– సింహంభట్ల సుబ్బారావు, 6300674054

మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం

కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. కొన్ని కాంట్రాక్టులు లభిస్తాయి. పాతబాకీలు వసూలై అవసరాలు తీరతాయి. దేవాలయాలు సందర్శిస్తారు. వాహనసౌఖ్యం. వ్యాపారులకు ఆశించినమేర లాభాలు. ఉద్యోగులకు హోదాలు. కళాకారులకు అవకాశాలు కొన్ని దక్కుతాయి. క్రీడాకారులు, వైద్యులు లక్ష్యసాధనలో విజయం. 21,22 తేదీల్లో మానసిక ఆందోళన. నవగ్రహస్తోత్రాలు పఠించండి.


వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు

కొత్త వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది. స్నేహితులు, బంధువులతో విభేదాలు పరిష్క రించు కుంటారు. ఆస్తుల విషయంలో చిక్కులు వీడతాయి. వ్యాపారులు కొత్త పెట్టుబడుల యత్నాలు ఫలించి ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగులకు ఉన్నతాధి కారుల సహకారం. పారిశ్రామికవేత్తలకు అంచనాలు ఫలిస్తాయి. రాజకీయవేత్తలు పదవులు. క్రీడాకారులు, పరిశోధకులకు మరింత ఉత్సాహం. 17,18 తేదీల్లో శ్రమాధిక్యం. గణేశాష్టకం పఠించండి.


మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు

అదనపు రాబడి లభించి అవసరాలు తీరతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ఎంతో కాలంగా వేధిస్తున్న సమస్యలు తీరి ఉపశమనం పొందుతారు. ఊహించని ఆహ్వానాలు. వ్యాపారులు కొత్త పెట్టుబడుల అన్వేషణలో సఫలమవుతారు. ఉద్యోగులకు ప్రమోషన్లు. కళా కారులకు కొత్త అవకాశాలు. 18,19 తేదీల్లో అనారోగ్య సూచనలు. దక్షిణామూర్తి స్తోతాలు పఠించండి.


కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష

సమాజంలో గౌరవం మరింత పెరుగుతుంది. ముఖ్య కార్యక్రమాలు సకాలంలో పూర్తి. ఆరోగ్య సమస్యలు తీరతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలుచేస్తారు. వ్యాపారులు భాగ స్వాములతో అంగీకారానికి వస్తారు. లాభాలు ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగస్తులకు శ్రమ ఫలిస్తుంది. పారిశ్రామికవేత్తలు ఊహించని అవకాశాలు సాధిస్తారు. పరిశోధకులు, వైద్యుల నైపుణ్యం వెలుగు చూస్తుంది. 20,21తేదీల్లో దూరప్రయాణాలు. కనకధారా స్తోత్రాలు పఠించండి.


సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం

ఆదాయం కంటే ఖర్చులు పెరిగి రుణాలు చేస్తారు. కుటుంబంలో చికాకులు. కాంట్రాక్టర్లు కొంత అసంతృప్తి. దేవాలయాలు సందర్శిస్తారు. స్నేహితు లతో విభేదిస్తారు. ఆస్తి వివాదాలు. వ్యాపారులకు ఒడిదుడుకులు పెరుగుతాయి. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. కళాకారులకు నిరాశా జనకంగా ఉంటుంది. 22,23 తేదీల్లో శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలాభం. శివపంచాక్షరి పఠించండి.


కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు

ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. యత్న కార్యసిద్ధి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపా రులకు లాభాలు. ఉద్యోగులు విధి నిర్వహణలో ఉత్సాహంతో గడుపుతారు. రాజకీయవేత్తలకు సంతోషకరమైన సమాచారం. కళా కారులు, పరిశోధ కులకు కొత్త అవకాశాలు. 19,20 తేదీల్లో అనారోగ్య సూచనలు. సుబ్రహ్మణ్యేశ్వరుని స్తోత్రాలు పఠించండి.


తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు

ఆదాయం విషయంలో సంతృప్తి చెందుతారు. ముఖ్య కార్యక్రమాలు సమయానికి పూర్తి. ఆత్మీయులతో ఆనందం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారులు అనుభవాలతో మరింతగా లాభాలు. ఉద్యోగస్తులకు మరింత ప్రోత్సాహం. కళాకారులకు కీలక సమాచారం. రచయితల ఆశలు నెరవేరతాయి. 17,18 తేదీల్లో సోదరులతో తగాదాలు. ఆరోగ్య సమస్యలు. శ్రీరామస్తోత్రాలు పఠించండి.


వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ

ఆదాయానికి ఇబ్బందులు లేకుండా గడిచి పోతుంది. పలుకుబడి కలిగిన వారి పరిచయాలు. వివాహ ప్రయత్నాలు. ఆలోచనలు కార్యరూపం దాలు స్తాయి. ఆస్తుల కొనుగోలులో ఆటంకాలు తొలగు తాయి. వ్యాపారులు లాభాలతో సాగుతారు. ఉద్యోగ స్తులు సత్తా చాటుకునే సమయం. రాజకీయ వేత్తలకు నూతనోత్సాహం. 21,22 తేదీల్లో  కుటుంబంలో సమస్యలు. అంగారకస్తోత్రం పఠించండి.


ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం

కొత్త వ్యక్తులతో పరిచయాలు. చేపట్టిన కార్య క్రమాలు సకాలంలో పూర్తి. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. వాక్చాతుర్యంతో కుటుంబసభ్యులను మెప్పిస్తారు. రాబడికోసం ఇబ్బందులు తొలగుతాయి. ఉద్యోగులు శ్రమకు ఫలితం దక్కించు కుంటారు. రాజకీయవేత్తలకు ఊహించని పదవులు. రచయితలు, వైద్యుల ఆశలు నెరవేరతాయి. 20,21 తేదీల్లో చికాకులు. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.


మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం , ధనిష్ఠ 1, 2 పాదాలు

ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధువులు, స్నేహితులతో సత్సంబంధాలు. స్థిరాస్తి విషయంలో సమస్యలు తొలగుతాయి. కాంట్రాక్టులు పొందుతారు. ముఖ్య నిర్ణయాలు తీసుకుని బంధు వులను ఆశ్చర్యపరుస్తారు. ఉద్యోగులు ఉత్సాహంగా సాగుతారు. కళాకారులకు ఊహించని అవకాశాలు లభిస్తాయి. క్రీడాకారులకు శుభవార్తలు. 18,19 తేదీల్లో ఆరోగ్య సమస్యలు.విష్ణుధ్యానం చేయండి.


కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

ఆదాయం గతం కంటే మెరుగుపడి అవసరాలు తీరతాయి. నిరుద్యోగులు ఉద్యోగాలు సాధిస్తారు. ఇంటి నిర్మాణాలలో ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారులు లాభాలు దక్కి ఉత్సాహంగా అడుగు వేస్తారు. రాజకీయవేత్తలకు శుభవార్తలు. రచయితలు, క్రీడాకారుల అంచనాలు ఫలిస్తాయి. 20,21 తేదీలలో మానసిక అశాంతి. బంధువుల నుంచి ఒత్తిడులు. ఆదిత్య హృదయం పఠించండి.


మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

రాబడికి లోటురాదు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. స్థిరాస్తి వివాదాల నుంచి గట్టెక్కి లబ్ధి పొందుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారులు లాభం పొందుతారు. భాగస్వాములతో వివాదాలు పరిష్కరించుకుంటారు. ఉద్యోగస్తులు ఊహించని హోదాలు. పారిశ్రామికవేత్తలు, పరిశోధ కులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. 20,21 తేదీల్లో సోదరులతో వివాదాలు. దూరప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. హనుమాన్‌ ‌ఛాలీసా పఠించండి.

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE