– సింహంభట్ల సుబ్బారావు, 6300674054
మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం
చేపట్టిన కార్యక్రమాలు పూర్తి చేసేవరకూ విశ్రమించరు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి. వాహనాలు, భూములు కొంటారు. గత జ్ఞాపకాలు నెమరువేసుకుంటారు. మీపై కుటుంబసభ్యులు మరింత ఆదరణ. వ్యాపారులు కొత్త పెట్టుబడులు సమ కూర్చుకుంటారు. ఉద్యోగవర్గాలకు అనుకోని ఇంక్రిమెంట్లు. కళాకారులు, క్రీడాకారులు, పరి శోధకులు రివార్డులు•. 1,2 తేదీల్లో ప్రయాణాలలో అవాంతరాలు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.
వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు
శుభకార్యాలలో పాల్గొంటారు. ఆదాయానికి లోటు ఉండదు, రుణాలు కొంతమేర తీరతాయి. ముఖ్యకార్యక్రమాలను సమయానుసారం పూర్తి చేస్తారు.తరచూ తీర్థయాత్రలు చేస్తారు. బంధువులతో ముఖ్య విషయాలపై ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, రచయితల ఆశలు ఫలిస్తాయి. 24,25 తేదీల్లో వృథా ఖర్చులు. కుటుంబసమస్యలు. లక్ష్మీస్తుతి మంచిది.
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఖర్చులకు తగినంత ఆదాయం. కొన్ని వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. ఆలోచనలు తక్షణం అమలు చేస్తారు. విద్యార్థులకు కొత్త ఆశలు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు లాభసాటి. ఉద్యోగాలలో హోదాలు. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, రచయితలకు కొత్త అవకాశాలు. 26,27 తేదీల్లో దూర ప్రయాణాలు. లక్ష్మీగణపతి స్తోత్రాలు పఠించండి.
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
చేపట్టిన కార్యక్రమాలను సజావుగా పూర్తి చేస్తారు. భూములు, వాహనాలు కొనుగోలు. గత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. వేడుకలకు హాజరవుతారు. ఉద్యోగార్థుల కృషి ఫలిస్తుంది. వ్యాపా రాలు కొత్త పెట్టుబడులతో విస్తరిస్తారు. ఉద్యో గస్తు లకు విధి నిర్వహణలో అవాంతరాలు తొలగు తాయి. రాజకీయవేత్తలు, కళాకారులు రచయితలకు శుభ వర్తమానాలు. 28, 1 తేదీల్లో అనుకోని ప్రయాణాలు. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
వ్యతిరేకులను సైతం ఆకట్టుకుంటారు. ముఖ్య కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. . భూముల కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. వాహనసౌఖ్యం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో లాభాలు, పెట్టుబడులు అందుతాయి. ఉద్యో గస్తులకు కొత్త హోదాలు. పారిశ్రామిక, రాజకీయ వేత్తలు, రచయితలకు అవకాశాలు దక్కుతాయి. 24, 25 తేదీల్లో విరోధాలు. అనారోగ్య సూచనలు.
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు
కొత్త కార్యక్రమాలు చకచకా పూర్తి చేస్తారు. ఆశించిన ఆదాయం. కొత్త విషయాలు తెలుస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు. వాహనాలు, భూములు కొనుగోలు. నేర్పుతో కొన్ని సమస్యలనుంచి బయట పడతారు. వ్యాపారాలలో ముంద డుగు. పారిశ్రామిక వేత్తలు, కళాకారులు, రచయితలకు ఊహించని అవకాశాలు. 26, 27 తేదీల్లో వృథా ఖర్చులు. నవగ్రహస్తోత్రాలు పఠించండి.
తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఆదాయం సంతృప్తికరంగా ఉండి అప్పులు తీరుస్తారు. దూరప్రాంతాల నుంచి ఆహ్వానాలు అందు తాయి. వ్యాపారాలు మరింత లాభసాటి. భాగస్వాము లతో వివాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది. రాజకీయవేత్తలు, కళా కారులు, రచయితలకు శుభవార్తలు. 25, 26 తేదీల్లో అనారోగ్యం, దూర ప్రయాణాలు. నృసింహ స్తోత్రాలు పఠించండి.
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ
కొన్ని ముఖ్య కార్యక్రమాలు ముందుకు సాగవు. రాబడి కంటే ఖర్చులు పెరిగి ఇబ్బందిగా మారవచ్చు. ఇంటి నిర్మాణయత్నాలు కొంత మందగిస్తాయి. వ్యాపారులు కొంత ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యో గస్తులకు విధుల్లో ప్రతిబంధకాలు, మార్పులు ఉండ వచ్చు. రచయితలు, పరిశోధకులు, కళా కారులకు అందిన అవకాశాలు సైతం చేజారవచ్చు. 24,25 తేదీల్లో శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలాభం.
ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆత్మీయుల ప్రేమానురాగాలు పొందుతారు. అదనపు ఆదాయం. వాహనాలు, ఆభరణాలు సమకూర్చుకుంటారు. కోర్టు కేసుల నుంచి విముక్తి. వ్యాపారాలు గతం కంటే పుంజుకుంటాయి. ఉద్యోగులకు పని భారాలు తగ్గు తాయి. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు, పరి శోధకుల యత్నాలు సఫలం. 1,2 తేదీల్లో వివాదాలు. వృథా ఖర్చులు. ఆదిత్య హృదయం పఠించండి.
మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం , ధనిష్ఠ 1, 2 పాదాలు
ముఖ్య కార్యక్రమాలు సకాలంలో పూర్తి. నిరుద్యోగులకు అరుదైన అవకాశాలు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. భాగస్వామ్య వ్యాపారాలలో అనూహ్యమైన లాభాలు. ఉద్యోగవర్గాలకు అనుకున్న ప్రమోషన్లు రావచ్చు. రాజకీయవేత్తలు, కళాకారులు, రచయితలకు శుభవర్తమానాలు. 24, 25 తేదీల్లో అనుకోని ప్రయాణాలు. బంధువులతో విభేదాలు. శివాష్టకం పఠించండి.
కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. విద్యార్థులకు విదేశీ విద్యావకాశాలు. వాహన, గృహయోగాలు. మీ అభిరుచులు, అభిప్రాయాలను కుటుంబసభ్యులు గౌరవిస్తారు. వ్యాపారాలు మరింత రాణిస్తాయి. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు రావచ్చు. పారిశ్రామిక, రాజకీయవేత్తలు, పరిశోధకులకు పట్టింది బంగారమే అన్నట్లుగా ఉంటుంది. 28,1 తేదీల్లో వివాదాలు. శ్రీకృష్ణస్తోత్రాలు పఠించండి.
మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
ఆస్తుల విషయంలో కొత్త అగ్రిమెంట్లు చేసుకుం టారు. ఇంటి నిర్మాణయత్నాలు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. వైద్యసలహాలు పొందుతారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరి విస్తరి స్తారు. ఉద్యోగులకు అనుకోని హోదాలు రావచ్చు. పారిశ్రామిక, రాజకీయవేత్తలు, కళాకారులకు విదేశీయానం. 27, 28 తేదీల్లో వృథా ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. శ్రీరామస్తోత్రాలు పఠించండి.