– సింహంభట్ల సుబ్బారావు, 6300674054
మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం
విచిత్ర సంఘటనలు ఎదురవుతాయి. రాబడి మరింత ఉత్సాహాన్నిస్తుంది. భూములు, స్థలాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగుల చిరకాల స్వప్నం నెరవేరుతుంది. వ్యాపారాలలో పెట్టుబడులు మరింతగా సమకూరతాయి. ఉద్యోగాలలో ఒడి దుడుకులు అధిగమిస్తారు. పారిశ్రామికవర్గాలకు విదేశీపర్యటనలు. రచయితలు,క్రీడాకారులకు ఉత్సా హంగా ఉంటుంది. 3,4 తేదీల్లో వ్యయ ప్రయాసలు. మానసిక అశాంతి. శివపంచాక్షరి పఠించండి.
వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు
కొత్త వ్యక్తులు పరిచయం సంతోషం కలిగిస్తుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. కళారంగం వారికి ఊహించని అవకాశాలు లభిస్తాయి. వైద్యులు, క్రీడాకారులకు శుభవర్తమానాలు. 7,8 తేదీల్లో బంధువిరోధాలు. కుటుంబంలో ఒత్తిడులు. గురు దత్తాత్రేయ స్తోత్రాల పఠనం ఉత్తమం.
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో కొన్ని వివాదాలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. పరిచయాలు మరింత పెరుగుతాయి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలలో లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు. వ్యవసాయదారులు, రచయితలకు అనుకూల సమాచారం. 6,7 తేదీల్లో మానసిక ఆందోళన. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం వద్దు. కాలభైరవాష్టకం పఠించండి.
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కొత్త కార్యక్రమాలు చేపడతారు. అదనపు ఆదాయం సమకూరి ఉత్సాహంగా గడుపుతారు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుం టారు. ఆలయాలు సందర్శిస్తారు. ప్రముఖులతో పరిచయాలు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం. పారిశ్రామిక వేత్తలకు విదేశీ పర్యటనలు. వైద్యులు, సాంకేతిక వర్గాల యత్నాలు. 8,9 తేదీలలో వ్యయ ప్రయాసలు. ఖర్చులు అధికం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
కొత్త కార్యక్రమాలు సమయానికి పూర్తి చేస్తారు. మిత్రులు మరింత సహాయపడతారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. గత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగు. బంధువుల సలహాలతో కొత్త నిర్ణయాలు. కళారంగం వారికి పురస్కారాలు. రచయితలు, క్రీడాకారులు మరింత పేరు. 3,4 తేదీల్లో మనశ్శాంతి లోపిస్తుంది. అనారోగ్యం. శ్రీరామస్తోత్రాలు పఠించండి.
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు
ఆస్తి తగాదాలు తీరి లాభం పొందుతారు. పరిచయాలు మరింత పెరుగుతాయి. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో మీ ఊహలు నిజం కాగల అవకాశం. కళారంగం వారికి సన్మానయోగం. వైద్యులు, సాంకేతిక వర్గాల కృషి ఎట్టకేలకు ఫలిస్తుంది. 5,6 తేదీల్లో అనుకోని ఖర్చులు. ఆరోగ్యసమస్యలు. నవగ్రహస్తోత్రాలు పఠిం చండి.
తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కొన్ని ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. కార్య క్రమాలలో అవాంతరాలు తొలగుతాయి. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులతో లాభాలు. ఉద్యోగాలలో సంతోషకరమైన సమాచారం అందు తుంది. పారిశ్రామికవర్గాలకు ఆహ్వానాలు రాగలవు. వ్యవసాయదారులకు మరిన్ని పెట్టుబడులు సమకూరతాయి. 7,8 తేదీలలో బంధు విరోధాలు. అనారోగ్యం. శ్రమాధిక్యం. విష్ణుధ్యానం చేయండి.
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ
కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. యత్న కార్యసిద్ధి. కీలక సమావేశాలలో పాల్గొంటారు. ఆస్తి వివాదాలు నేర్పుగా పరిష్కరించు కుంటారు. ఉద్యోగా లలో కీలకమార్పులు ఉండవచ్చు. రాజకీయ వర్గాలకు శ్రమానంతరం ఫలితం దక్కు తుంది. రచయితలకు కొత్త అవకాశాలు రావచ్చు. 4,5 తేదీల్లో అనుకోని ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం కొంత ఇబ్బందిగా మారతారు. ఈశ్వరారాధన మంచిది.
ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
అదనపు రాబడి లభించి ఉత్సాహంగా గడుపు తారు. వాహనయోగం. ఒక సంఘటన ఆకట్టు కుంటుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం చాలావరకూ తగ్గవచ్చు. రాజకీయవర్గాలకు శుభవార్తలు అందుతాయి. క్రీడాకారులు, సాంకేతిక వర్గాలకు అంచనాలు నిజమవుతాయి. 3,4 తేదీల్లో లేనిపోని ఖర్చులు. కుటుంబసమస్యలు. అన్నపూర్ణాష్టకం పఠించండి.
మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం , ధనిష్ఠ 1, 2 పాదాలు
ఆదాయం మెరుగుపడుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహకరిస్తారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు. ఉద్యోగులకు విధి నిర్వహణలో ప్రశాంతత. కళారంగం వారికి సంతోషకరమైన సమాచారం. రచయితలు, వైద్యులకు ముఖ్య సమాచారం. 6,7 తేదీల్లో ఖర్చులు. మానసిక ఆందోళన. స్వల్ప అనారోగ్యం. నవగ్రహస్తోత్రాలు పఠనం ఉత్తమం.
కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
అనుకున్న ఆదాయం సమకూరక ఇబ్బంది తప్పదు. దూరపు బంధువులను కలుసుకుంటారు. వ్యాపార లావాదేవీలు స్వల్పంగానే లాభిస్తాయి. ఉద్యోగులకు బాధ్యతలు మరింత పెరుగుతాయి. పారిశ్రామికవర్గాలకు సమస్యలు ఎదురవుతాయి. వ్యవసాయదారులు, వైద్యులకు కొన్ని ఇబ్బందులు తప్పవు. 5,6 తేదీలలో శుభవార్తలు. వాహనయోగం. దేవీఖడ్గమాల పఠించండి..
మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాల గురించి చర్చలు. ఇతరుల విషయాలలో అతిగా జోక్యం వద్దు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార లావాదేవీలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు చిక్కులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. క్రీడాకారులు, రచయితల యత్నాలు సఫలం. 8,9 తేదీలలో ఖర్చులు తప్పవు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. దుర్గాదేవిని స్మరించండి..