రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ – ఆర్‌ఎస్‌ఎస్‌ అం‌టే డాక్టర్‌ ‌బీఆర్‌ అం‌బేడ్కర్‌కు ఒక సంపూర్ణమైన అవగాహన ఉంది. ఓ జాతీయ సంస్థగా ఆర్‌ఎస్‌ఎస్‌ ‌హిందువుల ఐక్యత కోసం అహర్నిశలు పనిచేస్తోందని కూడా ఆయనకు తెలుసు. నిజానికి, మహారాష్ట్రలోని కరాడ్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ ‌శాఖను సందర్శించినప్పుడు ఇది మనది అనే భావనను ఆయన వ్యక్తం చేశారు. అంబేడ్కర్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ ‌శాఖను సందర్శించింది 1940లో. ప్రస్తుతం ఆర్‌ఎస్‌ఎస్‌ ‌తన వందవ ఏట అడుగుపెట్టింది. ఈ ఏడాది విజయదశమి నాటికి ఆర్‌ఎస్‌ఎస్‌ ఆవిర్భవించి 100 సంవత్సరాలు పూర్తవుతాయి. కాలం గడుస్తున్న కొద్దీ ఆర్‌ఎస్‌ఎస్‌ అనేక సవాళ్లను, అభియోగాలను ఎదుర్కొంది. కానీ ఈ అభియోగాలన్నీ నిరాధారమైన వని ప్రపంచానికి చాటి చెప్పింది ఆర్‌ఎస్‌ఎస్‌. అదే సమయంలో సమాజానికి తన వల్ల ఒనగూరే ప్రయోజనాన్ని ప్రదర్శించింది. ఆర్‌ఎస్‌ఎస్‌ ‌వేర్వేరు కారణాల్లో మూడు పర్యాయాలు నిషేధానికి గురైంది. అయినప్పటికీ ప్రతిసారీ కూడా నిష్కల్మషంగా అవతరించింది. బ్రాహ్మణులు కేంద్రంగా పనిచేసే ఆర్‌ఎస్‌ఎస్‌లో అస్పృశ్యులకు చోటు లేదు అంటూ వచ్చిన ఆరోపణ ప్రస్తుతానికి ఓ అపోహగా మిగిలిపోయింది.

అస్పృశ్యత నివారణ

1934లో వార్దాలో ఆర్‌ఎస్‌ఎస్‌ ఏర్పాటు చేసిన శిబిరాన్ని గాంధీ సందర్శించారు. శిబిరంలో వాలంటీర్లు వేర్వేరు కులాలు, మతాలకు చెందిన వారుగా ఆయన గుర్తించారు. అదే సమయంలో ఏ ఒక్క వాలంటీరులో కూడా ఇతరుల కులమేమిటో తెలుసుకోవాలనే ఆసక్తి లేకపోవడాన్ని గమనించారు. వారందరిలో ఉన్న ఏకైక భావన వారు పంచుకున్న హిందూ సారూప్యత. ఈ ఏకతా భావన వారిని కలిసి జీవించేలా, కలిసి భుజించేలా, కలిసి పనిచేసేలా ప్రేరేపించింది. ఇది చూసి గాంధీ ఎంతగానో ఆశ్చర్యపోయారు. మరుసటిరోజు ఆయన అప్పటి ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సర్‌సంఘ్‌చాలక్‌ ‌పూజనీయ డాక్టర్‌ ‌హెడ్గేవార్‌ను కలుసుకున్నారు. అస్పృశ్యతా నివారణ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్నా రంటూ డాక్టర్‌ ‌హెడ్గేవార్‌ను ఆయన అభినందిం చారు. ఇందుకు పూజనీయ హెడ్గేవార్‌ ‌సమాధాన మిస్తూ నిఅస్పృశ్యతను నివారించడానికని ఆర్‌ఎస్‌ఎస్‌ ఎలాంటి నిర్దేశిత కార్యక్రమాలను నిర్వహించడంలేదు. మేం చేస్తున్నదల్లా మనమంతా హిందువులం అనే సందేశాన్ని ప్రతి ఒక్కరికీ చేరవేయడం. ఏకతా భావన కుల భేదాలు లేదా అస్పృశ్యతను అసంగతమైనదిగా చేస్తుంది. మనం హిందువులమనే విశ్వాసం ప్రతి ఒక్కరిలోనూ మిగిలిపోతుంది• అని అన్నారు.

అంతేకాకుండా ఆర్‌ఎస్‌ఎస్‌ ‌జాతీయ పతాకాన్ని గౌరవించదని, ఆగస్టు 15 లేదా జనవరి 26న ఆర్‌ఎస్‌ఎస్‌ ‌జాతీయ పతాకాన్ని ఎగురవేయదనే ఆరోపణలు ఉండేవి. అయితే ఈ ఆరోపణలు కూడా నిరాధారమైనవని తేలింది. ఆర్‌ఎస్‌ఎస్‌ ‌స్వయంసేవ కులు స్వరాజ్య ఉద్యమంలో పాల్గొనలేదన్న వితండవాదాన్ని సైతం ఖండించడం జరిగింది.

బాబా సాహెబ్‌ ‌చిరస్మరణీయమైన ఉపన్యాసం

ఆర్‌ఎస్‌ఎస్‌ ‌దళితులకు వ్యతిరేకమని, డాక్టర్‌ ‌బాబా సాహెబ్‌ అం‌బేడ్కర్‌కు ఆర్‌ఎస్‌ఎస్‌ ‌పట్ల సదభిప్రాయం లేదని ఆరోపణలు కూడా నిలువలేక పోయాయి. ఇటీవల వెలికివచ్చిన ఓ డాక్యుమెంటు డాక్టర్‌ అం‌బేడ్కర్‌కు, ఆర్‌ఎస్‌ఎస్‌కు మధ్య ఉన్న అనుబంధాన్ని మరింత ప్రస్ఫుటం చేసింది.

నిజానికి, డాక్టర్‌ ‌బాబాసాహెబ్‌ అం‌బేడ్కర్‌ 1940, ‌జనవరి 2న కరాడ్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ ‌శాఖను సందర్శించి స్వయంసేవకుల ముంగిట ఉపన్యాసం ఇచ్చారు.  నికొన్ని విషయాల్లో మన మధ్య విభేదాలు ఉన్నప్పటికీ నేను ఈ సంస్థను మనది అనే భావనతో చూస్తున్నాను • అని ఆయన అన్నారు.

దినపత్రికలో వచ్చిన కథనంలో దీనికి సంబం ధించిన ప్రస్తావన ఇలా ఉంది.. నిజనవరి 2న డాక్టర్‌ ‌బాబా సాహెబ్‌ అం‌బేడ్కర్‌ ‌కరాడ్‌ను సందర్శించారు. ఆ సందర్భంగా మునిసిపల్‌ ‌కార్పోరేషన్‌ ఆమోదం కోరుతూ ఒక లేఖను సమర్పించే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన ఆర్‌ఎస్‌ఎస్‌ ‌శాఖను ఉద్దేశించి ప్రసంగించారు. నికొన్ని విషయాల్లో మన మధ్య విభేదాలు ఉన్నప్పటికీ నేను ఈ సంస్థను మనది అనే భావనతో చూస్తున్నాను• అని డాక్టర్‌ అం‌బేడ్కర్‌ అన్నారు’’ అని వార్తా కథనం పేర్కొంది.

ఆర్‌ఎస్‌ఎస్‌ ‌గడచిన 99 సంవత్సరాలుగా కుల వివక్ష, అసమానతలకు తావులేని ఓ హిందూ సమాజాన్ని నిర్మించడానికి పని చేస్తోంది. కుల గోడలకు ఆవల ఏకతా సమాజం నిర్మాణంపై దృష్టి పెడుతోంది. మనది అనే భావనతో ఆర్‌ఎస్‌ఎస్‌ను చూస్తున్నానంటూ డాక్టర్‌ అం‌బేడ్కర్‌ ‌చేసిన ప్రకటన ఈ దిశగా ఆర్‌ఎస్‌ఎస్‌ ‌చిత్తశుద్ధితో చేస్తున్న ప్రయత్నాలకు ఓ ప్రమాణంగా నిలుస్తోంది. 1974లో ఆర్‌ఎస్‌ఎస్‌ ‌తృతీయ సర్‌సంఘ్‌చాలక్‌ ‌పూజనీయ బాలసాహెబ్‌ ‌దేవరస్‌ ‌పుణేలో ఉపన్యాసాల మాలలో భాగంగా సామాజిక సమానత, హిందూ ఏకత అనే అంశంపై ప్రసంగించారు. ఆయన ఆ ఉపన్యాసంలో అత్యంత పురోగతితో కూడుకున్న వైఖరిని ప్రదర్శించారు. ఆయన మాట్లా డుతూ ని కులాంతర వివాహాలు సర్వసాధారణంగా జరగాలి. అస్పృశ్యత అనేది ఓ దురాచరం. దానిని భూస్థాపితం చేయాలి. అది నామరూపాల్లేకుండా పోవాలి. అస్పృశ్యత సరైంది అయితే ప్రపంచంలో ఏదీ కూడా తప్పు కాదు. కుల వ్యవస్థ అక్రమమైంది వక్రమైంది కూడాను. దానిని సమూలంగా నిర్మూలించాల్సిన అవసరం ఉంది. దానిని ఎలా నిర్మూలించాలనే దానిపై మనం దృష్టి పెట్టాలి. మనం అస్పృశ్యత, కుల వివక్షను పాటించే వారిలో మార్పును తీసుకురావడానికి పనిచేయాలి. మనం వారితో పోరాడటానికి బదులుగా మనం వారి దగ్గరకు వెళ్లాలి. వారితో సమావేశం కావాలి. మన అభిప్రాయాలను వారికి వివరించాలి. ఇది కూడా ఒక విధమైన పనే. ఎందుకంటే ఈ సోదరులు మనలో ఓ భాగం. మన లక్ష్యం వారి ఆలోచనాధోరణిలో మార్పు తీసుకురావడం• అని అన్నారు. ఈ అభిప్రాయాలు ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సామాజిక సామరస్యానికి కట్టుబడిన తీరును స్పష్టంగా చూపుతున్నాయి.

అయితే ఆర్‌ఎస్‌ఎస్‌ అం‌టే పడనివారు సంస్థపై దురభిప్రాయాలను ప్రచారం చేశారు. ఇలాంటి ఓ తార్కాణం నిజాయతీతో కూడుకున్న ఆర్‌ఎస్‌ఎస్‌ ‌వైఖరిని తేటతెల్లం చేస్తోంది. డాక్టర్‌ ‌బాబాసాహెబ్‌ అం‌బేడ్కర్‌ ఆశించిన సామాజిక సంస్కరణలు మరీ ముఖ్యంగా అస్పృశ్యత, కుల వివక్షకు సంబంధించిన సామాజిక సంస్కరణలను ఆర్‌ఎస్‌ఎస్‌ ‌తాను ఆవిర్భవించిన 1925 నాటి నుంచే చేపట్టింది. ఆర్‌ఎస్‌ఎస్‌ అనుసరించే విధానం వేరైనప్పటికీ సామాజిక ఏకత, సంస్కరణ అనే లక్ష్యాన్ని నిత్యం ముందు ఉంచుతూనే వచ్చింది.

దత్తోపంత్‌ ‌ఠేంగ్డీ రచించిన ‘డాక్టర్‌ అం‌బేడ్కర్‌ ఔర్‌ ‌సామాజిక్‌ ‌క్రాంతి కీ యాత్ర’ అనే పుస్తకంలో డాక్టర్‌ అం‌బేడ్కర్‌కు ఆర్‌ఎస్‌ఎస్‌కు మధ్య సంబంధాన్ని మరింత లోతుగా పరిశీలించారు. పుస్తకంలో ‘డాక్టర్‌ అం‌బేడ్కర్‌ ఔర్‌ ‌రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌’ ‌పేరుతో ఉన్న ఎనిమిదవ అధ్యాయంలో డాక్టర్‌ అం‌బేడ్కర్‌కు ఆర్‌ఎస్‌ఎస్‌ ‌కార్యకలాపాలపై పూర్తి అవగాహన ఉందని, ఆయన స్వయంసేవకులతో క్రమం తప్పకుండా చర్చలు సాగిస్తుండేవారని దత్తోపంత్‌ ‌పేర్కొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ‌హిందువుల ఏకత కోసం పనిచేస్తున్న ఓ జాతీయ సంస్థ అని ఆయనకు తెలుసు. అంతేకాకుండా ఆర్‌ఎస్‌ఎస్‌కు, ఇతర జాతీయ స్థాయిలోని హిందూ సంస్థలకు మధ్య తేడాలను కూడా ఆయన గుర్తించారు. డాక్టర్‌ అం‌బేడ్కర్‌ ‌డాక్టర్‌ ‌హెడ్గేవార్‌ ‌తరహాలో ఏకత, సామరస్యంతో కూడుకున్న ఓ సమాజాన్ని నిర్మించడం ద్వారా మాత్రమే సామాజిక సమానత్వం సాధ్యమౌతుందని విశ్వసించారు.

కరాడ్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ ‌శాఖను డాక్టర్‌ అం‌బేడ్కర్‌ ‌సందర్శించడం ద్వారా ఏకత, సౌభ్రాతృత్వం తాలూకు సందేశం ప్రపంచానికి అందివచ్చింది. ఈ ఘటనకు గుర్తుగా సామాజిక సామరస్యాన్ని పాదుగొల్పే ఉద్దేశంతో 2025, జనవరి 2న లోక్‌ ‌కల్యాణ్‌ ‌మండల్‌ ‌ట్రస్టు కరాడ్‌లో సౌభ్రాతృత్వ సదస్సును నిర్వహించింది. అఖండ భారత్‌ ఆవిర్భావం కోసం చేపట్టిన ఈ ప్రయత్నానికి మనమందరం మద్దతుగా నిలబడాలి.

‘ఆర్గనైజర్‌’ ‌నుంచి

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE