నవంబర్ 24, 2024, ముగింపు సభ
గత రెండువేల ఏళ్లుగా ప్రయోగాలు చేస్తూ విఫలమౌతూనే ఉన్నవారికి మనం స్పందించాల్సిన అవసరం లేదు. మన దృష్టి తప్పుడు కథనాలలో చిక్కుకుపోతే, లేదా వాటిని ఎదుర్కొంటున్న మన ప్రజలకు మార్గదర్శనం చేయడంపై ఉండాలి. అంతర్జాతీయ వేదికపై మనం మనదైన పద్ధతిలో, మనం ముందస్తుగా నిర్వచించిన కొలమానాలకు అనుగుణంగా వ్యవహరిస్తామని ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ స్పష్టం చేశారు.
శాశ్వతమైన భారతీయ భావనలైన ధర్మం, సృష్టిపై లోతైన దృష్టికోణం ఏమిటో ముగింపు ప్రసంగంలో డా. భాగవత్ అందించారు. ప్రపంచం తన గమ్యం గురించి ఆలోచించకుండా ముందుకు పరుగులు తీస్తున్నప్పుడు, భారత్ ఐక్యత, ఐక్యతకు సంబంధించిన లోతైన సత్యాలపై ఆలోచించిందన్న విషయాన్ని ఆయన చెప్పారు.
‘‘లోక్ (ప్రజల), సృష్టి, ధర్మ మూలాలు అన్నీ సమకాలికమైనవని డా।। భాగవత్ అన్నారు. ఈ మూడూ సహజీవనం చేస్తూ, కాలాంతం వరకు ఉనికిలో ఉంటాయని, అందుకే అవి ‘సనాతనమైనవి’ అని అన్నారు. ఈ మూడూ కలసి ఉండటం వల్ల సహజీవనం సాధ్యమైంది. ఈ మూడింటి తోడ్పాటుతోనే అంతా నడుస్తున్నది. మన పూర్వికులు ఈ సత్యాన్ని గుర్తించారు. ఇది మన ప్రత్యేక వారసత్వం ఏమీ కాదు, మన పూర్వీకులు కనుగొన్నారు కనుక అది సార్వత్రిక సత్యం. మన జీవితం సనాతనమైనది. మన దేశం సనాతనమైనది. మన వస్త్రధారణ మారి ఉండవచ్చు, మన ఆహారపు అలవాట్లు పరిణామం చెంది ఉండవచ్చు కానీ అంతర్గతంగా మనందరం ఒకటిగానే ఉంటాం’’ అని అన్నారు.
‘సముద్రాన్ని మథిస్తున్న సందర్భంలో హాలాహలం ఉత్పన్నమైనట్టు, సవాళ్లు తలెత్తుతాయి. కానీ వాటిని సహిస్తూ, అందరి సంక్షేమం కోసం అమృతాన్ని పంచేందుకు మనం సిద్ధంగా ఉన్నాం,’ అని డా. భాగవత్ అన్నారు. లోక్‌మంథన్ చొరవను గ్రామీణ భారతానికి తీసుకువెళ్లాలని పిలుపిస్తూ, క్షేత్రస్థాయి గొంతుకలను వినేందుకు గ్రామాలలో చిన్నస్థాయి సమావేశాలను నిర్వహించాలని కోరారు.
భిన్నత్వంలో కూడా ఏకత్వం ఉంది. ఏకత్వం లేదా ఐక్యత ఉంటే అంతా మనదే అవుతుంది. అందరూ సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే మనం నిజంగా సంతోషంగా ఉండగలం. ఎవరైనా శాంతి, సంతృప్తిని నిజంగా కోరుకుంటుంటే, ‘సర్వేభవంతు సుఖినః’ స్ఫూర్తి మినహా మరొక మార్గం లేదు. మన దేశంలో, వనరులన్నీ సమాజ యాజమాన్యంలో ఉండేవి, కానీ విదేశీ పాలకులు, ముఖ్యంగా బ్రిటిష్ వారు వచ్చి మన వనరులను దోచుకున్నారు. క్రమంగా ఇది, మనను ప్రస్తుత స్థితికి తెచ్చింది. ఇప్పుడు ఇది మనది అని చెప్పేందుకు మనం నొక్కి చెప్పి, ప్రకటించు కోవలసి వస్తోంది. ఇది దురదృష్టకరం, అవమాన కరం,’’ అని ఆయన అన్నారు.
‘‘స్వంతగా మనను ఓడించగలిగే సామర్ధ్యం విదేశీ ఆక్రమణదారులకు లేదు, నేడు కూడా వారు అంత సమర్ధులు కాదు. ఇది జరగడానికి కారణం మనం ధర్మం నుంచి పక్కదోవ పట్టడమే. మనం ఎవరో మనం మరచిపోయాం, మన ఆత్మగౌరవాన్ని మరచిపోయాం. మనం ఎందుకు అలా విస్మరించాం? ఎందుకంటే, మన జీవిత లక్ష్యాన్ని మనం కోల్పోయాం. ధర్మం అంటే ఏమిటి? భిన్నత్వం ఉన్నప్పటికీ కలసి జీవిస్తూ, ప్రయాణించడమే. ధర్మం నిలకడగా ఉంటే, సృష్టి వృద్ధి చెందుతుంది,’ అని ఆయన అన్నారు.
‘‘అయోధ్య లేకుండా లోకమంగళ (ప్రజా సంక్షేమ) స్ఫూర్తిని కనీసం భారత్ వరకూ అయినా స్పష్టంగా ఊహించలేమని తన ఆశీర్వచనంలో ఆచార్య మిథిలేష్ నందిని శరణ్‌జీ మహారాజ్ అన్నారు. అందుకే, రాముడి కీర్తిని అభివర్ణిస్తూ అన్న మాటలలో లోకాభిరాముడు అన్న మాట ఎంతో ప్రాచుర్యం చెందిందని, ప్రజలకు, ప్రపంచానికి ఎంతో ప్రియమైన వాడు అని అర్థం అన్నారు. ఆయన ఆశీఃప్రసంగం చేశారు.
మరొక ప్రపంచపు శక్తిపై ప్రతిఫలించే ఇంద్రియా తీతమైన సారం ద్వారా లోక్ వ్యక్తమవుతుంది. అందుకే, భారతీయ తాత్వికత, సర్వం ఖల్విదం బ్రహ్మ (అంతా బ్రహ్మమయమే) అని ప్రకటించింది. ఈ సారాంశాన్ని గ్రహించగలవారు, ఉన్నత, నిమ్నత మధ్య తేడాను గుర్తించి, నిబంధనలను నిర్దేశించి, నిషేధాలను ఏర్పాటు చేయగలరు. ఇంద్రియాతీత సారం లోక్ స్థాయిలో కాలము, ప్రాదేశిక పరిమాణం (టైమ్ అండ్ స్పేస్) ద్వారా వ్యక్తమైనప్పుడు, ప్రకృతి ద్వారా ప్రకటించుకుంటుందని వారికి ఎరుక ఉంటుంది కనుక. అయినప్పటికీ, దీనితో పాటు వికృతులు కూడా ఉద్భవిస్తాయని ఆయన అన్నారు.
భారతదేశం సంస్కృతి ఆధారిత దేశం అని తరచుగా అంటుంటాను. దురదృష్టవశాత్తు, ప్రపంచ ధోరణుల ప్రభావంతో మనం నాగరికతా ఆధారితం అయిన దేశం అవుతున్నాం. నాగరికత అనేది బహిర్గతం, కృత్రిమమైనది కాగా, సంస్కృతి అనేది అంతర్లీనమైంది, ప్రాథమికమైంది. సంస్కృతి సారాన్ని మనం లోతుగా పరిశీలించినప్పుడు, అది ధర్మంలో భాగమై ఉన్నదని కనుగొంటామని ఆయన అన్నారు.
ఉనికిని దాని మూలసారంలో నిర్వహించడమే ధర్మం అన్నారు. ధర్మమంటే ప్రతిదాన్నీ దాని స్వాభావిక రూపంలో స్థిరీకరించే నిబద్ధత. అయితే, సంప్రదాయాలలో తేడాల వల్ల, కాలం, స్థల ప్రభావాల వల్ల, ప్రవర్తనపై ఈ ఒత్తిడులనే ధర్మం అని తప్పుడు ముద్ర వేశాం. ఇదే భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా చర్చలకు దారి తీసింది. ధర్మం ఘర్షణలకు, పోరాటాలకు కారణమవుతోందనే వాదనలు లేవనెత్తారు. కానీ ఇది సత్యం కాదు.
మనం లోక్‌మంథన్‌ను చేపట్టినప్పుడు, ఏమి ఉత్పన్నమవుతుంది? మొదటగా, మనం మథనపు ప్రయోజనాన్ని, లక్ష్యాన్ని అర్థం చేసుకోవాలి. గట్టిపడిన దానిని మెత్తపరచడం, నలగగొట్టి, ద్రవీకరించి, సరళీకరించడమే మథన సారమని వేదాలు వివరించాయి. ఘనీభవించిన సంప్రదాయాలు, ఆచరణలు లేదా ఉద్వేగాలను మరింత సరళీకరించి, అందుబాటులోకి తేవాలన్నది మంథన్ లక్ష్యం. తరతరాలుగా కొనసాగే పద్ధతులు, సంప్రదాయాలు ఘనీభవిస్తాయి. శరీరంలో గడ్డకట్టిన రక్తంలా ఈ కఠినత ఒక తీవ్రమైన జబ్బులా వ్యక్తమవుతుంది. అలాగే, మనం దేశంలో కొన్ని సంప్రదాయాలు కాలక్రమంలో వక్రీకరణకు లోనయ్యాయి. అయితే, అవి ప్రాచీనమైనవి కనుక, మనం వాటికి మద్దతునిచ్చి, వాటి తరఫున వాదించడం కొనసాగిస్తాం. మథనం అనేది ఘనీభవించిన సంప్రదాయాలను ముక్కలు చేసి, వాటిని మెత్తగా, చర్చకు అనుకూలంగా ద్రవీకరిస్తుంది. అది సమాచారాన్ని సరళీకరించి, వ్యక్తుల మధ్య అవగాహనను ప్రోత్సహిస్తుందని ఆయన చెప్పారు.
తన నాగరికతా సంప్రదాయాలను పునరుద్ధ రించుకొని, ప్రపంచ సవాళ్లను ఎదుర్కొని, పరిష్క రించడంలో తనదైన పద్ధతిని దృఢపరచు కోవాలన్న పిలుపుతో నవంబర్ 24న లోక్‌మంథన్ భాగ్యనగర్ 2024 ముగిసింది.