– సింహంభట్ల సుబ్బారావు, 6300674054

మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం

ఆప్తులతో సఖ్యత నెలకొంటుంది. బంధు వులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తి వివాదాల పరిష్కారం. ఇంటి నిర్మాణాలకు ప్రణాళిక. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు నెలకొన్నా సర్దుకుంటాయి. రచయితలు, క్రీడాకారులు అనుకున్నది సాధిస్తారు. 10,11తేదీల్లో ప్రయాణాలు. స్నేహితుల నుంచి ఒత్తిడులు. దైవకార్యాలలో పాల్గొంటారు. హయగ్రీవ ్యధ్యానం చేయండి.


వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు

సోదరులు, స్నేహితులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టు కుంటారు. విద్యార్థులు, నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగులకు విధుల్లో అవాంతరాలు తొలగి ప్రోత్సాహకరంగా ఉంటుంది. కళాకారులు అనుకున్న అవకాశాలు క్రీడాకారులు, పరిశోధకులకు అనుకూల సమయం. 13,14 తేదీల్లో ఆస్తి వివాదాలు. ఆకస్మిక ప్రయా ణాలు. శ్రీమహావిష్ణు షోడశనామస్తుతి మంచిది.


మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు

ఆదాయం తగ్గి కొత్తగా అప్పులు కూడా చేయాల్సివస్తుంది. బంధువులు, స్నేహితులతో వివాదాలు నెలకొనే సూచనలు. కొన్ని వ్యవహారాలలో రాజీ తప్పదు. విద్యార్థులు కొంత నిరాశ చెందుతారు. భూవివాదాలు, కోర్టు కేసులు కొంత చికాకు. ఉద్యో గులకు అదనపు పనిభారం. రచ యితలు, కళా కారులు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మేలు. 12,13 తేదీల్లో శుభవార్తా శ్రవణం. ధన, వస్తు లాభాలు. మహాలక్ష్మీ అష్టకమ్‌ ‌పఠించండి.


కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష

అదనపు ఆదాయం సమకూరి అవసరాలు తీర తాయి. కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. ఇంటి నిర్మాణ యత్నాలు కార్యరూపం. పట్టుదలతో కొన్ని సమస్యలు పరిష్క రించుకుంటారు. వ్యాపారులకు క్రమేపీ లాభాలు. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. పారి శ్రామికవేత్తలు ఒత్తిడులనుంచి బయట పడతారు. కళాకారులు, రచయితల యత్నాలు సఫల మవుతాయి. 15,16 తేదీల్లో స్నేహితులతో తగాదాలు. అనారోగ్యం. శ్రీ సూర్యప్రార్థన చేయండి.


సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం

సన్నిహితులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. దూరపు బంధువులను కలుసుకుని మీ భావాలను వెల్లడిస్తారు. వ్యాపారులు సంస్థలను విస్తరిస్తారు. ఉద్యోగు లకు విధుల్లో ఆటంకాలు తొలగుతాయి. మంచి గుర్తింపు లభిస్తుంది. రచయితలు, వైద్యుల సేవలకు తగిన గుర్తింపు లభిస్తుంది. 10,11 తేదీల్లో వృథా ఖర్చులు. కుటుంబంలో ఒత్తిడులు. అనారోగ్యం. మేధా దక్షిణామూర్తి స్తుతి మంచిది.


కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు

సమాజంలో విశేష గౌరవం లభిస్తుంది. రాబడి గతంకంటే మెరుగు. ఇంతకాలం పడిన కష్టం ఫలి స్తుంది. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగులకు సమస్యలు తీరతాయి. పారిశ్రామిక వేత్తలకు అన్నింటా విజయాలు సిద్ధిస్తాయి. క్రీడాకారులు, పరిశోధకులకు నూత నోత్సాహం. 14,15 తేదీల్లో వృథా ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. సుబ్రహ్మణ్యధ్యానం చేయండి.


తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు

గతం నుంచి వ్యేధిస్తున్న ఒక సమస్య నుంచి గట్టెక్కే సూచనలు. ఆదాయం మెరుగ్గా ఉన్నా ఖర్చులు  అధికం. శుభకార్యాలపై చర్చలు సఫలం. వ్యాపారు లకు విస్తరణ కార్యక్రమాలలో విజయం. ఉద్యోగులకు శ్రమానంతరం ఫలితం. పారిశ్రామిక వేత్తలకు శుభవార్తలు. రచయితలు, క్రీడాకారుల యత్నాలు సఫలం. 13,14 తేదీల్లో ఇంటా బయటా చికాకులు. అనారోగ్య సూచనలు. నవగ్రహ స్తోత్రాలు పఠించండి.


వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ

ఎదురు చూస్తున్న ఉద్యోగావకాశాలు దగ్గరకు వస్తాయి. కొన్ని సమావేశాలకు హాజరవుతారు. పరిచయాలు విస్తృత మవుతాయి. గృహ, వాహనాలు కొనుగోలు యత్నాలు సఫలం. ఉద్యోగులకు కొత్త హోదాలు లభిస్తాయి. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. పరిశోధకులు, వైద్యుల సేవలకు విశేష ఆదరణ లభిస్తుంది. 11,12 తేదీల్లో వృథా ఖర్చులు. ద్వాదశ సూర్య నమస్కారాలు చేయండి.


ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం

చేపట్టిన కార్యక్రమాలు కొంత నిదానంగా పూర్తి చేస్తారు. విద్యార్థులకు అనుకూల పరిస్థితి. ఇంటి నిర్మాణయత్నాలలో పురోగతి. వ్యాపారులకు క్రమేపీ లాభాలు అందుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. కళాకారులకు కొత్త అవకాశాలు. రచయితలు, క్రీడాకారులకు పేరుప్రతిష్ఠలు దక్కుతాయి. 10,11 తేదీల్లో స్వల్ప అనారోగ్యం. కుటుంబంలో కలహాలు. శ్రీరామధ్యానం మంచిది.


మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం , ధనిష్ఠ 1, 2 పాదాలు

ఇంతకాలం పడిన కష్టం కొలిక్కి వస్తుంది. విలువైన వస్తువులు, భూములు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. కాంట్రాక్టర్లు అనుకున్న టెండర్లు దక్కించుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారులకు విస్తరణ కార్యక్రమాలలో విజయం. ఉద్యోగులకు మంచి గుర్తింపు లభిస్తుంది. 13,14 తేదీల్లో బంధువులతో తగాదాలు. కష్టానికి ఫలితం కనిపించదు. ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం పఠించండి.


కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

మీ కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది. నూతన వ్యక్తుల పరిచయం. సమాజంలో గౌరవమర్యాదలు పొందుతారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉత్సాహాన్నిస్తాయి. వ్యాపారులకు మరింత లాభాలు. ఉద్యోగులకు పరిస్థితులు అనుకూలిస్తాయి. క్రీడాకారులు, పరిశోధకులకు అనుకున్న అవకాశాలు దక్కుతాయి. 15,16 తేదీల్లో బంధువిరోధాలు. చోరభయం. లలితాదేవిస్తుతి మంచిది.


మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

వ్యతిరేకులు కూడా అనుకూలురుగా మారి చేయూతనిస్తారు. కాంట్రాక్టర్లకు శుభవార్తలు అందుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారులు అనుకున్న లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. రాజకీయవేత్తలకు కొన్ని సమస్యల నుంచి విముక్తి. వైద్యులు, రచయిత లకు ఊహించని ఆహ్వానాలు అందుతాయి. 11,12 తేదీలలో దూరప్రయాణాలు. కుటుంబంలో ఒత్తి డులు. ధన్వంతరీ మంత్రం జపించండి.

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE