ఇంగ్లండ్ ముస్లింలు మెజారిటీగా ఉండే దేశంగా మారిపోవడానికి సుదీర్ఘకాలం అవసరం లేదని అమెరికా ఇప్పటికే హెచ్చరించింది. ఫ్రాన్స్, ఇటలీ ఇంకొన్ని ఐరోపా దేశాలు ముస్లిం జనాభాతో సతమవుతున్నాయి. ఇటలీ ప్రధాని మెలోనీ తాను అధికారంలోకి వచ్చిన తరువాత అసలు మసీదుల నిర్మాణమే నిలిపివేయించారు. రాజ్యాంగానికి లోబడి ఉండని మౌల్వీలను ఓడ ఎక్కించేశారు. కానీ భారత్, బ్రిటన్ తదితర దేశాల ఉదారవాదుల మాదిరిగానే జపాన్ ఉదారవాదులకి కూడా జ్ఞానోదయం కావడం లేదు. బ్రిటన్ ముస్లిం మెజారిటీ దేశంగా మారడాన్ని ప్రపంచం వేరే విధంగా చూస్తున్నది. బ్రిటన్ వంటి అణ్వాయుధ సామర్ధ్యం కలిగిన దేశం ముస్లింల చేతికి వెళ్లడం అంటే, అణుశక్తి సామర్ధ్యం ఉన్న దేశం ముస్లిం మతోన్మాదుల చేతికి వెళ్లడమేనని వ్యాఖ్యానిస్తున్నారు. ఇక జపాన్- ఒకప్పుడు అణుబాంబుతో సర్వనాశనం అయిన దేశం. ఇప్పుడు ముస్లిం సమస్య ద్వారా మరొకసారి అంతే తీవ్రమైన వినాశనాన్ని ఎదుర్కొం టున్నది.
జపాన్ ఒక కీలక సమస్యను ఎదుర్కొంటున్నది. ఐరోపా దేశంలో సామాజిక సమస్యలు, మతోన్మాద సమస్యలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఇదంతా ఒక వర్గంతోనే కావడం విశేషం. వారే ముస్లింలు. మైనారిటీలుగా ఉన్నప్పటికీ మతాచారాల పట్ల, జీవన విధానం పట్ల మెజారిటీలను శాసించాలన్న ఒక విధానమే ఇందుకు కారణం. జపాన్‌లో ప్రస్తుతం ముస్లింలు ఎదుర్కొంటున్నది ఈ కోణంలోనిదే. ఆ ఆసియా దేశంలో ప్రస్తుతం ముస్లిం జనాభా శరవేగంగా పెరిగిపోతున్నది. దీనితో మృతదేహాలకు అంతిమ సంస్కారం విషయంలో జపాన్ సమాజంతో సంఘర్షణ కూడా పెరిగింది. ముస్లింల మతాచారాన్ని జపాన్ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
తమ వర్గంలో మరణించిన వారికి ఇస్లామిక్ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు చేయడం ప్రాథమిక హక్కు అంటున్నది అక్కడి ఆ వర్గం. అయితే వారి ఆచారాలను అనుమతిస్తే అది ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుందని జపాన్ వారి వాదన. ముస్లిం ఆచారాల ప్రకారం అంత్యక్రియలకు ప్రత్యేక మైన స్థలం ఉండాలి. అది కేవలం వారికే పరిమితం. అలాంటి స్థలాలు, అంటే ఖబరస్తాన్‌ల ఏర్పాటుకు జరుగుతున్న ప్రయత్నమే ఇప్పుడు అక్కడ సాంఘిక సమస్యగా పరిణమించింది. ప్రభుత్వం ఇందుకు సుముఖంగా ఉన్నా జపాన్ సమాజం పూర్తి వ్యతిరేకంగా ఉంది.
కైయూష్ ద్వీపంలోని హిజీ పట్టణంలో తమ వర్గానికి ఒక శ్మశానవాటిక మంజూరైందని అక్కడి బెప్పు ముస్లిం సంఘం భావించింది. అందుకు అనువైన పరిస్థితులు కూడా కనిపించాయి. అంటే ప్రభుత్వాలు సరేనన్నాయన్న మాట. కానీ స్థానికుల ప్రతిఘటన, సామాజిక మాధ్యమాలలో వచ్చిన వార్తల వల్ల అది అటకెక్కింది. మియాగి ప్రాంత గవర్నర్ యోషిహిరో మురాయి ముస్లింల సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేశాడు. మన దేశంలో సెక్యులరిస్టులు, ఉదారవాదుల వంటి వాడే యోషిహిరో. ముస్లింలు ఎదుర్కొంటున్న సమస్య పట్ల ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించాల్సి ఉందని ప్రకటించాడు. దేశంలో బహుళ సంస్కృతిని రక్షించుకోవాలని హితవు పలికాడు. ఈశాన్య జపాన్ ప్రాంతంలో తొహోకులో ఉండే ముస్లింలు తనను ఈ సమస్య పరిష్కరించ వలసిందిగా తనను కోరారని,‘తాను ఎన్ని విమర్శలకు గురైనా, ఎవరు ఏం విమర్శించినా ముస్లిం సోదరుల సమస్యను పరిష్కరించడానికి’ తాను శతథా ప్రయత్నిస్తానని ఆ గవర్నర్ సెలవిచ్చాడు.
జపాన్‌లో ఇటీవల మారిన జనాభా సమీకరణ లను ఒకసారి చూడాలి. 2010లో జపాన్‌లో ముస్లిం జనాభా 1,10,000. ఒక పుష్కరానికల్లా అంటే 2023కి ఆ జనాభా 3,50,000కి చేరుకుంది. ఇటీవలి కాలంలో విదేశీయులకి జపాన్ కల్పిస్తున్న అనేక సౌకర్యాలే ఇందుకు కారణం. ఆ పెరిగిన జనాభాకు తగ్గట్టే మసీదులు కూడా పెరిగాయి. 1980లో నాలుగు మసీదులు జపాన్‌లో ఉండేవి. 2024 సంవత్సరానికి అవి 149 కి పెరిగాయి. కానీ జనాభాకు తగ్గట్టు స్మశాన వాటికలు పెరగలేదు. కేవలం 10 నగరాలలోనే ముస్లింలకు ప్రత్యేక స్మశానవాటికలు ఉన్నాయి. తమకు స్మశానవాటికలు లేకుండా చేయడంలో సామాజిక మాధ్యమాలు ప్రధాన పాత్ర అని బెప్పు ముస్లిం సంఘం నాయకుడు మహమ్మద్ తాహిర్ అబ్బాస్ ఆరోపిస్తున్నాడు. ప్రజారోగ్యం గురించి, స్థానిక సంప్రదాయల గురించి అపోహలు సృష్టిస్తున్నారని అతడు చెబుతున్నాడు. ఎవరు ఏమనుకున్నా, ముస్లింలకు స్మశాన వాటికలు సాధించి తీరుతామని, మతాచారానికి అనుగుణంగా అంత్యక్రియలు జరిపించుకోవడం తమ హక్కు అని అతడు అంటున్నాడు.
– జాగృతి డెస్క్