– సింహంభట్ల సుబ్బారావు, 6300674054

మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం

చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పరిచయాలు విస్తృతమవుతాయి. కాంట్రాక్టులు పొందుతారు.  వ్యాపారులు సంస్థలను విస్తరిస్తారు. ఉద్యోగులకు మరింత పురోగతి కనిపిస్తుంది. పారి శ్రామిక వర్గాలకు  ప్రభుత్వ నుంచి ప్రోత్సాహం. 17,18 తేదీలలో స్వల్ప శారీరక రుగ్మతలు. కుటుంబంలో చికాకులు. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.


వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు

ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరిం చండి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు వాయిదా వేస్తారు.  వ్యాపారులు లాభాలు ఆశించినంతలేక నిరుత్సాహం చెందుతారు. ఉద్యోగులకు మార్పులు ఉంటాయి. కళారంగం వారి కృషి కొంత ఫలిస్తుంది. రచయితలు, సంగీతకళాకారులకు సామాన్యంగా ఉంటుంది. 16,17 తేదీల్లో  వాహననయోగం. శుభవార్తలు. విష్ణుధ్యానం చేయండి.


మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు

ఆదాయం మరింత పెరిగి అవసరాలు తీరతాయి. బంధువుల నుంచి శుభవర్తమానాలు అందుతాయి. కాంట్రాక్టర్ల యత్నాలు సఫలం. ఇంటి నిర్మాణాలపై దృష్టి సారిస్తారు. మీ పట్టుదలకు స్నేహితులు ఆశ్చర్యపోతారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారులు విస్తరణ కార్యక్రమాలు ముమ్మరం చేస్తారు. ఉద్యోగులకు విధులు అనుకూ లిస్తాయి. 18,19 తేదీల్లో  వృథా ఖర్చులు, బంధువిరోధాలు. గణేశ్‌స్తోత్రాలు పఠించండి.


కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష

పలుకుబడి మరింత పెరుగుతుంది. ఇంటి నిర్మాణ యత్నాలలో కొంత పురోగతిఉంటుంది. వ్యాపారులు భాగస్వాముల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. ఉద్యోగులకు పనిభారం నుంచి విముక్తి లభిస్తుంది. రాజకీయవర్గాలకు అవ కాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. రచయితలు, క్రీడాకారులు లక్ష్యాలు సాధిస్తారు.13,14 తేదీల్లో వృథా ఖర్చులు. స్నేహితుల నుంచి ఒత్తిడులు. గణేశాష్టకం పఠించండి.


సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం

చిన్ననాటి స్నేహితులతో కష్టసుఖాలు విచారిస్తారు. విద్యార్థులకు భవిష్యత్తుపై భరోసా కలుగు తుంది. ఉద్యోగార్థులకు శుభవార్తలు అందుతాయి. ఉద్యోగులకు విధులు ప్రశాంతంగా సాగుతాయి. పారిశ్రామికవర్గాలకు అన్నివిధాలా అనుకూలం. రచయితలకు విశేషమైన కాలమని చెప్పాలి. 17,18 తేదీల్లో అనుకోని ప్రయాణాలు. మానసిక ఆందోళన. హనుమాన్‌ ‌చాలీసా పఠించండి.


కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు

ఆత్మీయులతో మరిన్ని ముఖ్య విషయాలు చర్చిస్తారు. కుటుంబంలో శుభకార్యాలపై నిర్ణయాలు తీసు కుంటారు. వ్యాపారులకు లాభాలు మరింత ఉత్సాహా న్నిస్తాయి.  ఉద్యోగులకు కీలక సమాచారం అందు తుంది. రాజకీయవేత్తలకు ఆహ్వానాలు రాగలవు. క్రీడాకారులు, సంగీతకళాకారులకు ఊహించని అవకాశాలు. 15,16 తేదీల్లో శారీరక రుగ్మతలు. కుటుంబంలో సమస్యలు.. శివాష్టకం పఠించండి.


తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు

మీ నిర్ణయాలపై బంధువులు సంతృప్తి వ్యక్తం చేస్తారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. ఉద్యోగులకు పని ఒత్తిడులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు  కొత్త ఆశలు చిగురిస్తాయి. క్రీడాకారులు, రచయితలకు  వృథా ఖర్చులు. బాధ్యతలు పెరుగుతాయి. 14,15 తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు. బంధువిరోధాలు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.


వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ

చిన్ననాటి స్నేహితులతో కష్టసుఖాలు పంచు కుంటారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. వ్యాపారులకు నూతన పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు కొత్త అవకాశాలు లభించే సూచనలు. పారిశ్రామికవర్గాల కృషి ఫలిస్తుంది. రచయితలు, క్రీడాకారులకు మరింత ఉత్సాహం. 14,15 తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు. బంధువిరోధాలు. దేవీస్తుతి మంచిది.


ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం

రాబడి ఆశాజనకంగా ఉంటుంది. ముఖ్య కార్యక్రమాలను శ్రమకోర్చి పూర్తి చేస్తారు. బంధు వులను కలుసుకుని మరింత ఉత్సాహంగా గడుపు తారు. ఉద్యోగులకు అనుకోని బాధ్యతలు లభిస్తాయి. రాజకీయవర్గాల సేవలకు విశేష గుర్తింపు రాగలదు. రచయితలు, సంగీత కళాకారులకు గతం కంటే మెరుగ్గా ఉంటుంది.  16,17 తేదీల్లో ధనవ్యయం. శారీరక రుగ్మతలు. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.


మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం , ధనిష్ఠ 1, 2 పాదాలు

కుటుంబసభ్యుల ఆరోగ్యం కుదుటపడి ఊరట చెందుతారు. దేవాలయాలు సందర్శిస్తారు.  ఉద్యో గులకు ఉన్నతాధికారుల ఒత్తిడులు తొలగుతాయి.  కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. పరిశోధకులు, క్రీడాకారులు గందరగోళం నుంచి బయటపడతారు. 18,19 తేదీల్లో వృథా ఖర్చులు. ఆరోగ్యభంగం. ఆంజనేయ స్వామి దండకం పఠించండి.


కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యో గార్ధులకు సంతోషకర సమాచారం అందుతుంది.  జీవితాశయం నెరవేరుతుంది.వ్యాపారులకు ఆశించిన లాభాలు అందుతాయి. పారిశ్రామిక వర్గాలకు అంచనాలు నిజమమవుతాయి. కళాకారులు, రచయితలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. 14,15 తేదీల్లో  కుటుంబంలో చికాకులు. ఆరోగ్యభంగం. లక్ష్మీ నృసింహస్తోత్రాలు పఠించండి.


మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

మీ గౌరవప్రతిష్ఠలు మరింత పెరుగు తాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆస్తి వ్యవహా రాలలో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. తండ్రి తరఫు వారినుంచి శుభవార్తలు. వ్యాపారులు  అవరోధాలు అధిగమిస్తారు. ఉద్యోగులకు గుర్తింపు లభిస్తుంది. కళాకారులు అనుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. క్రీడా కారులకు గతం కంటే మెరుగైన పరిస్థితులు ఉంటాయి. 17,18 తేదీల్లో  మానసిక అశాంతి. ఆదిత్య హృదయం పఠించండి.

About Author

By editor

Twitter
YOUTUBE