– సింహంభట్ల సుబ్బారావు, 6300674054
మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం
ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. భూములు, వాహనాలు కొనుగోలు. రియల్టర్లకు లాభ దాయకంగా ఉంటుంది. ఆలయాలు సందర్శిస్తారు. విద్యార్థులకు పోటీపరీక్షలలో విజయం. రాబడి సంతృప్తికరం. వ్యాపారులకు మరింత అనుకూలం. ఉద్యోగులకు హోదాలు. కళాకారులకు సన్మానం. రచయితలు, క్రీడాకారులు నైపుణ్యతను చాటుకుంటారు. 23.24 తేదీల్లో వృథాఖర్చులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు
కొత్త కార్యక్రమాలు చేపడతారు. యుక్తిగా వివాదాల నుంచి బయటపడతారు. పరిచయాలు మరింత పెరుగుతాయి. ప్రముఖులతో చర్చలు సఫలమవుతాయి. నిరుద్యోగులకు ఒక సమాచారం మరింత ఊరటనిస్తుంది. వ్యాపారులు ఆశించిన పెట్టుబడులు అందుకుంటారు. రాజకీయవర్గాలకు పదవీయోగం. కళాకారులు, రచయితలకు ప్రోత్సాహ కరంగా ఉంటుంది. 24,25 తేదీల్లో వ్యయ ప్రయాసలు. శివపంచాక్షరి పఠించండి.
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఆలోచనలు అమలు చేస్తారు. సోదరులు, సోదరీలతో విభేదాలు తొలగుతాయి. అనుకున్న విధంగా డబ్బు సమకూరుతుంది. సభలు, సమా వేశాలలో పాల్గొంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగు తుంది. కుటుంబంలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. వాహనయోగం. రాజకీయవేత్తలు, క్రీడాకారులు, ర చయితలకు మరింత ఆదరణ లభిస్తుంది. 27,28 తేదీల్లో వృథా ఖర్చులు. దూరప్రయాణాలు. హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
శ్రమ తప్ప ఆశించిన ఫలితం కనిపించదు. బంధువులతో అకారణంగా విభేదాలు. మీ ప్రతి పాద నలను కుటుంబసభ్యులు వ్యతిరేకిస్తారు. కొన్ని సమస్యలు సహనాన్ని పరీక్షిస్తాయి. వ్యాపారులకు కొంత గందరగోళంగా ఉంటుంది. ఉద్యోగులకు మరింత పనిభారం తప్పదు. కళా కారులకు ఒత్తిడులు పెరుగుతాయి. పరిశోధకులు, రచయితలకు విదేశీ పర్యటనలు వాయిదా. 25,26 తేదీల్లో శుభవార్తలు. వాహనయోగం. విష్ణుధ్యానం చేయండి.
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. మీ నిర్ణయాలపై కుటుంబంలో ఆమోదం లభిస్తుంది. వ్యాపారస్తులు గతం కంటే మరింత పుంజుకుంటారు. ఉద్యోగులకు విధుల్లో ఆటంకాలు తొలగుతాయి. రాజకీయవేత్తలు, కళాకారులు, రచయి తలకు ఊరటనిచ్చే ప్రకటన రావచ్చు. 28,29తేదీల్లో వృథా ఖర్చులు. స్నేహితులతో తగాదాలు. అంగారక స్తోత్రాలు పఠించండి.
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు
ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. సన్ని హితుల నుంచి శుభవార్తలు. నూతన ఉద్యో గాన్వేషణలో విజయం. పలుకుబడి పెరుగుతుంది. ఆస్తుల విషయంలో చిక్కులు తొలగుతాయి. వ్యాపా రస్తులకు లాభాలు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. రాజకీయవేత్తలు, కళాకారులు, రచయితలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. 23,24 తేదీల్లో అనుకోని ఖర్చులు. ఆదిత్య హృదయం పఠించండి.
తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఆదాయం సంతృప్తినిస్తుంది. చేపట్టిన కార్య క్రమాలు సజావు. ప్రముఖుల నుంచి ముఖ్య సమా చారం. ఇంటర్వ్యూలు అందుతాయి. ఆధ్యాత్మిక కార్య క్రమాలలో పాల్గొంటారు. వ్యాపారస్తులకు లాభాలు. ఉద్యోగస్తులకు కొత్త హోదాలు. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు, పరిశోధకులకు అరుదైన ఆహ్వానాలు 27,28 తేదీల్లో అనుకోని ప్రయాణాలు. బంధువులతో విభేదాలు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ
ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విచిత్ర మైన సంఘటనలు ఎదురవుతాయి. కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వ హిస్తారు. చేపట్టిన కార్యక్రమాలు సజావు. వ్యాపారులు సంస్థలను విస్తరిస్తారు. ఉద్యోగులకు విధుల్లో అవాంత రాలు. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది.26,27తేదీల్లో అనుకోని ఖర్చులు. ఆంజనేయ దండకం పఠించండి.
ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణబాధలు తొలగుతాయి. బంధువులతో సత్సంబంధాలు. జీవిత భాగస్వామి తరఫున ఆస్తిలాభం. రియల్టర్లకు కలసివచ్చే కాలం. వ్యాపారులు తగినంత లాభాలు. ఉద్యోగులకు ఉన్నత స్థితితోపాటు, గుర్తింపు లభిస్తుంది. రచయితలు, క్రీడా కారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. 23,24ల్లో అనుకోని ప్రయాణాలు. కాలభైరావష్టకం పఠించండి.
మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం , ధనిష్ఠ 1, 2 పాదాలు
కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కొన్ని వ్యవహారాలో పట్టింది బంగారమే కాగలదు. రాబడి ఆశాజనకం. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు రావచ్చు. పారిశ్రామిక వర్గాలకు ఆహ్వానాలు అందు తాయి. రచయితలు, పరిశోధకుల కృషి ఫలిస్తుంది. 25,26 తేదీల్లో అనుకోనిప్రయాణాలు. దుర్గాస్తోత్రాలు పఠించండి.
కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
ఆశించినంత ఆదాయం సమకూరుతుంది. ఆలోచనలు అమలు చేస్తారు. ముఖ్య కార్యక్రమాలు సకాలంలో పూర్తి కాగలవు. ఆత్మీయులతో వివాదాలు తీరతాయి. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారులకు లాభ సాటిగా ఉంటుంది. పారిశ్రామిక వర్గాలకు సంతోషకరమైన సమాచారం. రచయితలు, క్రీడాకారులకు మంచి గుర్తింపు. 26,27 తేదీల్లో ధనవ్యయం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.
మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
ఆదాయం సమృద్ధిగా ఉంటుంది.ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచ యాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారస్తులకు అనుకున్న లాభాలు తథ్యం. ఉద్యో గస్తులు మార్పులు పొందుతారు. పారిశ్రామిక వేత్తలు, కళాకారులు, రచయితలకు విశేషంగా కలసివస్తుంది. 28,29తేదీల్లో దూరప్రయాణాలు. కుటుంబంలో సమస్యలు. కనకధారా స్తోత్రాలు పఠించండి.