పరిషత్ ఆంధ్రశాఖ అధ్యక్షులు జటావల్లభుల పురుషోత్తం ప్రసంగిస్తూ శాస్త్ర విజ్ఞానం పెరిగినకొలదీ ఇతర మతాలు క్షీణించిపోతాయనీ, హిందూమతం మరింతగా విశ్వవ్యాప్తం అవుతుందనీ అన్నారు.
మహానుభావులు నాగరికతను, మతాన్ని వికసింపజేస్తారనీ, పశుప్రాయులు (బార్బేరియన్స్) దానిని నాశనం చేయజూస్తారనీ పాశ్చాత్య పండితుడు సి.ఈ.ఎమ్. జోడ్ వ్రాశారు. ఇతరులు మనపై దురాక్రమణ జరపడానికి కారణం మన మతంలో లోపం కాదని స్పష్టమవుతోంది.
వాస్తవానికి వర్ణాశ్రమ ధర్మాల వల్ల హిందూ మతం హైందవ నాగరికత నేటికీ నిలచి ఉన్నాయి. మహమ్మదీయమతం అనేక దేశాలను ఆక్రమించింది. అనేక మతాలను గెంటివేసింది. తూర్పు ద్వీపాల్లో ఇతర మతాలు నాశనం అయ్యాయి. మహమ్మదీయుల కత్తి వల్ల, క్రైస్తవుల కుతంత్రం వల్ల కాని ప్రభావితం కాకుండా ఈ దేశంలో హిందూ మతం నిలచింది. దీనికి కారణం వర్ణాశ్రమ ధర్మాలు, కర్మకాండ, సాంఘిక వ్యవస్థ, వేదాలలో విశ్వాసం.
అయితే ఇతర మతాలు మన మతంపైకి విజృంభించడానికి కారణం మనలో రక్షణ చైతన్యం (డిఫెన్స్ కాన్షస్‌నెస్) లేకపోవడం, ఇతరులు మన మతాన్ని, మన దేవుళ్లనూ తడుతూ ఉంటే ‘మనకెందు కులే’ అని ఊరుకునే దౌర్భాగ్యం పట్టింది మనకు. ఈ దుస్థితి తొలగాలి.
ప్రపంచంలో శాస్త్రీయ పరిశోధనలు ప్రపంచ చరిత్ర హిందూ మత మూల సూత్రాలను సమర్థించే దిశలో సాగుతున్నాయి. ఈ సమయంలో విశ్వ హిందూ పరిషత్ అనే మహాసంస్థ ఉద్భవించడం బ్రహ్మానందంగా ఉన్నది. ఎందరో ఉన్నతోద్యోగులు, శాసనసభ్యులు ఇదే భావాన్ని వ్యక్తిగతంగా నాకు వ్యక్తం చేశారు. పుష్కర స్నానం చేస్తూన్న కమ్యూ నిస్టులు, సోషలిస్టులు నాకు కనబడుతున్నారు. ప్రపంచ మేధావులలో హిందూమతం యెడ ఆదరణ పెరుగు తోంది. ప్రపంచంలోని ప్రతి మేధావి హిందువు అయ్యే పరిస్థితి ఏర్పడుతోంది. ఇట్టి తరుణంలో విశ్వహిందూ పరిషత్ ఆవిర్భ వించింది.
‘‘హిందూ’’ శబ్ద నిర్వచనం
‘హిందూ’ శబ్ద నిర్వచనంపై వాదోపవాదాలలో నికి దిగవద్దని జటావల్లభుల పురుషోత్తం ప్రతి నిధులకు హెచ్చరిక చేశారు. వేదకాలంలో మరో జాతి లేనందువల్ల ‘హిందూ’ శబ్దం వేదాలలో లేదని వారన్నారు. మూడవ వ్యక్తి లేనప్పుడు పేరు అవసరం లేకుండానే సంభాషణ జరగవచ్చు, ముఖ్యమైన అనేక పదాలకు-ఉదాహరణకు ‘ప్రాణము’ అనే దానికి నిదర్శనం లేదు. ‘నా మనస్సుకు’ నా ఆత్మకు దేశాంతర భక్తి ప్రపత్తులు లేవనే వ్యక్తి హిందువు అని వారన్నారు.
శత్రు శక్తుల నిరోధం కర్తవ్యం
హిందూ మతసంప్రదాయంలో ఏవో లోపాలున్నా యని అందువల్ల ఈనాడిలా ఉన్నామని అర్థంలేని ప్రచారాలు చేస్తున్నారని జటావల్లభుల విమర్శించారు. అలాగే ఏ మతమైతేనేం ఆనే మాటలలో హిందూత్వంయెడ అనాదరణ వ్యక్తం చేస్తున్నారని, ఇది పరిచయమైన దృక్పథమూ కాదు, వాస్తవమూ కాదు, హిందూత్వం పరిపూర్ణమైనట్టిదని, మహోన్నత మైనట్టిదని అన్నారు. దానిని మనం సరిగా అర్థం చేసుకొనలేకపోవడం. ఆ ప్రకారం జీవించకపోవడం అనే లోపాలతో పాటు, దీనియెడ శత్రుత్వం వహించి వ్యవహరిస్తున్న శక్తులకు వాదాలకు ఆస్కారమిస్తున్నా మని గుర్తు చేశారు. హిందూ సమాజం బాహ్య శత్రు శక్తులవల్ల దెబ్బతీయబడ్డద•నే విషయాన్ని కూడా మనం విస్మరించరాదని చెప్పారాయన. మనను సరిదిద్దు కొనడంతోపాటు, బాహ్య శత్రు శక్తుల ప్రవాహాన్ని కూడా నిరోధించగలగాలి అన్నారు. ‘‘హిందువు లందరు రామాయణం, మహాభారతం, భాగవతం మున్నగువానిలో నిక్షిప్తమైయున్న ధార్మిక ప్రబోధాన్ని తెలుసుకుని జీవించాలి’’ అని వారు సూచించారు.