ఉత్తర భారతదేశంలో; లేదంటే కర్ణాటక, కేరళ వంటి దక్షిణాది రాష్ట్రాలలోనో కనిపించే ముస్లిం మతోన్మాదం ఇప్పుడు ఆంధప్రదేశ్‌కు కూడా విస్తరిస్తున్నదా? రాయలసీమలో ఇటీవల వరసగా జరిగిన దుర్ఘటనలను బట్టి అలాంటి అభిప్రాయానికి రాక తప్పదు. హిందువులు నిర్వహించుకునే శోభాయాత్రల మీద రాళ్ల దాడులు చేయడం ఉత్తరాది రాష్ట్రాలకే పరిమితం కాదని ముస్లిం మతోన్మాదులు చెప్పదలుచుకున్నారు. ఇందుకు రుజువు మార్చి 4న అన్నమయ్య జిల్లా రాయచోటిలో జరిగిన దుర్ఘటన. శ్రీభద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి ఊరేగింపుపై ముస్లిం మూకలు ఆ రోజు దాడి చేశాయి. ముందుగా రాళ్లు సిద్ధం చేసుకుని ఒక పద్ధతి ప్రకారం ఈ దాడి చేశారు. ఇది భారతదేశమా? లేక మనం పాకిస్తాన్‌లోనో, బాంగ్లాదేశ్‌లోనో ఉన్నామా అనుకునేటట్టు చేసి ఒక్క క్షణం విస్తుపోయేటట్టు చేశారు. ‘ఇది వీరశైవుల కార్యక్రమం కాబట్టి..’ అంటూ అల్లర్లకు వారే కారణం అన్న తీరులో ఒక పోలీసు అధికారి మాట్లాడడం, అది వైరల్ కావడం వారి పక్షపాత వైఖరిని తెలియచేస్తున్నది. ఈ విషయం మీద దర్యాప్తు అవసరం. ఇలాంటి వ్యాఖ్య ముస్లింల మీద ఆ అధికారి చేయగలడా?
రాయచోటి ఘటనకు నిరసనగా విశ్వహిందూ పరిషత్, హిందూ చైతన్య వేదిక పిలుపు మేరకు మార్చి 10వ తేదీన ఆంధప్రదేశ్‌లోని అన్ని జిల్లాలలో ధర్ణాలు, నిరసనలు నిర్వహించారు. ఇందులో హిందూ ఐక్యతా శక్తి స్ఫుటంగా కనిపించింది. ఇకనైనా మైనారిటీలు ధోరణి మార్చుకుంటే మంచిదన్న హెచ్చరిక కూడా వినిపించింది. రాయచోటి దాడి ఘటనలో దోషులపై చర్యలు తీసుకోవాలని హిందూ చైతన్యవేదిక ప్రకాశం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించింది. ఆరు మాసాలుగా పెడన, రాయచోటి, వి.కోట, దాచేపల్లి ప్రాంతాలలో హిందువులపై జరిగిన దాడుల గురించి అందులో ప్రస్తావించింది.
రాయచోటి పట్టణంలోని వీరభద్రస్వామి వారి ఆలయం 11వ శతాబ్దంలో నిర్మించినట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఫిబ్రవరి 23 నుండి మార్చి 5వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వ దేవాదాయ ధర్మదాయ శాఖ 10 రోజుల పాటు ఉత్సవాలను నిర్వహించింది. ఉత్సవాలకు తెలుగువారే కాకుండా, కర్ణాటక నుంచి కూడా భక్తులు వస్తారు. ఉత్సవాలలో భాగంగా 4వ తేదీన పార్వేట (అశ్వవాహన ఉత్సవం) నిర్వహించారు. స్వామివారి పల్లకి గాంధీ బజార్, కడప-చిత్తూరు రహదారి మీదుగా వెళుతుంది. వీరశైవుల ఇంటి దేవునిగా కొలిచే శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో ఈ సంప్రదాయం ఎన్నో ఏళ్లుగా ఆచరిస్తున్నారు. పార్వేట టి. సుండుపల్లె రోడ్డులోని రవి హాలు సమీపంలో గల మండపం వద్ద జరుగుతుంది. ఉత్సవం అనంతరం దేవా లయానికి తీసుకొని వస్తున్న స్వామివారి పల్లకి కడప-చిత్తూరు రహదారికి చేరుకొన్న వెంటనే ఆపేందుకు ముస్లింలు ప్రయత్నించారు. భజంత్రీలను నిరోధించి, పల్లకిని అడ్డుకున్నారు. దీనిని ప్రతి ఘటించిన భక్తులపై ముస్లిం మూకలు దాడులక• పూనుకున్నారు. సాయంత్రం 6.00 గంటలకు ప్రారంభమైన పార్వేట 9.00 గంటల ప్రాంతానికి కల్పన సెంటరుకు చేరుకుంది. ముందస్తు ప్రణాళిక వేసుకొన్న ముస్లింలు రాళ్లతో దాడిచేస్తూ పల్లకిని ఇటువైపు తిప్పరాదు అంటూ నినాదాలు చేశారు. మసీదు ప్రాంతంలో రాళ్లు పెట్టుకొన్న మూకలు వీరభద్రస్వామి పల్లకిపై రాళ్ల వర్షం కురిపించారు.
దాడి జరిగింది ఇలా
ఊరేగింపు అయేషా మసీదు మీదుగా రవి థియేటర్ ప్రాంతంలోని మండపానికి వెళ్లాలి. ఈ మార్గంలోనే మసీదు దగ్గర పల్లకిని ఆపివేసి, ముస్లింలు వాదనలకు దిగారు. జిల్లా పోలీసు ఉన్నతాధికారులు కల్పించుకొని పరిస్థితిని అదుపులోనికి తీసుకొచ్చారు. మసీదు ప్రాంతంలోని ముస్లిం యువకులను పంపించి వేశారు. తిరిగి ఉత్సవ విగ్రహాలను తీసుకొని దేవాలయానికి వస్తున్న క్రమంలో ముస్లిం మూకలు దాడులకు పాల్పడ్డారు. పల్లకిని మోసుకొని వస్తున్న భక్తులు, సాంస్కృతిక ప్రదర్శనలు చేస్తున్నవారిపై, విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులపై రాళ్లతో దాడిచేసారు. ఈ సంఘటనలో చాలామందికి మూగదెబ్బలు తగిలాయి. పరిస్థితి అదుపులో తెచ్చేం దుకు పోలీసులు లాఠీచార్జి చేసి అళ్లరి మూకలను అదుపులోనికి తీసుకొన్నారు.
కానీ ఎప్పటి వలెనే ముస్లిం పెద్దలు దీనికి రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేశారు. ఊరేగింపులో వైసీపీ నాయకులు పాల్గొని, ముందస్తు ప్రణాళిక ప్రకారం దాడులు చేసి స్థానిక ఎమ్మెల్యేకు, పార్టీకి చెడ్డపేరు తీసుకురావాలనేది వారి దురుద్దేశ మని ఆ మత పెద్దలు చెప్పడం హాస్యాస్పదం. ఒకపక్క తమ ప్రాంతంలో, తాము ఉన్నచోట హిందూ ఉత్సవాలు, పల్లకిసేవలు జరపరాదని బహిరంగంగా చెబుతూ కొందరు ముస్లింలు దాడులు చేస్తుంటే, ముస్లిం మత పెద్దలు ఈ దాడులను వైసీపీ నాయకులు చేసినవని చెప్పడం విచిత్రం. పవిత్ర రంజాన్ మాసంలో ప్రార్థనలు చేసుకుంటూ భక్తితో ఉంటామని అంటూనే ఇలా దాడులు చేయడం ఏమిటి అని ప్రశ్నిస్నే, సమాధానం ఉండదు. తాము ప్రార్థన చేస్తున్న సమయంలో హిందువుల ఊరేగింపులతో వచ్చే శబ్దాలు తమకు ఇబ్బంది కలిగిస్తాయి, కాబట్టి అటు రాకూడదని ఆదేశించడం వారికే చెల్లు. ఇదొక లౌకికవాద దేశమని వారు ఏనాడూ విశ్వసించలేదు. పైగా కడప-చిత్తూరు రహదారి ప్రక్కనే ఉన్న మసీదుకు రహదారిపై వెళుతున్న వాహనాల శబ్దం ఇబ్బందికరం కాదని, హిందువుల ఉత్సవాలే ఏకాంతానికి భంగమని వితండవాదం చేస్తున్నారు.
హిందువులపై దాడులు కొత్తకాదు…
రాయచోటిలో హిందువుల ఉత్సవాలపై దాడులు జరగడం కొత్తకాదు. 5 సంవత్సరాల క్రితం వినాయక ఉత్సవాలపై జరిగాయి. 5 నెలల క్రితం అయ్యప్ప స్వాములు పడిపూజ ఊరేగింపుపై దాడి జరిగింది. గత సంవత్సరం శ్రీ వీరభద్రస్వామి పల్లకి సేవను ఆపేందుకు ప్రయత్నించారు. రంజాన్ ఉపవాసాల పేరుతో ఇలాంటి దాష్టీకాలకు పాల్పడడం అలవాటుగా మారింది. హిందువులను భయభ్రాంతు లకు గురిచేసి ముస్లింల ఆధిపత్యాన్ని కొనసాగించడం కోసం ఈ దాడులు జరుగుతున్నాయనేది జగమెరిగిన సత్యం. రాయచోటిలోని శ్రీ వీరభద్రస్వామి దేవ స్థానానికి ఒకప్పుడు 320 ఎకరాల మాన్యం ఉండేదని చెబుతారు. ప్రస్తుతం 3 ఎకరాలకు పరిమితమైంది. దేవస్థానానికి 100 మీటర్ల దూరంలోనే, దేవస్థానం భూమిలోనే మసీదు నిర్మించి, స్వామివారి ఉత్సవాలకు ఆటంకం కలిగిస్తున్నప్పటికీ స్థానిక రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు నోరు మెదపడం లేదు.
భారతదేశ చరిత్రను పరిశీలిస్తే ముస్లింలపై, ఇతర మతస్తులపై హిందువులు దాడులు చేసిన సంఘటనలు కానరావు. ఇటీవల 66 కోట్ల మంది ప్రయాగలో ఒకేచోట చేరినా ఇతర మతాల ప్రార్థనాస్థలాల మీద ఒక్క రాయి కూడా పడలేదని గుర్తుంచుకోవాలి. ఇవేమీ గుర్తించడానికి ఇష్టపడని ముస్లిం మతోన్మాదులు ఇప్పటికీ హిందువుల మనోభావాలను రకరకాలుగా గాయపరుస్తూనే ఉన్నారు. అన్నమయ్య జిల్లాలోను ప్రతి సంవత్సరం 2 నుంచి 5 దాడులు జరుగుతూనే ఉన్నాయి. రాజకీయ నాయకులు ఈ దాడులను తమకు అనుకూలంగా మార్చుకున్నారే కానీ, హిందువులపై జరుగుతున్న దాడులుగా ఏనాడు చూడలేదు. ఏ నాయకుడు అధికారంలో ఉంటే వారికి వత్తాసు పలుకుతున్న కొంతమంది పోలీసు అధికారుల వల్ల ఈ దాడులకు అడ్డుకట్ట పడడం లేదు. దీంతో హిందువులను అణచివేతనే లక్ష్యంగా చేసుకొన్న ముస్లింలు దాడులను తీవ్రతరం చేస్తూ భయబ్రాంతు లకు గురిచేస్తున్నారు.
కంచె చేనుమేస్తే
కంచె చేనుమేస్తే ఏమౌతుంది? పోలీసులలో కొందరి ప్రవర్తన అందుకు తగ్గట్టే ఉంది. వారి మాటలు, చర్యలు విస్తుగొలుపుతున్నాయి. ఉత్సవానికి రక్షణగా ఉంచిన అధికారి హిందు సంఘాలలో బలమైన నాయకులపై అక్రమ కేసులను బనాయిం చారు. కొంతమంది పోలీసులపై ఈ హిందూ నాయకులు దాడిచేసి చంపేందుకు ప్రయత్నించారని ఒక ఎస్.ఐ., అక్రమ కేసులు పెట్టి స్వామి భక్తి (రాజకీయనాయకుని) ని చాటుకొన్నారు. అక్రమంగా 16 మంది హిందూ సోదరులపై కేసులు పెట్టించిన ఘనత ఆ ఎస్.ఐ.కే దక్కుతుంది ఈ కేసు వెనుక స్థానిక నాయకుడి అండదండలు పుష్కలంగా ఉన్నాయనేది జగమెరిగిన సత్యం. హిందూ సోదరు లపై కేసు పెట్టడం వలన వీరభద్రస్వామి ఉత్సవంపై జరిగిన దాడి కేసు నీరుగార్చడమే ముఖ్య లక్ష్యం.
దాడుల వెనుక ఎవరున్నారు?
ముస్లిం జనాభా అధికంగా ఉన్న రాయచోటిలో మత ఛాందసవాదం చాప కింద నీరులా సాగుతుంది. ప్రధానంగా ఈ ప్రాంతంవారు వివిధ పనుల రీత్యా విదేశాలలో (అరబ్) ఉండడం వివిధ రకాల పరిచయాలు ఏర్పడడం ఇందుకు ప్రధాన కారణం. అంతేకాక ఎస్.డి.పి.ఐ., పి.ఎఫ్.ఐ. సంస్థలతోపాటు వివిధ సంఘాల కార్యాచరణ వేగంగా సాగుతుంది. అంతేకాక మసీదులలో యువతకు ఇతర మతాలపై ద్వేషం పెంచే రీతిలో ఉపన్యాసాలు ఇవ్వడం యథేచ్ఛగా సాగుతున్నది. దీనితో ముస్లిం యువత ఆలోచన తీరు హిందూ యువత ఆలోచన తీరుకు చాలా భిన్నంగా ఉంది. శాంతి, దైవభక్తి హిందూ యువకులలో అధికంగా ఉంటే ఇందుకు విరుద్ధంగా ముస్లిం యువకులు ఉన్నారు. మామాటే నెగ్గాలి, మమ్మల్ని చూస్తే భయపడాలి అన్న ధోరణి కనిపిస్తున్నది. దీనికి ఓటుబ్యాంకు రాజకీయాలు తోడవడంతో హిందూవులపై దాడులు అధికమ య్యాయి. చివరికి రాయచోటిలో హిందూ పండగలు, ఉత్సవాలు జరుపుకోవాలి అంటే ముస్లిం అనుమతి తీసుకోవలసిన దుస్థితి నెలకొన్నది. ఓటుబ్యాంకు రాజకీయాలతో పాటు, స్వామిభక్తి (రాజకీయ) పరాయణులైన కొందరు ప్రభుత్వ అధికారులు కూడా కారణమే.
పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించి ఊరేగింపులో హారతులతో వెళుతున్న మహిళలపై, వృద్ధులపై కూడా విచక్షణా రహితంగా లాఠీ చార్జీ చేసారు.
ఇంటలిజన్స్, స్పెషల్ బ్రాంచ్ వైఫల్యం
ఆర్‌ఎస్‌ఎస్, విశ్వహిందూ పరిషత్, బజ్రంగ్ దళ్ వంటి హిందూ సంస్థల చిన్న కార్యక్రమాలకు హడవిడి చేసే ఇంటలిజన్స్, స్పెషల్ బ్రాంచ్ అధికారులు రాయచోటిలో కొన్ని సంవత్సరాల నుండి ఇలా హిందువులపై దాడులు ఎందుకు జరుగు తున్నాయి, దీని వెనుక ఎవరు ఉన్నారు, వీటిని అరికట్టేది ఎలా అన్న దృష్టిలో ఏనాడు పనిచేసిన దాఖలాలు కనిపించవు. అధికారుల వైఫల్యంతోనే ఎంతో పురాతనమైన శ్రీ వీరభద్రస్వామి ఉత్సవంపై, హిందువులపై ముస్లింల రాళ్ల దాడులు జరిగాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. రక్షించాల్సిన వారే భక్షించి 200 మంది హిందువులపై అక్రమ కేసులు పెట్టడం స్వామిభక్తికి నిదర్శనం. దాడిచేసిన వారిని రక్షించేందుకు స్థానిక రాజకీయ నాయకులు ఎంతగానో ప్రయత్నిస్తున్నట్లు తెలస్తుంది. ఏది ఏమైనా రాయచోటి పట్టణంలో హిందువులను అణిచి వేసేందుకు వారిపై దాడిచేసేందుకు హిందువులపై అక్రమ కేసులు బనాయించేందుకు ఒక హిందువే సహకరించడం బాధాకరమైన విషయం.
ఇరువర్గాలపై కేసులు నమోదు
శ్రీ వీరభద్రస్వామి పార్వేట ఉత్సవ సమయంలో జరిగిన సంఘటనలో హిందూ ముస్లింలపై పోలీసులు కేసులు నమోదు చేసారు. హిందువులపై దాడిచేసిన ముస్లింలు సుమారు 500 మందిగా, హిందువులు 200 మందిగాను కేసు నమోదు చేయడం జరిగింది. ఇప్పటి వరకు హిందువులను 16 మందిని గుర్తించి 12 మందిని, ముస్లింలను 17 మందిని గుర్తించి 8 మంది పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.
– డి. సురేశ్‌కుమార్