‘‘పాకిస్తాన్, బాంగ్లాదేశ్ వారి ఫిక్సెడ్ డిపాజిట్లు. అవి ఇస్లామిక్ రాజ్యాలు కనుక ఎవరూ అవి మావంటూ డిమాండ్ చేయలేరు. భారతదేశం జాయింట్ అకౌంట్, కనుక ఎంతగా దోచుకోవాలను కుంటే అంతగా దోచుకోవచ్చు,’’ అంటూ బెంగాలీ రచయిత శివ ప్రసాద్ రాయ్ రాసిన మాటలను దేశంలోని ఇస్లామిక్ అతివాదులు స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచీ రుజువు చేస్తూనే ఉన్నారు. దేశంలో వక్ఫ్ పేరుతో, మసీదుల పేరుతో, ఆఖరుకు విద్యుత్ చోరీతో ఇస్లామి స్టులు దేశాన్ని ఆక్రమిస్తున్న తీరుకు బ్రేక్ వేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో హింస పెచ్చరిల్లుతున్నది. ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన భారతదేశంలో గల ఆలయాలు, మందిరాలు తమవంటూ నిన్న కాక మొన్న పుట్టిన మతస్థులు తమ హక్కును ప్రకటించడమే కాదు, వారి నిజాన్ని బయట పెట్టేందుకు ఎవరు యత్నించినా, వారిని బెదిరించడం, ఆ ప్రదేశంలో హింసను రెచ్చగొట్టడం చేస్తున్నారు. ఇటీవలి కాలం వరకూ మతకల్లోలాకు ప్రసిద్ధి చెందిన ఉత్తర్‌ప్రదేశ్‌లోని సంభాల్‌లో కల్కి మందిరాన్ని తిరిగి దక్కించుకునేందుకు చేస్తున్న ప్రయత్నం సందర్భంలో కూడా అదే జరిగింది.
కల్కి జన్మిస్తాడని విశ్వసించే హరిహర మంది రంపై జామా మసీదును నిర్మించారన్న వాదనతో పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది విష్ణుశంకర్ జైన్ వాదనల మేరకు అక్కడ సర్వే చేసి నిజాలు తెలుసుకునేందుకు కోర్టు అనుమతి ఇవ్వడంతో ఈ ఏడాది నవంబర్ 19, 21, 24న అక్కడ కోర్టు పర్యవేక్షణలో పురావస్తు శాఖ సర్వే జరిగింది. ఇక, నవంబర్ 23న మసీదులో శుక్రవారం ప్రార్థనల సందర్భంగా చేసిన రెచ్చగొట్టే ఉపన్యాసాలతో ఉద్రిక్తతలు నెలకొని, పరిస్థితి దిగజారింది. దీనితో అక్కడ జరిగిన హింసలో నలుగురు మరణించారు. ఈ క్రమంలోనే, అక్కడి ఆలయాన్ని కూలగొట్టి మసీదు నిర్మించినట్టు బాబర్‌నామా వంటి చారిత్రిక దస్తావేజులు కూడా ప్రస్తావించిన విషయం ముఖ్య మంత్రి యోగి గుర్తు చేయడం గమనార్హం. అలాగే, శ్రీ మహావిష్ణువు పదవ అవతారమైన కల్కి అవత రించేది సంభాల్‌లోనేని పేర్కొన్నాయి. అయినప్పటికీ అక్కడ పట్టు ముస్లింలదే కావడం గమనార్హం.
క్షీణించిన హిందూ జనాభా శాతం
ఈ ప్రాంతంలో మెజార్టీ జనాభాగా ఉన్న ముస్లింలే హింసకు పాల్పడుతున్నా, వారు మాత్రం మైనార్టీల ముసుగులో దాక్కోవడం, మేధావులు ఆ కథనాన్నే ప్రచారం చేయడమే విషాదకరం. అయితే, భారత్ స్వాతంత్య్రం సాధించి, విభజన జరిగిన సమయంలో సంభాల్ జనాభాలో 45శాతం మంది హిందువులు ఉండగా, ముస్లింల శాతం 55గా ఉంది. కాలక్రమంలో ఈ ప్రాంతంలో హిందూ జనాభా 15-20 శాతానికి పడిపోగా, ప్రస్తుత ముస్లిం జనాభా 80-85 శాతంగా ఉందంటే, అక్కడ ఏం జరిగిందో, జరుగుతోందో మనం ఊహించవచ్చు. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు అది ఎలా జరిగిందో వివరిస్తూ, 1947 నుంచి 209మంది మత ఘర్షణల ఘటనల్లో మరణించారంటూ పేర్కొనడం గమనార్హం.
1947 నుంచే మతకల్లోలాల సంస్కృతి
విభజన సమయం నుంచే సంభాల్ అట్టుడకడం ప్రారంభమైందని, 1947లో ఒక హిందువును మత విద్వేషంతో హతం చేయగా, 1948లో ఆరుగురిని చంపి వేశారని వాస్తవాన్ని యోగి లెక్కలు చెప్పారు. ఇక 1958 నుంచి 1962 మధ్యలో అనేక మత కల్లోలాలు చోటు చేసుకున్నాయని, 1976లో జరిగిన ఘర్షణలలో ఐదుగురు వ్యక్తులు మరణించగా, 1978లో జరిగిన అల్లర్లలో 184మంది హిందువు లను సజీవ దహనం చేయడంతో కొన్ని నెలల పాటు ఆ ప్రాంతంలో కర్ఫ్యూ కొనసాగిన విషయాన్ని యోగి గుర్తు చేశారు. అయితే, ఈ మత విద్వేషాలు ఆగలేదని, 1980ల్లో కూడా రాజుకుని మరిన్ని జీవితాలను బలి తీసుకుందని ఆయన అన్నారు. 1980లో ఒకరిని హత్య చేయగా, 1982లో మరొకరిని, 1986లో నలుగురిని మతోన్మాదంతో ఇస్లామిస్టు అతివాదులు హతం చేశారు. అయినప్పటికీ, హింస అక్కడితో ఆగలేదు, 1990-1992 మధ్య హింస కొనసాగి ఐదుగురి ప్రాణాలను బలి తీసుకోగా, 1996లో ఇద్దరిని బలికొంది. వీటన్నింటిలోనూ 1978లో జరిగిన అల్లర్లు అత్యంత దారుణమైనవి, కశ్మీర్ తరహాలో అక్కడి నుంచి హిందువులు పలాయన మయ్యేందుకు కారణమయ్యాయి. కాగా, తాజా పరిణామాల మధ్య సంభాల్ పొరుగున ఉన్న ఖగ్గుసరాయ్‌లో హఠాత్తుగా అదృశ్యమైన ఆలయం, ఇటీవలే బయటపడడం ఒక విచిత్రం. సంభాల్ చరిత్రలోనే అత్యంత దారుణమైన మతకల్లోలాల అనంతరం దాదాపు 100 హిందూ కుటుంబాలు ఖగ్గూసరాయ్‌ను శాశ్వతంగా వదిలి, ప్రాణాలను దక్కించుకునేందుకు పారిపోయాయి.
రాజకీయ ప్రాబల్యం కోసమే అల్లర్లు?
ఈ అల్లర్లకు మూల కారణం ముస్లింలీగ్ నాయకుడు మంజర్ షఫీ రాజకీయ ఆకాంక్షలను నెరవేర్చుకోవడానికేనని తెలుస్తోంది. 1977లో జరిగిన ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన షఫీ, తన రాజకీయ పరపతిని, పట్టును తిరిగి సాధించు కునేందుకే ఈ అల్లర్లను ప్రారంభించాడనే వాదన ఉంది. 1978, మార్చి 29న స్థానిక ఎస్‌డిఎం కార్యాలయాన్ని షఫీ సందర్శించిన తర్వాతే ఈ అల్లర్లు ప్రారంభమయ్యాయి. అతడి డిమాండ్లను నెరవేర్చకపోవడంతో, షఫీ స్థానిక మార్కెట్‌ను మూసి వేయించేందుకు ప్రయత్నించాడు. అయితే, అటు పోలీసులు, ఇటు హిందూ దుకాణదారులు ప్రతిఘటించడంతో ఘర్షణ ప్రారంభమైంది. ఈ గొడవ తీవ్రతరం కావడంతో అతడి మద్దతుదారులు పోలీసులతో ఘర్షణ పడి, షఫీ మరణించాడనే వదంతిని వ్యాప్తి చేశారుట. దీనితో భారీ హింస ప్రారంభమైంది, ముఖ్యంగా దీపసరాయ్‌లోని హిందువులను లక్ష్యంగా చేసుకుని హింస జరిగింది.
ఇంతకీ 1978లో ఏం జరిగింది?
నాటి మీడియా కథనాల ప్రకారం 29 మార్చి 1978న హోలీ వేడుకల అనంతరం ఈ అల్లర్లు ప్రారంభమయ్యాయి. ఒక ముస్లిం రాజకీయ నాయకుడి అసహనం కారణంగా జరిగి, దాదాపు 184 జీవితాలను బలిగొన్నాయి. దీనితో ఈ ప్రాంతంలో నెలకు పైగా కర్ఫ్యూను విధించారు. మత ఘర్షణల సమయంలో సంభాల్‌లో ప్రముఖ వ్యాపారవేత్త అయిన బన్వరీలాల్ గోయల్ హత్య చేశారు. అదే ఘర్షణలలో ఒక హిందూ ఉపాధ్యాయుడి కుమార్తెను, భార్యను ఎత్తుకువెళ్లి, హిందువులకు వ్యతిరేకంగా ఈ అల్లర్లను, హింసను రెచ్చగొట్టడంలో కీలకపాత్ర పోషించిన మంజర్ షఫీ అనే ధూర్తుడే అత్యంత దారుణంగా అత్యాచారం చేశాడు. హిందువులు ఉపాధ్యాయుడి భార్యను అనంతరం కాపాడారు. ఈ ఘటనల అనంతరమే ఆ హిందూ అధ్యాపకుడి కుటుంబం, తదనంతర కాలంలో బన్వరీలాల్ గోయల్ కుటుంబం సంభాల్‌ను శాశ్వతంగా వీడిపోయారు.
హిందువుల సజీవ దహనం
మత ఘర్షణలు ప్రారంభం కాగానే, అనేకమంది హిందూ దుకాణదారులను తన బావమరిది మురారీ లాల్ ఇంట్లో దాక్కోవలసిందిగా బన్వరీలాల్ కోరాడు. అయితే, ఈ విషయాన్ని ముస్లిం దుకాణదారులు అల్లరిమూకల చెవిన వేశారు. దానితో మతోన్మాదంతో ఊగిపోతున్న ఇస్లామిక్ అల్లరి మూకలు ట్రాక్టర్‌ను ఉపయోగించి మురారీలాల్ ఇంటి గేట్లను విరగొట్టి లోపలికి ప్రవేశించి 24మంది హిందువులను దారుణంగా హత్య చేశారు. చెరుకు గడల పిప్పిని, టైర్లను వారి చుట్టూ ఉంచి, నిప్పు అంటించారు. పరిస్థితి ఎంత ఉద్రిక్తంగా మారిందంటే, అనేకమంది హిందువులు బ్రిజ్‌ఘాట్‌లో తమ కుటుంబ సభ్యులకు దిష్టిబొమ్మలను తయారు చేసి సంకేతాత్మకంగా వాటికి అంత్యక్రియలు చేయవలసి వచ్చింది.
ఈ అల్లర్ల చరిత్ర గురించి తెలిసిన అక్కడి చరిత్రకారుడు సంజయ్ శంకధర్ చెప్పిన మాటలను దైనిక్ భాస్కర్ వంటి పత్రికలు తమ వార్తల్లో ప్రస్తావించాయి. ఈ అల్లర్ల కారణంగా అభద్రతకు గురైన అనేక హిందూ కుటుంబాలు ఆ ప్రాంతాన్ని వదిలివెళ్లిపోయాయని ఆయన చెప్పారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ 1978 మధ్య హిందూ జనాభా పదిశాతం పడిపోయి 35 శాతంగా ఉండగా, ఈ అల్లర్ల అనంతరం వారి జనాభా శాతం 20 శాతానికి పడిపోయింది. 1978 అల్లర్లు సంభాల్ చరిత్రలో ఒక కీలక మలుపుగా మారి, గతంలో ఎన్నడూ లేనంతగా హిందువులు ఆ ప్రాంతాన్ని వదిలిపోయేలా చేశాయి.
సాక్ష్యం చెప్పకుండా బెదిరింపులు
ఈ హత్యాకాండకు పాల్పడిన ఏడుగురు దోషులను వారి బారి నుంచి తప్పించుకున్న ఇద్దరు హిందువులు గుర్తించారు. కానీ, వీరితో పాటుగా ఇతర సాక్షులను కూడా ఎంతగా ఒత్తిడి చేశారంటే, ఈ నిందితుల్లో ఒకడు బన్వరిలాల్ కుమారిడి వ్యాపార భాగస్వామి తమ్ముడిని కాల్చి చంపి, తనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేందుకు ఎవరు ప్రయత్నించినా, అతడికి పట్టిన గతే పడుతుందని హెచ్చరించాడు. దానితో అతడిపై అసలు ఏ కేసూ నమోదు కాలేదు. అక్కడ ఉన్న బన్వర్‌లాల్ కుటుంబం వంటి హిందువులపై 90వ దశకం మొదట్లో మాజీ సమాజ్‌వాది ఎంపీ ఒత్తిడి తేవడంతో వారు సంభాల్‌ను శాశ్వతంగా వదిలిపోయారట. ఏమైనా, కాంగ్రెస్, తదనంతరం వచ్చిన ప్రభుత్వాల సాయంతో అతివాద ముస్లింలు ఈ ప్రాంతంపై పట్టు సాధించి, హిందువుల గొంతులు నొక్కాయన్నది వాస్తవం.
1978 అల్లర్ల కేసును తిరిగి తెరిచేందుకు యోగి నిర్ణయం
ఈ అల్లర్లకు సంబంధించి పోలీసులు నమోదు చేసిన మూడిటితో సహా 169 ఎఫ్‌ఐఆర్లు నమోదు అయ్యాయి. అయినప్పటికీ నేటి వరకూ ఎవరికీ శిక్ష పడలేదు. దీనితో,1978 మతకల్లోలాల కేసును తిరిగి తెరవాలని యుపి ముఖ్య మంత్రి యోగి ఆదిత్యనాథ్ అసెంబ్లీలో ప్రకటించడంతో అక్కడి ఇస్లామిస్టులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ మేరకు సంభాల్ జిల్లా యంత్రాంగాన్ని ఆ హింసకు సంబంధించి నమోదు అయిన కేసుల ఫైళ్లు అన్నింటినీ అప్పచెప్పవల సిందిగా ఆదేశాలు కూడా జారీ చేసి, ఈ కేసులను దర్యాప్తు చేయడంలో, నింది తులకు వ్యతిరేకంగా ఆధారాలను సేకరించడంలో ఏమైనా అవకతవకలు జరిగాయేమోనని పరిశీలిస్తున్నారు. కోర్టు కేసులు ఏ దశలో ఉన్నాయి, సాక్షులు చెప్పిన సాక్షాలు, వారెంట్ల జారీ సహా పలు అంశాలను ఉన్నతాధికారులు పరిశీలి స్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఒకవేళ, కేసులు తిరిగి ప్రారంభమైతే, బాధితులకు న్యాయం జరిగడం తథ్యం.
బయటపడిన శివ హనుమాన్ మందిరం
1978లో అల్లర్ల అనంతరం ముస్లింలు అక్రమించుకున్న వాటిలో హిం దువుల ఆస్తులే కాదు, ఆలయాలు కూడా ఉన్నాయి. అక్రమ కబ్జాలను తొలిగించా లంటూ యోగి ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల మేరకు సంభాల్‌లో ఆ పని ప్రారంభించిన నేపథ్యంలో ప్రాచీన శివ-హనుమాన్ ఆలయం బయట పడింది. దీనిని శుభ్రం చేసి డిసెంబర్ 20న తిరిగి తెరిచి, పూజలు ప్రారంభించారు. కాగా, ముస్లిం అతివాదుల భయానికి అక్కడ పూజలు చేసే బ్రాహ్మణులందరూ పారిపోవడంతో ప్రస్తుతం వేరే ప్రాంతం నుంచి పూజారిని పిలిపించవలసి వచ్చిం దంటే, పరిస్థితి ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. కాగా, ఈ ఆలయం బయటపడినంత అనంతరం వారణాసి సహా పలు ప్రదేశాలలో ముస్లింలు నివసించే ప్రాంతాల్లో హిందూ ఆలయాలు బయటపడినట్టు వార్తలు వస్తున్నాయి.
రాష్ట్రాన్ని దోచుకుతింటున్న సంభాల్ ముస్లింలు
ఇదే సమయంలో షాహీ జామా మసీదు ప్రాంతంలో కబ్జాలకు వ్యతిరేక ఆపరేషన్‌ను నిర్వహించడం గమనార్హం. ఈ సందర్భంగా, మసీదు విస్తృతంగా విద్యుత్తును చోరీకి పాల్పడుతుండటాన్ని అధికారులు గమనించారు. దాదాపుగా 15 నుంచి 20 ఇళ్లలో ముఖ్యంగా స్థానిక సమాజ్‌వాదీ ఎంపీ బర్క్ నివాసం సహా, మసీదులలో ఇదే తంతును గుర్తించారు. ఒక మసీదులోనే 59 ఫ్యాన్లు, ఒక ప్రిఢ్జి, వాషింగ్ మెషిను, దాదాపు 30 లైట్ పాయింట్లను గమనించామని, ఇవన్నీ విద్యుత్ మీటర్‌ను బంద్ చేసి నడుపుతుండడంతో, సునిశితంగా తనిఖీ చేస్తున్నా మని జిల్లా కలెక్టరు చెప్పడంతో అక్కడి ముస్లింలు రాష్ట్రాన్ని ఎలా దోచుకు తింటున్నారో బయటపడింది. స్థానిక ఎంపీ జియా వుర్ రెహ్మాన్ బర్క్ ఇంట్లో కూడా అధికారులు అక్రమ కనెక్షనని నిర్ధారించి విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో పాటు రూ.1.19 కోట్ల జరిమాన విధించారు ఈ అంశాన్ని సమాజ్ వాది పార్టీ రాజకీయం చేయడం విషాదకరం.
– జాగృతి డెస్క్