ఆర్‌ఎస్‌ఎస్‌ అఖిల భారత ప్రతినిధి సభ హెచ్చరిక

బెంగళూరులో 2025 మార్చి 21 నుంచి 23 వరకు ఆర్‌ఎస్‌ఎస్‌ అఖిల భారత ప్రతినిధి సభ జరిగింది. మీడియా ఊహించినట్టుగానే చాలా కీలకమైన విషయాలపై నిర్ణయాలు, తీర్మానాలు వెలువడినాయి. బాంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న అమానుష హింసపై ఆర్‌ఎస్‌ఎస్‌ ‌తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సంఘ శతాబ్ది నిర్వహణ, నియోజకవర్గాల పునర్విభజన, మాతృభాష, మత రిర్వేషన్లు వంటి అంశాలను సభ చర్చించింది. ప్రపంచశాంతి, సౌభాగ్యాలకు ఐకమత్యంతో కూడిన హిందూ సమాజ నిర్మాణం అత్యవసరమని కూడా అఖిల భారత (ఆ.భా) ప్రతినిధి సభ  తీర్మానించింది.

మతం ప్రాతిపదికగా రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం

మతం ప్రాతిపదికగా రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సర్‌కార్యవాహ దత్తాత్రేయ హోసబలే అన్నారు. బెంగుళూరులో మూడు రోజుల ఆర్‌ఎస్‌ఎస్‌ అఖిల భారత ప్రతినిధి సభ ముగింపు సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ‘‘మతం ప్రాతిపదికగా రిజర్వేషన్లు సాధ్యం కాదు. అది ఒక మతంలో వెనుకబడిన తరగతులకు చెందినవారికి మాత్రమే సాధ్యమౌతుంది. బాబాసాహెబ్‌ అం‌బేడ్కర్‌ ‌రచించిన రాజ్యాంగం మతం ప్రాతిపదికగా రిజర్వేషన్లను ఆమోదించదు. ఎవరైనా అలాంటి పని చేస్తే అది రాజ్యాంగ రూపకర్తకు వ్యతిరేకంగా వెళ్లినట్టవుతుంది’’ అని అన్నారు.

మరో పది వేలు పెరిగిన శాఖలు

ప్రస్తుతం భారతదేశం నలుమూలలా లక్షా పదిహేను వేల శాఖలు కార్యకలాపాలు నిర్వహిస్తు న్నాయి. నిత్య శాఖ రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్‌కు ఊపిరి. శాఖలను విస్తరింప చేయడం ఒక యజ్ఞంలా సంఘం స్వీకరిస్తుంది కూడా. హిందువుల మధ్య సాంఘిక ఏకాత్మత నిర్మాణానికి నిత్య శాఖా కార్యక్రమమే సరైన పక్రియ అని సంస్థ ప్రగాఢంగా విశ్వసిస్తుంది. కొద్దిసేపు చరిత్రను, అందులోని పాఠాలను గమనించడం, కొద్దిసేపు శారీరక వ్యాయామాలతో శాఖలు జరుగుతూ ఉంటాయి. దాదాపు గంట సేపు సాగే ఈ కార్యక్రమం భారతమాతకు జై అన్న నినాదంతో ముగుస్తుంది. ఇది హిందువులలో సామాజిక దూరాన్ని తగ్గిస్తూ వస్తోంది. కాలం లేదా చరిత్ర రుజువు చేసింది కూడా అదే. సంఘ శతాబ్ధి నేపథ్యంలో నిత్య శాఖల సంఖ్య 10,000 పెరిగింది. ఈ మేరకు నివేదికలు అందాయని ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సహసర్‌కార్యవాహ సీఆర్‌ ‌ముకుంద బెంగళూరులో వెల్లడించారు. దేశంలో 51,710 స్థలాలలో 83,129 శాఖలు ప్రతిరోజు జరుగుతున్నాయి. వారానికోసారి జరిగే సాప్తాహిక్‌ ‌మిలన్‌లు 38,989(గత సంవత్సరం కన్నా 5,188 పెరిగాయి.) నెలకొకసారి జరిగే సంఘమండలి 12,091 (గత సంవత్సరం కన్నా 1524 వృద్ధి.) శాఖలు, సాప్తాహిక్‌ ‌మిలన్‌, ‌సంఘమండలి అన్ని కలిపి 1,34,149.

మార్చి 21, 2025 నుంచి బెంగళూరులో మూడు రోజుల అఖిల భారత ప్రతినిధి సభకు వచ్చిన సభ్యులు శాఖల వివరాలు అందించారు.

గ్రామీణ ప్రాంతాలలో శాఖలను విస్తరింప చేసే కృషిలో ఆర్‌ఎస్‌ఎస్‌ ‌నిమగ్నమై ఉంది. ఇటీవలి కాలంలో గ్రామీణ మండలాలలో శాఖల పట్ల ఆదరణ పెరుగుతున్నది. సంఘ పరిధిలో 58,939 మండలాలు ఉన్నాయి. ఇక్కడ 30,770 నిత్య శాఖలు జరుగుతున్నాయి. వీటి సంఖ్య గతం కంటే 3,050 పెరిగింది. సంఘ్‌లో చేరుతున్న వారి సంఖ్య కూడా ఇతోధికంగా పెరిగింది. గడచిన ఏడాది 2,22,962 మంది చేరారు. వీరిలో 1,63,000 మంది 14-25 మధ్య వయస్కులే. ఆన్‌లైన్‌ ‌ద్వారా ఇచ్చిన జాయిన్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ ‌పిలుపును గురించి ముకుంద్‌ ‌తెలియచేశారు. 2012 నుంచి సంస్థను 12,73,453 మంది సంప్రతించారని చెప్పారు. వీరంతా ఆర్‌ఎస్‌ఎస్‌ ‌చేపడుతున్న వివిధ సామాజిక, సాంస్కృతిక, సేవా కార్యక్రమాలలో భాగస్థులు కావడానికి ముందుకు వచ్చినవారే. 46,000 మంది మహిళలు కూడా సంఘ్‌ను సంప్రతించారు. వీరిని సంఘ పరివార్‌లోని వివిధ సంస్థలకు పరిచయం చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ‌పురుషులకు మాత్రమే ప్రవేశం కల్పిస్తుంది. రాష్ట్రీయ సేవా సమితి మహిళల కోసం ఉద్దేశించినది. దుర్గా వాహిని, మైత్రి శక్తి విశ్వహిందూ పరిషత్‌ అనుబంధ సంస్థలు. ఇవన్నీ సంఘ పరివార్‌లో భాగస్వాములు.

ఇటీవల దివంగతులైన సంఘ ప్రముఖులకే కాకుండా, వివిధ రంగాలలో ఇతోధిక సేవలు అందించి కీర్తిశేషులైన లబ్ధ ప్రతిష్టులకు ప్రతినిధి సభ నివాళి ఘటించింది. మాజీ ప్రధాని మన్మోహన్‌ ‌సింగ్‌, ‌విదేశాంగ వ్యవహారాల మాజీ మంత్రి ఎస్‌ఎం ‌కృష్ణ, సినీ దర్శకుడు శ్యామ్‌ ‌బెనెగల్‌, ఆర్థికవేత్త వివేక్‌ ‌దేవ్‌రాయ్‌, ‌దేవేంద్ర ప్రధాన్‌ (‌కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ‌తండ్రి), దక్షిణ మధ్య క్షేత్ర పూర్వ క్షేత్ర సంఘచాలక్‌ ‌పర్వతరావు వారిలో ఉన్నారు.

ఏడాదిపాటు శతాబ్ది కార్యక్రమాలు

విజయదశమినాడు సర్‌సంఘచాలక్‌ ‌ప్రసంగం

ఆర్‌ఎస్‌ఎస్‌ ‌శతాబ్దిని పురస్కరించుకొని ఏడాది పాటు జరిగే కార్యక్రమాల్లో ప్రధానంగా అక్టోబర్‌ 2‌న విజయదశమినాడు సర్‌సంఘ్‌చాలక్‌ ‌స్వయం సేవకులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమంతో పాటుగా మొత్తం లక్ష శాఖలు లక్ష్యంగా ప్రతి మండలంలోనూ శాఖలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాల లక్ష్యం పెద్ద సంఖ్యలో బస్తీలకు, ఇండ్లకు చేరుకోవడం.

హిందూ సమ్మేళనాలు

మండల స్థాయిలో జరిగే ఈ సమ్మేళనాలు ఓ వివక్షారహితమైన, పటిష్టమైన, సామరస్యపూర్వకమైన సమాజం ఆవశ్యకతను నొక్కి చెబుతాయి. దైనందిన జీవితంలో పంచ పరివర్తన పాటించే విధానం గురించి మార్గదర్శనం చేస్తారు.

సామాజిక సద్భావన సమావేశాలు

స్వయంసేవకుల ప్రయత్నాల కారణంగా సామాజిక ఐక్యత బలోపేతమైంది. లక్ష్యం సమాజాన్ని ఐక్యంగా ఉంచడం. ఈ సమావేశాలు ఆధ్యాత్మిక సుసంపన్నత, సామరస్యం, ఏదేనీ వ్యసనం నుంచి యువతకు విముక్తి, స్థానికంగా పరిశుభ్రతపై దృష్టి పెడతాయి.

ప్రముఖజన గోష్టి – మేధావులతో గోష్టి

ఈ సమావేశం జాతీయ అంశాలపై దృష్టి పెడుతుంది. సంవత్సరాల తరబడి బహుళ ప్రాచుర్యం పొందుతున్న తప్పుడు కథనాలను సరిచేయాల్సిన అవసరం ఉంది. లక్ష్యం విమర్శలో మార్పు తీసుకురావడం.

డాక్టర్‌ ‌మోహన్‌ ‌భాగవత్‌ ఇష్టాగోష్టి

పూజనీయ డాక్టర్‌ ‌మోహన్‌ ‌భాగవత్‌ ‌దేశంలోని నాలుగు ప్రముఖ నగరాల్లో ప్రసంగించడం ద్వారా జాతీయ వ్యాఖ్యానంలో సరికొత్త ఒరవడిని సృష్టిస్తారు.

శాఖ విస్తరణ ప్రణాళిక

సెప్టెంబర్‌ ‌నుంచి అక్టోబరు 2025 దాకా లక్షకు పైగా ప్రాంతాల్లో వారం రోజులపాటు శాఖలను నిర్వహిస్తారు.

యువత కార్యక్రమం

13 నుంచి 30 ఏళ్ల లోపు వయసున్న కళాశాల విద్యార్థులు, యువత కోసమని పంచ పరివర్తన, సేవ, జాతి అభివృద్ధి, సమాజానికి యువత తోడ్పాటు, మరోసారి సౌభాగ్యవంతమైన దేశంగా భారత్‌ అనే అంశాలపై దృష్టి పెడుతూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

                                                                                                     *       *        *

దైనందిన జీవితంలో మాతృభాష తప్పనిసరి

ఆర్‌ఎస్‌ఎస్‌ ‌దైనందిన జీవితంలో మాతృభాష వాడకాన్ని గట్టిగా సమర్థించింది. ప్రతీ వ్యక్తీ తన మాతృభాష, ఓ ప్రాంతీయ భాష, వృత్తి, వ్యాపకాలకు పనికొచ్చే ఓ భాష (హిందీ, ఇంగ్లీషు, కన్నడ, తదితరాలు) ఇలా కనీసం మూడు భాషలు నేర్చుకోవాలి. అయితే వృత్తి, వ్యాపకాలకు సంబంధించి ఏ భాషను ఎంచుకోవాలనేది వ్యక్తికే వదిలేయాలి.

రాణి అబ్బక్క జీవితం యావత్‌ ‌జాతికి స్ఫూర్తిదాయకం

ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సర్‌కార్యావహ దత్తాత్రేయ హోసబలె అఖిల భారతీయ ప్రతినిధి సభలో ఉల్లాల మహారాణి అబ్బక్క 500వ జయంతిని పురస్కరించు కొని మాట్లాడుతూ ‘‘భారతదేశపు గొప్ప స్వరాజ్య సమరయోధురాలైన ఉల్లాల మహారాణి అబ్బక్క ఉత్తమ నిర్వాహకురాలు, అజేయమైన వ్యూహకర్త, అత్యంత పరాక్రమంతో కూడుకున్న పాలకురాలు. ఆమె కర్ణాటకలోని కోస్తా ప్రాంతంలో ఉల్లాల సంస్థానాన్ని విజయవంతంగా పరిపాలించారు. రాణి అబ్బక్క 500వ జయంతిని పురస్కరించుకొని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్‌ అజేయమైన ఆమె వారసత్వానికి హృదయ పూర్వక శ్రద్ధాంజలి సమర్పించు కుంటున్నది.

ఆమె తన ఏలుబడిలో ప్రపంచంలోనే అజేయమైన సైనిక శక్తుల్లో ఒకటైన పోర్చుగీసు చొరబాటుదారులను పదేపదే ఓడించడం ద్వారా తన రాజ్యాపు స్వాతంత్య్రాన్ని పరిరక్షించుకున్నారు. ఆమె దౌత్యనీతిజ్ఞత, వ్యూహాత్మక సంబంధాలు మరీ ముఖ్యంగా ఉత్తర కేరళకు చెదిన రాజా సాముద్రి (జమొరిన్‌) ‌లాంటి పాలకులతో సంబంధాలు ఆమె ఈ ఘనతను సాధించడానికి సుసాధ్యం చేశాయి. ఆమె వ్యూహం, శౌర్యం, నిర్భయ నాయకత్వం ఆమెకు చరిత్ర పుటల్లో ‘అభయరాణి’ అనే పేరును తెచ్చిపెట్టాయి.

మహారాణి అబ్బక్క భారతదేశపు సంఘటిత సంప్రదాయాన్ని అనుసరిస్తున్నట్టుగా అనేక శివాలయాలను నిర్మించారు. తీర్థయాత్ర స్థలాలను ప్రోత్సహించారు. ఆమె సర్వ మతాలను సమానమైన గౌరవంతో చూశారు. సమాజంలోని అన్ని రంగాలను సమగ్రంగా అభివృద్ధి చేశారు. ఈ గౌరవం, ఐక్యతల వారసత్వం కర్ణాటకలో నేటికీ ప్రతిధ్వనిస్తోంది. స్ఫూర్తిమంతమైన ఆమె వృత్తాంతాలు యక్షగానాలు, జానపద గీతాలు, సంప్రదాయ నృత్యాల రూపంలో సజీవంగా ఉన్నాయి.

భారత ప్రభుత్వం ఆమె అజేయమైన పరాక్రమం, ధర్మం పట్ల, జాతి పట్ల ఆమె అంకితభావం, ఆమె ప్రభావితమైన పరిపాలనను గుర్తిస్తున్నట్టుగా 2003లో ఆమె పేరిట తపాలా బిళ్లను విడుదల చేసింది. తద్వారా ధైర్య, సాహసాలతో కూడిన ఆమె వృత్తాంతాలను జాతితో పంచుకుంది. దీనికి తోడు నావికా దళాన్ని వీరోచితంగా నడిపించిన ఆమె వారసత్వానికి స్ఫూర్తిమంతమైన దీప స్తంభం అన్నట్టుగా భారత ప్రభుత్వం 2009లో ఒక గస్తీ నౌకకు రాణి అబ్బక్క అని నామకరణం చేసింది.

మహారాణి అబ్బక్క జీవితం యావత్‌ ‌జాతికి స్ఫూర్తిదాయకమైనది. ఆమె 500వ జయంతిని పురస్కరించుకొని ఈ అద్వితీయమైన వ్యక్తికి రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్‌ ‌నివాళులర్పిస్తోంది. తేజోమయ మైన ఆమె జీవితం నుంచి స్ఫూర్తిని పొంది ప్రస్తుతం కొనసాగుతున్న జాతి నిర్మాణ యజ్ఞంలో పాలుపంచుకోవాలని యావత్‌ ‌సమాజానికి పిలుపునిస్తోంది.

  • సంఘ శతాబ్ది సంకల్పం
  • కార్యాచరణపై చర్చ
  • బాంగ్లా హిందువులకు సంఘీభావం
  • నియోజకవర్గాల పునర్విభజనపై
  •  విపక్షాల వైఖరి  సరికాదు
  •  మాతృభాషను గౌరవించాలి

బాధ్యతల్లో మార్పు

ఇప్పటివరకు మన దక్షిణ మధ్య (కర్నాటక, ఆంధప్రదేశ్‌, ‌తెలంగాణ) క్షేత్రానికి క్షేత్ర ప్రచారక్‌గా పనిచేసిన సుధీర్‌, అఖిల భారత సహ బౌద్ధిక్‌ ‌ప్రముఖ్‌గా, సహక్షేత్ర ప్రచారక్‌గా ఉన్న భరత్‌కుమార్‌ ‌క్షేత్ర ప్రచారక్‌గా అ.భా.ప్రతినిధి సభలో నియుక్తి అయ్యారు.


శతాబ్ది వేళ సంకల్పం

బాంగ్లాదేశ్‌లో హిందువుల రక్షణకు ఐరాస పూనుకోవాలి

బాంగ్లాదేశ్‌లో తీవ్రవాద ఇస్లాం శక్తుల చేతుల్లో హిందువులు, ఇతర అల్పసంఖ్యాక వర్గీయులు ఒక ప్రణాళిక ప్రకారం నిరంతరాయంగా ఎదుర్కొంటున్న హింస, అన్యాయం, అణచివేతపై ఆర్‌ఎస్‌ఎస్‌ అఖిల భారతీయ (అ.భా) ప్రతినిధి సభ తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేసింది. ఇది కచ్చితంగా మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన తీవ్రమైన అంశమని పేర్కొంది. బాంగ్లాదేశ్‌లో ఇటీవల పాలనాపరమైన మార్పు చోటు చేసుకున్న తర్వాత మఠాలు, దేవాలయాలు, దుర్గాపూజ మండపాలు, విద్యా సంస్థలపై దాడులకు సంబంధించి అనేక సంఘటనలు జరిగాయి. ఇవి చాలదన్నట్టుగా దేవతా విగ్రహాలను అపవిత్రం చేయడం, దారుణమైన హత్యలు, ఆస్తుల లూటీ, మహిళల అపహరణ, వారిపై అత్యాచారం, నిర్బంధ మత మార్పిడులు అడ్డూఅదుపూ లేకుండా సాగుతున్నాయి. అవి కేవలం రాజకీయపరమైన ఘటనలే అని నమ్మబలకడం ద్వారా వాటి వెనుక మతపరమైన కోణాన్ని కప్పిపుచ్చడమంటే ఆ సంఘటనల్లో అనేక మంది హిందువులు, ఇతర అల్పసంఖ్యాక వర్గీయులు బాధితులైన వాస్తవాన్ని నిరాకరించడమే అవుతుంది.

బాంగ్లాదేశ్‌లో మతోన్మాద ఇస్లాం శక్తుల చేతుల్లో హిందువులు, ఇతర అల్పసంఖ్యాక వర్గీయులు మరీ ముఖ్యంగా షెడ్యూల్డ్ ‌కులాలు, షెడ్యూల్డ్ ‌తెగలకు చెందినవారు పీడనకు గురికావడమనేది కొత్త విషయం కాదు. బాంగ్లాదేశ్‌లో నిరంతరాయంగా పడిపోతున్న హిందువుల జనాభా (1951లో 22 శాతంగా ఉన్న వారి జనాభా నేడు 7.95 శాతానికి చేరుకుంది) వారు ఎదుర్కొంటున్న అస్తిత్వ సంక్షోభానికి అద్దం పడుతోంది. అయితే గత ఏడాది కాలంగా హింస, విద్వేషానికి ప్రభుత్వపరమైన, సంస్థాగతమైన మద్దతు తీవ్రమైన ఆందోళన కలిగించే అంశం. దీనికి తోడు బాంగ్లాదేశ్‌లో నిరంతరాయంగా వినిపిస్తున్న భారత్‌ ‌వ్యతిరేక గళం ఇరు దేశాల మధ్య సంబంధాలను తీవ్రంగా దెబ్బ తీస్తాయి.

కొన్ని అంతర్జాతీయ శక్తులు దేశాల మధ్య పరస్పర అపనమ్మకం, ఘర్షణతో కూడుకున్న వాతావరణాన్ని సృష్టించడం ద్వారా భారత్‌ను ఆవరించి ఉన్న యావత్‌ ‌ప్రాంతంలో అస్థిరత్వాన్ని పెంచిపోషించడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. అ.భా.ప్రతినిధి సభ అంతర్జాతీయ సంబంధాలకు చెందిన ఆలోచనాపరులైన నేతలకు, విద్యావేత్తలకు అలాంటి భారత్‌ ‌వ్యతిరేక కార్యకలా పాలపైన, పాకిస్తాన్‌, ‌డీప్‌ ‌స్టేట్‌ ‌కార్యకలాపాలపైన నిఘా ఉంచి, వాటిని ఎండగట్టాలని పిలుపునిచ్చింది. అ.భా.ప్రతినిధి సభ యావత్‌ ‌ప్రాంతానికి ఓ సమష్టి సంస్కృతి, చరిత్ర, సామాజిక బంధాలు ఉన్నాయనే వాస్తవాన్ని ప్రధానంగా ప్రస్తావించింది. ఆ కారణం గానే ఏదైనా ఒక చోట ఒడిదుడుకులు తలెత్తితే యావత్‌ ‌ప్రాంతం ఆందోళన చెందుతుంది. అ.భా. ప్రతినిధి సభ అప్రమత్తంగా ఉండేవారంతా భారత్‌, ‌దాని ఇరుగుపొరుగు దేశాలకు చెందిన ఈ సమష్టి వారసత్వాన్ని బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు చేయాలని అ.భా. ప్రతినిధి సభ భావించింది.

బాంగ్లాదేశ్‌లో ఇంతటి సంక్షుభిత సమయంలో హిందూ సమాజం తమపై జరుగుతున్న అఘాయిత్యాలను ఒక ప్రశాంతమైన, సమష్టి, ప్రజాస్వామ్య పంథాలో ధైర్యంగా ఎదుర్కోవడం ఇక్కడ ప్రస్తావించాల్సిన వాస్తవం. అంతేకాకుండా ఈ సంకల్పానికి భారత్‌తో పాటుగా ప్రపంచమంతటా విస్తరించి ఉన్న హిందూ సమాజం నుంచి నైతిక, మానసిక మద్దతు లభించడం శ్లాఘనీయం. భారత్‌లో, వేర్వేరు దేశాలో అనేక హిందూ సంస్థలు ఈ హింసపై తీవ్రమైన ఆందోళన తెలిపాయి. ప్రదర్శనలు, పిటిషన్లు ద్వారా బాంగ్లాదేశ్‌లో హిందువులకు భద్రతను, గౌరవాన్ని డిమాండ్‌ ‌చేశాయి. అంతర్జా తీయ సమాజానికి చెందిన అనేక మంది నేతలు వారి స్థాయిలో ఈ విషయాన్ని సైతం లేవనెత్తారు.

భారత ప్రభుత్వం బాంగ్లాదేశ్‌లో హిందువులు, ఇతర అల్పసంఖ్యాక వర్గీయులకు అండదండగా నిలబడటంపైన, వారికి అవసరమైన భద్రత పైన తన నిబద్ధతను నిలబెట్టుకుంది. భారత ప్రభుత్వం ఈ విషయాన్ని బాంగ్లాదేశ్‌లో మధ్యంతర ప్రభుత్వం దృష్టికి, అనేక అంతర్జాతీయ వేదికల దృష్టికి తీసుకొనివెళ్లింది. భారత ప్రభుత్వాన్ని బాంగ్లాదేశ్‌ ‌ప్రభుత్వంతో నిరంతరాయంగా, అర్థవంతమైన చర్చలు జరుపుతూనే బాంగ్లాదేశ్‌లో హిందువుల భద్రత, ఆత్మగౌరవం, శ్రేయస్సు కోసమని సాధ్యమైనన్ని ప్రయత్నాలు చేయాలని అ.భా.ప్రతినిధి సభ  విజ్ఞప్తి చేసింది. బాంగ్లాదేశ్‌లో హిందువులు, ఇతర అల్పసం ఖ్యాక వర్గీయుల పట్ల జరుగుతున్న అమానుషమైన ఘాతుకాలను తీవ్రంగా పరిగణించి, అలాంటి హింసాత్మక చర్యలకు ముగింపు పలికేలా బాంగ్లాదేశ్‌ ‌ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత ఐక్యరాజ్యసమితి లాంటి అంతర్జాతీయ సంస్థలకు, అంతర్జాతీయ సమాజానికి ఉందని అ.భా.ప్రతినిధి సభ అభిప్రాయపడింది. బాంగ్లాదేశ్‌లో హిందువులు, ఇతర అల్పసంఖ్యాక వర్గీయులకు సంఘీభావం తెలుపుతూ గళమెత్తాలని వేర్వేరు దేశాల్లో హిందూ సమాజానికి, నేతలకు, అంతర్జాతీయ సంస్థలకు సైతం అ.భా.ప్రతినిధి సభ పిలుపునిచ్చింది.


ప్రపంచశాంతికి హిందూ సమాజ నిర్మాణం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్‌ – ‌తన శతాబ్దిని పురస్కరించుకొని ధర్మం, ఆత్మ విశ్వాసం, పౌరసంబంధిత బాధ్యతలో వేళ్లూనుకున్న  సామరస్య పూర్వకమైన, వివక్షారహితమైన, పరిసరాల పట్ల స్పృహ కలిగిన సమాజాన్ని అభివృద్ధి చేయడంలో తన నిబద్ధతను పునరుద్ఘాటించింది. ఈ మేరకు ఆర్‌ఎస్‌ఎస్‌• అఖిల భారత ప్రతినిధి సభ సంకల్పంతో ప్రపంచాన్ని శాంతి, ఐక్యతల వైపునకు నడిపించే ఆధ్యాత్మికంగా సుసంపన్నమైన, భౌతికంగా సౌభాగ్యవంతమైన భారత్‌కు పునాది వేసింది.

అనాదిగా హిందూ సమాజం మానవ ఐక్యత, లోకహితం సాధనే లక్ష్యంగా అతి విస్తారమైన, అద్భుతమైన ప్రయాణం చేస్తున్నది. మన దేశంలో అనేక ఒడిదుడుకులు ఉన్నప్పటికీ సాధువులు, యోగులు, మహానుభావులు, తేజస్సుతో కూడిన మాతృమూర్తుల ఆశీస్సులతో పురోగమిస్తున్నది.

పూజనీయ డాక్టర్‌ ‌కేశవ్‌ ‌బలిరామ్‌ ‌హెడ్గేవార్‌ ‌చాలా కాలంగా మన జాతిని అంటిపెట్టుకున్న బలహీనతను తొలగించడానికి, ఒక సంస్థాగతమైన, ధర్మబద్ధమైన, శక్తిమంతమైన దేశంగా భారత్‌ను సమున్నతమైన పరమ వైభవ స్థానానికి చేర్చడం కోసమని 1925లో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్‌ను ఆరంభించారు. డాక్టర్‌ ‌హెడ్గేవార్‌ ‌సంఘ కార్యానికి విత్తనాలు నాటుతున్నట్టుగా రోజువారీ శాఖ రూపేణా ఓ సరికొత్త వ్యక్తి నిర్మాణ విధానాన్ని రూపొందించారు. అది కాలక్రమేణా మన శాశ్వతమైన సంప్రదాయ విలువలు, ఆచారవిచారాలకు తగ్గట్టుగా జాతిని పునర్‌ ‌నిర్మించడంలో నిస్వార్థమైన తపస్సుగా మారింది. ఆయన జీవించి ఉన్న కాలంలోనే అది దేశమంతటా విస్తరించింది. ఆర్‌ఎస్‌ఎస్‌ ‌రెండవ సర్‌సంఘచాలక్‌ ‌పరమ పూజనీయ గురూజీ (మాధవ సదాశివ గోల్వాల్కర్‌) ‌నేతృత్వంలో వారి దూరదృష్టితో సమాజంలోని వేర్వేరు రంగాలలో శాశ్వత చింతన అనే వెలుగులో కాలానుగుణంగా వివిధ క్షేత్రాలు ప్రారంభమయ్యాయి.

ఆర్‌ఎస్‌ఎస్‌ ఈ ‌వందేళ్ల ప్రస్థానంలో రోజువారీ శాఖలో పొదిగిన విలువలతో సమాజం నుంచి అచంచలమైన విశ్వాసం, అభిమానాన్ని సంపాదించు కుంది. ఈ కాలంలోనే సంఘ స్వయంసేవకులు మర్యాదలు, అవమానాలు, ఇష్టాలు, అనిష్టాలకు అతీతంగా ప్రతీ ఒక్కరిని ప్రేమాభిమానాల శక్తితో ముందుకు తీసుకువెళ్లడానికి పాటుపడ్డారు. సంఘ శతాబ్ది సంవత్సరాన్ని పురస్కరించుకొని అన్ని రకాల అవరోధాల మధ్య వారి ఆశీస్సులు, సహకారంతో కొండంత బలంగా నిలిచిన పూజ్యులైన సాధువులను, సజ్జనులను, వారి జీవితాలను అంకితం చేసిన స్వార్థమెరుగని స్వయంసేవకులను, అంకితభావంలో తలమునకలై ఉన్న స్వయంసేవకుల కుటుంబాలను స్మరించుకోవడం మన విధి.

భారత్‌కు సుసంపన్నమైన సంప్రదాయాలను పుణికిపుచ్చుకున్న పురాతనమైన సంస్కృతి ప్రవాహంతో సామరస్యపూర్వకమైన ప్రపంచాన్ని సృష్టించే  అనుభవపూర్వకమైన వివేకం ఉంది. మన ఆలోచనలు వేర్పాటువాద, స్వీయ విధ్వంసక ధోరణుల నుంచి యావత్‌ ‌మానవాళిని కాపాడుతూ, చరాచర సృష్టిలో  ఏకత్వ భావనను, శాంతిని పాదుగొల్పుతాయి.

ధర్మం ఆధారంగా పొందిన సంపూర్ణ ఆత్మ విశ్వాసం, సంస్థాగత సమష్టి జీవనం ప్రాతిపదికగా హిందూ సమాజం తన భౌగోళిక బాధ్యతను సమర్థమంతంగా పూర్తి చేయగలదని సంఘం విశ్వసిస్తోంది. కనుక, మనం సామరస్యపూర్వకమైన విధానాలను పాటిస్తూ, అన్ని రకాలైన వివక్షలను తోసిరాజంటూ, పర్యావరణ హిత జీవన శైలి ప్రాతిపదికగా ఆవిర్భవించిన విలువ ఆధారిత కుటుంబాలను ప్రోత్సహిస్తూ, పనిలోపనిగా స్వేచ్ఛాధీనత, పౌర విధుల్లో పూర్తిగా నిమగ్నమైన సమాజాన్ని సృష్టిస్తూ ఆదర్శవంతమైన సమాజ నిర్మాణానికి సంకల్పం చేద్దాం. ఇది మనల్ని భౌతికంగా సుసంపన్నమైన, ఆధ్యాత్మికతను పుణికిపుచ్చుకున్న పటిష్టమైన జాతి జీవనాన్ని నిర్మించి, సమాజంలో సవాళ్లను అధిగమించి అన్ని సమస్యలను పరిష్కరించేలా చేస్తుంది.

అ.భా.ప్రతినిధి సభ సజ్జనుల నేతృత్వంలో యావత్‌ ‌సమాజాన్ని కలుపుకొని సామరస్యపూర్వకమైన, ఐకమత్యంతో కూడిన భారత్‌ ‌నమూనాను ప్రపంచం ముందు ఉంచాలని సంకల్పం చేసుకుంది.

మూడు రోజుల పాటు సాగిన ఆ.భా. ప్రతినిధి సభ మార్చి 23, 2025 న ముగిసింది.

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE