– సింహంభట్ల సుబ్బారావు, 6300674054
మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం
ఆశ్చర్యకరమైన రీతిలో కార్యక్రమాలు చేస్తారు. దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం. రావలసిన డబ్బు చేతికందుతుంది, కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆరోగ్య సమస్యలు తీరతాయి. ఉద్యోగులకు ఒడిదుడుకులు తొలగు తాయి. వ్యాపారాలలో అనుకున్న ప్రగతి. రాజకీయ వర్గాలకు పదవులు. 12,13 తేదీల్లో ధననష్టం. కుటుంబంలో చికాకులు. శ్రీ ఆదిత్య హృదయం పఠించండి.
వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు
ముఖ్యమైన కార్యక్రమాలలో ఆటంకాలు ఎదుర్కొంటారు. కోర్టు కేసులు కొంత చికాకు పరుస్తాయి. విలువైన వస్తువులు జాగ్రత్త. రుణ యత్నాలు సాగిస్తారు. వ్యాపారాలు నత్తనడకనసాగుతాయి. ఉద్యోగాలు సామాన్యస్థితి. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు వాయిదా. క్రీడాకారులు, వైద్యుల కృషి నిరుపయోగం కాగలదు. 13,14 తేదీల్లో శుభవార్తలు. వాహనయోగం. చర్చల్లో పురోగతి. శ్రీ మేధా దక్షిణామూర్తి స్తుతి మంచిది.
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కొత్తవిషయాలు తెలుసుకుంటారు. సేవాకార్యక్రమ్లాలలో పాల్గొంటారు. వాహనసౌఖ్యం. ఆశించినంత ఆదాయం సమకూరుతుంది. కుటుంబంలో చికాకుల నుంచి బయటపడతారు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు కొత్త అవకాశాలు రావచ్చు, కళాకారులకు ఆహ్వానాలు. పారిశ్రామికవేత్తలు, రచయితల యత్నాలలో పురోగతి. 15,16 తేదీల్లో బాధ్యతలు పెరుగుతాయి. శ్రీ గురుదత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
అనుకున్న కార్యకమాలు సకాలంలో పూర్తి. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు. దేవాలయాలు సందర్శిస్తారు. రావలసిన డబ్బు అందుతుంది. కుటుంబసభ్యులతో వివాదాలు సర్దుబాటు. వ్యాపారులకు కొత్తఆశలు. ఉద్యోగులకు పైస్థాయినుంచి ప్రశంసలు. రాజకీయవర్గాలకు విదేశీయానం. సాంకేతికరంగాల వారికి అవకాశాలు. 10,11 తేదీల్లో దూరప్రయాణాలు. మానసిక అశాంతి. శ్రీ నృసింహస్తోత్రాలు పఠించండి.
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ప్రముఖుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఆస్తి వివాదాలు కొలిక్కివచ్చే సమయం. రాబడి ఆశాజనకం. కుటుంబసభ్యులతో సఖ్యత. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులకు విధుల్లో అనుకూలం. కళాకారులకు శుభవర్త మానాలు. రచయితలు, వ్యవసాయదారులకు అనుకూలం. 13,14 తేదీల్లో ఖర్చులు. స్నేహితులతో తగాదాలు. శ్రీ భువనేశ్వరీదేవి స్తోత్రాలు పఠించండి.
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు
చేపట్టిన కార్యక్రమాలలో విజయం. శుభకార్యాలకు హాజరవుతారు. జీవితాశయం నెరవేరుతుంది. ఆస్తి వివాదాల పరిష్కారం. దేవాలయాలు సందర్శిస్తారు. కుటుంబంలో అనుకూల వాతావరణం. ఉద్యోగులకు పారిశ్రామికవేత్తలకు నూతనోత్సాహం. సాంకేతిక రంగం వారు, వైద్యులకు ఉత్సాహ వంతంగా గడుస్తుంది. 11,12 తేదీల్లో ఖర్చులు. మానసిక ఆందోళన. శ్రీ వారాహీ స్తోత్రం పఠించండి.
తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ప్రముఖులనుంచి సహాయసహకారాలు అందుతాయి. దేవాలయ దర్శనాలు. ఆర్థికఇబ్బందులు తొలగి ఊపిరిపీల్చుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలు క్రమేపీ అనుకూలిస్తాయి. వైద్యులకు ఊహించని పిలుపు. 10,11తేదీల్లో ఆస్తి వివాదాలు. స్నేహితులతో కలహాలు. అనారోగ్యం. శ్రీ దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ
కొత్త ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. అందరిలోనూ గౌరవమర్యాదలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంతకాలం పడిన కష్టం ఫలిస్తుంది. రావలసిన బాకీలు అందుతాయి. విద్యార్థులకు శుభవర్తమానాలు. కుటుంబసమస్యలు కొలిక్కివస్తాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు. ఉద్యోగాలు ఆశాజనకం. 10,11 తేదీల్లో ఖర్చులు. శ్రీ ఆంజనేయ దండకం పఠించండి.
ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
పరిచయాలు పెరుగుతాయి. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. కుటుంబంలో సంతోషకరంగా గడుపుతారు. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు. ఉద్యోగులకు కొత్తబాధ్యతలు రావచ్చు. కళాకారులకు కొన్ని చేజారిన అవకాశాలు దక్కుతాయి. రచయితలకు శుభవర్తమానాలు. 14,15 తేదీల్లో దూర ప్రయాణాలు. స్నేహితులతో తగాదాలు. శ్రీ అన్న పూర్ణాదేవి స్తోత్రాలు పఠించండి.
మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం , ధనిష్ఠ 1, 2 పాదాలు
ఆలోచనలు కలసివస్తాయి. కాంట్రాక్టులు పొందుతారు. రావలసిన సొమ్ము అందుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. వాహనయోగం. దేవాలయాల సందర్శన. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు కీలక సమాచారం. పారిశ్రామికవేత్తలకు లైసెన్సులు, అనుమతులు రాగలవు. రచయితలు, కళాకారులకు సత్కారాలు. 15,16 తేదీల్లో వృథా ఖర్చులు. శ్రీరామరక్షా స్తోత్రాలు పఠించండి.
కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
దీర్ఘకాలిక సమస్యలు తీరుతాయి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. కొన్ని కార్యక్రమాలు సాఫీగా సొగుతాయి. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటి నిర్మాణాలు చేపడతారు. ఉద్యోగాలలో కొత్త ఆశలు. రాజకీయవేత్తలకు చిక్కులు తొలగుతాయి. 11,12 తేదీల్లో అనుకోని ఖర్చులు. మానసిక అశాంతి. ఆరోగ్య సమస్యలు. శ్రీ కాలభైరవాష్టకం పఠించండి.
మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. విద్యార్థులు అనుకున్న ఫలితాలు పొందుతారు. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తిలాభ సూచనలు. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుకుంటారు. ఉద్యోగాలలో ఒడి దుడుకులు తొలగి ఉపశమనం పొందుతారు. కళా కారులకు సత్కారాలు, వైద్యులు, క్రీడాకారులకు విదేశీ పర్యటనలు. 12,13 తేదీల్లో. దూరప్రయాణాలు. శ్రీ విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.