ఆహార అవసరాలు తీరడానికీ, గ్రామ వికాసానికీ, గ్రామీణ యువత ఉపాధికి, దేశ ఆర్థికాభివృద్ధికీ మూలం వ్యవసాయరంగమే. కాబట్టే ఆ రంగానికి 2025-26 బడ్జెట్‌లో కేంద్రం విశేష ప్రాధాన్యం ఇవ్వడం ముదావహం. ఈ మద్దతు రైతుల ఆర్థిక పరిపుష్టికి, వ్యవసాయోత్పత్తుల పెంపునకు, వాణిజ్యపరంగా ఉత్పత్తులు పెంచడానికి, ఇతర దేశాల ఆహార అవసరాలను తీర్చేందుకు కూడా దోహదం చేస్తుంది. ఎక్కువకాలం సూర్యరశ్మి, ఇతర వాతావరణ పరిస్థితులతో రకరకాల పంటలు పండించేందుకు అనుకూలమైన దేశం మన భారత్‌. ఇన్ని వనరులు ఉన్నందునే కరోనా కాలంలోనూ మన ఆహార అవసరాలు తీర్చడమే కాక, ఇతర దేశాల అవసరాలను కూడా సాయపడింది. వ్యవసాయాభివృద్ధి కారణంగానే మన ఆర్ధిక ప్రగతి కుంటుపడకుండా గినంత జరిగింది.

ఈ బడ్జెట్‌లో రూ. 1,29,280 కోట్ల కేటాయింపులతో కార్యశీలత కలిగిన ఆరు పథకాలకు చోటు కల్పించారు. ఇది గత ఏడాది కేటాయింపుల కంటే మిన్నగానే ఉన్నప్పటికీ, 2024-25 రివైజ్డ్ ‌బడ్జెట్‌లో సూచించిన గణాంకాల కన్నా (రూ.1,31,195.27 కోట్లు) తక్కువే. అంటే రూ.390.05 కోట్లు తక్కువ. కాబట్టి కొన్ని రంగాలకు కేటాయింపులు తగ్గించినట్టే. ఉదాహరణకి గత ఏడాదితో పోలిస్తే ఈ పథకాలకు (ఫసల్‌ ‌బీమా యోజన, కేంద్ర పథకాలు, ఎరువుల మీద) కొంత తగ్గింపు ఉన్నప్పటికీ ఈ బడ్జెట్‌లో ప్రతిపాదించిన ఆరు పథకాలు, వ్యవసాయ పరిశోధనల కోసం పెంచిన కేటాయింపులు కనిపిస్తున్నాయి. ఇదే ప్రభుత్వం ముందు చూపునకు మంచి నిదర్శనం. ఈ కొత్త పథకాలు, గతంలోని ముఖ్యపథకాల గురించి క్లుప్తంగా తెలుసుకోవాలి.

అధికోత్పత్తికి ధనధాన్య కృషి యోజన

అధికోత్పత్తిని ఇవ్వగలిగి, ఆయా వాతావరణ పరిస్థితులకు అనువైన నూతన వంగడాలు, తగినంత సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నప్పటికీ ఉత్పాదకత ఇంకా ఆశించిన స్థాయిలో జరగడం లేదు. వరి, గోధుమతో పాటు చిరుధాన్యాలు, అపరాలు, పప్పు ధాన్యాలు ప్రస్తుతం దేశంలోని వంద జిల్లాలలో పండిస్తున్నారు. తగిన వనరులు, సాంకేతిక పరిజ్ఞానం రైతులకు అందుబాటులోకి తెచ్చి ఈ పంటలన్నిటి ఉత్పత్తిని గణనీయంగా పెంచడానికి ప్రయత్నం జరుగుతుందని ఆశించవచ్చు. ఇందుకోసం ప్రదర్శన క్షేత్రాలు, పంటల పర్యవేక్షణ, రైతులతో ముఖాముఖీ కార్యక్రమాలు, ఇతర ప్రచార మాధ్యమాలను ఉపయోగించుకుని ఆయా పంటల విస్తీర్ణం, ఉత్పాదకత పెంచే ప్రయత్నం జరుగుతుంది. రాష్ట్రాల సహకారం కూడా తీసుకుని కేంద్ర నిధులతో పంటల వైవిధ్యాన్ని పెంచి సాధారణ రైతుకు మేలు చేయాలన్న తలంపు కనిపిస్తుంది.

నీటివనరులు ఉన్న జిల్లాలలో పలు పంటలు, ముఖ్యంగా వరి, గోధుమ ఉత్పత్తిని ప్రోత్సహించేం దుకు ప్రభుత్వం కనీస మద్దతు ధర కొనుగోలు చేసేది. దీనితో రైతులకు నికరంగా కొంత మిగులుతుంది. కాబట్టి అలాంటి పంటల వైపే రైతులు మొగ్గు చూపేవారు. మొక్కజొన్న, చిరుధాన్యలు, పప్పు ధాన్యాలు, అపరాలు అధిక వర్షాలు లేదా వర్షాభావ పరిస్థితుల వల్ల ఉత్పాదకత, ఉత్పత్తి తక్కువ. ఇలా తక్కువ ఉత్పత్తి ఉన్నప్పటికి ప్రభుత్వం నుండి సరైన మద్దతు ధర దక్కడం లేదు. దీనితో పలు సందర్భాలలో వ్యవసాయోత్పత్తులను రైతులు మార్కెట్‌లో తక్కువ ధరకే అమ్ముకోవలసిన పరిస్థితి ఏర్పడుతున్నది. అందుకే ఈ పంటల సాగు పట్ల రైతులు విముఖంగా ఉంటున్నారు. నిజానికి ఈ పంటలు వైవిధ్యం, భూసార పరిరక్షణకు, వాతావరణ సమతుల్యతకు దోహదపడుతు, రైతుకు ఆదాయం కూడా తెచ్చి పెట్టేవే. కానీ ప్రోత్సాహం లేదు. అదే ఈ బడ్జెట్‌లో రూ. 1,29,280 కోట్ల కేటాయింపులతో కార్యశీలత కలిగిన ఆరు పథకాలకు చోటు కల్పించారు. ఇది గత ఏడాది కేటాయింపుల కంటే మిన్నగానే ఉన్నప్పటికీ, 2024-25 రివైజ్డ్ ‌బడ్జెట్‌లో సూచించిన గణాంకాల కన్నా (రూ.1,31,195.27 కోట్లు) తక్కువే. అంటే రూ.390.05 కోట్లు తక్కువ. కాబట్టి కొన్ని రంగాలకు కేటాయింపులు తగ్గించినట్టే. ఉదాహరణకి గత ఏడాదితో పోలిస్తే ఈ పథకాలకు (ఫసల్‌ ‌బీమా యోజన, కేంద్ర పథకాలు, ఎరువుల మీద) కొంత తగ్గింపు ఉన్నప్పటికీ ఈ బడ్జెట్‌లో ప్రతిపాదించిన ఆరు పథకాలు, వ్యవసాయ పరిశోధనల కోసం పెంచిన కేటాయింపులు కనిపిస్తున్నాయి. ఇదే ప్రభుత్వం ముందు చూపునకు మంచి నిదర్శనం. ఈ కొత్త పథకాలు, గతంలోని ముఖ్యపథకాల గురించి క్లుప్తంగా తెలుసుకోవాలి.

అధికోత్పత్తికి ధనధాన్య కృషి యోజన

అధికోత్పత్తిని ఇవ్వగలిగి, ఆయా వాతావరణ పరిస్థితులకు అనువైన నూతన వంగడాలు, తగినంత సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నప్పటికీ ఉత్పాదకత ఇంకా ఆశించిన స్థాయిలో జరగడం లేదు. వరి, గోధుమతో పాటు చిరుధాన్యాలు, అపరాలు, పప్పు ధాన్యాలు ప్రస్తుతం దేశంలోని వంద జిల్లాలలో పండిస్తున్నారు. తగిన వనరులు, సాంకేతిక పరిజ్ఞానం రైతులకు అందుబాటులోకి తెచ్చి ఈ పంటలన్నిటి ఉత్పత్తిని గణనీయంగా పెంచడానికి ప్రయత్నం జరుగుతుందని ఆశించవచ్చు. ఇందుకోసం ప్రదర్శన క్షేత్రాలు, పంటల పర్యవేక్షణ, రైతులతో ముఖాముఖీ కార్యక్రమాలు, ఇతర ప్రచార మాధ్యమాలను ఉపయోగించుకుని ఆయా పంటల విస్తీర్ణం, ఉత్పాదకత పెంచే ప్రయత్నం జరుగుతుంది. రాష్ట్రాల సహకారం కూడా తీసుకుని కేంద్ర నిధులతో పంటల వైవిధ్యాన్ని పెంచి సాధారణ రైతుకు మేలు చేయాలన్న తలంపు కనిపిస్తుంది.

నీటివనరులు ఉన్న జిల్లాలలో పలు పంటలు, ముఖ్యంగా వరి, గోధుమ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కనీస మద్దతు ధర కొనుగోలు చేసేది. దీనితో రైతులకు నికరంగా కొంత మిగులుతుంది. కాబట్టి అలాంటి పంటల వైపే రైతులు మొగ్గు చూపేవారు. మొక్కజొన్న, చిరుధాన్యలు, పప్పుధాన్యాలు, అపరాలు అధిక వర్షాలు లేదా వర్షాభావ పరిస్థితుల వల్ల ఉత్పాదకత, ఉత్పత్తి తక్కువ. ఇలా తక్కువ ఉత్పత్తి ఉన్నప్పటికి ప్రభుత్వం నుండి సరైన మద్దతు ధర దక్కడం లేదు. దీనితో పలు సందర్భాలలో వ్యవసాయోత్పత్తులను రైతులు మార్కెట్‌లో తక్కువ ధరకే అమ్ముకోవలసిన పరిస్థితి ఏర్పడుతున్నది. అందుకే ఈ పంటల సాగు పట్ల రైతులు విముఖంగా ఉంటున్నారు. నిజానికి ఈ పంటలు వైవిధ్యం, భూసార పరిరక్షణకు, వాతావరణ సమతుల్యతకు దోహదపడుతు, రైతుకు ఆదాయం కూడా తెచ్చి పెట్టేవే. కానీ ప్రోత్సాహం లేదు. అదే ఉంటే రైతులు ఈ పంటల వైపు కూడా మొగ్గు చూపుతారు. పరిశోధనలతో ముడిపడి ఉన్న ప్రోత్సాహక పథకాన్ని అమలు చేస్తున్నట్టు కేంద్ర ఆర్థికమంత్రి ప్రకటించారు. మారుతున్న వాతావరణ పరిస్థితులకు తట్టుకునే విధంగా, నూతన వంగడా లను రూపొందించేందుకు, వాటి సాగుకు అనువైన సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించేందుకు అవసర మైన పరిశోధనల విషయంలో ప్రకృతి వ్యవసాయానికి పెంచిన స్థాయిలో పెంచలేదు. గతంలో కన్నా తక్కువే కూడా. అయినా అధిక పోషక, చీడపీడలను తట్టుకునే నూతన వంగడాల రూపకల్పనకు శాస్త్రవేత్తలు ఇతోధికంగా కృషి చేయాలి. ఇప్పటికే సిద్ధమైన (వంద ఆవిష్కరణలు) వంగడాల సాగును ప్రోత్సహించాలి. ఈ పంటల విస్తీర్ణం పెంచేందుకు శ్రమించాలి. స్థానిక, ఇతర ప్రాంత అవసరాలకు తగినట్టు సాగు చేసే విధంగా చూడాలి. ప్రభుత్వం కూడా ఈ పంటలను గిట్టుబాటు ధరతో కొనుగోలు చేస్తే ఆశించిన ఫలితాలు ఉంటాయని గట్టిగా చెప్పవచ్చు.

పప్పుధాన్యాల ఉత్పత్తికి ఆత్మనిర్భరత మిషన్‌

‌పప్పుధాన్యాలు, అపరాల ఉత్పత్తి కొంతవరకు పెరిగింది. అయినా మన ప్రజల అవసరాల మేరకు స్వయం సమృద్ధిని సాధించవలసిన అవసరం మాత్రం ఉంది. ఈ లోటును భర్తీ చేయడానికే ఆత్మనిర్భరత మిషన్‌ ‌కింద ప్రత్యేకంగా రూ.1000 కోట్లు కేటాయించారు. ఈ పథకం కింద మినుము, పెసర వంటి పప్పుధాన్యాలను సాగును ఇతోధికంగా ప్రోత్సహించి, ప్రాసెసింగ్‌ ‌ద్వారా గ్రామీణ రైతులకు, మహిళా రైతులకు, సన్న, చిన్నకారు రైతులకు ఉపాధి కల్పించాలన్న ఆశయం ఉంది. ఇందులో భాగంగానే నాలుగేళ్ల నాఫెడ్‌ ‌ద్వారా పప్పుధాన్యాలను కొనుగోలు చేస్తారు. గ్రామాల నుంచి వలసలను నిరోధించడం, గ్రామీణ యువతకు ఆదాయ మార్గాలు చూపడం కూడా ఈ పథకం ఆశయం. పప్పుధాన్యాలతో పాటు నూనెగింజలలో కూడా ఆత్మనిర్భరత స్ఫూర్తితో స్వయం సమృద్ధిని కనుక సాధించగలిగితే రూ.60 వేల నుంచి 80 వేల కోట్ల వరకు విదేశీమారక ద్రవ్యాన్ని ఆదా చేయగలం. రూపాయి విలువ కూడా సుస్థిరంగా ఉండడమే కాక, పెరుగుతుందని కూడా చెప్పవచ్చు.

అధికోత్పత్తి వంగడాలకు జాతీయ మిషన్‌

అధికోత్పత్తి సాధించాలంటే పరిస్థితులకు అనువైన పంటలు, అందుకు అవసరమైన రకాలు అవసరం. ఈ రకాల సాగుకు మేలైన సాంకేతిక పద్ధతులను ఉపయోగించాలి. ఆ ఉద్దేశంతోనే 2024 నుంచి మేలైన అధికోత్పత్తిని ఇచ్చే రకాలు, పోషక విలువలు కలిగిన, చీడపీడలను తట్టుకునే 100కు పైగా రకాలను ప్రధాని ద్వారా పొలాలకు అందించారు. వీటి నుంచి ఆశించిన ఫలితాలను రాబట్టేందుకు, తద్వారా విత్తనాలను ఇతోధికంగా వృద్ధి చేసి రైతులకు అందించేందుకే ఈ పథకాన్ని ఉద్దేశించారు. ఈ స్ఫూర్తితోనే జాతుల మిషన్‌ను ఏర్పాటు చేశారు. మారుతున్న వాతావరణ పరిస్థితులను, నీటి ఎద్దడిని, చీడపీడలకు తట్టుకుని మంచి పోషణ కల పంట రకాలను రూపకల్పన చేయడం కూడా ఈ పథకం ఉద్దేశం. ఇందుకు రూ.100 కోట్లతో నిధి ఏర్పాటు చేశారు. వంగడాలను వృద్ధి చేసి రైతులకు అందు బాటులోకి తేవడం ఇందులో ప్రధాన ఉద్దేశం.

ప్రత్తి కోసం ప్రత్యేక పథకం

ప్రత్తి సాగు దేశంలో అధికోత్పత్తి రకాలతోనే సాగుతున్నది. అయినప్పటికి ఇతర దేశాలతో పోలిస్తే మన దిగుబడి తక్కువే. మనం సాగు చేస్తున్న ప్రత్తిలో పింజె నిడివి తక్కువ. అయితే పింజె నిడివి ఎక్కువ ఉన్న రకాలకే మార్కెట్‌లో గిరాకీ ఉంటుంది. మంచి పింజె, నిడివి ఎక్కువ ఉన్న పింజెతో దిగుబడి సాధించేందుకు, చీడపీడలను తట్టుకు నిలబడే, వాతావరణ పరిస్థితులను తట్టుకునే ప్రత్తి వంగడాల నిర్మాణానికి రూ. 500 కోట్లతో నిధి ఏర్పాటయింది. ఈ నిధితో అనుకున్న విధంగా మంచి పొడవైన పోగు/దారం ఇవ్వగల, హెచ్చు దిగుబడి సాధ్యమయ్యే ఉత్పత్తిని సాధించేందుకు కృషి జరుగుతుంది. నూలు మిల్లుల సెక్టర్‌లో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్‌ 5ఎఫ్‌ ‌విజన్‌కు కూడా ఈ ప్రత్తి ప్రత్యేక పథకం ఉపకరి స్తుందని బడ్జెట్‌లో హామీ ఇచ్చారు.

కూరగాయలు, పండ్ల సాగుకు నూతన పథకం

ఉద్యానవన విభాగ అభివృద్ధికి తోడుగా పండ్లు, కూరగాయల సాగుకు నూతనంగా ప్రవేశ పెట్టిన పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దీనిని రూ. 500 కోట్లతో అమలు చేస్తున్నారు. రైతుల ఉత్పత్తి సంస్థలు, సహకార సంఘాలు, రాష్ట్ర ఉద్యానవన విభాగాల సమన్వయంతో వీటి సాగును ప్రోత్సహిస్తే ఉత్పత్తి గణనీయంగా ఉంటుంది.

వంటనూనెలలో స్వయంసమృద్ధి కోసం ఎడిబుల్‌ ఆయిల్‌ ‌సీడ్‌ ‌జాతీయ మిషన్‌ ‌పథకం అమలు చేయనున్నట్టు ఆర్థికమంత్రి వెల్లడించడం ప్రత్యేక ప్రాధాన్యం కలిగిన అంశంగా భావించాలి. ఏటా మనం దేశ అవసరాల కోసం వంటనూనెల దిగుమతు లకు భారీగా విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు చేస్తున్నాం. ఈ నేపథ్యంలో ఈ పరిస్థితి నుంచి బయటపడడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయడం ముదావహం. ఇది రైతుల ఆర్థిక పరిస్థితిని కూడా ఇతోధికంగా మెరుగు పరుస్తుంది.

  • మఖన్‌ అభివృద్ధికి కొత్తగా మఖన్‌ ‌బోర్డును రూ. 100 కోట్లతో బిహార్‌లో ఏర్పాటు చేయడం వల్ల ఆ రైతులకు మంచి భవిష్యత్తును ఇస్తుంది.
  • పశుపోషణ, డెయిరీ సెక్టర్‌లో 2024-25 కన్నా, 2025-26 బడ్జెట్‌లో రూ.319 కోట్లు అదనంగా కేటాయించారు. ఈ ప్రోత్సాహం వల్ల ఆ సెక్టర్‌ ‌ప్రగతిపథంలో దూసుకు వెళ్లే అవకాశం ఎంతో ఉంది.
  • బడ్జెట్‌లో చేసిన ప్రతిపాదనలు, వాటి కేటా యింపులు సక్రమంగా అమలు జరగాలంటే, ఉత్పత్తులు పెరగాలంటే రైతు పెట్టే పెట్టుబడి కూడా కీలకమే.ప్రత్తి రైతులకు సకాలంలో రుణాలు దొరకక, పురుగుమందులు, ఎరువులు వేయకపోవడం వల్ల దిగుబడులు తగ్గుతున్నాయి. రైతులు నష్టపోతున్నారు. ఈ విషయంలో మన ప్రధాని నరేంద్ర మోదీ చొరవతో కిసాన్‌ ‌క్రెడిట్‌ ‌కార్డు పరిమితిని రూ. 3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచారు. ఇది వ్యవసాయోత్పత్తులు పెరగడానికే కాదు, రైతు ఆర్థికంగా నిలదొక్కు కోవడానికి ఉపకరిస్తుంది.
  • పంటల ఉత్పత్తులు గణనీయంగా పెరగడంలో కీలకమైన ఎరువు యూరియా. ఇది తగినంతగా అందుబాటులో ఉండేందుకు అస్సాంలో ప్లాంట్‌ను ఏర్పాటు చేయడం మంచి నిర్ణయం. ఈ ప్లాంట్‌ ‌సామర్ధ్యం 12.7 లక్షల మెట్రిక్‌ ‌టన్నులు. దీనితో యూరియా కొరత తీరిపోతుంది.
  • కొత్త పథకాలు, కేటాయింపులతో ఈ బడ్జెట్‌ ‌వ్యవసాయరంగానికి ఆశావహంగా కనిపిస్తున్నది.

ప్రొ. పి. రాఘవరెడ్డి

మాజీ వీసీ, ఆచార్య ఎన్జీ రంగా

వ్యవసాయ విశ్వవిద్యాలయం

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE