భాగ్యనగర్‌ : 2030 నాటికి లక్ష మంది అభాగ్య బాలికల అభ్యున్నతి లక్ష్యంగా సేవాభారతి ముందుకు సాగాలని తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్‌ బాబు అన్నారు. తెలంగాణ సేవాభారతి ఆధ్వర్యంలో రన్‌ ఫర్‌ గర్ల్‌ చైల్డ్‌ కార్యక్రమం ఫిబ్రవరి 2 న గచ్చిబౌలిలో జరిగింది. 21,10,5 కిలోమీటర్ల విభాగాల్లో 9వ సారి జరిగిన ఈ రన్‌ బాలికల సాధికారతకు సంబం ధించిన ‘కిషోరి వికాస్‌’ కార్యక్రమం పట్ల  ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఉద్దేశించినది.

ఈ సందర్భంగా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీధర్‌ బాబు మాట్లాడుతూ సమాజంలోని అభాగ్యుల అభ్యున్నతి కోసం సేవాభారతి చేస్తున్న కృషిని ప్రశంసించారు. ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాల్లో బాలికల సాధికారత కు ఉద్దేశించిన కార్యక్రమాల ప్రాముఖ్యతను ప్రత్యేకంగా ప్రస్తా వించారు. సేవాభారతి ఇప్పటికే 10,500 మంది బాలికల జీవితాలను ప్రభావితం చేసిందని మంత్రి కొనియాడారు. 2030 నాటికి లక్షమంది బాలికల జీవితాలను ప్రభావితం చేసే లక్ష్యంతో సేవాభారతి ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు.

రన్‌ఫర్‌ గర్ల్‌ చైల్డ్‌ వార్షిక కార్యక్రమం బాలికల అభ్యున్నతికి ఎంతగానో తోడ్పడుతోందని సేవాభారతి జాతీయ ప్రధాన కార్యదర్శి పరాగ్‌ అభయంకర్‌, తెలంగాణ అధ్యక్షుడు దుర్గారెడ్డి అన్నారు. ఫ్రీడమ్‌ ఆయిల్‌, గ్లోబల్డేటా, ఇన్ఫోసిస్‌, జీఈపీ, పాల్టెక్‌, బీడీఎల్‌, ఇన్నోవా సొల్యూషన్స్‌, ఫిల్టరేషన్‌ గ్రూప్‌, చబ్బ్‌, యూఎస్టీ గ్లోబల్‌, డిష్‌ టీవీ, ఈసీఐఎల్‌, ఎస్పీ ఎంసీఐఎల్‌, పెర్సెప్టివ్‌, కోటివిటి, పెగా సిస్టమ్స్‌, చబ్‌, టెక్వేవ్‌, సైలోటెక్‌, గ్లోబల్లాజిక్‌, టెక్వేదిక, సత్య నారాయణ జ్యువెలర్స్‌, స్ప్లాష్బీఐ, హ్యాపీ హైదరాబాద్‌, సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు, హెచ్సీయూ, రన్ఫిట్‌ ప్రో, ఐబ్రిడ్జ్‌, AADHAN TV, TAL రేడియో, ఐబ్రిడ్జ్‌ సంస్ధలు తమ వంతు కృషిగా సేవా భారతికి మద్దతునిచ్చాయన్నారు.  గచ్చిబౌలి స్టేడియం నుండి ప్రారంభమైన ఈ రన్‌లో కార్పొరేట్‌లు,వారి కుటుం బాలు, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు, విద్యార్థులను కలుపుకొని 11వేల మందికి పైగా ప్రజలు పాల్గొ న్నారు.

విజేతలకు మంత్రి శ్రీధర్‌ బాబు మెమోంటోలు అందజేశారు. శాసనసభ్యులు ఏ.గాంధీ, ఫ్రీడమ్‌ ఆయిల్‌ జి.యం. చేతన్‌, గ్లోబల్‌ డేటా డైరెక్టర్‌ రాజీవ్‌ గుప్తా, పాల్టెక్‌ ప్రతినిధి శ్యాంపాల్‌రెడ్డి రన్‌లో పాల్గొన్నవారిని అభినందించారు.ఇన్ఫోసిస్‌ సిఎస్‌ఆర్‌ హెడ్‌ వంశీపరంజ్యోతి, ఫిల్టరేషన్‌ గ్రూప్‌ సి.ఎఫ్‌.వో వినోద్‌, యూఎస్టీ గ్లోబల్‌  సి.ఎస్‌.ఆర్‌ హెడ్‌ తిరుమల్‌ విజయ్‌, తెలంగాణ ప్రాంత సంఘచాలక్‌ సుందర్‌రెడ్డి, దక్షిణ మధ్య క్షేత్ర సేవాప్రముఖ్‌ ఎక్కా చంద్రశేఖర్‌, తెలంగాణ సేవాభారతి సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE