మన దేశం విభిన్న ప్రాంతాలతో భాషా మత సంస్కృతులతో సామరస్యానికి నిలయంగా ఉంది. భారత రాజ్యాంగం పౌరులందరికీ వీటిని పరిరక్షించుకునే హక్కులను ఇచ్చింది. దురదృష్టవశాత్తు కొన్ని శక్తులు తమ సంతుష్టీకరణ రాజకీయాల కోసం ఈ దేశ మెజారిటీ ప్రజల మత, భాష, సంస్కృతి సాంప్రదాయాలను హేళన చేస్తున్నాయి. దేశ ప్రజల మధ్య సామరస్యాన్ని దెబ్బతీస్తూ వికృత ఆనందాన్ని పొందుతున్నాయి. వారి గురి కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం. కానీ గాయపడుతున్నది దేశ ప్రజలే. బాధ్యతాయుత ముఖ్యమంత్రి పదవిల్లో ఉండి కూడా ఇలా ప్రవర్తిస్తే ఎలా అనే స్పృహ కూడా వీరికి లేకపోవడం శోచనీయం.

త్రిభాషా విధానానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించారు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌. ‌హిందీ భాషను తమపై బల వంతంగా రుద్దాలని ప్రయత్నిస్తే దాన్ని అణచి వేసేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తామంటు న్నారు. మరో భాషా పోరాటానికి తమిళనాడు ప్రజలు సిద్ధం అని స్టాలిన్‌ ‌హెచ్చరించారు. ఆయన పిలుపు మేరకు రాష్ట్రంలో హిందీలో ఉన్న బోర్డులకు నల్లరంగు పూశారు డీఎంకే కార్యకర్తలు. తమ ఇళ్ల ముందు హిందీ భాషా వ్యతిరేక నినాదాలతో ముగ్గులు వేశారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానంలో భాగంగా త్రిభాషా విధానం తప్పనిసరని కేందప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా ప్రాంతీయ భాషతో పాటు హిందీ, ఇంగ్లీషు భాషలను నేర్పించాల్సి ఉంటుంది. దీన్ని అమలు చేయని తమిళనాడుకు సమగ్ర శిక్షా అభియాన్‌ ‌పథకం కింద ఇవ్వాల్సిన రూ.2152 కోట్ల నిధులను నిలిపేస్తున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ‌ప్రకటించారు. డీఎంకే ప్రభుత్వం రాజకీయ కారణాలతోనే హిందీని వ్యతిరేకిస్తోందని ప్రధాన్‌ ఆరోపించారు. కేంద్రం ఎప్పుడూ తమిళ భాష చదవకూడదని చెప్పలేదని, మూడోభాషగా హిందీని అంగీకరించాలని ప్రతిపాదించామని స్పష్టంచేశారు. ఈ నిధులను తాము అడుక్కోవడం లేదని, మీ నాన్నగారి సంపాదన నుంచి అడగడం లేదని వ్యాఖ్యానించారు స్టాలిన్‌ ‌కుమారుడు, ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌.

‌తమిళనాట హిందీపై వ్యతిరేకత ఈనాటిది కాదు. స్వాతంత్య్రానికి ముందు నుంచే జస్టిస్‌ ‌పెరియార్‌ ‌రామస్వామి, అన్నాదురై ద్రవిడవాదం ముసుగులో హిందీ వ్యతిరేక ఆందోళనలు నిర్వహిం చారు. స్వాతంత్య్రం తర్వాత ప్రథమ ప్రధాని నెహ్రూ ప్రతిపాదించిన త్రిభాషా విధానాన్ని వ్యతిరేకించారు. ఫలితంగా హింస చెలరేగి వందలాది మంది మరణించారు.

హిందీ వ్యతిరేక ఉద్యమాలతో అధికారం కోల్పోయిన కాంగ్రెస్‌ ‌పార్టీ ఈనాటికీ కోలుకోలేదు. ఈ భాషోన్మాద రాజకీయాల ఆధారంగా ఎదిగిన డీఎంకే అదే రాజకీయాలను ఇప్పటికీ కొనసాగిస్తోంది. ప్రస్తుతం తమిళనాడులో ద్విభాషా విధానం మాత్రమే కొనసాగుతోంది. తమిళం, ఆంగ్లం మాత్రమే బోధిస్తున్నారు.

డీఎంకే కపట విధానాలు

డీఎంకే నాయకులు హిందీ వ్యతిరేకత విషయంలో కపట రాజకీయాలు చేస్తున్నారని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై విరుచుకు పడ్డారు. ద్విభాషా విధానం పేరుతో ప్రభుత్వ పాఠశాలల్లో హిందీ నేర్పడాన్ని నిరాకరిస్తున్నారు. కానీ సీబీఎస్‌ఈ ‌సిలబస్‌ ‌బోధించే ప్రైవేటు స్కూళ్లలో థర్డ్ ‌లాంగ్వేజ్‌ ‌లేదా అని ప్రశ్నించారు. ఇందులో కొన్ని స్టాలిన్‌ ‌బంధువులవి, డీఎంకే పార్టీ వారివే

ఉన్నాయని అన్నామలై గుర్తుచేశారు. ‘‘ఇక్కడ డీఎంకేది ద్వంద్వ విధానం. ధనికుల పిల్లలకు ఒక రకంగా, పేదల పిల్లలకు ఒక రకంగా వ్యవరిస్తోంది. ఇది కపట ధోరణి’’ అంటూ అన్నామలై ఎక్స్ ‌వేదికగా ట్వీట్‌ ‌చేశారు.

ఇటీవల లోక్‌సభలో భాషాపరమైన అంశంపై డీఎంకే ఎంపీ దయానిధి మారన్‌ను స్పీకర్‌ ఓం‌బిర్లా మందలించారు. లోక్‌సభ కార్యకలాపాలను ఎప్పటి కప్పుడు సంస్కృతంలోకి అనువదించడంపై దయానిధి అభ్యంతరం చెప్పారు. ‘‘దేశంలో కేవలం 73వేల మంది మాత్రమే సంస్కృతం మాట్లాడుతున్నారన్నారు. సంస్కృతం ఎవరికీ అర్థం కాదు.. ఇది కేవలం ఆర్‌ఎస్‌ఎస్‌ ‌భావజాలంతో చేస్తున్న పని’’ అని వ్యాఖ్యానించారు. సంస్కృతంలోకి అనువదించడంవల్ల ప్రజలు కష్టపడి కడుతున్న పన్నులు వృథా అవుతున్నాయన్నారు దయానిధి మారన్‌..

‌దీనికి లోక్‌సభ స్పీకర్‌ ఓం‌బిర్లా తీవ్రంగా స్పందించారు. ‘‘లోక్‌సభలో కేవలం సంస్కృతమే కాదు హిందీ సహా పలు భాషల్లో అనువాదం జరుగుతోంది. మీ సమస్య ఏంటో అర్థం కావడం లేదు.. మీరు ఏ దేశంలో నివసిస్తున్నారు. ఇది భారతదేశం. భారతదేశ ప్రాథమిక భాష సంస్కృతం’’ అని మందలించారు. బోడో, డోగ్రి, మైథిలి, మణిపురి, సంస్కృతం, ఉర్దూ భాషల్లో కూడా ఏకకాలంలో అనువాదం జరుగు తోందని అన్నారు. దయానిధి మారన్‌ ‌భారతీయ భాషల మధ్య ద్వేషాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తు న్నారని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఆరోపించారు. విచిత్రం ఏమిటంటే.. డీఎంకే దిగ్గజనేత దివంగత మాజీ సీఎం కరుణానిధి, ఆయన మేనల్లుడు దయానిధి, మనవడు ఉదయనిధి పేర్లలోనే సంస్కృతం కనిపిస్తుంది. దయానిధి కుటుంబం నిర్వహించే చానళ్లు సూర్య, ఆదిత్య, ఉదయ, తేజ ఏ భాషకు సంకేతం?

డీఎంకే నాయకులు హిందీ విషయంలో చేస్తున్న వ్యాఖ్యలను ఇటీవల కేంద్ర మంత్రి ఎల్‌ ‌మురుగన్‌ ‌తప్పుపట్టారు. తమిళ భాష గుర్తింపు పట్ల వారి నిబద్ధతను ప్రశ్నించారు. స్టాలిన్‌, ఉదయనిధి స్టాలిన్‌ అనే పేర్లు ఏమైనా తమిళమా అని నిలదీశారు. వారు ముందుగా తమ సొంత కుటుంబంలో తమిళ పేర్లను ఉంచుకోవాలి అని మురుగన్‌ ‌సూచించారు.

పునర్విభజనపై రాద్దాంతం

లోక్‌సభ నియోజకవర్గ పునర్విభజన విషయంలో కూడా తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ ‌చాలా రోజులుగా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. జనాభా ప్రాతిపాదికన మాత్రమే నియోజక వర్గాలను నిర్ణయిస్తే దక్షిణ భారతదేశంతో పాటు తమిళనాట లోక్‌సభ స్థానాలు తగ్గిపోతాయని ఆందోళవ్యక్తం చేశారు. ఇందుకు విరుగుడుగా కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలు త్వరగా పిల్లల్ని కనాలనే ఓ హాస్యాత్మక ప్రతిపాదనను ఆయన చేశారు. గతంలో తాము కుటుంబ నియంత్రణపై మాత్రమే దృష్టి సారించామని కానీ ఇప్పుడు రాష్ట్ర జనాభాను పెంచుకోక తప్పని పరిస్థితుల్లో పడ్డామని అన్నారు.

స్టాలిన్‌ ‌వాదనకు గట్టి బదులు ఇచ్చారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ ‌షా. నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాల్లో ఒక్క లోక్‌సభ సీటు కూడా తగ్గదని స్పష్టం చేశారు. సీఎం స్టాలిన్‌, ఆయన కుమారుడు ఉదయనిధి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన హామీ మేరకు దక్షిణ భారత రాష్ట్రాలకు దామాషా నిష్పత్తిలో ఒక్క పార్లమెంటు స్థానం కూడా తగ్గదని తేల్చి చెప్పారు.

మహాకుంభమేళాపై విషం

పూర్వం రాక్షసులు మన మునులు యాగాలు చేస్తున్నప్పుడు భగ్నం చేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలం కావడం తెలిసిందే. ఇప్పుడు హిందువుల ఆచారాల వ్యవహారాలను అవహేళన చేస్తూ భగ్నం చేసే పాత్రను కుహనా లౌకికవాద పార్టీలు తీసుకున్నాయి. ఇటీవల ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా దిగ్విజయంగా ముగిసింది. మకర సంక్రాంతి నాడు ప్రారంభమై మహాశివరాత్రి నాడు ముగిసిన ఈ పవిత్ర ఆధ్యాత్మిక వేడుకకు 66 కోట్ల మందికి పైగా భక్తులు తరలి వచ్చి గంగ, యమున, సరస్వతి నదుల సంగమంలో స్నానమాచరించారు. ఇంత పెద్ద కార్యక్రమంలో జరిగిన స్వల్ప అపశ్రుతులు కొంత బాధ కలిగించినా, మొత్తం మీద శుభప్రదం చేసింది ఉత్తరప్రదేశ్‌ ‌ప్రభుత్వం. కుక్కతోక వంకర అనే చందాన హిందుత్వాన్ని, బీజేపీని, సంఘ్‌ను తీవ్రంగా ద్వేషించే కొన్నిపార్టీల నేతలు యధావిధిగా కారు కూతలు కూశారు.

మహాకుంభ్‌ ‌మృత్యుకుంభ్‌గా మారిందని ఆరోపించారు పశ్చిమ బెంగాల్‌ ‌ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. తనకు మహా కుంభమేళాపై భక్తి ఉందని.. గంగమ్మ తల్లి అంటే గౌరవం అంటూనే ఉత్తరప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పించారు.

మమత వ్యాఖ్యలను యోగి ఆదిత్యనాథ్‌ ‌తీవ్రంగా ఖండించారు.

‘‘ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంపై రాజకీయాలు చేయడం ఎంతవరకు సముచితం. తొలిరోజు నుంచి మహాకుంభ్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఈ శతాబ్దంలో జరిగిన కార్యక్రమంలో భాగస్వా ములు కావడం ఆనందంగా ఉంది. అందుకే తప్పుడు ప్రచారాలు పట్టించుకోకుండా ఈ ప్రపంచం, ఈ దేశం మహాకుంభ్‌లో పాల్గొంది’’ అని యోగి అన్నారు.

పశ్చిమ బెంగాల్‌ ‌రాష్ట్రంలో హిందువుల మీద జరుగుతున్న దాడుల విషయంలో మమతా బెనర్జీ ఏనాడూ పట్టించుకోలేదు. దోషులపై కఠిన చర్యలు తీసుకోలేదు. పైగా ఓటు బ్యాంకు రాజకీయాలతో నిందితులను వెనుకేసుకు వచ్చారు. బాంగ్లాదేశ్‌ ‌నుంచి కొనసాగుతున్న అక్రమ వలసలను అరికట్టకపోగా, వారి ఓట్ల కోసం రేషన్‌ ‌కార్డులు, ఆధార్‌ ‌కార్డులు ఇప్పించారనే ఆరోపణలు పశ్చిమ బెంగాల్‌ ‌రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నాయి. మమత హిందుత్వం విషయంలో విషం కక్కడం కొత్తేమీ కాదు.

మరోవైపు కుంభమేళాకు అర్థమే లేదంటూ ఆర్జేడీ అధినేత, బిహార్‌ ‌మాజీ సీఎం లాలూ ప్రసాద్‌ ‌తన నోటి దురద తీర్చుకున్నారు. ఢిల్లీ రైల్వే స్టేషన్‌ ‌తొక్కిసలాట ఘటనపై స్పందిస్తూ కుంభమేళా పనికిరానిదని వ్యాఖ్యానించారు.

పవిత్ర స్నానాలపై కాంగ్రెస్‌ అక్కసు

దేశ వ్యాప్తంగా ప్రాంతాలు, కులాలు, రాజకీయాలకు అతీతంగా కుంభమేళాకు తరలి వెళ్లి పుణ్య స్నానాలు చేశారు. కానీ కాంగ్రెస్‌ అ‌గ్రనేతలు దీనికి దూరంగా ఉండిపోయారు. ‘‘రాహుల్‌ ‌గాంధీ తరచుగా రాయ్‌బరేలికి వెళ్తారు. కానీ ఆయన ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా జరిగే ప్రదేశానికి వెళ్లలేకపోయారు. ఇది కేవలం 2 గంటల రెండు నిమిషాల ప్రయాణ సమయంతో 120 కి.మీ. దూరంలో ఉంది’’ అని బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్‌ ‌భండారి విమర్శించారు. రాహుల్‌ ‌కుటుంబం మొత్తం హిందూ మతాన్ని వ్యతిరేకిస్తుంది. వారు అయోధ్యలో వివాదస్పదకట్టడం మసీదుకు మూడుసార్లు వెళ్లారు కానీ రాముడి ఆలయంలో శ్రీరాముని దర్శనం కోసం వెళ్లలేదు అని ఆరోపించారు. ఇక కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అయితే ‘‘గంగలో మునిగినంత మాత్రానా పేదరికం తొలగిపోతుందా, తినేందుకు భోజనం దొరుకుతుందా’’ అంటూ వ్యాఖ్యానించారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా కుంభమేళాలో పవిత్ర స్నానం చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. ఖర్గే హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటూ ఓ న్యాయవాది ముజఫర్‌పూర్‌ ‌కోర్టుకు వెళ్లి పిటిషన్‌ ‌దాఖలు చేశారు.

వారివి బానిస మనస్తత్వాలు: మోదీ

మహా కుంభమేళాపై విపక్షాలు చేస్తున్న విమర్శల పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో స్పందిం చారు. బానిస మనస్తత్వాలు ఉన్నవారే ఇలా హిందూ మత విశ్వాసాలపై దాడి చేస్తుంటారని మండిపడ్డారు. మన నమ్మకాలు, మన దేవాలయాలను, మన సంస్కృతిని, మన సిద్ధాంతాలపై దాడి చేస్తుంటారని అన్నారు.

విదేశీ మద్దతు ఉన్న కొందరు నేతలు హిందూ మతాన్ని వెక్కిరిస్తుంటారని, తప్పుబడు తుంటారని, దేశాన్ని బలహీనపర్చేందుకు ప్రయత్ని స్తుంటారని మోదీ ధ్వజమెత్తారు. ప్రజల మధ్య చీలికలు తీసుకురావడమే వారి పని. మన దేశాన్ని కుంగదీసేం దుకు అనేక విదేశీ శక్తులు ప్రయత్ని స్తున్నాయంటే… ఇలాంటి వారు అండగా ఉండడం వల్లే అంటూ మోదీ విమర్శించారు. మహా కుంభమేళా వంటి భారీ కార్యక్రమం ప్రతి ఒక్కరినీ విస్మయానికి గురి చేయడంలో ఆశ్చర్యమేమీ లేదని, అది ఐక్యతా చిహ్నంగా భవిష్యత్‌ ‌తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని మోదీ వివరించారు.

‌క్రాంతిదేవ్‌ ‌మిత్ర

సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE