ఒకటవ సమావేశం-జానపద సాహిత్యం

జానపద సాహిత్యం భారత జీవన సారం

రెండవ రోజు తొలి సమావేశం స్థానిక భాష, జీవనశైలిలో దాని పాత్ర, మన నిత్యజీవనంలో దాని సహకారం, ప్రాతినిధ్యంపై ‘లోక్‌సాహిత్యం’ దృష్టి పెట్టింది. ఈ అంశంపై ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు శాఖ విశ్రాంతాచార్యులు డా।। కసిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, మన సాహిత్యంలోనే విస్త్రతంగా కనిపించే వైవిధ్యాన్ని గురించి మాట్లాడారు. అయితే, ఈ వైవిధ్యం ‘గొప్ప సంప్రదాయం’, ‘చిన్న సంప్రదాయం’గా తప్పుడు అన్వయానికి లోనైందని ఆయన అన్నారు. దీనిని సమాజంలో అంతరాన్ని సృష్టించేందుకు ఒక పద్ధతి ప్రకారం చేశారని ఆయన వాదించారు. మన చేతనలో సమైక్యత అన్న భావన పాతుకుపోయి ఉన్నప్పటికీ, స్వార్ధ ప్రయోజనాలు కలిగిన కొన్ని శక్తులు తమ సాహితీ రచనల ద్వారా ఈ విభజన నుంచి లబ్ధి పొందుతున్నా రన్నారు. లోక్‌ ‌కహానియా (జానపద కథలు) ద్వారా భారతీయ సంస్కృతి అన్న అంశంపై ఆయన అంతర్‌దృష్టులను పంచుకున్నారు. లెక్కలేనంతమంది వ్యక్తులు ఈ జానపద గీతాలను సంకలనం చేస్తున్నారన్నారు. ముఖ్యంగా, పండిట్‌ ‌రఘునందన్‌, ‌డా।। పి భాస్కర్‌, ‌ప్రొఫెసర్‌ ‌బి. రామరాజు వంటి వ్యక్తుల కృషిని ప్రస్తావించారు. రామాయణంపై ఆధారపడిన కొన్ని లోక్‌ ‌కహానియాలు, లోక్‌గీత్‌ల నుంచి ఆయన కొన్ని ఉదాహరణలను ప్రస్తావించారు. మొత్తం అన్నింటినీ తెలుగు భాషలోనే ప్రస్తావిస్తూ, దక్షిణ భారతంలోనూ ప్రభు శ్రీరాముడిని ఎంత భక్తిశ్రద్ధలతో కొలుస్తారో ప్రదర్శించారు.

జానపద గీతాలు, కథల ద్వారా పురాణాలను చెప్పే, పాడే సంస్కృతిని గురించి పద్మశ్రీ పురస్కార గ్రహీత, ప్రముఖ రచయిత డా।। విద్య విందు సింగ్‌ ‌వివరణా త్మకంగా మాట్లాడారు. ప్రభు శ్రీరాముడు ఎన్నో యుగాలుగా మౌఖిక సంప్రదాయాలలో భాగంగా ఉన్న విషయాన్ని ఆమె నొక్కి చెప్పారు. అటువంటి అనేక పాటలు, కథలు ఇప్పుడు కనుమరుగయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తూ,  సంస్కృతి, సంప్రదాయాల ద్వారానే భారతీయ ప్రజాసారం ఇంకా సజీవంగా ఉందని చెప్పారు. చెట్లు నిద్ర పోతాయనే భావనతో రాత్రి వేళల్లో ఆకులు కోయక పోవడం, బావి నుంచి నీటిని తోడకపోవడం వంటి సున్నితమైన, భావోద్వేగ పరమైన వైఖరి ప్రకృతి పట్ల ఉందన్నారు. భారతీయ సంప్రదాయంలో నిర్జీవమైన వస్తువులకు కూడా మానవ లక్షణాలు ఉంటాయని భావిస్తారంటూ, వేడిగా ఉన్న బాణలిపై నీరు పోస్తే దానికి ఇబ్బంది అవుతుందని పోయరంటూ ఉదాహరణ ఇచ్చారు. మన విస్తృత సాంస్కృతిక వారసత్వాన్ని అర్థం చేసుకోవలసిన ప్రాముఖ్యతను ప్రస్తుత తరం అర్థం చేసుకోవాలని నొక్కి చెప్తూ, తమ మూలాలతో అనుసంధానమైనవారు జీవితంలో అద్భుతంగా రాణిస్తారని అన్నారు. ఆధునిక మీడియా, నిర్ధిష్టంగా సినిమా పాటలు సామాజిక విలువలను పతనం చేస్తున్నాయని విమర్శిస్తూ, మౌఖిక సంప్రదాయాలకు ప్రచారం జరగాలని ప్రతిపాదించారు. భారతీయ సంప్రదాయాలు వెనుకబడినవనే భావనకు వ్యతిరేకంగా వాదిస్తూ, భారతీయ విలువలను పాశ్చాత్య కొలమానాలు న్యాయంగా కొలవలేవని అన్నారు.

పరిష్కారాలపై దృష్టి పెట్టిన చర్చలు లేకపోవడం గురించి మాట్లాడుతూ, ఏకతా చర్యలు మాత్రమే మనకు సురక్షా కవచంగా ఉంటాయని అన్నారు. అవే మనను ‘స్వ’ ‘ప్ర’ మధ్య భేదాన్ని నివారిస్తాయన్నారు. ప్రజల ఆనందంలో, దుఃఖంలో ఈ లోకం పాలు పంచుకుంటుందన్నారు. సెక్యులరీకరణ కారణంగానే మన సాంస్కృతిక విలువల పతనం ప్రారంభ మైందంటూ, తన ధర్మపరమైన మూలాలు లేకుండా సమాజం ఎలా మనుగడ సాగిస్తుందని ప్రశ్నించారు. ప్రజలు తమ మూలాలకు తిరిగి వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. వలసవాద భావనల నుంచి విముక్తి దిశగా జరుగుతున్న కృషిని సభకు అధ్యక్షత వహించిన ఐజిఎన్‌సిఎ కార్యదర్శి డా।। సచ్చిదానంద జోషి కొనియాడారు. కాగా, ఆయన ‘లోక్‌మంథన్‌’  ‌పదాన్ని ప్రశ్నిస్తూ, అది మరింత విభజనను  సూచిస్తుందని అభిప్రాయపడ్డారు. భారతీయ సారం, పాటలు అన్నీ కూడా లోక్‌గీత్‌, ‌లోక్‌అర్ధ్‌లో అంతర్నిహితంగా ఉన్నందున ఈ కృషిని ‘భారత్‌ ‌మంథన్‌’ అం‌టే బాగుండేదన్నారు. ప్రతీదీ ప్రారంభమైన చోటే ముగిస్తుందన్న భారతీయ సంప్రదాయమైన ఆవృత ఆలోచన గురించి  ఆయన మాట్లాడారు.


రెండవ సమావేశం – ‘‌పర్యావరణ పట్ల భారతీయ  చైతన్యం’

నదలూ, చెట్లూ మన జీవనంలో అంతర్భాగం…

భారతీయ సాంస్కృతిక, పర్యావరణ వారసత్వం గురించి తన అనర్గళమైన అంతర్దృష్టులతో ‘వాటర్‌ ‌వుమన్‌’‌గా ప్రాచుర్యం పొందిన, పంచతత్వ ఫౌండేషన్‌ ‌వ్యవస్థాపక డైరెక్టర్‌ ‌సుశ్రీ సిప్రా పాఠక్‌ ‌ప్రసంగించారు. భారతమాత సేవకు తమను తాము అంకితం చేసుకున్న లెక్కలేనంతమంది అజ్ఞాత వీరుల సేవలను గుర్తిస్తూ, వనరులు, వాటి వినియోగం, ఆధ్యాత్మిక మధ్య ఉన్న సామరస్యాన్ని నొక్కి చెప్పేందుకు ‘లోక్‌ ‌నుంచి భోగం, భోగం నుంచి యోగం’ అన్న సూక్తిని ఉద్ఘాటించారు. తాను జలాలపై పని చేయడం అన్నది తన ఎంపిక కాదని, నదులే, ముఖ్యంగా నర్మదా మాత తమను గౌరవించి, పరిరక్షించేందుకు తనను ఎంచుకున్నాయని పాఠక్‌ అన్నారు. శతాబ్దాల తరబడి దాడులు, వలసరాజ్య పాలన ఉన్నప్పటికీ భారతీయ సాంస్కృతిక ఐక్యతను సుస్థిరంగా ఉంచేందుకు నదీ సంస్కృతి కీలక పాత్ర పోషించిందన్నారు. రసాయనాలతో కూడిన ఉత్పత్తుల వినియోగం భారీ ఎత్తున పెరిగిందని, ఒకనాడు ఒకటే టూత్‌పేస్ట్‌తో ఉన్న ఇళ్లు ఇప్పుడు ప్రమాదకరమైన వస్తులతో మునిగి తేలుతోందన్నారు. ‘ప్లాస్టిక్‌ ‌వినియోగాన్ని తగ్గించడం, పర్యావరణ అనుకూల పద్ధతులను పాటించడం అన్నది సమాజాన్ని, భవిష్యత్‌ ‌తరాలను కాన్సర్‌ ‌వంటి జబ్బుల నుంచి కాపాడటానికి కీలకమని అప్రమత్త చేశారు. చెట్లను పూజించే భారతీయ సంప్రదాయానికి తిరిగి రావాలంటూ, మన జీవితం చివరిలో కూడా చెట్లు మన జీవిత భాగస్వాములుగా అనుసరిస్తాయని చెప్పారు.

సుస్థిరమైన గ్రామీణ అభివృద్ధికి వినూత్న పద్ధతులను భాగీరథ గ్రామ్‌ ‌వికాస్‌ ‌ప్రతిష్ఠాన్‌ ‌చైర్మన్‌ ‌డా।। ప్రసాద్‌ ‌వామన్‌ ‌దేవ్‌ధర్‌ ‌పంచుకున్నారు. పశు, గో మయం బయోగ్యాస్‌ ‌కేంద్రాల ద్వారా పర్యావరణ అనుకూల ఇంధనంగా మార్చడం గురించి వివరిం చారు. తమ సంస్థ గ్రామీణ ప్రాంతాలలో అటువంటి కేంద్రాలను ఎలా ఏర్పాటు చేస్తోందో వివరించారు. తక్కువ ఆర్ధిక భారంతో వీటిని ఏర్పాటు చేస్తూ పర్యావరణ పరిరక్షణతో పాటు గ్రామీణ సాధికార తను సాధిస్తున్నామని చెప్పారు. స్థిరమైన అభివృద్ధి అన్నది ఆత్మగౌరవంలో ఉందని, ఆధార పడడంపై సాధించరాదని నొక్కి చెప్పారు. సబ్సిడీలు అనేక సందర్భాలలో సుస్థిరత చొరవల విలువను తగ్గిస్తా యని, బయోగ్యాస్‌ ‌కేంద్రాల వంటి వాటి ఏర్పాటుకు సమాజం చేసే కృషి సంప్రదాయ విజ్ఞానాన్ని, ఆధునిక సాంకేతికతకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గిస్తుంద న్నారు. దారిద్య్ర నిర్మూలన, పర్యావరణ పరిరక్షణలో పరిశోధన, సాంకేతికత, బయోటెక్నాలజీ పాత్రను డా।। దేవధర్‌ ‌పట్టి చూపారు.

ఆర్‌ఎస్‌ఎస్‌ అఖిల భారతీయ పర్యావరణ సంయోజక్‌, ‌పర్యావరణవేత్త గోపాల్‌ ఆర్య మాట్లాడుతూ, హరిత (ప్రకృతితో జీవనం) వంటి సంప్రదాయ వ్యవస్థలను పునరుద్ధరించాలని పిలుపిచ్చారు. నీరు, భూమి, అడవి, పశువులు, ప్రజల రక్షణకు ప్రజా అవగాహనను, భాగ స్వామ్యాన్ని, సామూహిక ఉద్యమాలను సమగ్రం చేయవలసిన అవసరాన్ని నొక్కి చెప్పారు. జల్‌ ‌హీ జీవన్‌ (‌నీరే జీవితం) అన్న పదబంధంలో ప్రాచీన విజ్ఞానం ఇమిడి ఉందని ఉద్ఘాటిస్తూ, సుస్థిరమైన భవిష్యత్తు కోసం ప్రకృతితో సమలేఖనమయ్యే జీవన శైలిని అలవరచుకోవాలని కోరారు.


మూడవ సమావేశం – ప్రజా ఆర్ధిక శాస్త్రం

ఆలయ కేంద్రిత ఆర్థిక వ్యవస్థ

కాలాతీతమైన భారతీయ ఆర్ధిక సూత్రాలు, నేడు వాటి ఔచిత్యంపై దృష్టి పెడుతూ జరిగిన ‘లోక్‌ అర్థశాస్త్ర’ సెషన్‌కు తమిళనాడు బీజేపీ ఉపాధ్యక్షుడు, డా।। శ్యామప్రసాద్‌ ‌ముఖర్జీ రీసెర్చ్ ‌ఫౌండేషన్‌ ‌కార్యదర్శి, ట్రస్టీ డా।। పి. కనగసభాపతి అధ్యక్షత వహించారు.

రాజు ధర్మానికీ, వార్తకు పరిరక్షకుడిగా ఉండే వాడని తెలిపారు. భారతీయ ఆర్ధిక వ్యవస్థలో  వార్త – వ్యవసాయం, వర్తక, పాడికి పునాదిగా ఉందని సెంటర్‌ ‌ఫర్‌ ‌పాలసీ స్టడీస్‌ ‌వ్యవస్థాపక చైర్మన్‌ ఎం‌డి శ్రీనివాసన్‌ ‌నొక్కి చెప్పారు. బ్రిటిష్‌ ‌వలసరాజ్య పాలనలో వ్యవసాయం క్షీణించిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తూ, వ్యవసాయానికి కాకుండా పరిశ్రమకు ప్రాధాన్యం ఇస్తున్న ఆధునిక ఆర్ధిక విధానాలను ఆయన విమర్శించారు. దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ దార్శనికతను ఉదహరిస్తూ, అత్యంత ప్రాధాన్యంగా వ్యవసాయాన్ని పునరుద్ధరించాలని, భార•త నాగరికత దృఢత్వాన్ని మరింత నిశ్చితంగా ప్రకటించాలని శ్రీనివాసన్‌ ‌ప్రతిపాదించారు. భారతదేశంలో తరిగిన వ్యవసాయ ఉత్పాదకత (హెక్టార్‌కు 2.3 టన్నులు)ను పట్టి చూపుతూ, వాననీటిపై ఆధార పడటాన్ని తగ్గించేందుకు సుస్థిర మైన నీటిపారుదల వ్యవస్థల అవసరం ఉందనిపిలుపిచ్చారు. వైదిక సాహిత్యం, భగవద్గీత నుంచి ఉదహరిస్తూ, ఆహార భద్రతను, సమాన పంపిణీ అన్నవి పాలనలో ప్రాథమిక అంశాలుగా చేయడ మన్నది నైతిక బాధ్యత అన్నారు.

శతాబ్దాల తరబడి ఇస్లామిక్‌ ఆ‌క్రమణదారులు, ఐరోపా వలసవాద శక్తులు, ముఖ్యంగా బ్రిటిష్‌వారు దేశాన్ని దోపిడీ చేసినప్పటికీ సంపదను ఉత్పత్తిదారుగా భారతదేశానికి గల శక్తిపై చాయిస్‌ ఇం‌టర్నేషనల్‌, ఐఐఎం ‌స్వతంత్ర డైరెక్టర్‌ ‌సందీప్‌ ‌సింగ్‌ ‌ప్రసంగిం చారు. ఈ శక్తికి కారణం లోక్‌విద్య (దేశీయ విజ్ఞానం) లోక్‌ అర్థ (స్థానిక ఆర్ధిక వ్యవస్థలు), ముఖ్యంగా మందిర ఆర్ధిక వ్యవస్థలేనని అన్నారు. కంచి, ఢాకేశ్వరి, సంభలేశ్వరిలను ఉదాహరణలుగా తీసుకుంటూ, ఆలయాలు కర్మకాండలు, వాణిజ్యం, పండుగల ద్వారా నిలకడైన ఆర్ధిక కార్యకలాపాలను నిర్వహిం చాయో వివరించారు. దీపావళి వంటి పండుగలతో లంకె సాంస్కృతిక పద్ధతులు ఇప్పటికీ స్థానిక ఆర్ధిక వ్యవస్థలకు ఎలా ఊతమిస్తున్నాయో ఆయన పట్టి చూపారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు, భారతీయ ఆర్ధిక వ్యవస్థలలో సంప్రదాయంగా వస్తున్న ఆలయ పాత్రను పునరుద్ధరించేందుకు ఆలయ కేంద్రిత ఆర్ధిక వ్యవస్థలను పునరుజ్జీవింప చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

రాజ్‌కోట్‌లో డీజిల్‌ ఇం‌జిన్‌ ఆవిష్కరణలు, నమక్కల్‌లో రవాణా నెట్‌వర్క్‌లను ఉదాహరణ లుగా తీసుకుని భారతీయ వ్యవస్థాపక స్ఫూర్తిని డా।। కనకసభాపతి వివరిం చారు. ఆర్ధిక వృద్ధిని ముందకు తీసుకువెళ్లడంలో మన కుటుంబ వ్యవస్థలు, అత్యధిక పొదుపు రేట్లను, సమాజ సహకార పాత్రను ఆయన ఉద్ఘాటించారు.

‘‘బ్రిటిష్‌ ‌వలసవాదుల దోపిడీ తర్వాతే మనం పేదవారం అయ్యాం. కానీ నేడు భారత్‌ ‌వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్థతో, అత్యధిక సంఖ్యలో వ్యవస్థాపకులు, కార్మిక శక్తిని కలిగి ఉంది,’’ అంటూ భారతీయ శక్తిని ఆయన ప్రశంసించారు. భారతదేశ విజయంలో కుటుంబ వ్యవస్థ, సమాజ సంబంధాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆయన నొక్కి చెప్పారు. ‘‘దేశంలో సగం మంది 1950, 60 దశకాల్లో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నప్పుడు కూడా పొదుపు మొత్తాలు సుమారు 10శాతంగా ఉండేవన్నారు. నేడు, ఎన్‌ఆర్‌ఐలు భారీగా డబ్బు పంపుతుండడంతో అది 30శాతంగా ఉంది’’ అన్నారు.

కోట్లాదిమందికి ఉపాధి కల్పిస్తున్న 60 మిలియన్‌ ‌సంస్థలు భారతదేశ వ్యవస్థాపక స్ఫూర్తిని, దృఢమైన శక్తిని ప్రతిఫలిస్తాయని అన్నారు. కుటుంబంలో, సమాజంలో, జాతి వ్యవస్థలలో పాతుకుని ఉన్న వ్యాపార నెట్‌వర్క్‌లు అటు సహకారాన్ని, ఇటు ఆరోగ్యవంతమైన పోటీని ప్రోత్సహిస్తూ, దేశ ఆర్ధిక వృద్ధిని, స్వావలంబనను ముందుకు తీసుకువెడుతన్నాయన్నారు.

దాదాపు 30శాతం క్షేత్రస్థాయి ఆవిష్కరణలు అన్నీ కూడా సంప్రదాయ విద్యలేని వ్యక్తుల నుంచే వచ్చాయంటూ, కుటుంబ ఆధారిత సంస్థలు, సాంస్కృతిక జ్ఞానం ద్వారా మన ఆర్ధిక వ్యవస్థను సుస్థిరం చేయడంలో మహిళలు పోషించిన కీలక పాత్రను ప్రశంసించారు.

ఆధునిక వృద్ధికి పునాదిగా దేశీయ పరిజ్ఞానం, సాంస్కృతిక వారసత్వంపై దృష్టిపెట్టి భారతీయ నాగరికత ఆర్ధిక సూత్రాలను పునరుద్ధరించాలన్న పిలుపుతో సెషన్‌ ‌ముగిసింది. భారత పురోగతిని సూక్ష్మబుద్ధిగల ప్రజలు, ప్రాచీన సంప్రదా యాలే నడుపుతున్నాయి తప్ప ప్రభుత్వ విధానాలు కాదన్న ఆర్ధికవేత్త జెకె గాల్‌‌బ్రిత్‌ ‌పరిశీలనను ప్రతిధ్వనిస్తూ వక్తలందరూ దానిని అంగీకరించారు.


నాల్గవ సమావేశం – ‘సమ్మిళిత ప్రజా వ్యవస్థ్థ’

సర్వ భావన అసలు అర్థం

సెషన్‌కు ప్రొఫెసర్‌ ‌విష్ణుకాంత్‌ ఎస్‌ ‌చాటపల్లి అధ్యక•త వహించగా, డా।। హర్ష్ ‌చౌహాన్‌ ‌వక్తగా, ఆర్గనైర్‌ ఎడిటర్‌ ‌ప్రఫుల్‌ ‌కేత్కర్‌ ‌మోడరేటర్‌గా వ్యవహరించారు.

‘‘కలుపుకుపోయే వృద్ధిని యాక్టివిజానికి సంబం ధించిన అంశంగా చూస్తారు. కలుపుకు పోవడం, అభివృద్ధి అనే భావనలను మనం వేరేచోటు నుంచి అప్పుతెచ్చుకున్నవి. మనం ‘సర్వ’ గురించి ఆలోచించి నప్పుడు, మనను మనం ఆ ఆలోచనా పక్రియలో జతకలుపుకోము’, అని డా।। హర్ష్‌కుమార్‌ అన్నారు.

‘ఒకసారి ఒక ఎన్జీవో కోసం ఆరు లక్షల విలువైన చెరువు నిర్మించాలని ప్రతిపాదించాం. ఎంతమంది లబ్ధిదారులుంటారు అని వారు అడిగారు. లబ్ధిదారు లను లెక్కించడం ఎలాగా అని నేను ఆశ్చర్య పోయాను. ఎందుకంటే, ఆ నీరు చెట్లను పోషిస్తుంది, జంతువుల దాహాన్ని తీరుస్తుంది, పర్యాటకులకు తోడ్పడుతుంది, ఇంకా చాలా చేస్తుంది. మొత్తానికి వారు నా దృష్టికోణాన్ని అర్థం చేసుకున్నారు కనుక అందరికీ లబ్ధి చేకూర్చే బావిని నిర్మించారు. మన వనవాసీ (గిరిజన) గ్రామాలలో ‘సర్వ’ అంటే అందరూ – మానవులు, జంతువులూ కలిపి’

 అస్పృశ్యత, అసభ్యత అన్న రెండు పదాలు భారతదేశంపై తీవ్ర ప్రభావాన్ని చూపి మనను విభజించాయి. అస్పృశ్య అన్న పదానికి మూలాలు స్పష్టంగా లేనప్పటికీ, అసభ్య అనేది బ్రిటిష్‌ ‌పదం. ఇది గిరిజన సమాజాలాపై అత్యధిక ప్రభావాన్ని చూపింది అని ఆయన వివరించారు. తాను విద్యార్ధిగా ఉన్న రోజులను గుర్తు చేసుకుంటూ, ‘నేను నగరంలో చదువుతున్నప్పుడు, గిరిజనులు ప్రమాదకరమైన వారని, చిత్రమైన దుస్తులు ధరిస్తారనే అభిప్రాయం ఉండటాన్ని గమనించాను. ఈ అభిప్రాయం ఎందుకు కలిగిందంటే ప్రజలు బ్రిటిష్‌ ‌వారు రాసిన పాఠ్యపుస్త కాలు చదవడం, కనీసం గ్రామాలను సందర్శించ కుండా గిరిజన సమాజాలను ప్రతికూల కోణంలో చిత్రించిన సినిమాలు చూడటమే కారణమన్నారు.

‘బ్రిటిష్‌వారు గిరిజనులను ‘వైట్‌మాన్స్ ‌బర్డెన్‌’ (ఇతరులును ఉద్ధరించేపని)గా చూసేవారు. ఈ కారణంగానే మనం వారిని వెలుగులోకి తేవాలని, వారి అభివృద్ధి కోసం పని చేయాలనే నమ్మకాన్ని ఏర్పరచుకున్నాం. మనం సర్వసమావేశి (సమ్మిళితం), గురించి మాట్లాడినప్పుడు మనం ‘సర్వ’లో ఏం చేర్చారో కూడా ఆలోచించాలి’ అని ఆయన పేర్కొన్నారు. మనం సర్వ గురించి మాట్లాడేటప్పుడు మనం కేవలం వికాస్‌పైనే కాకుండా సమృద్ధిపై కూడా దృష్టిపెట్టాలి. ఎందుకంటే, అభివృద్ధి కేవలం ఒక వ్యక్తిగత యూనిట్‌కు పరిమితమైంది కాదని డా।। చౌహాన్‌ ఉద్ఘాటించారు. ‘ఒకసారి మేం చెరువు నిర్మించిన గ్రామాన్ని సందర్శించాను. అక్కడి ప్రజలతో, ‘ఇప్పుడు మీ అభివృద్ధి జరుగుతుంది,’ అన్నాను. అందుకు వారు, ‘లేదు, మేం మరొక గ్రామానికి వెళ్లి అక్కడ చెరువును నిర్మిస్తే అభివృద్ధి జరుగుతుంది’ అని సమాధానమిచ్చారని తన అనుభవాన్ని చెప్పారు.

గిరిజన సమాజం వ్యక్తిగత యాజమాన్యాన్ని విశ్వసించదని, వారు సామాజిక యాజమాన్య సూత్రంపై పని చేస్తారని ఆయన వివరించారు. మరొక వృత్తాంతాన్ని పంచుకుంటూ, ‘ఎన్జీవోలు ఎందుకు విఫలమవుతాయన్న అంశంపై ఐఐఎం ఇందోర్‌కు చెందిన విద్యార్ధి ఒకరు పరిశోధన చేస్తున్నాడు. విఫలం కాని ఒక ఎన్జీవో ఒక దానిని అతడి అధ్య యనంలో గుర్తించాడు. అతడు దాని గురించి మాతో మాట్లాడినప్పుడు, ఇతరుల కోసం పని చేయాలని వ్యక్తులు ఎన్జీవోలలో చేరినప్పటికీ, వారు క్రమంగా తమ స్వంత అభివృద్ధిపై దృష్టిపెడతారు. ఎందుకంటే, వారు సాయం చేయాలనుకున్న సమాజాలు వారి మాట వినవు అని గుర్తించాం. ఆ అనుసంధానత లేకపోవడం అన్నది ఎన్జీవో వైఫల్యాలకు దారి తీస్తుంది. చేయవలసింది ఏమిటంటే, సమాజాలతో ప్రత్యక్షంగా కలిసిపోయి, వారి అభివృద్ధి కోసం వారితో కలిసి పని చేయడం,’’ అన్నారు.

‘‘తాత్వికతను ఐక్యం చేసేందుకు, దేశవ్యాప్తంగా జీవన విధానం స్థిరంగా ఉంటుందని గుర్తించడం ముఖ్యం. సమ్మిళితత్వం, వ్యవస్థాగత సామరస్యాన్ని నిజంగా అర్థం చేసుకునేందుకు, మనం ప్రాచీన గ్రామీణ నిర్మితిని గుర్తు చేసుకోవాలి,’’ అధ్యక్షత వహించిన ప్రొఫెసర్‌ ‌విష్ణుకాంత్‌ ఎస్‌. ‌చాటపల్లి అన్నారు.

‘గ్రామీణ గణతంత్ర భావనను వేదాలలో కూడా ప్రస్తావించారు. ఈ భావన అంతర్గతంగా కలుపుకుపోయే స్వభావం గల క్షేత్రస్థాయి పాలన, పంచాయతీ వ్యవస్థ పై ప్రధానమంత్రి ప్రాధాన్యతను ఇవ్వడంతో సమలేఖనం అవుతుంది’ అని ఆయన అన్నారు.


స్వాతంత్య్ర సమరంలో గిరిజనోద్యమాలు అన్న అంశం మీద జాగృతి సంపాదకుడు డా. గోపరాజు నారాయణరావు ప్రధానోపన్యాసం చేశారు. తరువాత లోక పరివర్తన అన్న అంశం మీద సామాజిక సమరసతా వేదిక కన్వీనర్‌ అప్పాల ప్రసాద్‌ ‌ప్రసంగించారు. దీనికి ప్రముఖ పత్రికా రచయిత, ‘ఆంధప్రదేశ్‌’ ‌పూర్వసంపాదకులు వల్లీశ్వర్‌ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలోనే వకుళాభరణం రామ్‌నరేశ్‌ ‌రచించిన ‘వినరా భారత వీరచరితము’ పద్య కావ్యాన్ని వల్లీశ్వర్‌ ఆవిష్కరించారు. పుస్తకం గురించి క్లుప్తంగా పరిచయం చేశారు. తరువాత రీ డిస్కరింగ్‌ ‌భారత్‌ అనే అంశం మీద ప్రముఖ రచయిత పవన్‌ ‌గుప్తా ఉపన్యసించారు. ఇటీవల పునర్ముద్రణకు నోచుకున్న ‘చదువుల చెట్టు’ (ధరమ్‌పాల్‌ ‌మూల రచన ఆధారంగా ఖండవల్లి సత్యదేవ్‌‌ప్రసాద్‌ అం‌దించిన రచన) ఆవిష్కరించారు. ఈ మూడు పుస్తకాలను సంబిత్‌ ‌ప్రకాశన్‌ ‌సంస్థ ప్రచురించింది. తరువాత స్వదేశీ జీవనం అన్న అంశం మీద ఆర్‌ఎస్‌ఎస్‌ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ సునిల్‌ అం‌బేకర్‌ ‌ప్రధానోపన్యాసం చేశారు.

About Author

By editor

Twitter
YOUTUBE