– సింహంభట్ల సుబ్బారావు, 6300674054
మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం
కుటుంబసభ్యులతో ఉల్లాసంగా గడుపు తారు. దేవాలయాల సందర్శన. ఇంటర్వ్యూలకు హాజ రవుతారు. మీ అభిప్రాయాలను నిర్భయంగా వెల్ల డిస్తారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వివాహ యత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారులకు లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. రచయితలు, రాజకీయవర్గాలకు మరింత అనుకూలపరిస్థితులు. 14,15తేదీలలో ఆకస్మిక ప్రయాణాలు. శ్రీరామరక్షా స్తోత్రాలు పఠించండి.
వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు
కొత్త కార్యక్రమాలు చేపడతారు. బంధువులు, శ్రేయోభిలాషుల నుంచి కీలక సమాచారం. ఆస్తి వివాదాలు తీరతాయి. దేవాలయాలు సందర్శిస్తారు. సోదరులతో సఖ్యత నెలకొంటుంది. వ్యాపారులు ఉత్సాహంగా ముందుకు సాగి లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులకు శుభవార్తలు. క్రీడాకారులు, పారిశ్రామికవర్గాలకు విదేశీయానం. 12,13 తేదీల్లో ఆస్తి వివాదాలు. ప్రయాణాలలో ఆటంకాలు. విష్ణుధ్యానం మంచిది.
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
అందరిలోనూ మరింత గుర్తింపు లభిస్తుంది. ఆదాయం పెరిగి అప్పులు తీరతాయి. కుటుంబ సభ్యుల సహకారంతో ముందడుగు. నిరుద్యోగులకు ఊహించని ఇంటర్వ్యూలు. గృహం కొనుగోలు యత్నాలు. వ్యాపా రులకు అధికలాభాలు దక్కే ఛాన్స్. ఉద్యోగులు పైస్థాయి వారి ప్రశంసలు. వ్యవసాయదారులు, కళాకారులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. 9,10 తేదీల్లో వివాదాలు. ఆరోగ్య, కుటుంబ సమస్యలు. కనకదుర్గాదేవిని స్మరించండి.
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
సన్నిహితుల సాయంతో ముందుకు సాగుతారు. కార్య క్రమాలు అనుకున్న రీతిలో సాగుతాయి. దేవా లయాలు సందర్శిస్తారు. అరుదైన ఆహ్వానాలు అందు కుంటారు. అదనపు రాబడి ఉంటుంది. వ్యాపారులకు పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులు తమ సత్తా చాటుకుంటారు. రచయితలు, కళాకారులకు ఆత్మీయ సన్మానాలు. 11, 12 తేదీల్లో బంధువులతో తగా దాలు. ఆరోగ్య సమస్యలు. ఆకస్మిక ప్రయాణాలు. నృసింహస్తోత్రాలు పఠనం ఉత్తమం.
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
విద్యార్థులు, నిరుద్యోగులకు కొత్త అవకాశాలు. దేవాలయాల సందర్శన. కాంట్రాక్టర్లకు అనుకూలం. వాహనయోగం. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టు కుంటారు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు విధి నిర్వహణలో ప్రోత్సాహం. వైద్యులు, రాజకీయ వర్గాలకు ఊరట కలిగించే సమాచారం రావచ్చు. విదేశీపర్యటనలు. 12,13 తేదీల్లో దూరప్రయాణాలు. అనారోగ్యం. కనకధారా స్తోత్రాలు పఠించండి.
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు
బంధువులు ఆపద్బాంధువులుగా ఆదుకుంటారు. కష్టాల నుంచి గట్టెక్కుతారు. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. రాబడి ఆశాజనకం. వాహన సౌఖ్యం. వివాహయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు అనూహ్యమైన ప్రగతి. క్రీడాకారులు, కళాకారులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. 14,15 తేదీల్లో వివాదాలు. అనారోగ్యం. మనశ్శాంతి లోపిస్తుంది. నవగ్రహస్తోత్రాలు పఠించండి.
తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
శ్రేయోభిలాషుల నుంచి శుభవర్తమానాలు. పడిన కష్టానికి ఫలితం. విద్యార్థులు అనుకున్నది సాధిస్తారు. స్రమాజంలో పలుకుబడి. గృహ, వాహనయోగాలు. వ్యాపారులకు మరింత ఉత్సాహం. ఉద్యోగులు చికాకుల నుంచి బయట పడతారు. రాజకీయవేత్తలు పదవులు పొందుతారు. 14,15 తేదీల్లో వృథా ఖర్చులు. మానసిక అశాంతి. దూరప్రయాణాలు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ
కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధువర్గంతో తగాదాలు తీరతాయి. విద్యార్థుల నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. చిరకాల ప్రత్యర్థులు అనుకూలురుగా మారతారు. ఉద్యోగులు కోరుకున్న మార్పులు ఉండవచ్చు. రచయితలు, రాజకీయ వేత్త లకు చిక్కులు వీడి ఉపశమనం లభిస్తుంది. 10,11 తేదీల్లో వృథా ఖర్చులు. కొన్ని ఒప్పందాలువాయిదా. ఆంజనేయ దండకం పఠించండి.
ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని మంచీచెడ్డా విచారిస్తారు. కాంట్రాక్టర్లకు అనుకూలమైన సమయం. వ్యాపారు లకు లాభాలు దక్కుతాయి. ఉద్యోగులు విధుల్లో ముందడుగు వేస్తారు. వైద్యులు, రాజకీయవేత్తలకు ఆహ్వానాలు అందుతాయి. 11,12 తేదీలలో ఆకస్మిక ప్రయాణాలు. మనశ్శాంతి లోపిస్తుంది. బాధ్యతలు పెరుగుతాయి. శ్రీరాఘవేంద్రస్వామిని స్మరించండి.
మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం , ధనిష్ఠ 1, 2 పాదాలు
ఆదాయం నిరుత్సాహపరుస్తుంది. కష్టానికి తగ్గ ఫలితం అంతగా కనిపించదు. కాంట్రాక్టర్లకు కొంత నిరాశాజనకంగా ఉంటుంది. దేవాలయాల సందర్శన. ఇంటాబయటా ఒత్తిడులు రావచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. దూరప్రయాణాలు. నిరుద్యోగులకు నిరాశాజనకం. వ్యాపారులకు చిక్కులు. ఉద్యోగులు పనిభారంతో ఉక్కిరిబిక్కిరి. 12,13 తేదీల్లో శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలబ్ధి. కుటుంబసౌఖ్యం. శివాష్టకం పఠించండి.
కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
ఆప్తులతో వివాదాలు తీరతాయి. విద్యార్థుల అంచనాలు నిజమవుతాయి. దేవాలయాల సందర్శన. వాహనాలు కొంటారు. ఉద్యోగ యత్నాలు కలసివస్తాయి. వ్యాపారులకు అధిక లాభాలు. వ్యవ సాయదారులు, కళాకారులకు విశేషంగా కలసి వస్తుంది..14,15 తేదీల్లో వివాదాలు. ప్రయాణాలలో ఆటంకాలు. ఆరోగ్య సమస్యలు. అన్నపూర్ణాష్టకం పఠించండి.
మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
ఆదాయం ఆశించినంతగా ఉండి అవసరాలు తీరతాయి. భూములు, వాహనాలు కొంటారు. నిరుద్యోగులు ఉద్యోగాలు సాధిస్తారు. కొన్ని వివాదాలు, సమస్యలు తీరతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. దేవాలయాల సందర్శన. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులు విధి నిర్వహణలో పొరపాట్లు సరిదిద్దుకుంటారు. రచయితలు, కళా కారుల యత్నాలు ఫలిస్తాయి. 10,11 తేదీల్లో అనుకోని ఖర్చులు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.