– సింహంభట్ల సుబ్బారావు, 6300674054
మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం
పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. మీ బాధ్యతలు మరింత పెరుగుతాయి. వివాహాది వేడుక లలో పాల్గొంటారు. ఉద్యోగులకు విధుల్లో ప్రతి బంధకాలు తొలగుతాయి. రాజకీయవేత్తలు, కళా కారులు, రచయితలకు విశేష గుర్తింపు లభిస్తుంది. 5,6 తేదీల్లో అనుకోని ప్రయాణాలు. బంధు విరోధాలు. అంగారక స్తోత్రాలు పఠించండి.
వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు
శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. అందరిలోనూ గుర్తింపు. ఆకస్మికంగా ధనలాభాలు. కొత్త కార్య ్రకమాలు ప్రారంభిస్తారు. చిన్ననాటి విషయాలు గుర్తు తెచ్చుకుంటారు. వ్యాపారులకు నూతన పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు చికాకులు తొలగు తాయి. కళాకారులు, రచయితలు, క్రీడాకారులకు సన్మానాలు, అనుకోని విదేశీ పర్యటనలు. 31,1 తేదీల్లో కుటుంబంలో చికాకులు. శ్రమాధిక్యం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. నూతన ఉద్యోగయత్నాలలో పురోగతి కనిపిస్తుంది. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. ప్రముఖులతో పరిచయాలు. దేవాలయాలు సందర్శి స్తారు. వాహనయోగం. వ్యాపారులు లాభాలు అందు కుంటారు. ఉద్యోగులకు ప్రమోషన్లు దక్కుతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, రచయితలకు విదేశీ పర్యటనలు. 4,5 తేదీల్లో అనారోగ్యం. చికాకులు. ఆంజనేయ దండకం పఠించండి.
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఆప్తులతో కష్టసుఖాలు పంచుకుంటారు. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. సోదరులు, స్నేహితులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలమవుతాయి. ఆలో చనలు అమలు చేస్తారు. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారస్తులకు కృషి ఫలిస్తుంది. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. పారిశ్రామికవేత్తలు, కళా కారులకు ఆహ్వానాలు అందుతాయి. 2,3 తేదీల్లో దుబారా ఖర్చులు. ఆదిత్య హృదయం పఠించండి.
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. వాహ నాలు, ఆభరణాలు కొనుగోలు. చిన్ననాటి విషయాలు గుర్తుకువస్తాయి. సంభలు, సమా వేశాలలో పాల్గొం టారు. వ్యాపారులకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో ఇబ్బందులు తొలగి ఊరట చెందు తారు. కళాకారులు, రచయితలకు విశేష ఆదరణ లభిస్తుంది. 1,2 తేదీల్లో కుటుంబంలో గందరగోళం. దూరప్రయాణాలు. నవగ్రహస్తోత్రాలు పఠించండి.
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు
ముఖ్యమైన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. సమాజసేవలో భాగస్వాములవుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడతారు. వ్యాపారులకు లాభాలు అందు తాయి. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు సన్మాన, సత్కారాలు. 31,1 తేదీల్లో వృథా ఖర్చులు. మనశ్శాంతి లోపిస్తుంది. అన్నపూర్ణాష్టకం పఠించండి.
తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
అదనపు ఆదాయం సమకూరుతుంది. నిరు ద్యోగులకు శుభవార్తలు అందుతాయి. పలుకుబడి పెరుగుతుంది. ఆస్తి వివాదాలు తీరతాయి. ఆలో చనలు కార్యరూపం దాలుస్తాయి. ఉద్యోగులకు విధి నిర్వహణలో ప్రశంసలు. రాజకీయ, పారిశ్రామిక వర్గాలు, కళాకారులు ఉత్సాహవంతంగా గడుపుతారు. అనుకున్నది సాధిస్తారు. 3,4 తేదీల్లో వివాదాలు. ఆరోగ్యసమస్యలు. శివాష్టకం పఠించండి.
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ
కొత్త కార్యక్రమాలు చేపడతారు. పరపతి పెరుగు తుంది. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారులు లాభాల దిశగా సాగుతారు. ఉద్యోగులకు ఒడిదుడుకులు తొలగి ఊరట లభిస్తుంది. కళాకారులు, రచయితలు, క్రీడాకారులకు గౌరవ పురస్కారాలు. 5,6 తేదీల్లో ఆటంకాలు. దూరప్రయాణాలు. శ్రీకృష్ణ స్తోత్రాలు పఠించండి.
ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
అదనపు రాబడితో ఉత్సాహంగా గడుపుతారు. ఇంటర్వ్యూలు అందుకుంటారు. కొన్ని కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. బంధువులతో సత్సం బంధాలు. వ్యాపారులకు లాభాలు అందుతాయి. ఉద్యోగులకు విధుల్లో ప్రతి బంధకాలు తొలగుతాయి. రచయితలు, పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్య టనలు. 4,5 తేదీల్లో వృథా ఖర్చులు. కుటుంబంలో ఒత్తిడులు. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.
మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం , ధనిష్ఠ 1, 2 పాదాలు
కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. శుభ కార్యా లలో పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసు కుంటారు.బంధువర్గంతో సత్సంబంధాలు నెలకొం టాయి. వ్యాపారులకు లాభాలు అందుతాయి. ఉద్యోగులకు మరింత పురోభివృద్ధి. రాజకీయ, పారి శ్రామికవేత్తలు, క్రీడాకారులకు అరుదైన ఆహ్వానాలు అందుతాయి. 1,2 తేదీల్లో వృథా ఖర్చులు. అనుకోని ప్రయాణాలు. లక్ష్మీనృసింహస్తోత్రాలు పఠించండి.
కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
అనుకున్నంత రాబడి సమకూరి అవసరాలు తీరతాయి. పోటీపరీక్షల్లో నిరుద్యోగులకు విజయం. కొత్త వ్యక్తుల పరిచయం. వ్యాపారులు లాభాలు దక్కిం చుకుంటారు. ఉద్యోగులకు విధి నిర్వహణ ప్రశాం తంగా సాగుతుంది. రాజకీయ, పారిశ్రామికవేత్తలకు సన్మానాలు. రచయితలు, కళాకారులకు ఊహించని ఆహ్వానాలు. 18,19 తేదీల్లో ఖర్చులు. సోదరులతో విభేదాలు. నృసింహ స్తోత్రాలు పఠించండి.
మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
ఆదాయం అంతగా లేక అప్పులు చేస్తారు. తరచూ ప్రయాణాలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. ఆస్తుల విషయంలో ఒప్పందాలు వాయిదా. వ్యాపారులకు ఒత్తిడులు పెరుగుతాయి. ఉద్యోగులకు పనిభారం తప్పదు. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, రచయితలకు కొంత గందరగోళం. 3,4 తేదీల్లో శుభవార్తలు. వాహనయోగం. లక్ష్మీస్తోత్రాలు పఠించండి.