక్షం, సముద్రయానం, శాస్త్రీయ పరిశోధన రంగాలకు మినహాయింపు నిచ్చింది. దీంతో ఒకే దేశంలో రెండు సమయాలపై మరోసారి చర్చ మొదలైంది.

కేంద్ర ప్రభుత్వం దేశానికి రెండు టైమ్‌ జోన్లు అవసరమనే డిమాండ్‌ను పలు మార్లు తిరస్క రించినా.. స్థానిక అవసరాలను బట్టి పని వేళలను నిర్ణయించుకునే అవకాశం మన చట్టాల్లో ఉంది. ప్లాంటేషన్స్‌ శ్రామిక చట్టం- 1951 వంటి కార్మిక చట్టాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయా పారిశ్రా మిక ప్రాంతాలలో స్థానిక సమయాన్ని నిర్వచించ టానికి , స్థాపించటానికి అవకాశం కల్పిస్తున్నాయి

టైమ్‌ జోన్‌ అంటే ఏమిటి?

1879లో స్కాటిష్‌-కెనడియన్‌ ఇంజనీర్‌ సర్‌ శాండ్‌ఫోర్డ్‌ ఫ్లెమింగ్‌ ప్రపంచవ్యాప్త సమయ మండల (టైమ్‌ జోన్స్‌) వ్యవస్థను ప్రతిపాదించాడు. 1884లో అంతర్జాతీయ మెరిడియన్‌ సమావేశం 24 గంటల రోజును స్వీకరించింది.

మన భూగోళాన్ని 360 రేఖాంశాలుగా విభజించారు. రేఖాంశాలంటే భూమిపై ధ్రువాలను తాకుతూ నిలువుగా ఉండే ఊహా రేఖలు. రెండు రేఖాంశాల మధ్య నాలుగు నిమిషాల దూరం ఉంటుంది. అలా భూమిని 24 టైమ్‌ జోన్లుగా విభజించారు. అంటే భూమి తనచుట్టూ తాను తిరగడానికి పట్టే 24 గంటల సమయాన్ని 360 డిగ్రీలకు విభజించారు. దీని ప్రకారం, 15 డిగ్రీల దూరాన్ని భూమి తిరగడానికి ఒక గంట సమయం పడుతుంది. ఒక డిగ్రీకి నాలుగు నిమిషాలు. అన్ని టైమ్‌ జోన్లూ ప్రధాన టైమ్‌ జోన్‌కు అనుగుణంగా ఉంటాయి. ప్రధాన టైమ్‌ జోన్‌ ‘ప్రైమ్‌ మెరీడియన్‌’ లండన్‌లోని గ్రీన్‌విచ్‌ గుండా వెళ్తుంది. అందుకే దీన్ని గ్రీన్‌విచ్‌ మీన్‌ టైమ్‌ (జీఎంటీ)అని కూడా పిలుస్తుంటారు.

వాస్తవానికి దేశమంతటికీ ఒకే స్టాండర్డ్‌ టైమ్‌ ఉండాలనే నిబంధన ఏమీ లేదు. ప్రపంచం మొత్తానికి ఒకే సమయం అమలు చేయలేం. ఒక్కో దేశంలో ఒక్కో టైంజోన్‌ ఉంటుంది. కొన్ని దేశాల్లో రెండు కంటే ఎక్కువే టైమ్‌ జోన్లు కూడా ఉన్నాయి. ఫ్రాన్స్‌లో అత్యధికంగా 12 టైమ్‌ జోన్లు ఉన్నాయి. అమెరికా, రష్యాల్లో 11 టైమ్‌ జోన్లు ఉన్నాయి. ఇండోనేషియాలో 3 టైమ్‌ జోన్‌లు ఉన్నాయి, బ్రెజిల్‌లో 4 టైమ్‌ జోన్‌లు ఉన్నాయి.

భారత ప్రామాణిక సమయం గురించి..

భారత ప్రామాణిక సమయం (ఐఎస్‌టీ)ని 82.5ళీ తూర్పు రేఖాంశం ఆధారంగా లెక్కకడతారు. ఈ రేఖాంశం ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ దగ్గర ఉన్న మీర్జాపూర్‌కు కొంచెం పశ్చిమంగా, ఆంధ్ర ప్రదేశ్‌లోని కాకినాడ మీదుగా వెళుతుంది. ఇది గ్రీన్‌ విచ్‌ టైమ్‌కు భారత్‌ టైమ్‌ ం5:30 గంటల ముందుకు ఉంటుంది. దీనిని ఇప్పుడు యూనివర్సల్‌ కోఆర్డినేటెడ్‌ టైమ్‌ (యూటీసీ) అని పిలుస్తారు. స్థానిక సమయాన్ని అలహాబాద్‌ అబ్జర్వేటరీ దగ్గర ఉన్న గడియార స్తంభం నుండి లెక్కకడతారు. మన దేశంలో సమయాన్ని పర్యవేక్షించేది న్యూఢల్లీిలోని కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిజికల్‌ లాబొరేటరీ (సీఎస్‌ఐఆర్‌-ఎన్‌ఐపీఎల్‌).

భారతదేశంలో బ్రిటీషు ఈస్టిండియా కంపెనీ 1792లో మద్రాసు అబ్జర్వేటరీని ప్రారంభించింది. 1802లో ఈస్టిండియా కంపెనీ అధికారిక ఖగోళ కారుడు జాన్‌ గోల్డింగ్‌హామ్‌, గ్రీన్‌విచ్‌ ప్రామాణిక సమయానికి ఐదున్నర గంటలు ముందున్న మద్రాసు రేఖాంశాన్ని స్థానిక ప్రామాణిక సమయంగా స్థిరపరిచాడు.

1850లలో మన దేశంలో రైల్వేలు వచ్చిన తర్వాత ఒకే ప్రామాణిక సమయం ఆవశ్యకత తెలిసొచ్చింది. 1884లో వాషింగ్టన్‌ డి.సి.లో జరిగిన అంతర్జాతీయ మెరిడియన్‌ సమావేశం ప్రపంచ మంతటా ప్రామాణిక టైమ్‌ జోన్స్‌ ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో భారతదేశంలో రెండు కాలమండలాలు ఉండాలని నిర్ణయించారు. కలకత్తా తూర్పు 90 డిగ్రీల రేఖాంశాన్ని, బొంబాయి తూర్పు 75 డిగ్రీల రేఖాంశాన్ని ఉపయోగించేది. క్రమేణ వాటి చుట్టుపక్కల ప్రాంతాలు, సంస్థానాలు ఈ ప్రామాణిక సమయాన్ని అవలంబించాయి.

1880ల చివరి వరకూ రైల్వేలు రెండు టైమ్‌ జోన్లకు మధ్యేమార్గంగా రైల్వే సమయంగా మద్రాసు టైమ్‌ ఉపయోగించడం ప్రారంభిం చాయి. అండమాన్‌ నికోబార్‌ దీవులు రాజధాని పోర్ట్‌ బ్లెయిర్‌లో మీన్‌ టైం అనే మరో ప్రత్యేక టైమ్‌ జోన్‌ స్థాపించబడిరది. పోర్ట్‌ బ్లెయిర్‌ టైమ్‌, మద్రాసు టైమ్‌ కంటే 49 నిమిషాల 51 సెకన్లు ముందు ఉండేది.

1905లోబ్రిటిష్‌ ఇండియా ప్రభుత్వం అధికారికంగా సమైక్య టైమ్‌ జోన్‌ ఏర్పాటు చేసింది. ఇదే మీర్జాపూర్‌ దగ్గర 82.5 డిగ్రీల రేఖాంశం ఆధారంగా ఏర్పాటు చేసిన సమయం. ఇది 1906 జనవరి 1 నుండి భారత్‌, శ్రీలంకలలో అమలులోకి వచ్చింది. చెన్నైలోని కేంద్రీయ అబ్జర్వేటరీని మిర్జాపూర్‌ దగ్గరకు తరలించారు.

1947లో భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశం మొత్తానికి ఒకే టైమ్‌ జోన్‌ అమలులోకి వచ్చింది.అయితే కలకత్తా సమయాన్ని 1948 వరకు అధికారికంగా, ప్రత్యేక కాలమండలంగానే నిర్వహించారు. కొంత కాలం వరకూ బొంబాయి టైమ్‌ కూడా పాటించారు.

కాగా 1962 చైనాతో యుద్ధం, 1965, 1971 పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధ సమయాల్లో పౌర విద్యుచ్ఛక్తి వినియోగాన్ని తగ్గించడానికి తాత్కాలికంగా డేలైట్‌ సేవింగ్‌ టైమ్‌ను అమలుపరిచారు.

మన దేశంలో భారత ప్రామాణిక సమయాన్ని దేశమంతా సమన్వయం చేసేందుకు ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆకాశవాణి, దూరదర్శన్‌ ఉపయోగిస్తు న్నారు. ప్రస్తుతం మొబైల్‌ కంపెనీలు  ఐఎస్‌టీని కచ్చితంగా సూచిస్తున్నాయి.

ఇరుగు పొరుగు దేశాల సమయాలు

మన దేశంలో ఉదయం 5 గంటల వేళ పొరుగు దేశాల్లో ఈ సమయాలు ఉంటాయి

భారత్‌           IST 05:00am (UTC+5:30)

పాకిస్తాన్‌       PKT 04:30am (UTC+5:00)

నేపాల్‌         NPT 05:15am (UTC+5:45)

భూటాన్‌        BTT 05:30am (UTC+6.00)

బాంగ్లాదేశ్‌    BST 05:30am (UTC+6.00)

మయన్మార్‌ MMT 07:00am (UTC+6:30)

శ్రీలంక         IST 05:00am (UTC+5:30)

చైనా             CST 07:30am (UTC+8:00)

About Author

By editor

Twitter
YOUTUBE