తమిళనాడులో మాదక ద్రవ్యాల వ్యాపారం ఓ వ్యవస్థీకృత నేర సామ్రాజ్యం వెన్నుదన్నుగా అంతకంతకూ విస్తరించుకుంటూపోతోంది. ఈ వ్యాపారంలో ముస్లిం యువత పాత్ర ఇటీవల వెలుగులోకి రావటం ఈ దందాలో చీకటికోణం గుట్టును పోలీసు నివేదికలు విప్పాయి. ఓ స్థానిక మౌల్వీ మాత్రం ఇంతటి భయంకరమైన పరిస్థితుల్లోనూ ముస్లిం యువతను లక్ష్యంగా చేసుకున్నారంటూ కాకమ్మ కబుర్లు చెప్పడం గమనార్హం.  అదే మౌల్వీ  పెద్ద పెద్ద ముస్లిం తలకాయలు ఈ అక్రమ వ్యాపారాన్ని ఇష్టానుసారంగా నడుపుతున్న వైనంపై పెదవి విప్పకపోవడం విశేషం.

తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో కోస్తా తీర ప్రాంతాలు మాదక ద్రవ్యాలు ప్రత్యేకించి మెథమాఫెటామైన్‌, ‌గంజాయి, హెరాయిన్‌ ‌లాంటి వాటికి చేతులు మారే కీలకమైన ప్రాంతాలుగా ఆవిర్భవించాయి. సంబంధిత అధికారులు కొద్ది మాసాలుగా కీజకరై, దేవీపట్టినం, కొన్నికరై, థొండి లాంటి చోట్ల అనేక మందిని అరెస్టు చేశారు. అలా అరెస్టయినవారిలో ముస్లింలు ఎక్కువ.

రెవిన్యూ ఇంటెలిజెన్స్ ‌డైరెక్టరేట్‌ ఇం‌డియన్‌ ‌కోస్ట్ ‌గార్డ్, ‌స్థానిక పోలీసుల సమన్వయంతో బోట్ల ద్వారా శ్రీలంకకు మాదక ద్రవ్యాలను అక్రమంగా తరలించే అనేక ప్రయత్నాలను భగ్నం చేసింది. ఇదే సందర్భంగా కోట్ల రూపాయలు విలువ చేసే మాదక ద్రవ్యాలు, నగదు, మొబైల్‌ ‌ఫోన్లను స్వాధీనం చేసుకుంది.

గతేడాది అక్టోబర్‌ 24‌న థొండి పోలీసులు తమకు అందివచ్చిన సమాచారం ప్రకారం గంజాయిని కలిగి ఉన్న ముగ్గురు ముస్లిం యువకులు ఆశిక్‌(20), ‌సాహుల్‌ ‌హమీద్‌(20), ‌బుర్హాన్‌ అలీ(22) ని రామనాథపురం జిల్లాలోని థొండిలో అరెస్టు చేశారు. అక్టోబర్‌ 25‌న ఓ కార్పొరేషన్‌ ‌డంపింగ్‌ ‌యార్డు వద్ద మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్న మహమ్మద్‌ ‌హారీస్‌ (30), ‌జగదీశన్‌(29) ‌ను కొన్నికరై పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 100 గ్రాముల మెథమాఫెటామైన్‌తో పాటుగా నిందితుల్లో ఒకడైన మహమ్మద్‌ ‌హారీస్‌ ఇం‌టి నుంచి మరో 200 గ్రాముల మెథమాఫెటామైన్‌, ‌రూ.45 వేలు, ఆరు మొబైల్‌ ‌ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నవంబర్‌ 25‌న సక్కరకొట్టయ్‌లో అబ్దుల్‌ ‌కలామ్‌ ‌నగర్‌లో ఓ మద్యం దుకాణం దగ్గర్లో మెథమాఫెటామైన్‌ ‌విక్రయిస్తున్న ఇద్దరు ముస్లిం యువకులు హబీబ్‌ ‌ముహమ్మద్‌(19), ‌హమీద్‌ ‌ముహమ్మద్‌(20)‌ను కొన్నికరై పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 13 కేజీల మెథమాఫెటామైన్‌, ‌రెండు సెల్‌ఫోన్లు, రూ.20 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. డిసెంబర్‌ 4‌న పెరియకాడు ఒత్తపన్నయ్‌ ‌బీచ్‌ ‌వద్ద మెథమా ఫెటామైన్‌, ‌గంజాయి విక్రయించడానికి ప్రయత్నించిన అఖిల్‌ అలీ(27) , మొహమ్మద్‌ ‌నబీల్‌ (23), ‌జయసూర్య (22)ను కీజకరై పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 72 గ్రాముల గంజాయి, 12 గ్రాముల మెథమాఫెటామైన్‌, ‌రూ.15 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. డిసెంబర్‌ 9‌న రామనాథపురం నుంచి కీజకరైకు మెథమాఫెటామైన్‌ను అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు ముస్లిం యువకులు జైనులాబిదీన్‌, ‌సయీద్‌ ‌మొహమ్మద్‌, ‌సద్దామ్‌ ‌హుస్సేన్‌ను కీజకరై పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 4 గ్రాముల హై గ్రేడ్‌ ‌మెథమాఫెటామైన్‌ ‌స్వాధీనం చేసుకున్నారు. మాదక ద్రవ్యాల కేసుల్లో ముస్లిం యువత అత్యధికంగా అరెస్టవుతున్న వైనాన్ని చూసి జీర్ణించుకోలేకపోయిన మౌల్వీ హఫీజ్‌ ‌మొహమ్మద్‌ ‌రఫీక్‌ ‌మిస్బా ఈ కేసుల్లో ముస్లింలను లక్ష్యంగా చేసుకున్నారంటూ వాపోయాడు. మాదక ద్రవ్యాల అక్రమ సరఫరాదారులు ముస్లిం యువతను పెడదారి పట్టిస్తున్నారని, వారిలో జవాబుదారీతనం లేని ప్రవర్తనకు, మానసిక రుగ్మతలకు కారణమౌతున్నారంటూ కాకమ్మ కబుర్లు చెప్పాడు. ఈ అబద్ధాల కోరు మాదక ద్రవ్యాల దందాలో ముస్లింల లోతైన ప్రమేయాన్ని గురించి మాటమాత్రమైనా చెప్పలేదు సరికదా ముస్లింలను మాదక ద్రవ్యాలకు బాధితులుగా చూపెట్టడం ద్వారా అసలు విషయాన్ని పక్కదారి పట్టించడానికి ప్రయత్నించాడు. ఇలాంటి మౌల్వీలు చెప్పే కల్లబొల్లి కబుర్లు మాదక ద్రవ్యాల దందాలో ముస్లిం యువతను నియమించుకోవడం ద్వారా వారిని తమ చేతుల్లో పావుల్లా ఇష్టారాజ్యంగా వ్యవహరించే ముస్లిం పెద్ద తలకాయల పాత్రను మరింత స్పష్టంగా చూపుతాయనేది విశ్లేషకుల మాట. అయితే ఆ మౌల్వీ అంతటితో ఊరుకుంటే సరిపోయేది. అతడు అలాకాకుండా మాదక ద్రవ్యాలపై అవగాహన కార్యమ్రాలు నిర్వహించాలని జమాత్‌ ‌నేతలకు విజ్ఞప్తి చేశాడు. అదే సమాజానికి పెను ముప్పుగా కొనసాగుతున్న అసలైన సూత్రధారులపై చర్య తీసుకునే విషయమై కిమ్మనకుండా ఉండిపోయాడు.

రాష్ట్రంలో మాదక ద్రవ్యాలకు సంబంధించిన నేరాలు నానాటికి పెరిగిపోతున్న నేపథ్యంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై మాట్లాడుతూ మాదక ద్రవ్యాల ముఠా నాయకుడు జాఫర్‌ ‌సిద్దిక్‌, ‌తమిళనాడు పాఠ్యపుస్తకాల కార్పొరేషన్‌ ‌లో ఓ కాంట్రాక్టర్‌కు మధ్య సంబంధంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ మంత్రి అన్‌బిల్‌ ‌మహేశ్‌ ‌పొయ్యామొళిని డిమాండ్‌ ‌చేశారు. గతేడాది మార్చిలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల రాకెట్‌ ‌వెలుగులోకి రావడానికితోడు 50 కేజీల సూడోఎఫెడ్రైన్‌ అధికారులు స్వాధీనం చేసుకున్న తరుణంలో జాఫర్‌ అరెస్టయ్యాడు. సూడోఎఫెడ్రైన్‌ను మాదక ద్రవ్యాల తయారీలో వినియోగిస్తారు.

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE