ఇన్నాళ్లూ ఇస్లాం చొరబాటుదారులను, మొగలాయి పాలకులను వీరులని, శూరులని కీర్తించిన భారత చలనచిత్ర పరిశ్రమ ఇటీవల విడుదలైన హిందీ చిత్రం ‘ఛావా’తో తప్పనిసరిగా తన ధోరణిని మార్చుకోవాల్సి వస్తుంది. ఆ భాష ఈ భాష అని లేకుండా అన్ని భాషల సినీ రూపకర్తలు ఇకపై దేశ చరిత్రను తెరకెక్కించేటప్పుడు ఇప్పటిదాకా తమ కళ్లకు పెట్టుకున్న ఆకుపచ్చని కళ్లద్దాలను తొలగించాల్సిన అవసరం వచ్చింది. పాశ్చాత్య పోకడలు పోయేవారు ఫిబ్రవరి 14న వాలెంటైన్స్‌ డే మత్తులో మునిగి తేలుతున్నప్పుడు, సరిగ్గా అదే రోజు ప్రపంచమంతటా వెండితెరలపై ‘ఛావా’ చిత్ర ప్రదర్శన ఆరంభమైంది.

సినిమా మొదలైనప్పటి నుంచి చివరిదాకా హైందవీ స్వరాజ్యం కోసం ఛత్రపతి శంభాజీ మహా రాజ్‌ సాగించిన అలుపెరుగని పోరాటం వీక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. దేశాన్ని సర్వనాశనం చేసిన ఇస్లాం చొరబాటుదారులలో యావత్‌ హిందూ బంధువులు గర్వించడానికి, ఆత్మగౌరవాన్ని రక్షించు కోవడానికి చేయాల్సిన పోరాటం ఇదే కదా అనే ఎరుకను సినిమా హాళ్లలో ఉన్న అబాలగోపాలానికి ‘ఛావా’ కలిగించింది. సినిమాను చూస్తున్నవారిలో అనేక మంది థియేటర్లలో నినాదాలు చేయడం, భావోద్వేగానికి లోనుకావడం, కంటతడి పెట్టిన సంఘటనలు కోకొల్లలు. వాటికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. యావత్‌ సినీ ప్రేమికులకు మేలుకొలుపుగా మారాయి. జరుపుకోవాల్సింది ప్రేమికుల రోజు కాదని నిజమైన హిందూ పోరాట యోధులను స్మరించుకోవడం ద్వారా హిందుత్వ అస్తిత్వాన్ని పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని కుంభవృష్టిగా కురుస్తున్న కలెక్షన్ల రూపంలో ఈ సినిమా తెలియపరిచింది.

ఇంతటి సంచలనం సృష్టిస్తున్న ఈ సినిమా వెనుక కథ అత్యంత ఆసక్తికరమైనది. భారతీయుల్లో చాలా మందికి 2014 వరకు కూడా దేశం కోసం సర్వస్వం త్యాగం చేసిన హిందూ రాజులు, రాణుల గురించి నామమాత్రంగా కూడా తెలీదు. దేశానికి స్వరాజ్యం సిద్ధించిన తర్వాత అలాంటి వారి గురించి తెలుసుకోవ డానికి హిందువులు తహతహలాడిపోతుండేవారు. కానీ ఎక్కడ చూసినా ఎంతసేపూ హిందూ దేవాల యాలు, రాజ్యాలను ధ్వంసం చేసి చక్రవర్తులైన ముస్లిం చొరబాటుదారులను వేనోళ్ల కీర్తిస్తూ రాసిన కథనాలు పాఠ్య పుస్తకాల్లో, చరిత్ర పుస్తకాల్లో కనిపించేవి. చివరికి అక్షరమ్ముక్క రానివారికి వినోదాన్ని పంచే నాటకాల్లో, సినిమాల్లో కూడా ఇదే తరహా వక్రభాష్యం వినిపించేది, కనిపించేది. సరిగ్గా ఇదే సమయంలో మరాఠా సినీ దర్శకుడు లక్ష్మణ్‌ ఉట్కేర్‌కు ప్రముఖ మరాఠా రచయిత శివాజీ సావంత్‌ ఛత్రపతి శివాజీ మహరాజ్‌ కుమా రుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్‌ జీవిత చరిత్ర ఆధారంగా రాసిన ‘ఛావా’ పుస్తకం కంటపడిరది. కాలం కలిసొచ్చింది. మరాఠా పుస్తకం కాస్త అదే పేరుతో అద్భుతమైన ఓ హిందీ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పుస్తకంతో పోల్చినప్పుడు సినిమా అత్యంత శక్తిమంతమైన ఉపకరణంగా ప్రేక్షకులపై ప్రభావం చూపిస్తుంది. అందుకే సినీ రూపకర్తలు చరిత్రను తెరకు ఎక్కించేటప్పుడు ఎంతో బాధ్యతగా ఆ పని చేయాలి. ఈ విషయంలో ‘ఛావా’ రూపకర్త లకు నూటికి నూరు మార్కులు ఇవ్వాలి.

భారత్‌లో హైందవీ స్వరాజ్య స్థాపనకు తన తండ్రి ఛత్రపతి శివాజీ మహారాజ్‌ కన్న కలను నిజం చేయడానికి పోరాడిన ఆయన కుమారుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్‌ పాత్ర పోషణలో విక్కీ కౌశల్‌ చక్కని ప్రతిభను చూపించారు. ఈ విషయంలో సౌరభ్‌ గోస్వామి కెమెరా పనితనం ముందు వరుసలో ఉంటుంది. శంభాజీ మహారాజ్‌ జీవితంలో కీలక మైన ఘట్టాలను ఆసక్తిదాయకంగా చిత్రీకరించడంలో దర్శకుడు లక్ష్మణ్‌ ఉట్కేర్‌ అంకిత భావం, పడిన తపన ప్రతీ ఫ్రేములోనూ కనిపించింది. ప్రతీ భారతీ యుడు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన ఘట్టాలవి. మొగలాయి చక్రవర్తి ఔరంగజేబ్‌ను సవాల్‌ చేసే సన్నివేశాల్లో తండ్రికి తగ్గ తనయుడిగా శంభాజీ మహారాజ్‌ ఈ సినిమాలో కనిపించారు. నటుడు అక్షయ్‌ ఖాన్నా ఔరంగజేబ్‌ను ఆవాహన చేసుకున్నట్టుగా నటించారు.

హృతిక్‌ రోషన్‌ హీరోగా 2008లో వచ్చిన జోధా అక్బర్‌ సినిమాలో అక్బర్‌ పాత్రను ఎంతో ఉన్నతంగా ఆకుపచ్చ రంగులో చూపించాడు దర్శకుడు అశుతోష్‌ గోవరికెర్‌. అయితే ‘ఛావా’ విషయానికి వచ్చేసరికి అలాంటి వక్రీకరణలకు ఏ మాత్రం తావు లేకుండా దర్శకుడు లక్ష్మణ్‌ ఉట్కేర్‌ వ్యవహరించారు. దానికి తగ్గట్టుగా ఔరంగజేబ్‌ నిజస్వరూపాన్ని వెండితెరపై ప్రదర్శించడంలో అక్షయ్‌ ఖన్నా తనదైన హావభావాలను పలికించారు.

శంభాజీ మహారాజ్‌ను మృత్యువు సమీపిస్తున్న వేళ మతం మార్చుకుంటే విడిచిపెట్టేస్తాను అని ఔరంగ జేబ్‌ అన్నప్పుడు హైందవీ రాజ్యానికి కట్టుబడి ఉన్నట్టుగా ఆ ప్రతిపాదనను శంభాజీ మహారాజ్‌ తిరస్కరించిన వైనం మొత్తం సినిమాకు మకుటాయ మానమైంది. ఇతర పాత్రలకు నటీనటుల ఎంపిక పాత్రోచితంగా ఉంది. మహరాణి ఈసుబాయిగా రష్మిక మందన్నా కనిపించారు. ఔరంగజేబ్‌ కుమార్తె జీనత్‌ ఉన్నీసాగా నటి డయానా పింటీ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. ఎవరెలా చేసినప్పటికీ ఛత్రపతి శంభాజీ మహారాజ్‌ను ఎదురుగా చూస్తున్నామా? అన్న రీతిలో నటించిన విక్కీ కౌశల్‌ యావత్‌ సినిమా భారాన్ని తన భుజస్కంధాలపై మోశారు. ఛత్రపతి శంభూజీ మహారాజ్‌ను ప్రేక్షకుల స్మృతి పథంలో శాశ్వతంగా నిలిపారు. ప్రతి ఒక్కరూ కనీసం ఒక్కసారైనా చూడాల్సిన సినిమాగా ‘ఛావా’.

– ‘ఆర్గనైజర్‌’ నుంచి

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE