– సింహంభట్ల సుబ్బారావు, 6300674054
మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం
అనుకున్న కార్యక్రమాలు ఇబ్బందులు అధిగ మిస్తారు. ప్రముఖులతో పరిచయాలు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. వ్యాపారులు కొత్త పెట్టుబడులు సమీకరిస్తారు. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు లభించే అవకాశం. రాజకీయవేత్తలు, కళా కారులకు కార్యసిద్ధి. ఐటీ నిపుణులు, రచయితలకు మరింత అనుకూల వాతావరణం. 30,31 తేదీల్లో అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.
వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు
ఆదాయం ఊరటనిస్తుంది. కొన్ని కార్యక్రమాలు సాఫీగాచేస్తారు. కుటుంబసమస్యలను పరిష్కరించు కుంటారు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. వాహనసౌఖ్యం. ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారులకు ఆశించిన లాభాలు. ఉద్యోగులకు అనుకూలస్థితి. రాజకీయవర్గాలకు ఒత్తిడులు తొలగు తాయి. కళాకారులు, క్రీడాకారులకు పరిస్థితులు అనుకూలం. 31,1తేదీల్లో ఖర్చులు అధికం. దూరప్రయాణాలు. గణేశాష్టకం పఠించండి.
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ముఖ్య కార్యక్రమాలు విజయ వంతంగా సాగుతాయి. విద్యార్థులకు నూత నోత్సాహం. రాబడి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ అంచనాలు కొన్ని నిజం చేసుకుంటారు. వ్యాపారులకు మరింత లాభాలు. ఉద్యోగులకు విధుల్లో అవాంతరాలు తొలగుతాయి. కళాకారులకు విశేషంగా కలసి వస్తుంది. 2,3తేదీల్లో బంధువులతో విభేదాలు. శారీరక రుగ్మతలు. శివపంచాక్షరి పఠించండి.
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో ప్రత్యేక గుర్తింపు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటాబయటా అనుకూల పరిస్థితులు. స్థిరాస్తి కొనుగోలు యత్నాలు. వ్యాపారస్తులు ఆశించిన లాభాలు. ఉద్యోగస్తులకు ఇబ్బందులు తొలగుతాయి. రాజకీయవేత్తలు, కళాకారులకు శుభవర్తమానాలు. రచయితలు, క్రీడాకారులకు మరింత అనుకూల సమయం. 4,5 తేదీల్లో దూరప్రయాణాలు. ఆప్తులతో విభేదాలు. ఆదిత్య హృదయం పఠించండి.
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆత్మీయులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆదాయం సంతృప్తికరం. శత్రువులు కూడా స్నేహితు లుగా మారతారు. వ్యాపారస్తులు లాభసాటిగా ఉండి ఊరట చెందుతారు. ఉద్యోగస్తులకు అనుకూల సమాచారం. పారిశ్రామికవేత్తలు, కళాకారుల ప్రయత్నాలలో పురోగతి. రచయితలు, క్రీడాకారులకు నూతన అవకాశాలు. జనవరి 3,4 తేదీల్లో కుటుం బంలో ఒత్తిడులు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు
పరిస్థితులను మీకు అనుకూలంగా మలచు కుంటారు. ఏ కార్యక్రమం చేపట్టినా విజయమే. ఆదాయంతోపాటు ఖర్చులు కూడా పెరిగే అవకాశం. అయితే ఖర్చులు కూడా పెరుగుతాయి. స్థిరాస్తుల కొనుగోలులో అవాంతరాలు తొలగుతాయి. వ్యాపారస్తులు లాభాల బాటలో పయనిస్తారు. ఉద్యోగస్తులకు ఉన్నతస్థితి. 30,31 తేదీల్లో దూర ప్రయాణాలు. సూర్యారాధన మంచిది.
తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
అదనపు ఆదాయం సమకూరి ఎటువంటి అవసరాలైనా తీరతాయి. కొత్త కాంట్రాక్టులు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యాపారులకు తగినంత లాభాలు. ఉద్యోగులకు పరిస్థితులు అనుకూలం. రాజకీయవేత్తలకు ఊహించని అవకాశాలు. కళాకారులు, రచయితలకు ముఖ్య సమాచారం. 1,2తేదీల్లో స్నేహితుల నుంచి ఒత్తిళ్లు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ
ముఖ్యమైన కార్యక్రమాలు కొన్ని వాయిదా వేస్తారు. స్వల్ప శారీరక రుగ్మతలు. కష్టపడ్డా ఫలితం కనిపించదు. గృహనిర్మాణాల్లో కొంత జాప్యం. వ్యాపారులకు పెట్టుబడులు ఆలస్యం. ఉద్యోగులకు కొన్ని ఊహించని మార్పులు. కళాకారులకు కొన్ని చికాకులు తప్పవు. రాజకీయ వేత్తలు, క్రీడాకారులకు అంచనాలలో పొరపాట్లు. 2,3 తేదీల్లో శుభవార్తలు. ఉద్యోగయోగం. విష్ణుధ్యానం చేయండి.
ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
రాబడి మరింత ఉత్సాహాన్నిస్తుంది. కొత్త కార్య క్రమాలు చేపడతారు. ఆస్తి వివాదాలు పరిష్కారదశకు చేరుకుంటాయి. వ్యాపారులు తగినంత లాభాలు అందుకుంటారు. కొత్త పెట్టుబడులు. ఉద్యోగులకు ఉన్నతస్థితి. పారిశ్రామికవేత్తలకు కొత్త ఆశలు. కళాకారులు, రచయితలు పట్టుదలతో అవకాశాలు. 4,5తేదీలలో స్నేహితులతో వివాదాలు. అనుకోని ఖర్చులు. శ్రీ నృసింహస్తోత్రాలు పఠించండి.
మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం , ధనిష్ఠ 1, 2 పాదాలు
రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. బంధు వులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆలయాలు సందర్శిస్తారు. ఉద్యోగులకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. కళాకారులకు కొత్త అవకాశాలు. రచయితలు, క్రీడాకారులు లక్ష్యాలు సాధిస్తారు. 31,1 తేదీల్లో అనుకోని ఖర్చులు. బంధువులతో వివాదాలు. శారీరక రుగ్మతలు. హనుమాన్ ఛాలీసా పఠించండి.
కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
రాబడి కోసం ఇంతకాలం పడిన కష్టం ఫలి స్తుంది. సోదరులతో విభేదాలు పరిష్కరించుకుం టారు. స్థిరాస్తి విషయంలో అగ్రిమెంట్లు చేసు కుం టారు. ఒక కోర్టు వ్యవహారంలో అనుకూల పరి స్థితులు కనిపిస్తాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఉత్సాహవంతంగా గడుస్తుంది. 3,4తేదీల్లో వృథా ఖర్చులు. ఆరోగ్య పరమైన చికాకులు. నృసింహస్తోత్రాలు పఠించండి.
మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
కొంత నిరాశ కలిగినా క్రమేపీ ఉత్సాహంగా గడుపుతారు. పరిస్థితులు అనుకూలించి ముందడుగు వేస్తారు. కుటుంబంలో శుభకార్యాలు. పరిచయాలు విస్తృతం. వాహనసౌఖ్యం. విద్యార్థులకు ఫలితాలు సంతోషదాయకం. వ్యాపారస్తులకు మరింత లాభాలు. ఉద్యోగస్తులకు సహచరులతో సఖ్యత. రచయితలు, క్రీడాకారులకు ఉన్నతమైన కాలం. 4,5తేదీల్లో వృథా ఖర్చులు. స్వల్ప అనారోగ్యం. అంగారక స్తోత్రాలు పఠించండి.