అమెరికా నూతన అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ పదవీ బాధ్యతలు స్వీకరించడానికి కాస్త ముందే చాలా పరిణమాలు జరిగిపోయాయి. మాజీ అధ్యక్షుడు జోబైడెన్ నావలో ప్రయాణించిన వారంతా తప్పుకున్నారు! చివరిగా హిండర్‌బర్గ్ వ్యవస్థాపకుడు, నాథన్ లేదా నాటె ఆండర్సన్ కూడా తన దుకాణం మూసుకుంటున్నట్టు జనవరి 15న ప్రకటించాడు. ఇది సంచలనమే. ఎందుకంటే ఇప్పటికిప్పుడు సంస్థను మూసివేయడానికి దారితీసే బలమైన కారణాలేమీ లేవు. డీప్‌స్టేట్‌పై యుద్ధం ప్రకటించిన ట్రంప్ అధికారంలోకి వస్తే తనకు ఇబ్బందులు తప్పవని భావించాడో ఏమో!
‘హిండన్‌బర్గ్ రీసెర్చ్ ఎల్‌ఎల్‌బి’ డెలావర్‌లో రిజిస్టరైంది. దీని వెనకాల ఎవరున్నదీ, వాళ్లు చేసే వ్యాపారాలేంటనేది ఎవ్వరికీ తెలియదు. అయినప్పటికీ తమను తాము ‘‘యాక్టివిస్ట్ షార్ట్ సెల్లర్స్’’ అని చెప్పుకుంటారు. షార్ట్ సెల్లింగ్ వ్యూహాల ద్వారా దూకుడుగా వ్యవహరించడం ఈ సంస్థ ప్రత్యేకత. దీనికి హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అని పేరుపెట్టడం వెనుక ఒక నేపథ్యం ఉంది. 1937లో జర్మనీకి చెందిన హిండెన్‌బర్గ్ ఎయిర్‌షిప్ న్యూజెర్సీకి వస్తున్న సమయంలో అగ్నిప్రమాదానికి గురైంది. అది దృష్టిలో ఉంచుకొని ఆండర్సన్ తన సంస్థకు హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అని పేరు పెట్టాడు. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంస్థ వెలువ రించిన నివేదికల్లో ఏడు ప్రధాన కేసులు ప్రపంచ వ్యాప్తంగా సంచనాలు సృష్టించాయి. వీటిల్లో ఆదానీ సంస్థ కూడా ఉండటం గమనార్హం. ఆదానీ గ్రూపుపై తప్పుడు ప్రచారం చేయడం ద్వారా అతనికి విపరీతమైన ప్రాచుర్యం లభించడంతో పాటు, నాలుగు మిలియన్ డాలర్లు ఆర్థిక ప్రయోజనం పొందాడన్న ఆరోపణలున్నాయి.
ఆదానీ గ్రూపు
ఆదాని గ్రూపు ఆర్థిక అవతవకలకు పాల్పడిందని ఆరోపిస్తూ 2023 జనవరిలో హిండన్‌బర్గ్ ఒక నివేదికను విడుదల చేసింది. ఇది విడుదల చేసే ముందు మార్క్ కింగ్‌డన్ అనే మరో అమెరికా సంస్థకు ఈ వివరాలు పంపింది. ఈ రెండు సంస్థలకు మధ్య లాభాల పంపకం ఒప్పందమే ఇందుకు కారణం. కింగ్‌డన్స్ భార్య అన్‌లా చంగ్. ఈమె చైనా-అమెరికన్ పౌరురాలు. అన్‌లా చంగ్‌కు చైనా కమ్యూనిస్ట్ పార్టీతో సన్నిహిత సంబంధాలున్నాయి. కింగ్‌డన్ క్యాపిటల్ సంస్థ ఆదానీ షార్ట్‌లో 40 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టి, తర్వాత గొడవలకు దిగి 9.2 మిలియన్ డాలర్లు లాభం పొందింది. ఇందులో సింహభాగం కింగ్‌డన్ క్యాపిటల్‌కే వెళ్లింది. కోటక్‌తో సంబంధమున్న ఇండియా ఫండ్ కూడా ఈ వాణిజ్యంలో సహాయపడినందువల్ల దానికి కూడా కొంత లాభం వెళ్లింది. ఆదానీ గ్రూపు మీద తప్పుడు నివేదికలు తయారుచేసినందుకు ఆండర్సన్‌కు ముట్టింది 4 మిలియన్ డాలర్లు!
హిండెన్‌బర్గ్ సంస్థ ఆదానీ గ్రూపుపై నివేదికను విడుదల చేయగానే, తనకు తానే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ సంస్థగా చెప్పుకునే ఓసీసీఆర్‌పీ రంగంలోకి దిగి ఈ నివేదికను ప్రపంచ వ్యాప్తంగా ప్రచారంలోకి తెచ్చింది. ఈ ప్రచారం వల్ల ఆదానీ గ్రూపు సంస్థల్లో రూ.8.13లక్షల కోట్ల మదుపర్ల పెట్టుబడులు ఆవిరైపోయాయి. ఈ నష్టాన్ని తిరిగి పూడ్చుకోవడానికి ఏడాది కాలం పట్టింది. హిండెన్‌బర్గ్ 2023 సంవత్సరమంతా అదానీ గ్రూపు లక్ష్యంగా విడుదల చేసిన నివేదికలు సంస్థ ఆర్థికంగా కుదుపులకు లోనవడానికి కారణమయ్యాయి. ఆదానీ గ్రూపు హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణలను కొట్టి పారేసినప్పటికీ మార్కెట్ విలువ పరంగా కొంతమేర దెబ్బతిన్నది. అయితే త్వరలోనే బయట పడి మామూలు స్థితికి చేరుకుంది. హిండెన్‌బర్గ్, దాని సహచర ఓసీసీఆర్‌పీ సంస్థల ఆరోపణల నేపథ్యంలో సుప్రీంకోర్టు, సెబీ, ముగ్గురు సభ్యుల స్వతంత్ర కమిటీ విచారణ జరిపి వారు చేసిన ఆరోపణలు బూటకమని తేల్చాయి. ఆదానీ గ్రూపు ప్రతిష్టను దెబ్బతీసే రీతిలో నివేదికలను విడుదల చేయడం ద్వారా హిండెన్‌బర్గ్‌కు వచ్చిన తక్షణ లాభాలు ఒకటి అంతర్జాతీయంగా ప్రాచుర్యంలోకి రావడం, రెండోది రూ.4మిలియన్ డాలర్లు ఆర్థిక లాభం చేకూరడం.
సెబీ చీఫ్ మాధవీ పూరీ బుఛ్
2024లో హిండెన్‌బర్గ్ సెబీ ఛైర్‌పర్సన్ మాధవి పూరీ బుఛ్ ఆమె భర్త ధావల్ బుఛ్‌పై ఆరోపణలు చేసింది. ప్రధానంగా ఆదానీ గ్రూపు పెద్దఎత్తున విదేశాల్లో పెట్టుబడులు పెట్టడం వెనుక వీరిద్దరూ ప్రయోజనం పొందారని ఆరోపించింది.
నికొల కార్పొరేషన్ (2020)
నికొల కార్పరేషన్ తన సాంకేతికపరమైన క్లైమ్‌లకు సంబంధించి 2020 లో తప్పుడు విధానాలను అనుసరించిందని హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపించిం ది. నికొల కార్పొరేషన్ తాను తయారుచేసిన ఒక ఎలక్ట్రిక్ ట్రక్‌కు సంబంధించి మార్కెట్ ప్రొమోషన్‌లో భాగంగా ఒక వీడియో విడుదల చేసింది. సంస్థ చెబుతున్నట్టుగా ఈ ఎలక్ట్రిక్ ట్రక్‌కు అంతటి సామర్థ్యం లేదని హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపించడంతో, సంస్థ కోర్టుకెక్కింది. చివరకు నికొల కార్పొరేషన్ వ్యవస్థాప కుడు ట్రివర్ మిల్టన్ అబద్ధాలతో కస్టమర్లను మోసం చేసాడని 2022లో యు.ఎస్. కోర్టు తీర్పు చెప్పింది.
ఐకహాన్ ఎంటర్‌ప్రైజెస్ ఎల్.పి. (2023-24)
2023లో ఐకహాన్ ఎంటర్‌ప్రైజెస్ ఎల్.పి. (ఐఈపీ) విడుదల చేసిన తన ఆర్థిక నివేదికపై హిండెన్‌బర్గ్ సంస్థ తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేసింది. ఐఈపీ తన ఆస్తుల విలువను పెంచేసి చూపుతూ, డివిడెండ్ల చెల్లింపులో ‘పోంజీ మాదిరి’ విధానాలకు పాల్పడిందని ఆరోపించింది. ఈ నివేదిక పుణ్యమాని ఐఈపీ షేర్ల ధరలు కుప్పకూలిపోయాయి. దీంతో కార్ల్ ఐకహాన్ వ్యక్తిగత ఆస్తుల విలువ 14.7బిలియన్ డాలర్లనుంచి 2.9 బిలియన్ డాలర్లకు పడిపోయిందని ఫోర్బస్ వెల్లడించింది. హిండెన్‌బర్గ్ సంస్థ కేవలం స్వార్థపూరితంగా వ్యవహరిస్తున్నదని, దీర్ఘకాలిక షేర్‌హోల్డర్లను దెబ్బతీయడం ద్వారా తాను ప్రయోజనం పొందాలనుకుంటు న్నదంటూ ఐఈపీ ఆరోపించింది.
బ్లాక్ ఇన్‌కార్పొరేషన్ వివాదం (2023)
శాన్‌ఫ్రాన్సిస్‌కోకు చెందిన జాక్ డార్సే 2009లో బ్లాక్ ఇన్‌కార్పొరేషన్ పేరుతో క్రెడిట్ కార్డు సర్వీసులను ప్రారంభించాడు. క్రెడిట్‌కార్డు సేవల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలన్నది ఆయన ఉద్దేశం. అయితే హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంస్థ తన నివేదికలో బ్లాక్ క్రెడిట్ కార్డులు వినియోగించే వారి సంఖ్యను విపరీతంగా పెంచి చూపించిందని, ఇదే సమయంలో కస్టమర్లకు విధించే చార్జ్‌లను తక్కువ చేసి చూపిందని ఆరోపించింది. దీంతో, హిండెన్‌బర్గ్ సంస్థకు వ్యతిరేకంగా జాక్ డార్సే కోర్టును ఆశ్రయించాడు.
ట్విట్టర్ పెట్టుబడి బదిలీ (2022)
ట్విట్టర్‌ను ఎలాన్ మస్క్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే 2022లో ట్విట్టర్ సంస్థ తన షార్ట్ పొజిషన్‌ను (త్వరలోనే షేర్ల ధరలు తగ్గుతాయని అంచనా. ఇందులో మదుపర్లకు సొంత షేర్లుండవు. సంస్థ నుంచి షేర్లను అప్పు తీసుకొని మరొక మదుపరికి విక్రయిస్తారు) ప్రకటించింది. ఒకవేళ ఎలాన్ మస్క్ 44 బిలియన్ డాలర్లకు సంస్థను కొనుగోలు చేయకుండా తప్పుకుంటే, షేర్ల ధరలు తగ్గుతాయని ట్విట్టర్ అంచనా వేసింది. అదే ఏడాది అక్టోబర్ నాటికి ఎలన్ మస్క్ సంస్థను కొనుగోలు చేయడంతో కథ సుఖాంతమైంది. ఇక్కడ హిండెన్‌బర్గ్ సంస్థ ట్విట్టర్ షేర్ల విషయంలో మొదట ‘‘షార్ట్ పొజిషన్’’ను అంచనావేసి, తర్వాత ‘లాంగ్ పొజిషన్’ (మదుపర్లు సొంత షేర్లను కలిగివుండటం)కు మళ్లడంతో ఎలాన్ మస్క్ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించినట్లయింది. అయితే మొదట అనుకున్న ధరకే ఎలాన్‌మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేయడంతో ఎటువంటి ఇబ్బందులు ఏర్పడలేదు.
జె&జె సంస్థ కొనుగోళ్లలో అవినీతి (2022)
జె&జె సంస్థ జరిపిన 400మిలియన్ డాలర్ల విలువైన కొనుగోళ్లలో ఆర్థిక అవకతవకలు చోటుచేసు కున్నాయని హిండెన్‌బర్గ్ సంస్థ ఆరోపించింది. దీంతో ఎఫ్.బి.ఐ. రంగంలోకి దిగింది. మీడియాలో కూడా ఇది విపరీతంగా ప్రచారం కావడంతో ఈ అవినీతిలో భాగస్వాములుగా ఉన్నవారిపై క్రిమినల్ విచారణకు దారితీసింది. చివరకు జె&జె సంస్థపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ విచారణ జరిపడంతో చివరకు ఈ అక్రమ లావా దేవీని పూర్తిగా రద్దు చేశారు.
మూసివేతకు కారణాలు
సిట్రన్ రీసెర్చ్ పేరుతో ఆండ్రూ లెఫ్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న ‘‘సింట్రన్ రీసెర్చ్’’ పేరుతో నడిచే స్వయం ప్రకటిత ‘‘యాక్టివిట్ షార్ట్ సెల్లర్’’ సంస్థపై అమెరికాలో ఎస్‌ఈసీ క్రిమినల్ కేసులను నమోదు చేసి విచారణ జరుపుతోంది. ఇదే పరిస్థితి తనకు కూడా తలెత్తే అవకాశం వున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా హిండెన్‌బర్గ్‌ను మూసేసి ఉండవచ్చునన్న అనుమానా లున్నాయి. హిండెన్‌బర్గ్ వివిధ కంపెనీల ప్రతిష్ట తెబ్బతీసే రీతిలో ఒకపక్క నివేదికలు తయారుచేస్తూ మరోపక్క వాటికి వ్యతిరేకంగా ‘షార్ట్ పొజిషన్స్’ తీసుకోవడం కూడా ఒక కారణం కావచ్చునని కొందరు నిపుణుల అభిప్రాయం. ఈ విధంగా ‘షార్ట్ పొజిషన్స్’ తీసుకోవ డానికి అవసరమైన నిధులను తప్పుడు పద్ధతుల్లో, పార దర్శకత లేకుండా సేకరించడం, ఇటువంటి నిధులతో మార్కెట్‌ను మోసగించడం వంటి చర్యలకు ఈ సంస్థ పాల్పడింది. నిజం చెప్పాలంటే షార్ట్ సెల్లర్స్‌లో సుస్థిర లాభాలను ఆర్జించేవారు చాలా అరుదు. బహుశా హిండెన్‌బర్గ్ సంస్థకు ‘‘షార్ట్ పొజిషన్స్’’కు అవసరమైన నిధుల కొరత ఏర్పడి ఉండవచ్చు. వీటితో పాటు నియంత్రణా సంస్థల నుంచి నిరంతర ఒత్తిడి, చట్టపరమైన స్క్రూటినీ, పెనాల్టీల భయం కూడా ఒక కారణం కావచ్చు. సాధారణంగా షార్ట్ సెల్లర్స్ ప్రాథమిక విశ్లేషణ లేదా కార్పొరేట్ సంస్థలో సంస్కరణలకోసం పట్టుబడుతున్న క్రియాశీలక మదుపర్లపై ఆధారపడి తమ వ్యాపారాన్ని కొనసాగి స్తారు. హిండెన్‌బర్గ్ సంస్థ ఇందుకు విరుద్ధంగా కంపెనీలను దెబ్బతీసే విధంగా నివేదికలు తయారుచేసి ప్రచురించేది. ఇది ఒకరకంగా ‘‘వెంటాడి వేటాడే విధానం’’. ఇదే సంస్థ కొంప మునగడానికి మరో కారణం. ఆర్థిక సంక్షోభ సమయాల్లో చాలా మార్కెట్లు ‘షార్ట్ సెల్లింగ్’ విధానాన్ని నిషేధిస్తాయన్నది గుర్తుంచుకోవా లి.
ఆండర్సన్ ఏం చెప్పాడంటే…
‘‘ఇప్పటివరకు చేపట్టిన పరిశోధనా ప్రాజెక్టులు పూర్తికావడమే సంస్థ మూసి వేతకు కారణం. ఇదంతా అనుకున్న ప్రణాళిక ప్రకారమే జరిగింది. నిజానికి ఈ సంస్థను మూసివేయాలని గత కొద్ది నెలలుగా అనుకుంటున్నాం. ముఖ్యంగా చేపట్టిన ఆర్థిక సంబంధ పరిశోధనా ప్రాజెక్టులు వరుసగా పూర్తవుతూ వచ్చాయి. ఇక చిట్టచివరి పోంజీ కేసుల వివరాలను నియంత్రాధికార్లకు అందజేసి ఈ రీసెర్చ్‌కు ముగింపు పలుకుతున్నాం’’. ఈ రీసెర్చ్ సంస్థను స్థాపించిన తొలినాళ్లలో ఎదురైన కష్టాలు, ఆర్థిక నష్టాల గురించి కూడా ఆండర్సన్ ఈ సదర్భంగా పంచుకున్నాడు. ఒక్కసారే మూడు కోర్టు కేసులను ఎదుర్కొనాల్సి రావడం, తనవద్ద చిల్లిగవ్వ కూడా లేకపోవడంతో నానా ఇబ్బందులు పడాల్సి వచ్చిందని చెప్పుకున్నాడు. అయితే అటువంటి సంక్లిష్ట సమయంలో లాయర్ బ్రెయన్ ఉడ్స్ అండగా నిలవడంతో ఈ కేసులను తట్టుకోగలిగానని పేర్కొన్నాడు. ఆండర్సన్ టీమ్‌లో మొత్తం 11మంది సభ్యులు పనిచేశారు. వీరెవరికీ సంప్రదాయిక ఆర్థిక నేపథ్యం లేదు. వీరు చేపట్టిన పరిశోధనల వల్ల సుమారు వందమంది వ్యక్తులపై సివిల్, క్రిమినల్ కేసులు దాఖలయ్యాయి. వీరిలో బిలియనీర్లు, సమాజంలో అత్యంత గొప్పవారిగా పేరుపడిన వాళ్లూ ఉన్నారు. తమ పరిశోధనల వల్ల కొన్ని బలమైన ఆర్థిక సామ్రాజ్యాలు ఒక్కసారి పెద్ద కుదుపులకు లోనైన మాట వాస్తవం అని ఆండర్సన్ చెప్పుకున్నాడు.
ట్రంప్ విజయంతో ప్రమాదఘంటికలు
అమెరికాలో జరిగిన ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ విజయం సాధించడంతో జోబైడెన్ పాలనా యంత్రాంగంలో ప్రమాద ఘంటికలు మోగడంతో డీప్‌స్టేట్ భాగస్వాములు ఒక్కరొక్కరుగా తప్పుకోవడం మొదలైంది. ట్రంప్‌పై హత్యాయత్నం నేపథ్యంలో సి.ఐ.ఎ.డైరెక్టర్ కింబర్లీ ఛెటెల్ రాజీనామా చేశారు. ఎఫ్.బి.ఐ. డైరెక్టర్ క్రిస్టోఫర్ వ్రే రాజీనామా చేస్తానని ప్రకటించారు. హాష్ మనీ కేసులో ట్రంప్‌పై విచారణ జరిపిన స్పెషల్ కౌన్సెల్ జాక్ స్మిత్ రాజీనామా చేశాడు. న్యూయార్క్ రాష్ట్రానికి చెందిన తూర్పు జిల్లా అటార్నీ జనరల్ బ్రొయాన్ పీస్‌కూడా ఇంటిదారి పట్టారు. ఆదానీ గ్రూపుపై దోషారోప ణలు చేసిన మహానుభావుడు ఈయనే. అదేవిధంగా యు.ఎస్. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (ఎస్‌ఈసీ) చీఫ్ గారీ జెన్సలర్ జనవరి 20న రాజీనామా సమర్పించారు. ఈవిధంగా డీప్‌స్టేట్‌తో సంబంధ మున్న వారంతా ఒక్కరొక్కరుగా తప్పుకుంటున్న నేపథ్యంలో ట్రంప్ వల్ల ‘న్యూ వరల్డ్ ఆర్డర్’ ఏర్పడుతుందా? అనేది వేచిచూడాలి.
జమలాపురపు విఠల్‌రావు
సీనియర్ జర్నలిస్ట్