సమగ్ర సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల గణన సర్వే.. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ముద్దుగా పిలుచుకున్న పేరు ‘కులగణన’ సర్వే. కులగణన సర్వే చేపడతామంటూ కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం మొదటి నుంచా ఎంతో అట్టహాసంగా, ఆర్భాటంగా చెబుతూ వచ్చింది. రాష్ట్రంలో ఏ కులంవారు ఎంత మంది ఉన్నారు? వారి సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? అన్నది తెలుసుకోవడం లక్ష్యంగా ఈ పక్రియ చేపట్టినట్లు ప్రకటించింది. తొలి విడతలో 50 రోజుల పాటు ఈ సర్వే నిర్వహించింది. ప్రభుత్వ అధికారులు, సిబ్బంది అదే పనిమీద ఉన్నా సర్వే విజయవంతం కాలేదు. పైగా దీనిమీద వచ్చినన్ని విమర్శలు, ఇప్పటివరకు కాంగ్రెస్‌ ‌నర్కా,రుపై ఏ అంశంలోనూ రాలేదనే చెప్పాలి.

తెలంగాణలో వెనుకబడిన తరగతులు వారి కోసమే కులగణన సర్వే చేపట్టామని, ఇది దేశంలోనే సాహసోపేత నిర్ణయమని, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఈ పక్రియ చేపట్టిన ఘనత తమ ప్రభుత్వానిదేనని కాంగ్రెస్‌ ‌పార్టీ ఆర్బాటంగా ప్రకటించింది. సర్వే ప్రారంభానికి పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీని పిలిపించి భా•రీ బహిరంగ సభ నిర్వహించింది. కులగణన ప్రభుత్వ కార్యక్రమ మైనప్పటికీ సంబంధిం చిన సమీక్షా సమావేశాల్లో కాంగ్రెస్‌ ‌పార్టీ శ్రేణులకు భాగస్వామ్యం కల్పించింది. కానీ, హంగులు, ఆర్భాటాలు ఎక్కువై.. ఫలితాల విషయంలో చతికిల పడింది.

కుల గణన సర్వే మొదటి దశలో వందశాతం పూర్తి కాకపోవడం, విపక్షాల నుంచి, చివరకు లబ్ధి కలిగిస్తామన్న బీసీ సామాజిక వర్గాల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. దాంతో ప్రభుత్వం రెండవసారి అవకాశం కల్పించింది. అయితే ఈ విడతలో మరింతగా పరువు పోయినంత పనయ్యింది. కొంత మంది రాజకీయ నాయకులు కావాలనే సర్వేలో పాల్గొనకపోవడం, తమ వివరాలు ఇవ్వక పోవడం వంటివి చోటు చేసుకున్నాయి. వివరాల సేకరణలో భాగంగా ప్రభుత్వం పలు రకాల అవకాశాలు ఇచ్చింది.ఎన్యూమరేటర్లు ఇంటికి వెళ్లి వివరాలు నమోదు చేయడం, ప్రజలు ఆన్‌లైన్‌లోనే వివరాలు నమోదు చేసుకోవడం, టోల్‌ ‌ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేయడం వంటివి చేపట్టింది. టోల్‌ ‌ఫ్రీ నెంబర్‌కు కాల్‌ ‌చేస్తే అధికారులే ఇంటికి వచ్చి సర్వే వివరాలు నమోదు చేసుకుంటారని ప్రకటించింది. ప్రజా పాలన కేంద్రాల వద్ద సర్వే ఫారం నింపి ఇవ్వొచ్చు. అంతేకాదు.. ఇంటి దగ్గరే సర్వే ఫారమ్‌లో వివరాలన్నీ ఎవరికి వాళ్లే నమోదు చేసుకొని.. ప్రజా పాలన కేంద్రాల్లో ఇవ్వొచ్చు. ఇంటిదగ్గర సర్వే ఫారం నింపడానికి వీలుగా ఇంటర్నెట్‌లో ఆ సర్వే ఫారాలు అందుబాటులో ఉంచింది ప్రభుత్వం. కాని ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్ల నుంచి పెద్దగా స్పందన లేదు. అటు.. ప్రజల నుంచి కూడా సర్వేలో పాల్గొనాలన్న ఆసక్తి అసలు కనిపించలేదు. ప్రధానంగా రాజధాని నగరం హైదరాబాద్‌లో మరీ చప్పగా సాగిందని చెప్పొచ్చు.

గత యేడాది నవంబర్‌, ‌డిసెంబర్‌ ‌నెలల్లో మొదటి విడత సర్వే పూర్తయిన త•ర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 3.56 లక్షల కుటుంబాలు సర్వేలో పాల్గొనలేదనిలెక్కలు చెబుతున్నాయి. రాష్ట్రంలోని కుటుంబాల్లో ఇది 3.1 శాతం. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమాన్ని సంపూర్ణంగా విజయవంతం చేయాలన్న లక్ష్యంతో మరోసారి అవకాశం ఇచ్చినా, స్పందన నామమాత్రమే.కేవలం 18,539 కుటుంబాలు మాత్రమే వివరాలు నమోదు చేసుకున్నాయి. మొత్తం మీద కులగణన పక్రియ పూర్తయినట్లు ప్రకటన వెలువడింది.

కులగణన సర్వే ప్రారంభానికి ముందు రాష్ట్రంలో మొత్తం 1,15,71,457 కుటుంబాలు ఉన్నట్లు గుర్తించిన ప్రభుత్వం అధికారులు, పర్యవేక్షకులు, సిబ్బందిని, ఎన్యూమరేటర్లును నియమించింది. మొదటి విడతగా గత ఏడాది నవంబర్‌ 6‌వ తేదీ నుంచి డిసెంబర్‌ 25‌వ తేదీ వరకు నిర్వహించిన సర్వేలో 96.9 శాతం (1,12,15,134) కుటుంబాలు వివరాలు నమోదు చేయించుకున్నాయి. ఆ సమయంలో ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా 3,56,323 కుటుంబాలు.. అంటే.. 3.1 శాతం మిగిలిపోయినట్లు తేల్చింది. వారి వివరాలను కూడా నమోదు చేసే లక్ష్యంతో కులగణన రెండో విడతగా ఫిబ్రవరి 16వ తేదీ నుంచి 28వ తేదీ వరకు సర్వే చేపట్టింది.

గత ఏడాది నవంబర్‌ 6‌వ తేదీ నుంచి 50 రోజుల పాటు (డిసెంబరు 25వ తేదీ వరకు) నిర్వహించిన సర్వేలో నమోదైన వివరాన్నిటిని క్రోడీకరించి కంప్యూటరైజ్‌ ‌చేశారు. సంబంధిత సమగ్ర నివేదిక ప్రభుత్వానికి చేరింది. దీంతో, ఫిబ్రవరి 4వ తేదీ శాసనసభ ప్రత్యేక సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కులగణ సర్వేనివేదికను ప్రకటించారు. ‘రాష్ట్రంలో గుర్తించిన మొత్తం 1,15,71,457 కుటుంబాలకు గాను 1,12,15,134 కుటుంబాలను సర్వే జరిగింది. అంటే 96.9 శాతం సర్వే పూర్త యింది. ఇంకా 3.1 శాతం అంటే.. 3,56,323 కుటుంబాలను సర్వే చేయలేదు’అని చెప్పారు. రెండో విడత సర్వేకు ప్రజా ప్రతినిధులు, అధికారులు కూడా సాధ్యమైనంత ప్రచారం కల్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. కానీ, కింది స్థాయిలో ఈ ఆదేశాలు అస్సలు అమలు కాలేదనే చెప్పుకోవచ్చు. ప్రభుత్వం రెండో విడత సర్వే కోసం కల్పించిన మూడు ఆప్షన్లను పరిశీలిద్దాం…

టోల్‌ ‌ఫ్రీ నెంబర్‌ 

‌ప్రభుత్వం ప్రకటించిన టోల్‌ ‌ఫ్రీ నంబర్‌ 040-21111111‌కు ప్రజలు ముందుగా రాష్ట్రంలోని ఏ ప్రాంతం నుంచైనా కాల్‌ ‌చేసి, కులగణనలో తమ వివరాలను నమోదు చేసుకోవాలని చెప్పాలి. సర్వే జరిగినన్ని రోజులు ఈ టోల్‌ ‌ఫ్రీ నెంబర్‌ అం‌దు బాటులో ఉంటుంది. కాల్‌ ఎవరు చేశారో.. వాళ్లు ఇచ్చిన వివరాల ఆధారంగా ఎన్యూమరేటర్లే వాళ్ల ఇంటికి వెళ్లి సర్వే ఫారంలో వివరాలు నమోదు చేసుకుంటారు.

ప్రజా పాలనా సేవా కేంద్రాలు 

గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఎంపీడీఓ కార్యాలయాల్లో, పట్టణ ప్రాంతాల్లో అయితే వార్డు కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన ప్రజా పాలనా సేవా కేంద్రాలకు ప్రజలు వెళ్లి తమ వివరాలను అందించాలి. మొదటి విడతలో సర్వేకు సంబంధిం చిన శిక్షణ పొందిన సిబ్బందిని ఈ కేంద్రాల్లో అందుబాటులో ఉంచారు. సర్వే ఫారాలను నింపడంలో ప్రజలకు వీళ్లు సహకరించా లని ఆదేశాలిచ్చారు.

ఇంట్లోనే వివరాలు నమోదు http//seeepcsurvey.cgg.gov.in అనే వెబ్‌సైట్‌ ‌నుంచి సర్వే ఫారాన్ని డౌన్‌లోడ్‌ ‌చేసుకొని.. ఆ ఫారంలో తమ కుటుంబ సభ్యుల సమగ్ర వివరాలను రాసి.. ఆ ఫారాన్ని దగ్గరలోని ప్రజా పాలనా సేవా కేంద్రంలో అందించాలి.

ఇలా.. ప్రభుత్వం మూడు రకాల ఆప్షన్లు ఇచ్చి రెండో విడత సర్వేలో పూర్తి వందశాతం వివరాల నమోదు పూర్తవుతుందని ఆశించింది. కానీ, అనుకున్న మాదిరిగా జరగలేదు. రెండు విడతల్లో నిర్వహించిన సర్వేల్లో చూసుకుంటే ప్రభుత్వం ప్రకటించిన మొత్తం కుటుంబాల్లో 97.08శాతం కుటుంబాలే సర్వేలో పాల్గొన్నట్లు తేలింది. దీనిని బట్టి చూస్తే.. రాష్ట్రంలో ఇంకా సర్వేలో పాల్గొనని, వివరాలు వెల్లడించని కుటుంబాల సంఖ్య 3,37,964 గా తేలింది.

కులగణన రెండో విడత సర్వేలో నమోదైన 18,539 కుటుంబాలను కూడా ఆన్‌లైన్‌లో అప్‌డేట్‌ ‌చేశారు. దీంతో, రాష్ట్రంలోని కులాల లెక్కల్లో స్వల్పంగా తేడా ఏర్పడే అవకాశం ఉంది. తొలి విడత సర్వేలో ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక మేరకు రాష్ట్రంలో ఎస్సీల జనాభా 17.43 శాతం (61,84,319), ఎస్టీల జనాభా 10.45 శాతం (37,05,929 ), బీసీల జనాభా 46.25 శాతం (1,64,09,179) ఉన్నట్టు తేల్చారు. వీరితో పాటు.. మొత్తం ముస్లిం జనాభా 12.56 శాతం (44,57,012) కాగా ఇందులో బీసీ ముస్లింల జనాభా 2.48 శాతం (8,80,424), ఓసీ ముస్లింల జనాభా10.08 శాతం (35,76,588), ఇతర ఓసీల జనాభా 13.31 శాతం (44,21,115)గా ఉన్నాయి. రెండో విడత సర్వే వివరాలను కూడా క్రోడీకరిస్తే.. ఈ లెక్కల్లో స్వల్పంగా మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.

ఇక, ప్రధాన ప్రతిపక్షం, గతంలో పదేళ్ల పాటు అధికారంలో కొనసాగిన బీఆర్‌ఎస్‌ ‌పార్టీ అధినేత కె.చంద్రశేఖరరావు, ఆయన కుమారుడు మాజీ మంత్రి తారక రామారావు, కేసీఆర్‌ ‌మేనల్లుడు, మాజీ మంత్రి హరీష్‌రావు వంటి వాళ్లు రెండో విడత సర్వేలో కూడా తమ వివరాలు నమోదు చేసుకోలేదు. వాస్తవానికి తొలి విడత సర్వే పూర్తయిన తర్వాత వీళ్లు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. బీసీల లెక్కలన్నీ తప్పులని పదే పదే ఆరోపణలు చేయగా ప్రభుత్వం వాటిని దీటుగా తిప్పికొట్టింది. అసలు సర్వేలో పాల్గొనని వాళ్లకు విమర్శించే అర్హత లేదంటూ ప్రభుత్వం ఎదురు దాడికి దిగడంతో.. రెండోసారి సర్వే చేయిస్తే.. తాము వివరాలు నమోదు చేయించుకుంటామని బీఆర్‌ఎస్‌ ‌ముఖ్య నేతలు ప్రకటించారు. అయినా బీఆర్‌ఎస్‌ ‌నేతలు కేసీఆర్‌, ‌కేటీఆర్‌, ‌హరీష్‌రావు మాత్రం సర్వేలో పాల్గొనలేదు. తమ వివరాలు వెల్లడించలేదు.

ఇక, కాంగ్రెస్‌, ‌బీఆర్‌ఎస్‌ ‌పార్టీల వ్యవహార శైలిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2014లో బీఆర్‌ఎస్‌ ఇదే మాదిరిగా సమగ్ర కుటుంబ సర్వే పేరుతో ఒక్కరోజు సర్వే చేపట్టి.. కనీసం ఆ సర్వే వివరాలు కూడా బయట పెట్టలేదు. ఆ వివరాలన్నీ కేవలం బీఆర్‌ఎస్‌ ‌పార్టీ కార్యాలయానికే చేరాయన్న విమర్శలు ఇప్పటికీ ఉన్నాయి. ఇక, ఇప్పుడు కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం కూడా సమగ్ర సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల గణన సర్వే పేరుతో అదే స్థాయిలో సర్వే చేపట్టింది. కానీ, అమలులో మాత్రం బొక్క బోర్లా పడింది. రెండుసార్లు సర్వే చేసినా విజయవంతం కాకపోవడంపై పలు రకాల విశ్లేషణలు సాగుతున్నాయి.

సుజాత గోపగోని

 సీనియర్‌ ‌జర్నలిస్ట్, 6302164068

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE