– సింహంభట్ల సుబ్బారావు, 6300674054
మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం
పరిచయాలు పెరుగుతాయి. భూ వివాదాలు తీరతాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొం టారు. తీర్థయాత్రలు చేస్తారు. వాహనాలు, భూములు కొంటారు. సమాజంలో విశేష గౌరవం. శుభకార్యా లపై కుటుంబంలో చర్చిస్తారు. ఉద్యోగులకు ప్రమో షన్లు. రాజకీయవేత్తలకు కొత్త పదవులు. రచయితలు, క్రీడాకారులకు నూతనోత్సాహం. 3,4 తేదీల్లో అనుకోని ఖర్చులు. కుటుంబ బాధ్యతలతో సతమత మవుతారు. ఆంజనేయ దండకం పఠించండి..
వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు
సమాజంలో మీకంటూ గౌరవం పెరుగు తుంది. కొత్త వ్యక్తుల పరిచయాలు సంతోషం కలిగి స్తాయి. ఆలోచనలు కార్యరూపం. రుణదాతల ఒత్తిడులు తొలగుతాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తాయి.దేవాలయాలు సందర్శి స్తారు. భాగస్వాముల సలహాలతో వ్యాపారాలు విస్త రిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు. కళాకారులకు యోగదాయకం. రచయితలు, క్రీడాకారుల కృషి ఫలి స్తుంది. 8,9 తేదీల్లో దూరప్రయాణాలు. దేవీస్తోత్రాలు పఠించండి.
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
రాబడి మొత్తంమీద మెరుగ్గా ఉండి అవసరాలు తీరతాయి. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. ఇంటి నిర్మాణాలు ముమ్మరం చేస్తారు. ప్రముఖులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. దేవాలయాలు సందర్శిస్తారు. మీ అంచనాలు కొన్ని నిజం కాగలవు. ఉద్యోగులకు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. కళా కారులకు అవకాశాలు. 6,7 తేదీల్లో బంధువులతో విభేదాలు. కనకధారా స్తోత్రాలు పఠించండి.
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
అదనపు ఆదాయం సమకూరి అవసరాలు తీరతాయి. సన్నిహితుల నుంచి కొంత ధనలాభం. నిరుద్యోగులకు ఉద్యోగలాభ సూచనలు. అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. ధార్మిక కార్యక్రమా లలో పాల్గొంటారు. గృహం, వాహనాలు కొంటారు. ఉద్యోగులకు పనిభారం తగ్గుతుంది. పారిశ్రామిక వేత్తలకు సంతోషకరమైన సమాచారం. రచయితలు, క్రీడాకారులకు అనుకూలం. 4,5 తేదీల్లో స్నేహి తులతో విరోధాలు.. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
కొత్త కార్యక్రమాలు అనుకున్న విధంగా పూర్తి. దైవకార్యాలలో పాల్గొంటారు. కొంతకాలంగా వేధిస్తున్న శారీరక రుగ్మతలు తీరతాయి. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారులకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు. పారిశ్రామికవేత్తలకు కొత్త సంస్థల ఏర్పాటులో విజయం. 3,4 తేదీల్లో బంధువులతో తగాదాలు. వృథా ఖర్చులు. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు
నిరుద్యోగులకు ఉద్యోగలాభం కలిగే అవ కాశాలు. భూములు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆదాయం గతం కంటే మెరుగు. నూతన విద్యావ కాశాలు. వ్యాపారులు ఒత్తిడుల నుంచి బయట పడతారు. రాజకీయ, కళారంగాల వారి యత్నాలు సఫలం. రచయితలు, క్రీడాకారులు అనుకున్నది సాధిస్తారు. 6,7 తేదీల్లో వృథా ఖర్చులు. శారీరక రుగ్మతలు. శివపంచాక్షరి పఠించండి.
తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
రాబడి మరింత మెరుగుపడి ఉత్సాహంగా గడుపు తారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. సాంకేతిక విద్యావకాశాలు దక్కుతాయి. వ్యాపారులకు పెట్టు బడులు సమకూరతాయి. ఉద్యోగులకు సంతోష కరమైన సమాచారం. రాజకీయవేత్తలకు ఊహించని ఆహ్వానాలు. కళాకారులు, పరిశోధకులకు పట్టింది బంగారమే. 8,9 తేదీల్లో అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో సమస్యలు. దత్త స్తోత్రాలు పఠించండి.
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ
ఆదాయానికి ఇబ్బందిలేకుండా గడిచిపోతుంది. అప్పులు తీరి ఒడ్డునపడతారు. కొత్త కార్యక్రమాలు చేపడతారు. భూవివాదాలు పరిష్కారమవుతాయి. కాం ట్రాక్టులు అనూహ్యంగా దక్కుతాయి. వ్యాపారులకు సకాలంలో విస్తరిస్తారు. పారిశ్రామిక వేత్తలకు ఊహించని ఆహ్వానాలు రాగలవు. క్రీడాకారులు, పరిశోధకులకు అన్నింటా విజయమే. 4,5 తేదీల్లో ఖర్చులు. విష్ణునామ ధ్యానం చేయండి.
ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
నూతన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. పలుకుబడి మరింత పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారులకు పెట్టు బడులు సమకూర తాయి. ఉద్యోగులకు కొత్త పోస్టులు లభిస్తాయి. రాజకీయవేత్తలకు నూతన పదవులు. క్రీడాకారులు, రచయితలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. 5,6 తేదీల్లో బంధువిరోధాలు. మానసిక అశాంతి. ఆదిత్య హృదయం పఠించండి.
మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం , ధనిష్ఠ 1, 2 పాదాలు
బంధువుల నుంచి కీలక సమాచారం. దేవా లయాలు సందర్శన. వాహన సౌఖ్యం. నూతన పరిచయాలు. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుం టారు. ఇంటి నిర్మాణాలకు ప్రణాళిక. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగులకు విధుల్లో అనుకూలం. రాజకీయవేత్తలకు శుభవార్తలు. 6,7 తేదీల్లో కుటుంబంలో సమస్యలు. అనారోగ్య సూచనలు. అంగారక స్తోత్రాలు పఠించండి.
కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
రాబడి తగ్గినా అవసరాలకు లోటురాదు. ఆకస్మిక ప్రయాణాలు సంభవం. శారీరక రుగ్మతలు ఇబ్బంది కలిగిస్తాయి. వ్యాపారులకు నిరాశాజనకంగా ఉంటుంది. ఉద్యోగులకు మార్పులు అనివార్యం. కళా కారులకు కొంతమేర ఒత్తిడులు తప్పవు. క్రీడా కారులు, నాయకులకు ఒడిదుడుకులు. 7,8 తేదీల్లో శుభవార్తలు. ఆకస్మిక ్య వస్తులాభాలు. ఆహ్వానాలు అందుతాయి. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి..
మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
రాబడి కొంత పెరిగి అవసరాలు తీరతాయి. విద్యార్థులు కోరుకున్న విద్యావకాశాలు పొందుతారు. సమాజంలో మరింత ఆదరణ. ప్రముఖులతో చర్చలు ఫలిస్తాయి. దేవాలయాలు సందర్శిస్తారు. వాహనాలు, వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు ఉన్నతస్థితి లభించే సూచనలు. కళాకారులకు కొత్త అవకాశాలు దక్కుతాయి. పారిశ్రామికవేత్తలు, రచయితల ఆశలు నెరవేరతాయి. 6,7 తేదీల్లో శారీరక రుగ్మతలు. స్నేహితులతో విభేదాలు. గణేశాష్టకం పఠించండి.