– సింహంభట్ల సుబ్బారావు, 6300674054

మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం

మొదట్లో వివాదాలు నెలకొన్నా సర్దుబాటు కాగలవు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. వ్యాపారులు సమస్యలు అధిగమించి లాభాలబాటలో పయనిస్తారు. రాజకీయవేత్తలు, సాంకేతిక నిపుణులకు మరింత అనుకూలత ఉంటుంది. 18,19తేదీల్లో బంధు విరోధాలు. మనశ్శాంతి లోపిస్తుంది. అంగారక స్తోత్రం పఠించండి.


వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు

ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి.  సోదరులు, స్నేహితులతో తగాదాలు. శారీరక రుగ్మతలు బాధిస్తాయి. దేవాలయాలు సందర్శిస్తారు. ప్రత్యర్థుల నుంచి కూడా సమస్యలు. వ్యాపారులకు సామాన్య లాభాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు బదిలీలు, మార్పులు. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు పర్యటనలు వాయిదా పడతాయి. 19,20 తేదీల్లో శుభవార్తలు. వాహనయోగం.విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.


మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు

రాబడి ఆశాజనకంగా ఉంటుంది. కాంట్రాక్టర్లకు శుభవార్తలు అందుతాయి. వాహన యోగం. చర్చలు సఫలం. ప్రముఖ వ్యక్తులు పరిచయం కాగలరు. ఇంటి నిర్మాణయత్నాలలో కద లికలు. వ్యాపారులు మరింతగా లాభాలు గడిస్తారు. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. కళాకారులు సత్కారాలు అందుకుంటారు. 21,22 తేదీలలో వృథా ఖర్చులు. శారీరక రుగ్మతలు. దక్షిణా మూర్తి స్తోత్రాలు పఠించండి.


కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష

రహస్య సమాచారం తెలుసుకుంటారు. ఆశించిన ఆదాయం సమకూరి ఉత్సాహంగా గడుపు తారు. కుటుంబసమస్యల నుంచి బయటపడతారు. విద్యార్ధులకు ఊహించని అవకాశాలు దక్కుతాయి. యత్నకార్యసిద్ధి. అందరిలోనూ ప్రత్యేక గుర్తింపు రాగలదు. వ్యాపారులు లాభాల బాటలో పయ నిస్తారు. ఉద్యోగులకు ఉన్నతస్థితి దక్కుతుంది. 19,20 తేదీలలో ఖర్చులు అధికం. సోదరులతో కలహాలు.అంగారకస్తోత్రం పఠించండి.


సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం

ప్రారంభంలో కొద్దిపాటి చికాకులు, సమస్యలు తప్పకపోవచ్చు. సోదరులు సోదరీలతో ఉత్సాహంగా గడుపుతారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం. వాహనయోగం. దేవా లయాలు సందర్శిస్తారు. వ్యాపారులు కొత్త పెట్టు బడులు అందుకుంటారు. ఉద్యోగులకు ప్రమోషన్లు లభిస్తాయి. 18,19 తేదీల్లో వృథా ఖర్చులు. మానసిక ఆందోళన. నృసింహస్తోత్రాలు పఠనం ఉత్తమం


కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు

ఆస్తి వ్యవహారాలలో కొత్త అగ్రిమెంట్లు. ఆదాయం ఆశాజనకం. అనుకున్న కార్యక్రమాలు విజయవంతం. ఇంటి నిర్మాణప్రయత్నాలు ముమ్మరం. చిరకాల ప్రత్యర్థులు స్నేహితులుగా మారతారు. వ్యాపారులు లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు రాగలవు. కళాకారులకు సన్మానాలు. 20,21తేదీల్లో వివాదాలు. మానసిక అశాంతి. కనకదుర్గా దేవి స్తోత్రాలు పఠించండి.


తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు

ఆలోచనలు తక్షణం అమలు చేస్తారు. ఆదాయం సంతృప్తినిస్తుంది. దేవాలయాలు సందర్శిస్తారు. స్థిరాస్తి వివాదాలు, కోర్టు వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారులకు లాభాలు అందుతాయి. నూతన పెట్టు బడులు అందుతాయి. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు దక్కుతాయి. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు నూత నోత్సాహం, విదేశీ పర్యటనలు. 16,17 తేదీల్లో ఖర్చులు. మానసిక ఆందోళన.విష్ణుధ్యానం చేయండి.


వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ

దూరపు బంధువులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు. సోదరుల నుంచి ధనలాభాలు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారులకు భాగస్వాములతో తగాదాలు తీరతాయి. ఉద్యోగస్తులు కోరుకున్న మార్పులు పొందుతారు. కళాకారులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి.18,19 తేదీలలో బంధువిరోధాలు. శారీరక రుగ్మతలు. శివస్తోత్రాలు పఠించండి.


ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం

అనుకున్న రాబడి దక్కి అవసరాలు తీరతాయి. ఆప్తులు, బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. పరపతి కలిగిన వ్యక్తులతో పరిచయాలు. శత్రువులు కూడా స్నేహితులుగా మారతారు. వ్యాపారులకు మరింత లాభాలు చేకూరుతాయి. ఉద్యోగులు ఒత్తిళ్ల నుంచి బయటపడతారు. సాంకేతిక నిపుణుల యత్నాలు సఫలం.19,20తేదీల్లో అనుకోని ఖర్చులు. కుటుంబ సమస్యలు.శ్రీరామస్తోత్రాలు పఠించండి.


మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం , ధనిష్ఠ 1, 2 పాదాలు

కార్యక్రమాలు సజావుగా కొనసాగుతాయి. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. జీవితభాగస్వామితో వివాదాలు సర్దుబాటు కాగలవు. దేవాలయాలు సంద ర్శిస్తారు. కాంట్రాక్టర్లకు ఊహించని టెండర్లు వ్యాపా రులకు ఆశించిన లాభాలు అందుతాయి. కొత్త భాగస్వాములు చేరతారు. ఉద్యో గులకు ఉన్నతస్థితి.  రాజకీయ వేత్తలకు పదవీయోగాలు. 21,22 తేదీల్లో మానసిక అశాంతి.ఆదిత్య హృదయం పఠించండి.


కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

నూతన వస్తులాభాలు. స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి చేకూరుతుంది. రియల్‌ఎస్టేట్‌ల వారికి ఉత్సాహ వంతంగా ఉంటుంది. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారులు నూతన పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఉద్యోగస్తులకు ఊహించని ఇంక్రిమెంట్లు రాగలవు. కళాకారులకు సత్కారాలు. 16,17తేదీలలో వివాదాలు. శారీరక రుగ్మతలు.అంగారకస్తోత్రం పఠించండి


మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

ఏ కార్యక్రమం చేపట్టినా విజయమే. ఆలోచనలు అమలు చేస్తారు. రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. సన్నిహితులు, బంధువులతో సత్సంబంధాలు. కొన్ని వివాదాలు, సమస్యలు నేర్పుగా పరిష్కరించుకుం టారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు. వ్యాపారులు నూతన పెట్టుబడులతో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు పైస్థాయి అధికారులనుంచి సహాయం. పారిశ్రామికవేత్తలు విదేశీ పర్యటనలు. 17,18తేదీల్లో ఖర్చులు. శివస్తోత్రాలు పఠించండి.

About Author

By editor

Twitter
YOUTUBE