‘అల్లర్లు, అరాజకాలు సృష్టించండి! ప్రభుత్వాలను అస్థిరపరచండి’ ఇది 13వ శతాబ్దానికి చెందిన మాకియవిల్లీ రాజనీతి. జార్జి సోరోస్ అనే అమెరికా- హంగేరియన్ యూదు విధ్వంసకుడిది కూడా ఇదే పంథా. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ బోధిస్తున్నదీ ఈ నీతినే. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో మర్రి చెన్నారెడ్డిని ముఖ్యమంత్రి గద్దె దించడం కోసం వై.ఎస్. రాజశేఖరరెడ్డి, 1969లో కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు మర్రి చెన్నారెడ్డి ఇదే వ్యూహం ప్రయోగించా రన్న ఆరోపణలు ఉన్నాయి. అంతా కాంగ్రెస్ వారే. ఇవన్నీ ఇప్పుడెందుకు గుర్తు చేసుకోవలసి వచ్చిందంటే మార్చి 17 రాత్రి మహారాష్ట్రలోని నాగపూర్‌లో అల్లర్లు జరిగాయి. రౌడీ మూకలు మహల్ ప్రాంతంలో కార్లకు నిప్పు పెట్టారు. షాపులు లూటీ చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయంపై దాడి చేశారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారుల తలలు పగలగొట్టారు. గొడ్డళ్లతో చేతులు నరికారు. రాళ్ల వర్షం కురిపించారు. ఇదంతా ఎందుకు?
‘ఛావా’ అనే ఒక సినిమా వచ్చింది. ఔరంగ జేబ్ దుర్మార్గం, శంభాజీ పరాక్రమం చిత్రీకరించిన చిత్రమది. మహారాష్ట్రలోని శంభాజీనగర్ జిల్లాలో ఔరంగజేబ్ సమాధి ఉంది. దానిని తొలగించాలని విశ్వహిందూ పరిషత్, బజరంగదళ్ కార్యకర్తలు ఆందోళన చేశారు. ‘మా ఔరంగజేబు మహాత్ముడు’ అంటూ అబ్దుల్లా ఆజ్మీ అనే సమాజవాది పార్టీ నాయకుడు ముంబాయిలో ప్రకటించడం వివాదానికి కారణం. ఔరంగజేబు దుర్మార్గాలు ఇన్నీ అన్నీ కావు. 36000 హిందూ దేవాలయాలు ధ్వంసం చేయిం చాడు. కాశీ విశ్వేశ్వర దేవాలయం నేలమట్టమయింది. మధుర శ్రీకృష్ణ దేవాలయం ధ్వంసం చేశాడు. గోల్కొండలోని అబుల్ హసన్ తానాషాపై దండెత్తాడు. ఎందుకు? ఔరంగజేబ్ సున్నీ, తానాషా షియా. ఔరంగజేబ్ హిందూ పాలకుడు శంభాజీనీ, సిక్కుల తొమ్మిదవ గురువు తేగ్ బహదూర్ సింగ్‌ను మాత్రమే కాదు, సున్నీలు కానివారినీ వదలలేదు. సోదరుణ్ణి హత్య చేశాడు. తండ్రి షాజహానును ఆగ్రా జైలులో పెట్టాడు. తాగేందుకు నీళ్లు కూడా ఇవ్వకుండా చంపాడు. ఇంతటి క్రూరస్వభావుణ్ణి అఖిలేష్ యాదవ్ పార్టీ ఎస్‌పీ ‘మంచోడు’ అంటున్నది. ఎందుకు? ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు రాబోతున్నాయి. లోగడ మహారాష్ట్రలో జరిగిన ఎన్నికలలో ఉద్ధవ్ ఠాక్రే, శరత్ పవార్ ఓడిపోయారు. అందుకని రాహుల్ గాంధీ కాంగ్రెసు పార్టీతో కలసి వారు అడ్డతోవలలో రాజ్యాధికారం పొందాలని ప్రయత్నిస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ వ్యూహం అదే.
ప్రియాంకా చతుర్వేది (ఉద్ధవ్‌ఠాక్రే యూబీటి) అనే ప్రతినిధి మాట్లాడుతూ ‘శాంతి భద్రతలు కాపాడడంలో దేవేంద్ర ఫడణవీస్ ప్రభుత్వం విఫలమయింది. కాబట్టి రాజీనామా చేయాలి’ అని ఒక ప్రకటన విడుదల చేసింది. సరిగ్గా ఇదే కాంగ్రెసు ఆశించిన వ్యూహం. మొత్తంగా చూస్తే ఇదొక సాలెగూడు.
దేశంలో మతకల్లోలాలు మొదటిసారి కాదు. ఇవే ఆఖరివీ కాదు. హిందువులు, ముస్లిములు, క్రైస్తవులు కలసి ఎందుకు సహజీవనం చేయలేక పోతున్నారు? బెంగాల్‌కు మమతా బెనర్జీ ఎందుకు నిప్పు పెట్టింది? దేశానికి నిప్పు పెట్టండి అని బహిరంగంగా కాంగ్రెసు పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ పిలుపునిచ్చాడు. రాజ్యంతో పోరాడతా నన్నాడు. ప్రధానమంత్రి పదవి ఆశించి, భంగపడి దేశం మీద ఇలా కక్ష సాధిస్తున్నాడు.
తమిళనాడు భారత్‌లో అంతర్భాగం కాదని తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్ వదరుతూనే ఉన్నాడు. ఎవరూ ఏం చేయలేకపోతున్నారు. ఈ దుర్మార్గాల వెనుక చైనా, పాకిస్తాన్‌లు ఉన్నాయనేది సుస్పష్టం. బెలూచిస్తాన్‌లో విభజనోద్యమం ఊపందుకున్నది. పాకిస్తాన్ ఏ క్షణంలోనైనా కుప్పుకూలిపోవచ్చు. అందుకని భారతదేశంలో అప్రజాస్వామిక మార్గాలలో హింసను ముమ్మరం చేసింది.
దేవేంద్ర ఫడణవీస్ ఇప్పుడు ఏం చేస్తారు? ఈ దుర్మార్గాలపై శిక్షలు లేవా? కాంగ్రెసు, ఉభయ కమ్యూనిస్టు, ముస్లిం లీగ్, సమాజవాద పార్టీ, డీఎంకే, తృణమూల్ కాంగ్రెసు పార్టీలను ఎన్నికల సంఘం నిషేధించగలదా? నిషేధించవలసిన అవసరం లేదా? వాటి కారణంగా ప్రజలకు ప్రజాస్వామ్యం మీద, రాజ్యాంగం మీద నమ్మకం పోతుంటే మీనమేషాలు లెక్కించడం ఏమిటన్నదే సామాన్యుడి ఆవేదన. రాజ్యాంగేతర మార్గాల ద్వారా అధికారం హస్తగతం చేసుకోవచ్చుననుకుంటే ఇక ఎన్నికల పక్రియ ఎందుకు?
నాగపూర్‌లో ఆర్‌ఎస్‌ఎస్ కేంద్ర కార్యాలయం ఉంది. దీనిమీద దాడి చేయాలని 1948లో కాంగ్రెసు వారు ప్రయత్నించారు. సంఘ్‌ను అణచివేయాలని నెహ్రూ వంశం ప్రయత్నిస్తూనే ఉంది. చరిత్రను జాగ్రత్తగా అధ్యయనం చేస్తే గత నూరేండ్లుగా కాంగ్రెసు పార్టీ హిందువుల అణచివేత కోసమే పని చేసింది. షౌకత్ అలీ, షేక్ ముజిబుర్ రహమాన్, మహమ్మద్ అలీ జిన్నాలతో మహాత్మా గాంధీ స్నేహం చేశాడు. కాంగ్రెస్ అవకాశం దొరికినప్పుడల్లా కమ్యూనిస్టులతో కలిసి ఆర్‌ఎస్‌ఎస్‌ను అణచివేయాలని ప్రయత్నించింది. అవసరమైతే విదేశాలకు వెళ్లి సైన్యం సమకూర్చుకొని హిందుత్వంపై యుద్ధం చేస్తానని 1950లో జవహర్లాల్ నెహ్రూ ప్రకటించాడన్నది నిజం.
2019లో కాంగ్రెసు నాయకుడు మణిశంకర అయ్యర్ కరాచీలోని దునియా టీవిలో ఐఎస్‌ఐ నాయకులతో ఇలా చెప్పాడు, ‘నరేంద్ర మోదీని ఓడించాలంటే మాకు మీ ప్రత్యక్ష సహాయం అవసరం’. లష్కరే తోయిబా, అల్ ఖైదా, జైషే మహమ్మద్, ఇత్తెహాదుల్ ముస్లిమీన్, ముస్లిం లీగ్, ఐసిస్, పి.ఎస్.ఐ. వంటి జీహాదీ ఉగ్రవాద సంస్థలు భారతదేశంలో సక్రియంగా పనిచేస్తున్నాయి. వీరిని నియంత్రించటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలక• దుర్లభమవుతున్నది. కారణం ఇంటి దొంగలు కావడమే. అర్బన్ నక్సల్స్ ముఖ్యమంత్రుల స్థానంలో ఉంటే శాంతి భద్రతల పరిరక్షణ ఎలా సాధ్యం?
మహారాష్ట్ర పరిస్థితి చూద్దాం. గత మూడు శతాబ్దాలుగా మహారాష్ట్రపై జిహాదీ దాడులు జరుగుతూనే ఉన్నాయి. చరిత్రలో ఛత్రపతి శివాజీ అవతరణకు ఆ దాడులే ప్రధాన కారణం కాదా? మహారాష్ట్ర ముస్లింల వైఖరి గురించి కొద్దిగా గుర్తుకు తెచ్చుకోవాలి. 1925లో నాగపూర్‌లో శ్రావణ శుక్రవారం వ్రతాలు జరుగుతున్న సందర్భంగా మహిళలపై జిహాదీలు దాడి చేశారు. హిందువులు భయపడి భాగో భాగో అంటూ పరుగెత్తారు. ఈ సన్నివేశం కేశవరావు బలిరాం హెడ్గేవార్ చూచి జాగో జాగో అని పిలుపునిచ్చారు. అదే రాష్ట్రీయ స్వయంసేవక సంఘ అవతరణకు ముహూర్తం. బాలాసాహెబ్ ఠాక్రే శివసేన పార్టీని స్థాపించాడు. (ఆయన కొడుకు ఉద్ధవ్ తండ్రి ఆదర్శాలకు విరుద్ధంగా కాంగ్రెసు, ముస్లింలీగ్ తో చేతులు కలిపాడు). అణగి ఉన్న జిహాదీ మనస్తత్వం మళ్లీ విజృంభిస్తున్నది. మహారాష్ట్ర రాజధాని ముంబాయి భారత ఆర్థిక రాజధాని. దీనిని హస్తగతం చేసుకోవడానికి ఉగ్రవాదులు నిరంతరం ప్రయత్నిస్తూ ఉన్నారు. దీనికి అంతం ఎక్కడ?
నాగపూర్ ప్రశాంత నగరం. ఈ సమీపంలోనే రాంటెక్ ఉంది. ఇక్కడే కాళిదాసు మేఘసందేశం రాశాడని లోకోక్తి. ఇక్కడ నుండే కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, రాష్ట్ర మంత్రులు ఎన్నిక అయినారు. ఇప్పుడు జిహాదీ ఉగ్రవాదులు వీరికి కత్తులతో, గొడ్డళ్లతో, పెట్రోలు బాంబులతో సవాలు విసిరారు.
చాలా సంవత్సరాలుగా చెబుతున్నాను – హిందువులకు శత్రువులు హిందువులే అని. ఆనాటి అంభి, జయచంద్రలకు, ఈనాటి కపిల్ సిబాల్, అఖిలేష్ యాదవ్, శరత్ పవార్లకు తేడా ఏముంది? నాగపూర్ అల్లర్లను రిపబ్లిక్ ఛానల్ ప్రసారం చేసింది. తక్కిన వారు కళ్లు మూసుకున్నారు. ఎందుకని? వీరిలో యుఎస్ ఫండ్స్ జాబితాలో చాలామంది ఉన్నారు. అల్లర్లకు సంబంధించి నాగపూర్‌కు చెందిన మైనారిటీ పార్టీ నాయకుడు షాహింఖాన్ అరెస్టయ్యాడు. ఖురానును తగలబెట్టారు అనే అసత్యపు వార్తను సృష్టించి, వీడియోలు పెట్టి జనాలను రెచ్చగొట్టి అల్లర్లు సృష్టించాడని తెలుస్తున్నది. కదమ్ అనే నవయువకుడు 2019 బ్యాచ్ పోలీసు ఉన్నతాధికారిని ఉగ్రవాదులు నిన్నటి దాడులలో గొడ్డలితో చేయి నరికాడు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారో చెప్పండి సోనియాగాంధీ గారూ!! ఉగ్రవాదుల పడగ నీడలో భారత్ విలవిలలాడుతున్నది. ఈ రోగానిది వేయేండ్ల చరిత్ర. అర్బన్ నక్సల్స్, కల్చరల్ టెర్రరిజం, ఎకనమిక్ టెర్రరిజం, రెలిజియస్ టెర్రరిజం ఇల్లా భిన్నముఖాలలో ఉగ్రవాదం జడలు విప్పింది. దీనికి సభ్య సమాజం బలి అయిపోతున్నది. ఈ దుర్గతిని ముందుగానే ఊహించిన ప్రవక్త వినాయక దామోదర సావర్కర్. నేటికీ సావర్కర్‌ను కాంగ్రెస్ పరమనీచంగా దూషిస్తూనే ఉంది. ఇస్లామిక్, క్రైస్తవ ఉగ్రవాదులు దశా బ్దాలుగా అల్లర్లు సృష్టిస్తూ ఉంటే వాటిని ప్రభుత్వాలు రాజకీయ సంకల్పంతో స్వీకరించలేకపో యాయి. ఇవాళ నాగ పూర్‌లో జరిగిన దురా గతం రేపు హైదరా బాదులో జరగదని ఎవరైనా హామీ ఇవ్వగలరా?
ప్రొ. ముదిగొండ శివప్రసాద్
విశ్రాంత ఆచార్యుడు