– సింహంభట్ల సుబ్బారావు, 6300674054

మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం

కొత్తవారు పరిచయం ఉత్సాహాన్నిస్తుంది. ముఖ్య కార్యక్రమాలు పూర్తి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారులు మరింత ఉత్సాహంతో సాగి లాభాలు పొందుతారు. ఉద్యోగులు ఉన్నతస్థాయి వారి ప్రశంసలు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు మరింత అనుకూల పరిస్థితి. క్రీడాకారులు, పరి శోధకులు వివాదాల నుంచి బయటపడతారు. 21,22 తేదీలలో బంధువులతో తగాదాలు. ఆరోగ్య సమస్యలు. ఆదిత్య హృదయం పఠించండి.


వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు

చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా సాగు తాయి. కాంట్రాక్టులు కొన్ని దక్కించుకుంటారు. గృహ నిర్మాణాలు చేపడతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పలుకుబడి, కొన్ని సమస్యల నుంచి ఉపశమనం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగుల శ్రమ ఫలించి ప్రత్యేక గుర్తింపు పొందుతారు. కళాకారులకు ఊహిం చని అవకాశాలు. క్రీడాకారులు, పరిశోధకులు ప్రతిభ నిరూపించుకుంటారు. 17.18 తేదీల్లో శారీరక రుగ్మతలు. గణేశ్‌స్తోత్రాలు పఠించండి.


మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు

స్నేహితులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. సేవా కార్యక్రమాలపై ఆసక్తి. వ్యతిరేకులు కూడా మీకు మద్దతుగా నిలుస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు. నిరుద్యోగులు అనుకోని అవకాశాలు దక్కించుకుంటారు. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపారులు పెట్టుబడులకు తగిన లాభాలు. ఉద్యోగులకు విశేషంగా కలిసివస్తుంది. 19,20 తేదీల్లో శారీరక రుగ్మతలు. కుటుంబంలో చికాకులు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.


కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష

ఎటువంటి సమస్య ఎదురైనా చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. రాబడి ఆశాజనకం. ఆత్మీయులు, బంధువుల నుంచి పిలుపురావచ్చు. కొత్త కాంట్రాక్టులు. పరిచయాలు మరింత పెరుగుతాయి. వ్యాపారులు లాభాలబాటలో పయనిస్తారు. ఉద్యో గులు విధి నిర్వహణలో ప్రశంసలు. క్రీడాకారులు తమ ప్రతిభ నిరూపించుకుంటారు. 20,21 తేదీల్లో వృథా ఖర్చులు. అనారోగ్యం. దూరప్రయాణాలు. శివపంచాక్షరి పఠించండి.


సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం

ముఖ్య కార్యక్రమాలు నెమ్మదిగా సాగుతాయి. దేవాలయ దర్శనాలు. ఆప్తులు కూడా శత్రువులుగా మారతారు. కుటుంబంలో ఒత్తిడులు పెరుగుతాయి. స్థిరాస్తి విషయంలో చిక్కులు. వ్యాపారులు స్వల్ప లాభాలతో సరిపెట్టుకోవాలి. ఉద్యోగులు మరింత శ్రమపడాల్సిన సమయం. 22,23 తేదీల్లో శుభ వార్తలు. ధనలబ్ధి. కుటుంబసౌఖ్యం. కనక దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.


కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు

కొన్ని ఇబ్బందులు, సమస్యలను నేర్పుగా పరిష్క రించుకుంటారు. ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ప్రముఖ వ్యక్తుల పరిచయం. కాంట్రాక్టర్లు ఆశాజనకంగా ఉంటుంది. గృహం, వాహనాలు కొంటారు. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు అనుకూలం. కళాకారులు, క్రీడాకారులు తమ ప్రతిభ చాటుకుంటారు. 21,22 తేదీల్లో వృథా ఖర్చులు. శారీరక రుగ్మతలు. శివాష్టకం పఠించండి.


తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు

రాబడి మరింత పెరుగుతుంది. ముఖ్య కార్య క్రమాలు విజయవంతంగా సాగుతాయి.  నిరు ద్యోగులకు ప్రభుత్వం నుంచి పిలుపురావచ్చు. తీర్థ యాత్రలు.వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులు ఆశ్చర్య కరమైన విధంగా పదోన్నతులు. పారిశ్రామిక వేత్తలు విదేశీ పర్యటనలు. కళాకారులు, రచయితలకు ఆహ్వానాలు. 19,20 తేదీలలో అనారోగ్యం. కుటుంబ సభ్యులతో వైరం. విష్ణుధ్యానం మంచిది.


వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ

శుభకార్యాలలో పాలుపంచుకుంటారు. అనుకోని ఆహ్వానాలు రావచ్చు. విద్యార్థులు విదేశీ విద్య, ఉద్యోగావకాశాలు. భాగస్వామ్య వ్యాపారాలు అనుకూ లిస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు దక్కవచ్చు. రాజకీయ, పారిశ్రామికవేత్తలకు మంచి గుర్తింపు లభి స్తుంది. కళాకారులు, రచయితలకు మరిన్ని అవ కాశాలు. 22,23 తేదీల్లో విచిత్ర సంఘటనలు. దూరప్రయాణాలు. నవగ్రహ స్తోత్రాలు పఠించండి.


ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం

ఊహించిన విధంగా సొమ్ము సమకూరుతుంది. యత్నకార్యసిద్ధి. మీ వ్యుహాలు అర్థంకాక ప్రత్యర్థులు కంగుతింటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొం టారు. ఉద్యోగుల సేవలకు తగిన గుర్తింపు. వ్యాపా రులకు లాభాలు. పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వం ద్వారా సన్మానాలు. పరిశోధకులు, రచ యితలు తమ ప్రజ్ఞాపాటవాలు చాటుకుంటారు. 20, 21 తేదీల్లో ఖర్చులు. కనకధారా స్తోత్రాలు పఠించండి.


మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం , ధనిష్ఠ 1, 2 పాదాలు

నిరుద్యోగులు అనుకున్న అవకాశాలు సాధిస్తారు.  రాబడి సంతృప్తికరంగా ఉండి అప్పులు తీరుస్తారు. పరిచయాలు విస్తృతమవుతాయి. మీ ఆశయాలు కొన్ని నెరవేరతాయి. వ్యాపారస్తులకు లాభాలు తథ్యం. ఉద్యోగులకు పదోన్నతులు లభించే సమయం. రాజకీయ, పారిశ్రామికవేత్తలు నైపుణ్యతను ప్రద ర్శిస్తారు. 17,18 తేదీలలో దూరప్రయాణాలు. మాన సిక ఆందోళన. సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించండి.


కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

అనుకున్నంత రాబడి సమకూరి అవసరాలు తీరతాయి. పోటీపరీక్షల్లో నిరుద్యోగులకు విజయం. కొత్త వ్యక్తుల పరిచయం. వ్యాపారులు లాభాలు దక్కిం చుకుంటారు. ఉద్యోగులకు విధి నిర్వహణ ప్రశాం తంగా సాగుతుంది. రాజకీయ, పారిశ్రామికవేత్తలకు సన్మానాలు. రచయితలు, కళాకారులకు ఊహించని ఆహ్వానాలు. 18,19 తేదీల్లో ఖర్చులు. సోదరులతో విభేదాలు. నృసింహ స్తోత్రాలు పఠించండి.


మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. తీర్థయాత్రలు చేస్తారు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. సేవా కార్యక్ర మాలలో పాల్గొంటారు. వ్యాపారులు భాగస్వాము లతో వివాదాలు పరిష్కరించుకుంటారు. ఉద్యోగులకు విధి నిర్వహణ మరింత ఉత్సాహంగా ఉంటుంది. పరిశోధకులు విశేష గుర్తింపు రాగలదు. 19,20 తేదీల్లో అనుకోని ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆంజనేయ దండకం పఠించండి.

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE