దేశమంతా ఇక ఒకే ప్రామాణిక సమయాన్ని నిర్దేశిస్తూ కేంద్రం తాజాగా నిబంధనలు విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో ఒకే సమయాన్ని పాటిస్తున్నా ఆచరణలో ఇబ్బందులు ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో ముందుగానే సూర్యోదయం, ఆలస్యంగా సూర్యాస్తమయం ఉండటంతోనే ఆ సమస్యలు వస్తున్నాయి. దేశంలోని తూర్పు, పశ్చిమ ప్రాంతాల మధ్య దాదాపు గంట తేడా ఉంది. అమెరికాకు ఆరు టైమ్‌ ‌జోన్స్ ఉన్నప్పుడు మన దేశానికి రెండు టైమ్స్ ‌జోన్స్ ఎం‌దుకు ఉండరాదనే చర్చ మరోసారి మొదలైంది. ఒకటికన్నా ఎక్కువ టైమ్‌ ‌జోన్స్ ఉం‌టే లాభనష్టాలపై ఇప్పటికే అనేక అధ్యయనాలు జరిగాయి.

వన్‌ ‌నేషన్‌.. ఈ ‌మధ్య ఎక్కువగా వినిపిస్తున్న నినాదం. వన్‌ ఎలక్షన్‌ ‌పేరుతో లోక్‌సభకు, అసెంబ్లీ లకు, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేం దుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మతాలతో సంబంధం లేకుండా ఉమ్మడి పౌరస్మతిని తీసుకొచ్చే దిశగా చర్చ మొదలు పెట్టింది.. ఇదే సమయంలో ఒకే దేశం ఒకే సమయం పేరుతో అన్ని రంగాల్లో భారత ప్రామాణిక సమయం (ఐఎస్‌టీ) వినియోగాన్ని తప్పనిసరి చేస్తూ కేంద్రం ముసాయిదా నిబంధనలు రూపొందించింది. దీనిపై ప్రజలు తమ అభిప్రా యాలు చెప్పడానికి విధించిన గడువు ఫిబ్రవరి 14 కూడా ముగిసింది. ఇందుకు నిబంధనలు, 2024 లోనే చట్టపరమైన విధివిధానాలు ఏర్పాటు చేశారు. ఇవి అమల్లోకి వస్తే.. చట్ట, పాలన, వాణిజ్య, ఆర్థిక రంగాలతో పాటు అధికారిక పత్రాల్లోనూ ఇక ఐఎస్‌టీ తప్పనిసరి. ఐఎస్‌టీ కాకుండా ఇతర టైమ్‌ ‌జోన్లను ప్రస్తావించడం నిషేధం. అయితే అంతరిక్షం, సముద్రయానం, శాస్త్రీయ పరిశోధన రంగాలకు మినహాయింపునిచ్చింది కేంద్రం.

ఒకే దేశం ఒకే సమయం అనే నిబంధన వినడానికి బాగానే ఉంది. జాతీయ ఐక్యతా స్ఫూర్తి ప్రతిబింబిస్తుంది… కానీ ఆచరణలో సమస్యలు చాలా ఉన్నాయనేది వాస్తవం.. విశాలమైన భారతదేశంలో రాష్ట్రాలు, ప్రాంతాల మధ్య భౌగోళికంగా చాలా దూరాలు ఉన్నాయి.. దేశమంతా ఒకే సమయాన్ని అనుసరించడంతో కొన్ని ప్రాంతాల ప్రజలు ఇబ్బం దులు ఎదుర్కోక తప్పడం లేదు.. ఇది ఎలాగో కాస్త లోతుల్లోకి వెళ్లి పరిశీలిద్దాం..

హైదరాబాద్‌లో సూర్యోదయం ఉదయం 5.45 నుంచి 6 గంటల ప్రాంతంలో జరగుతుంది. అదే విశాఖలో ఉదయం 5.15 నుంచి ఐదున్నర గంటల మధ్య అవుతుంది. దాదాపు రెండు నగరాల మధ్య దాదాపు పావుగంట తేడా ఉంటుంది. ఎండాకాలం, శీతాకాలంలో సూర్యోదయ, సూర్యాస్తమయ వేళలు మారినా రెండు ప్రాంతాల మధ్య పావు గంట తేడా మాత్రం అలాగే కొనసాగుతుంది. ఇక ఈశాన్య రాష్ట్రాల పరిస్థితి ఎలా ఉందో చూడండి.. ఇక తూర్పు, పశ్చిమ రాష్ట్రాల మధ్య సమయంలో చాలా తేడా వచ్చేస్తోంది. భారతదేశంలో తొలి సూర్యోదయం అరుణాచల్‌ ‌ప్రదేశ్‌ ‌రాష్ట్రంలోని అంజా జిల్లాలో సముద్ర మట్టానికి 1,240 మీటర్ల ఎత్తులో ఉన్న డోంగ్‌ ‌గ్రామంలో అవుతుంది. అక్కడ వేసవిలో ఇక్కడ వేసవిలో ఉదయం 4 గంటలకే సూర్యుడు కనిపిస్తాడు. సాయంత్రం 4.30కే సూర్యాస్తమయం అవుతుంది. శీతాకాలంలో నాలుగింటికే చీకటి పడటంతో కార్యాలయాలు, విద్యాసంస్థల్లో లైట్లు వెలిగించి పనులు చేసుకుంటారు.. ఈశాన్య రాష్ట్రాలు అన్నింటిలో దాదాపు ఇదే పరిస్థితిని గమనించవచ్చు..

ఈశాన్య భారతంలో సమస్యలు

మన దేశంలోని తూర్పు నుంచి పడమర ప్రాంతాల మధ్య అంటే.. గుజరాత్‌లో 68 0 7’E జు నుండి అరుణాచల్‌లో 97025’E వరకు 2933 వేల కిలో మీటర్లు దూరం ఉంటుంది. పశ్చిమాన రాన్‌ ఆఫ్‌ ‌కచ్‌తో పోలిస్తే సూర్యుడు తూర్పు సరిహద్దులో దాదాపు రెండు గంటల ముందుగా ఉదయిస్తాడు. అహ్మదాబాద్‌లో ఉదయం 6 గంటలు అయితే ఈటానగర్‌ ‌వాసులకు అది 8 గంటలకు సమానం. దేశ రాజధాని వాసులకు 7 గంటలతో సమానం.

దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఈశాన్య రాష్ట్రాల్లో సూర్యోదయం, అస్తమయాలు కాస్త ముందుగానే పూర్తయినా వారు ప్రామాణిక భారత సమయం ఇండియన్‌ ‌స్టాండర్డ్ ‌టైమ్‌ IST ‌ప్రకారం తమ దైనందిన కార్యకలాపాలు కొనసాగించక తప్పడంలేదు. దీని ప్రభావం జీవక్రియలపై పడుతోంది. వారు దేశంలోని ఇతర ప్రాంతాలకన్నా ముందే లేచినా IST ప్రకారం ఆలస్యంగా విధులకు హాజరవుతూ, ఆలస్యంగా నిద్ర పోతున్నారు. అక్కడ పిల్లలకు నిద్ర కరువవుతోంది. సూర్యాస్తమయం ఆలస్యంగా జరిగే ప్రాంతాల్లో పిల్లలు ఆలస్యంగా పడుకుంటారు. కానీ వీరు ఉదయాన్నే త్వరగా నిద్ర లేవాల్సి వస్తుంది. ఈ ప్రభావం వారి చదువులపై కూడా పడుతోందని చెబుతున్నారు. ఈశాన్యంలోని చాలా మంది ప్రజలు దాదాపు భోజన సమయానికి అల్పాహారం తీసుకుంటున్నారు.

అయితే అసోంలోని తేయాకు తోటల్లో ప్రత్యేక సమయాన్ని పాటిస్తున్నారు. త్రి హిమంత బిశ్వ శర్మ ఈ డిమాండ్‌ను పునరుద్ఘాటించారు. ఈశాన్య ప్రాంతాలకు ప్రత్యేక టైమ్‌ ‌జోన్‌ అవసరముందని స్పష్టం చేశారు. ఈ టైమ్‌ ‌జోన్‌ ‌భారత్‌ ‌ప్రధాన భూభాగం కంటే రెండు గంటలు ముందుకు ఉంటే.. చాలా విద్యుత్‌ ఆదా అవుతుందని, పనిచేసే సామర్థ్యం కూడా పెరుగుతుందని హిమంత తెలిపారు. ప్రజల ఆరోగ్యంపై కూడా దీని ప్రదేశమంతా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తే.. తేయాకు తోటల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే పనిచేస్తారు. ఈ విధానాన్ని చైబగన్‌ ‌టైమ్‌ (‌టీ గార్డెన్‌ ‌టైమ్‌) అని పిలుస్తుంటారు. తేయాకు ఉత్పత్తిని పెంచడం కోసం బ్రిటిష్‌ ‌వారు ఈ విధానాన్ని మొదలు పెట్టారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా ఇదే విధానం కొనసాగుతోంది.

ఇండియన్‌ ‌స్టాండర్డ్ ‌టైమ్‌ ‌కారణంగా ఏర్పడుతున్న సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఈశాన్య రాష్ట్రాలకు వేరే టైమ్‌ ‌జోన్‌ ఉం‌డాలనే డిమాండ్‌ ‌చాలా కాలంగా ఉంది. మూడేళ్ల క్రితం అసోం ముఖ్యమంభావం సానుకూలంగా ఉంటుందని, జీవ గడియారంతో మనం అనుసరించే టైమ్‌ ‌కూడా కలుస్తుంది అని వివరించారారు. సూర్యరశ్మి అందుబాటులో ఉండే సమయాన్ని కోల్పోవడం, విద్యుత్‌ ‌వినియోగం పెరగడం లాంటి కారణాలను చూపుతూ హిమంత బిశ్వ శర్మ ప్రత్యేక టైమ్‌ ‌జోన్‌ అం‌శాన్ని కేంద్రం దృష్టికి తీసుకొచ్చారు. IST అరగంట ముందుకు సాగడం వల్ల ప్రతి సంవత్సరం 2.7 బిలియన్‌ ‌యూనిట్ల విద్యుత్‌ ఆదా అవుతుందని ఒక అంచనా.

గతంలో అరుణాచల్‌ ‌ముఖ్యమంత్రి పెమా ఖండూ ఇదే డిమాండ్‌ ‌వినిపించారు. ‘‘మేం ఉదయం నాలుగు గంటలకే నిద్ర లేస్తాం. కానీ మా ఆఫీసులు పది గంటలకు తెరచుకుంటాయి. ఈ మధ్య చాలా సమయం వృథాగా పోతోంది’’ అని వ్యాఖ్యా నించారు. ఈశాన్య భారత రాష్ట్రాలకు +6 UTC ప్రకారం అరగంట ముందు ఉండే టైమ్‌ ‌జోన్‌ ‌కావాలని సూచించారు.

దేశంలో రెండు టైమ్‌ ‌జోన్లు ఉంటే రెండు సమయ మండలాల మధ్య సరిహద్దు రేఖ 89.520E (అసోం-పశ్చిమ బెంగాల్‌ ‌మధ్య) ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉంది. ఈ రేఖకు పశ్చిమాన ఉన్న రాష్ట్రాలు IST-I (UTC+5:30)ని అనుసరిస్తాయి, ఈ రేఖకు తూర్పున ఉన్న రాష్ట్రాలు (అస్సాం, మేఘాలయ, నాగాలాండ్‌, అరుణాచల్‌ ‌ప్రదేశ్‌, ‌మణిపూర్‌, ‌మిజోరం, త్రిపుర, అండమాన్‌ – ‌నికోబార్‌ ‌దీవులు IST-II (UTC+6:00)ని అనుసరిస్తాయి.

కమిటీల అధ్యయనం

1980వ దశకపు చివరిలో ఒక పరిశోధకుల బృందం విద్యుచ్చక్తిని ఆదాచేయటానికి దేశాన్ని రెండు లేదా మూడు కాలాంశాలుగా విభజించాలని ప్రతిపాదించారు. వీరి ప్రతిపాదనలో బ్రిటిషుపాలన కాలంలో ఉన్న రెండు కాలాంశాల పద్ధతిని తిరిగి ప్రవేశపెట్టడం కూడా ఒకటి. అయితే ఈ ప్రతి పాదనలు అమలుకు నోచలేదు.

2001లో కేంద్ర ప్రభుత్వం శాస్త్ర సాంకేతిక శాఖ ఆధ్వర్యంలో అదనపు టైమ్‌ ‌జోన్స్ ‌పగలు సమయం ఆదాను అధ్యయనం చేసేందుకు నలుగురు సభ్యుల సంఘాన్ని నియమించింది. ఈ సంఘం చేసిన సూచనలకు కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి కపిల్‌ ‌సిబాల్‌ 2004‌లో భారత పార్లమెంటులో ప్రవేశ పెట్టారు. ఈ కమిటీ ఇప్పుడున్న టైమ్‌ ‌జోన్‌లో మార్పులు అవసరం లేదని సూచించింది. 2006లో ప్రణాళికా సంఘం దేశాన్ని రెండు సమయ మండలా లుగా విభజించాలని సిఫార్సు చేసింది. 2009లో సైన్స్ అం‌డ్‌ ‌టెక్నాలజీ విభాగంలోని హైలెవల్‌ ‌కమిటీ కూడా ఈశాన్య ప్రాంతంలోని రాష్ట్రాలకు ఒక గంట ముందుకు ఉంటే మేలని సూచించింది. 2018లో భారత ప్రామాణిక సమయాన్ని నిర్వహించే సీఎస్‌ఐఆర్‌-ఎన్‌ఐపీఎల్‌ ‌రెండు సమయ మండలాల ఆవశ్యకతను వివరిస్తూ ఒక పరిశోధనా కథనాన్ని ప్రచురించింది. భారత కాలమానం కంటే ఒక గంట ఇది ముందుకు ఉంటే, అక్కడి సూర్యరశ్మిని మెరుగ్గా ఉపయోగించుకోవచ్చని పేర్కొంది. భారత్‌లోనూ రెండు టైమ్‌ ‌జోన్లు ఏర్పాటు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ కొందరు గువాహటి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం కూడా దాఖలు చేశారు. అయితే కోర్టు దాన్ని తిరస్కరించింది.

రెండు టైమ్‌ ‌జోన్లతో లాభాలేంటి?

1980 ప్రాంతంలో టైమ్‌ ‌జోన్స్ ‌మీద ఒక అధ్యయనం జరిగింది.. రెండు టైమ్‌ ‌జోన్స్ ఏర్పాటు చేస్తే ఈశాన్య ప్రాంతాలను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావచ్చని ఎన్‌ఐఏఎస్‌ ‌సూచించింది. ప్రజలు సూర్యకాంతి ఆధారంగా తమ ప్రణాళికను అమలు చేసుకోగలుగు తారు. వారి దేహచక్రం మరింత మెరుగ్గా ఉంటుంది. శ్రామికశక్తి వినియోగం పెరుగుతుంది. ఐఎస్‌టీని అరగంట ముందుకు తేస్తే ప్రతి సంవత్సరం 2.7 బిలియన్‌ ‌యూనిట్ల విద్యుత్‌ ఆదా అవుతుంది. సంవత్సరానికి రూ.1,000 కోట్లు ఆదా చేయవచ్చు. విద్యుత్‌ ‌కొరతతో బాధపడుతున్న భారత ఆర్థిక వ్యవస్థకు ఇది చాలా కీలకం.

విద్యుత్తును ఆదా చేయగలిగితే పర్యావరణ సమస్యలు తగ్గుతాయి. కార్బన్‌ ‌డయాక్సైడ్‌ ‌కొంత తగ్గుంది. వాతావరణ మార్పులను ఎదుర్కోవాలనే భారత్‌ ‌సంకల్పం పెరుగుతుంది. రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయి. మహిళల భద్రత పెరుగుతుంది. పగలు సమయం ప్రకారం కార్యాలయాలు నడిస్తే ఉద్యోగుల ఆహారం, నిద్ర, పని వేళలు మెరుగై ఆరోగ్యంగా ఉంటారు. విద్యార్థులు సకాలంలో నిద్రాహారాలను తీసుకోడం ద్వారా మరింత ఆరోగ్యంగా ఉంటారు. వారి చదువులు మెరుగై మంచి ఫలితాలను సాధిస్తారు.

ప్రతికూల పరిస్థితులు

ఒకటికన్నా ఎక్కువ టైమ్‌ ‌జోన్స్ అం‌టే కొన్ని ప్రతికూల అంశాలు కూడా ఎదురవుతాయి. దేశ వ్యాప్తంగా వేర్వేరు టైమ్‌ ‌జోన్స్ ఉం‌టే కార్యాలయాలు, బ్యాంకుల పనిలో గందరగోళం ఏర్పడుతుందనే వాదన ఉంది. రైలు సమయాలను టైమ్‌ ‌జోన్లకు అనుగుణం నడిపిస్తే సరిగ్గా అర్థం చేసుకోకపోతే చిక్కులు పెరుగుతాయి. రైల్వే ట్రాఫిక్‌లో మార్పులతో ప్రమాదాలు తరచుగా జరిగే అవకాశం ఉంది. ప్రజలు తరచూ గడియారాలు సెట్‌ ‌చేసుకోవడం కూడా కష్టమే. టైమ్‌ ‌జోన్లకు అటూ ఇటూ తిరిగేవారు పదే పదే టైమ్‌ ‌మార్చుకుంటూ ఉండాలి. నిరక్ష రాస్యులు మరిన్ని ఇబ్బందులు పడక తప్పదు

మన దేశంలో అనేక ప్రాంతాలు, మతం, కులం, జాతి, భాష ఆధారంగా వేర్పాటువాద సమస్యలు పెరుగుతున్నాయి. రెండు టైమ్‌ ‌జోన్స్ ‌వస్తే ఈశాన్య రాష్ట్రాల ప్రజలు మిగతా దేశ ప్రజలతో పోల్చుకొని తాము భిన్నమైన వారమని అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది. ఇప్పటికే అక్కడి రాష్ట్రాల్లో వేర్పాటు వాద శక్తులు దేశ సమైక్యత, సార్వభౌమాధికారాన్ని ధిక్కరిస్తున్నాయి.

మరి దీనికి ప్రత్యామ్నాయం ఏమిటి? ప్రస్తుత భారత ప్రామాణిక సమయాన్ని (ఐఎస్‌టీ)ని అరగంట ముందుకు మారిస్తే కొన్ని పరిస్థితులు సర్దుకునే అవకాశం ఉందని సూచిస్తున్నారు. చైనా, కిర్గిస్తాన్‌, ‌మలేషియా, సింగపూర్‌, ‌దక్షిణ కొరియా దేశాలు తమ గడియారాలను కాస్త ముందుకు జరపడంతో అనేక రకాలుగా లబ్దిపొదాయి.

(వచ్చేవారం టైమ్‌జోన్‌ అం‌టే ఏమిటి?)

క్రాంతిదేవ్‌ ‌మిత్ర

సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE