– సింహంభట్ల సుబ్బారావు, 6300674054
మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం
ఊహించని వ్యక్తి నుంచి ధనలబ్ధి కలుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారులకు భాగస్వాముల సహకారం అందుతుంది. ఉద్యోగులకు ప్రమోషన్లు. కళాకారులు, రచయితలు అనుకున్నది సాధిస్తారు. 24,25 తేదీలలో మానసిక అశాంతి. కుటుంబంలో చికాకులు. ఈశ్వరస్తుతి మంచిది.
వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు
సమాజంలో గౌరవం పెరుగుతుంది. స్నేహితులు, ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటి నిర్మాణాల్లో అవరోధాలు తొలగుతాయి. వ్యాపారులు విస్తరణ కార్యక్రమాలు ముమ్మరం చేస్తారు. ఉద్యోగులకు ఒక సమాచారం ఊరటనిస్తుంది. పారిశ్రామికవేత్తల కృషి ఫలిస్తుంది. రచయితలకు అవార్డులు రావచ్చు. 20,21 తేదీల్లో వృథా ఖర్చులు. స్వల్ప అనారోగ్యం. శ్రీలక్ష్మీ నృసింహస్తోత్రాలు పఠించండి.
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కొత్త కార్యక్రమాలలో ఆటంకాలు తొలగుతాయి. నూతన పరిచయాలు. రాబడి గతం కంటే మెరుగు. రుణ ఒత్తిడులు తొలగుతాయి. వ్యాపారులకు ఆశించిన లాభాలు. ఉద్యోగులకు విధుల్లో అవాంతరాలు తొలగి ఊరట చెందుతారు. రాజకీయవేత్తలు, కళాకారులకు సానుకూలమైన కాలం. క్రీడాకారులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. 21,22తేదీల్లో శారీరక రుగ్మతలు. అనుకోని ప్రయాణాలు. దుర్గా స్తోత్రాలు పఠించండి.
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఆదాయం మరింత మెరుగుపడి రుణబాధలు తొలగుతాయి. స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు. ఇంటి నిర్మాణాల్లో కొంత ప్రగతి కనిపిస్తుంది. వ్యాపారులకు పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు బాధ్యతలు ఉత్సాహాన్నిస్తాయి. పారిశ్రామికవేత్తలకు అవకాశాలు పెరుగుతాయి. రచయితలకు సంతోషకరమైన వార్తలు అందుతాయి. 23,24తేదీల్లో బంధువులతో తగాదాలు. శారీరక రుగ్మతలు. కనకదుర్గా స్తోత్రాలు పఠించండి.
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
చేపట్టిన కార్యక్రమాలలో అవాంతరాలు తొలగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ. ఖర్చులు అధిక మవుతాయి. స్నేహితులతో స్వల్ప వివాదాలు. ఒప్పందాలు చివరి క్షణంలో వాయిదా. వ్యాపారులు కొంతమేర లాభాలు. ఉద్యోగులు విధుల్లో ప్రశాం తంగా గడుపుతారు. క్రీడాకారులకు ఉత్సాహంగా ఉంటుంది. 22,23 తేదీల్లో శుభ వార్తలు. ధన, వస్తులాభాలు. శివాష్టకం పఠించండి.
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు
కొత్త కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవం. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. వ్యాపారులకు పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు. రాజకీయవర్గాలకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. రచయితలకు కొత్త అవకాశాలు. 25,26 తేదీల్లో ఖర్చులు. కుటుంబ సభ్యులతో విభేదాలు. విష్ణుధ్యానం చేయండి.
తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
విద్యార్థులకు అవకాశాలు ఉత్సాహాన్నిస్తాయి. స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. కళా కారులకు ఊహించని అవకాశాలు. క్రీడాకారులు, పరిశోధకులకు మంచి గుర్తింపు లభిస్తుంది. 21,22 తేదీల్లో బంధువులతో విభేదాలు. శారీరక రుగ్మతలు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ
పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగు తారు. కొన్ని సమస్యలు చాకచక్యంగా పరిష్క రించు కుంటారు. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారులకు లాభాలు దక్కుతాయి. పారిశ్రామికవేత్తలు అనుకున్న అవకాశాలు పొందుతారు. కళాకారులు, రచయితల యత్నాలలో కదలికలు. 24,25 తేదీల్లో వృథా ఖర్చులు. మానసిక ఆందోళన. ఆదిత్య హృదయం పఠించండి.
ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
విద్యార్థులకు నూతన విద్యావకాశాలు. ఊహించని కొన్ని ఆహ్వానాలు రాగలవు. బంధు వులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. గృహ నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపారులకు ఆశించిన లాభాలు. ఉద్యోగులకు కొన్ని మార్పులు. రాజకీయవేత్తలకు కొత్త ఆశలు. కళాకారులు, క్రీడా కారులకు కార్యసిద్ధి. 23,24 తేదీల్లో స్వల్ప అనారోగ్యం. రాఘవేంద్ర స్తోత్రాలు పఠించండి.
మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం , ధనిష్ఠ 1, 2 పాదాలు
ఆభరణాలు, వాహనాలు కొనుగోలు చేస్తారు. మీ భావాలను ఆప్తులతో పంచుకుంటారు. సమాజంలో విశేష గౌరవమర్యాదలు. వ్యాపారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. ఉద్యోగులకు మరింత పురోగతి కనిపిస్తుంది. రాజకీయవేత్తలు, కళాకారుల ఆశలు ఫలిస్తాయి. కళాకారులకు శుభవార్తలు. 21,22 తేదీలలో శారీరక రుగ్మతలు. కుటుంబంలో సమస్యలు. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.
కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
వ్యతిరేక పరిస్థితులను చాకచక్యంగా మార్చు కుంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. శుభకార్యాలపై కుటుంబంలో సంప్రదింపులు. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలం. వ్యాపారులు కొత్త పెట్టుబడులు. ఉద్యోగులకు ఒడిదుడుకులు తొలగుతాయి. కళాకారులు, రచయితలకు ఉత్సాహ వంతమైన కాలం. 20,21 తేదీల్లో బంధువుల నుంచి సమస్యలు. సూర్యారాధన చేయండి.
మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
ఆదాయం పెరిగి ఉత్సాహంగా గడుపుతారు. భూములు, వాహనాలు కొనుగోలు. విద్యార్థులకు ఊహించని అవకాశాలు దక్కవచ్చు. వ్యాపారులకు ఆశించిన మేర లాభాలు అందుతాయి. ఉద్యోగులకు కొన్ని మార్పులు ఉత్సాహాన్నిస్తాయి. పారిశ్రామిక వేత్తలు, కళాకారులకు అన్ని విధాలా అనుకూల సమయం. రచయితలు, క్రీడాకారులకు పట్టింది బంగారమే. 24,25తేదీల్లో దూర ప్రయాణాలు. అనారోగ్యం. హనుమాన్ చాలీసా పఠించండి.