అనాదిగా వస్తున్న బంధాలను అనుబంధాలను
పక్కకు జరుపుతున్న నేటితరం
వసంతలక్ష్మిని స్వాగతిస్తుందని ఆశిద్దాం..
డబ్బు వ్యామోహంలో తూగుతున్న సమాజం
సంప్రదాయాలనూ మరువకుండా
మధుమాసపు సంబరాల్ని జరుపుతుందని ఆశిద్దాం..
స్విగ్గి, జామాటలను ఆరగిస్తున్న యువతరం
ప్రకృతి అందిస్తున్న షడ్రుచులనూ స్వీకరిస్తుందని ఆశిద్దాం..
కృత్రిమ పెర్ఫ్యూమ్‌లను వాడే సమూహం
ప్రకృతి నుంచి వచ్చే మల్లె, జాజి ఘుమ
ఘుమల పరిమళాలనూ అనుభవిస్తుంది ఆశిద్దాం..
అపార్ట్మెంట్ కల్చర్‌తో ముందుకు సాగుతున్న ఈ తరం
రుతువులలోని వెన్నెల రాత్రులనూ వీక్షించగలదని ఆశిద్దాం..
పంచాంగం క్యాలండర్ మరుస్తున్న ఈ రోజుల్లో పండుగల
ఆత్మీయ్య అంతరార్ధాన్నీ ఆలింగనం చేసుకోగలరని ఆశిద్దాం
అన్ని ఫలాలను అందిస్తున్న ప్రకృతి ఆకృతిలోని
సంపదను అందరు ఆస్వాదిస్తారని ఆశిస్తూ
ఈ ఉగాదికి స్వాగతం సుస్వాగతం
చివుకుల వాసుదేవమూర్తి
9849651444