ఒకటవ సమావేశం – ప్రజా భద్రత, న్యాయం

భద్రత, న్యాయం నాటి విలువుల

‘లోక్‌’ అనే పదానికి తెలుగులో ‘జానపద’మని అర్థమని, కనుక ‘లోక్‌మంథన్‌’ను ‘జనపద మంథనం’గా అనువాదితమవుతుందని ఐఎన్‌డి ఐసిఎలో డీన్‌, సీనియర్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ నాగరాజ్‌ పాతూరి అన్నారు. కార్యక్రమ నిర్వాహకులు ‘జానపద’ అనే పదాన్ని ప్రస్తావించి ఉంటే, దీని ప్రభావం ఐదువేల రెట్లు  ఎక్కువ ఉండేదని ఆయన అన్నారు. తెలుగు మాట్లాడేవారికి భద్రత గురించి చెప్పాలనుకుంటున్నాను, ఇప్పుడు ‘జానపద భద్రత గురించి మాట్లాడబోతున్నాను అంటూ ఆయన ప్రసంగాన్ని ప్రారంభించారు.

వలసపాలన కాలానికి ముందు గ్రామంలో సమస్యలను పరిష్కరించేందుకు గ్రామ పెద్ద లేదా పంచాయత్‌ ముఖియా ఉండేవారు. బ్రిటిష్‌వారు అడుగుపెట్టకముందు, స్థానిక గ్రామీణ న్యాయవ్యవస్థ ఉనికిలో ఉండేది. గత 30 ఏళ్లల్లో నేను అటువంటి అనేక వివాద పరిష్కారాలకు హాజరయ్యాను. భారతదేశంలో మనకు పట్టణ` గ్రామీణ విభజన లేదు, ప్రతి ప్రధాన నగరం కూడా ప్రధానంగా కొన్ని గ్రామాల సముదాయమే. నేటి వరకూ పంచాయతీలు నిర్వహిస్తూనే ఉన్నారు, దానినే మనం ‘లోక న్యాయ’ అంటున్నామని ఆయన అన్నారు.

ఇక లోక్‌ సురక్ష విషయానికి వస్తే, గ్రామీణ పహారా లేక భద్రత వ్యవస్థ ఒకటి ఉంది. సాధారణంగా ప్రజలు ‘గ్రామీణ వాచ్‌మాన్‌’ అనే పదాన్ని ఉపయోగిస్తుంటారు, అంటే ఆధునిక సమాజాలలోలా ఒక్కరే ఉంటారనే భావన వస్తుందని, కానీ అది తప్పని ఆయన చెప్పారు. తెలుగులో మేం వారిని ‘తలారీ’ అని పిలుస్తామన్నారు. పంచాయతీ రాజ్‌ వ్యవస్థ ద్వారా సంప్రదాయ వ్యవస్థలను పరిరక్షిస్తున్నందున, భారతదేశ వ్యాప్తంగా ‘తలారీ’ పాత్ర కొనసాగుతోందన్నారు. కొన్ని సందర్భాలలో ఒక గ్రామంలో అనేకమంది తలారీలు ఉండే వారన్నారు. కాశీఖండంలోని 15వ శతాబ్దపు కథనాన్ని ఆయన చెప్పుకొచ్చారు – ఆలయంలో పండ్లను దొంగలించినందుకు ఒక వ్యక్తిని తలారీలు అదుపులోకి తీసుకున్నారట. ఇది ఆరోగ్యవంతమైన భద్రతా వ్యవస్థను సూచిస్తుందంటూ, కేవలం ఈ ఒక్క వ్యవస్థ ఉండేది కాదన్నారు. ఆధునిక భారతదేశానికి ముందు ప్రజలందరూ సాయుధులై ఉండేవారని, ఆత్మరక్షణ సామర్ధ్యంతో ఉండడంతో, నేటి ప్రత్యేక పోలీసు వ్యవస్థ వంటి వ్యవస్థ అవసరం ఉండేది కాదన్నారు.

ఈ గ్రామాలలో ‘వీరగాళ్లు’ అన్న రాళ్లను పూజిస్తారు, అంతిమంగా అవి గ్రామంలో మెజారిటీ ప్రజలు ఆరాధించే దైవాన్ని బట్టి శివుడు లేదా కృష్ణుడికి ప్రాతినిధ్యం వహిస్తాయి. ఈ శిలలే శివుడు లేదా విష్ణు విగ్రహాలుగా మారుతుంటాయంటూ అనేక ఉదాహరణలు చెప్పారు. మన వ్యవస్థలో ‘లోక్‌’ అన్నది ఎంత లోతుగా పాతుకుపోయిందో చూపేందుకు కార్గిల్‌ యుద్ధ సమయంలో ఈ పద్ధతులు కొనసాగడమే ఉదాహరణ అని వివరించారు.

క్రూరమృగాల నుంచి రక్షించడం భద్రతలో ఒక కోణమని, అందులో విజయవంతం అయిన వారిని గ్రామస్తులు గౌరవించేవారన్నారు. మరొక ముఖ్య అంశం, గ్రామాలలోని వ్యాయామశాలలని, ఇక్కడ దండవ్యాయామం, దండయుద్ధం వంటి కార్యకలాపాలు కొనసాగేవని అన్నారు. గ్రామంలో ఊరేగింపులు జరిగే సమయంలో వీటిని ప్రదర్శిస్తుండేవారన్నారు. కత్తులు, లాఠీలు, గదలు వంటివాటిని ఆరాధిస్తారని, అంటే సాయుధీకరణను గ్రామీణులు ప్రోత్సహించేవారని అన్నారు.

‘లోక్‌’లో ఉన్నదే ‘శ్లోక్‌’లో కూడా ఉందని సీనియర్‌ విద్యావేత్త, ఇండాలజిస్టు డా॥శ్రీకృష్ణ జుగ్ను పేర్కొన్నారు. అన్ని గ్రంథాలు, సంప్రదాయాలూ కూడా సమాజంలో భాగమని, మను, కమండక్‌, చాణక్య, సప్తర్షి వంటివారు రచించిన విధానపరమైన గ్రంథాలు అన్నీ కూడా సమాజానికి చెందినవేనని వివరించారు. ఈ జ్ఞాపకాలన్నీ మన సమాజం చుట్టూ ఉన్నాయని, ఇందులో భద్రత, న్యాయం అనేవి ముందుంటాయని ఆయన అన్నారు. ఇటువంటి ఆచరణలు అన్నింటినీ  సమాజప జ్ఞానంగా వరాహమిహిరుడు ‘బృహత్‌ సంహిత’ అనే గ్రంథంలో పొందుపరిచాడని ఆయన వివరించారు.

సమాజం సంప్రదాయం, నమ్మకాలలో మనకున్న న్యాయాన్ని తప్పుదోవ పట్టించలేరు. ఉదాహరణకు, గుజరాత్‌కు సంబంధించిన మల్లపురాణంలో మల్లులు సమాజాన్ని ఎలా రక్షించేవారో వివరిస్తుంది. మానసోల్లాస్‌ కూడా ఇదే సందేశాన్ని ఇస్తుండగా, బృహద్‌ యాత్ర కూడా అదే బోధిస్తుంది. లఘుయాత్ర, దీర్ఘయాత్ర, బృహద్‌ యాత్ర అన్న వరాహమిహిరుని రచనలు దీనిని పట్టి చూపుతాయి. అనేక కులాలు ఇక్కడ ఉనికిలో ఉండటానికి కారణం వారు భద్రతకు హామీ ఇవ్వడమేనన్నారు. రాజస్థాన్‌లో సాన్సీ, మోగియా, కంజర్‌, బావ్రీ, పార్ధీ వంటి సమూహాలు భద్రత కోసం సరిహద్దులలో స్థిరపడ్డారన్నారు. నేటికి కూడా, గ్రామీణులు వారిని గుర్తిస్తారని, నగరాలకు వచ్చిన మనం, పెద్ద కార్యక్రమాలు జరిగిన సందర్భంగానే వారిని గుర్తు చేసుకుంటామన్నారు.

నేడు మీరు లోక్‌సురక్ష, న్యాయ గురించి విన్నారు. మొదటగా నేను లోక్‌మంథన్‌ ద్వారా రుద్రమదేవికి నివాళులు అర్పిస్తున్నానంటూ సమావేశానికి అధ్యక్షత వహించిన జెఎన్‌యు విసి ప్రొఫెసర్‌ శాంతిశ్రీ ధూలిపూడి పండిట్‌ అన్నారు. ఫెమినిజానికి విలువనిచ్చే సమాజంలో మనం ఉన్నామని, ఫెమినిజం గురించి బోధించేందుకు మనకు పాశ్చాత్య బృందాలు అవసరం లేదని అన్నారు. మన దేవు ళ్లందరినీ వారి భార్యల పేరుతో కలిపి సీతాపతి, ఉమాపతి, లక్ష్మీపతి అంటూ సంబోధిస్తామని, అటువంటి మనకు ఎవరూ ఫెమినిజాన్ని బోధించనవ సరం లేదని అన్నారు. భారతీయ చరిత్రలో మహిళా శక్తిని ప్రదర్శిస్తూ తనకు అన్యాయం జరిగినప్పుడు పాండ్య సామ్రాజ్యాన్ని కన్నగి ధ్వంసం చేసిందని సంగమ సాహిత్యంలో ఉన్న విషయాన్ని ప్రస్తావించారు. చోళ, మరాఠా వంటి భారతీయ వంశాలు మన సంస్కృతిని సముద్రాల ద్వారా వాయవ్య ఆసియా, ప్రపంచం లోని ఇతర ప్రాంతా లలో వ్యాప్తి చేశాయి. మనం ప్రపంచ స్థాయిలో మానవ భద్రత గురించి మాట్లాడినప్పుడు, ఆ భానను మన నుంచే తీసుకుని ఉంటారని భావిస్తాను. జెఎన్‌యు చరిత్రలో ‘కమ్యూనిస్టు ఆర్కియాలజీ’ అనే పాఠ్యాంశం లేదని, కానీ ఇప్పుడు దానిని జతపరి చామని అన్నారు. లోక్‌మంథన్‌ అన్నది పాత సంప్రదాయాలను, కొత్తవాటితో మిళితం చేయడమేనని, ఈ భావనల గురించి ఇక్కడ మాట్లాడి వదిలేయ కుండా ఈ జ్ఞానాన్ని యువ తరానికి తీసుకువెళ్లాలని, ఇది సమగ్రమైనది కావడం వల్ల ఎంతో ముఖ్య మైనదని ఆమె అన్నారు.


రెండవ  సమావేశం – వృద్ధి పట్ల ప్రజా భావన, ప్రక్రియ

వికాసమే అభివృద్ధికి కొలమానం

ప్రస్తుతమున్న అభివృద్ధి అనే భావన సమాజాన్ని జడపదార్ధం చూడటం వల్లనే సమస్యలు పెరుగుతు న్నాయని సంస్కార శిక్షణ సంస్థాన్‌ వ్యవస్థాపకులు, ఐఐటి కాన్పూర్‌ ప్రొఫెసర్‌ భగాడియా అన్నారు. మనం స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల గురించి మాట్లాడుతూ, సున్నా దారిద్య్రం లక్ష్యంగా పెట్టుకుంటామని కానీ, 1990 నుంచి 2024 వరకు దారిద్య్రం అనేది కొన సాగడమే కాదు అనేక దుష్ఫలితాలతో కొనసాగు తోందని ఫలితాలు చూపుతున్నాయన్నారు. జీడీపీలో పెరుగుదల అన్నది సంపన్నులకు, పేదలకు మధ్య అంతరాన్ని పెంచిందని, కనుక భారతదేశంలో అభివృద్ధిని భారతీయ భావన అయిన వికాస్‌ ద్వారా అర్థం చేసుకోవలసిన అవసరం ఉందన్నారు. వికాస్‌ అన్నది కేవలం భారత్‌కే కాక ప్రపంచమొత్తానికీ అని అన్నారు.

ఇక్కడ అభివృద్ధికి అవకాశం ఉండటానికి కారణం సహజీవనమేనని, ప్రతి అణువుకూ నాలుగు చర్యలు ` తెలుసుకోవడం, ఆమోదించడం, అర్థం చేసుకో వడం, పాటించే అవకాశం ఉంది. ప్రతి అణువు లోనూ అభివృద్ధిని ఇలా చూస్తారు.

సత్యమన్న భావనే అభివృద్ధికి పునాదిగా ఉంటుందని శివగంగ ఆశ్రమ వ్యవస్థాపకులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత మహేష్‌ శర్మ పేర్కొన్నారు. మన సంప్రదాయంలో ఏమిటీ భావన అంటే`‘ఏకం సత్‌ విప్రః బహుదావదంతి’`అనేక ఆలోచనలు ఉండ వచ్చు, కానీ మనం వాటన్నింటినీ కలిపి ఉంచగలము. ప్రతి ఒక్కరి హృదయంలో సమాన భాగస్వామ్యంతో తన ప్రజలు సంతోషంగా జీవించేలా రాజ్యం ఉండాలి. భావనలు రుజువు చేయవచ్చు కానీ విశ్వాసాలను చేయలేం. మనం అభివృద్ధి చెందామని మనం ఎలా విశ్వసించగలం? అని ఆయన ప్రశ్నిం చారు. మనసులను గెలుచుకోవడమే అభివృద్ధి భావన అని, అందరూ వృద్ధి చెందేలా సమాజాన్ని నిర్మించాలని అన్నారు.

మధ్యప్రదేశ్‌లోని రaబువాలోని హాతిపావ కొండల వద్ద భూమాతను సేవించేందుకు 15,000 గ్రామాలకు చెందిన వారు కలిసి వచ్చే సంప్రదాయ మైన హల్మా గురించి ఒక వీడియో ప్రదర్శన జరిగింది. వీరందరూ నిస్వార్ధ స్ఫూర్తితో తమ స్వంత వనరులను ఉపయోగించుకొని నీటి పరిరక్షణ కోసం పని చేసేందుకు వెళ్లడం కనిపిస్తుంది. ఈ గిరిజనులు పరోపకారం కోసం వచ్చి, భవిష్యత్‌ తరాల కోసం  పూర్వీకుల పాత్ర పోషించడం కనిపిస్తుంది. ఒక సమాజం ఇటువంటి స్ఫూర్తితో నిర్మాణమైనప్పుడు అభివృద్ధి జరుగుతుంది. లోక్‌ అన్న భావన అభివృద్ధి ప్రక్రియే.

హల్మలో ఆనకట్టలు, చెరువులు, బావులు, ఇతర నిర్మాణాలు కట్టడం కనిపిస్తుంది. ఇది రaబువాల నుంచి ఒక ఉదాహరణ మాత్రమే. వీరిని మనం వెనుకబడినవారిగా భావిస్తాం. వారి పరోపకార స్వభావం, నిస్వార్ధత అన్నవే ఆదర్శ అభివృద్ధి భావన. మౌనం లేదా నిశ్శబ్దమనే సెంటిమెంటును అర్థం చేసుకునేదే అభివృద్ధి చెందిన సమాజం. అలాంటి సమాజం ఏర్పడినప్పుడు, దానిని సుస్థిరంగా ఉంచడం ఎలా అని చర్చించడం సమంజసమే కదా?

భారతీయ అభివృద్ధి వాస్తవ స్ఫూర్తి మూర్తీభ వించిన భిల్‌ సమాజాన్ని తన అధ్యక్షోపన్యాసంలో ఐసిఎస్‌ఎస్‌ఆర్‌ మాజీ చైర్మన్‌, పద్మశ్రీ అవార్డు గ్రహీత డా॥ జె.కె. బజాజ్‌ కొనియాడారు. ఆయన రaబువా ప్రాంతపు సవాళ్లను, ముఖ్యంగా నీటి నిర్వ హణకు సంబంధించిన వాటిని పట్టి చూపారు. అయినప్పటికీ, భిల్లులు తమ శక్తిసామర్ధ్యాలను, వ్యవసాయంలో నైపు ణ్యాన్ని ప్రదర్శిస్తూ నాణ్యత కలిగిన గోధుమలను సాగు చేస్తారని అన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో కొనసాగే సామర్ధ్యాన్ని  కొని యాడుతూ, వ్యవ సాయం పట్ల వారి నిలకడైన వైఖరిని సంప్రదాయంలో పాతుకుపోయిన అభి వృద్ధికి ఉదాహరణగా డా॥ బజాజ్‌ పట్టి చూపారు.

భారత్‌లో అభివృద్ధి అంటే ఏమిటి? అది ఏమిటో భారతీయ ప్రజ లకు తెలుసు, ఎందుకంటే అది వారి సంస్కృతి, సంప్రదాయంలో నాటుకొని ఉండడమేనన్నారు. దీనిని అర్థం చేసుకునేందుకు మూడు మార్గాలు ఉన్నాయి -సాంకేతికంగా, రెండవది ప్రత్యక్షంగా చూడటం కోసం ప్రజల్లోకి వెళ్లడం, మూడవది బ్రిటిష్‌వారి రాకకు ముందు భారతీయ సమాజాల జీవన విధానం ఎలా ఉండేది, వ్యవస్థ ఏమిటి అనేది అర్థం చేసుకోవడం. ఇక్కడ మనం చూసే భావనలు ఏమిటి? అభివృద్ధి జరిగిందా?

మొదటగా, ఈ అభివృద్ధి చెందిన గ్రామాలకు ప్రస్తుత అవసరాలకన్నా మూడు నుంచి ఆరు రెట్ల తలసరి ఉత్పత్తి ఉంది. ఇక్కడ మీకు ఆలయాలు, బావులు, చెరువులు కనిపిస్తాయి అని ఆయన వివరించారు.


వ్యాసకర్తలు: కె. సురేందర్‌, డి. అరుణ, ఎన్‌. ఆయూష్‌, బి.ఎస్‌. శర్మ కె.కె.వి. శర్మ, జి.ఎన్‌.ఆర్‌.,

ఫోటోలు : ఎన్‌.రవీంద్ర, సాయి వరప్రసాద్‌, చిగుళ్ల కుమార్‌

About Author

By editor

Twitter
YOUTUBE