– సింహంభట్ల సుబ్బారావు, 6300674054
మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం
ఆత్మీయుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. ఆదాయం ఆశా జనకంగా ఉంటుంది. శుభకార్యాలపై కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు. పాతమిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. రాజకీయవేత్తలు, కళాకారులు, క్రీడా కారులకు కొత్త అవకాశాలు కొన్ని దక్కవచ్చు. 10,11 తేదీల్లో వృథా ఖర్చులు. గణేశాష్టకం పఠించండి.
వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు
ఆత్మీయుల ఆదరణ పొందుతారు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారస్తులకు పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగస్తులకు విధుల్లో ఆటంకాలు తొలగుతాయి. రాజకీయ, పారిశ్రామిక వేత్తలు, కళాకారులకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. 9,10 తేదీల్లో దూరప్రయాణాలు. శారీరక రుగ్మతలు. కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. అనుకున్నది సాధించాలన్న పట్టుదల, ఆత్మవిశ్వాసం పెరిగి ముందుడుగు వేస్తారు. ఉద్యోగ యత్నాలు కలసి వస్తాయి. వ్యాపారస్తులకు లాభాలు మరింత అందుతాయి. ఉద్యోగస్తులకు అనుకూల వాతావరణం నెలకొంటుంది. రాజకీయవేత్తలు, కళాకారులు, క్రీడాకారులకు కొన్నిసమస్యలు తీరతాయి. 6,7తేదీల్లో ఆస్తి వివాదాలు. కుటుంంబంలో సమస్యలు. లక్ష్మీస్తోత్రాలు పఠించండి.
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఆదాయం గతంకంటే కొంత మెరుగుపడుతుంది. కొన్ని నిర్ణయాలు తీసుకుని అందర్నీ ఆశ్చర్యపరుస్తాయి. వాహనాలు, భూములు కొనుగోలు యత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగస్తులకు పైస్థాయి వారినుంచి మరింత ప్రోత్సాహం. రాజకీయ, పారిశ్రామికవేత్తలు, రచయితలకు ఊరటనిచ్చే సమాచారం రావచ్చు. 8,9 తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు. కొత్త రుణయత్నాలు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆదాయవ్యయాలు సమానంగా ఉన్నా అవస రాలు తీరతాయి. కొన్ని వ్యవహారాలలో పురోగతి కనిపిస్తుంది. వ్యాపారస్తులు కొత్త సంస్థల యత్నాలు ముమ్మరం చేస్తారు. ఉద్యో గస్తులకు పని ఒత్తిడులు తగ్గవచ్చు. పారిశ్రామిక వేత్తలు, కళాకారులు, రచయితలకు కార్యసిద్ధి. 10,11 తేదీల్లో శారీరక రుగ్మతలు. బంధువుల నుంచి ఒత్తిడులు. వివాదాలు. ఆంజనేయ దండకం పఠించండి.
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు
ఆలోచనలు అమలుచేస్తారు. భూములు, వాహనాలు కొనుగోలు చేసే వీలుంది. ఆర్థికపరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారస్తులకు లాభాలు అందుతాయి. పెట్టుబడులు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు విధులు ప్రశాంతంగా సాగుతాయి. రాజకీయ, పారిశ్రామికవేత్తలు, రచయితలకు కొత్త విషయాలు తెలుస్తాయి. 7,8 తేదీల్లో ఖర్చులు అధికం. శారీరక రుగ్మతలు. శ్రీరామస్తోత్రాలు పఠించండి.
తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఆత్మీయులు, శ్రేయోభిలాషులు సహకరిస్తారు. ఆదాయం సమృద్ధి. మిత్రులనుంచి పిలుపు అందు తుంది. నిరుద్యోగులు ఎంతోకాలం ఎదురుచూస్తున్న అవకాశం దగ్గరకు వస్తుంది. ఉద్యోగస్తులకు విధుల్లో అవాంతరాలు తొలగుతాయి. రాజకీయవేత్తలు, కళాకారులు, పరిశోధకులకు సంతోషకరమైన సమాచారం. 10,11తేదీల్లో దూర ప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. శివాష్టకం పఠించండి.
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ
శుభ కార్యాలపై బంధువర్గంతో సమాలోచనలు జరుపుతారు. యుక్తితో వివాదాలనుంచి గట్టెక్కు తారు. విద్యార్థుల కాస్త ఉపశమనం. వ్యాపారస్తులకు లాభాలు అందుతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, రచయితలకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. 7,8 తేదీల్లో వృథా ఖర్చులు. ఆరోగ్య సమస్యలు. ఆకస్మిక ప్రయాణాలు. హనుమాన్ ఛాలీసా పఠించండి.
ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
ఎంతటి వ్యక్తినైనా వాక్చాతుర్యంతో ఆకట్టుకుం టారు. నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారస్తులకు ఊహించని విధంగా లాభాలు అందుతాయి. ఉద్యో గస్తులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. రాజకీయ వేత్తలు, కళాకారులు, పరిశోధకులకు శుభవార్తలు అందుతాయి. 8,9 తేదీలలో ఆకస్మిక ప్రయాణాలు. రుణయత్నాలు. శివపంచాక్షరి పఠించండి.
మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం , ధనిష్ఠ 1, 2 పాదాలు
కుటుంబంలో సమస్యలు తీరుతా•యి. ఇంటి నిర్మాణాలలో ముఖ్యనిర్ణయాలు తీసుకుంటారు. దూరపు బంధువులనుంచి సమాచారం సంతోషం కలిగిస్తుంది. వ్యాపారస్తులకు లాభాలు. ఉద్యోగస్తు లకు ఉన్నత పోస్టులు దక్కుతాయి. పారిశ్రామిక, రాజకీయవేత్తలు, రచయితలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. 9,10 తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు. శ్రమాధిక్యం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.
కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
ప్రయాణాలు చివరి క్షణంలో వాయిదా. శారీరక రుగ్మతలు కొంత బాధిస్తాయి. కొన్ని కార్య క్రమాలు మధ్యలో విరమిస్తారు. విలువైన వస్తువులు జాగ్రత్తగా కాపాడుకోండి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు తప్పకపోవచ్చు. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, క్రీడాకారులకు గందరగోళ పరిస్థితి. 8,9 తేదీల్లో శుభవార్తలు. వాహనయోగం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.
మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. కొన్ని వ్యవహారాలలో ఒప్పందాలు చేసుకుంటారు. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. వ్యాపారస్తులు గతం కంటే లాభాలు మరింత దక్కించుకుంటారు. ఉద్యో గస్తులకు విధుల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయవేత్తలు, కళాకారులు, క్రీడాకారులకు మంచి గుర్తింపు లభిస్తుంది. 6,7 తేదీల్లో శారీరక రుగ్మతలు. బంధువిరోధాలు. ఆదిత్య హృదయం పఠించండి.