– సింహంభట్ల సుబ్బారావు, 6300674054

మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం

‌శ్రేయోభిలాషులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు.వాహన, గృహయోగాలు. కుటుంబ సభ్యులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. శుభకార్యాలపై చర్చలు జరుపుతారు. ఆరోగ్యం కొంత మెరుగుపడుతుంది. వ్యాపారులకు గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగులకు కొత్త హోదాలు రాగలవు. కళాకారులకు విశేష గుర్తింపు రాగలదు. 2,3 తేదీలలో చర్చల్లో ప్రతిష్ఠంభన. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.


వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు

క్రమేపీ అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. అనుకున్న కాం ట్రాక్టులు పొందుతారు. ఆదాయం సంతృప్తినిస్తుంది. కుటుంబసభ్యులతో విభేదాలు తొలగుతాయి. కొద్దిపాటి రుగ్మతలు. వ్యాపారులకు క్రమేపీ లాభాలు దక్కు తాయి. పారిశ్రామికవేత్తలు విదేశీయానం. కళాకారులు, రచయితలకు సమస్యలు తీరతాయి. 4,5తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు. మానసిక ఆందోళన. గణేశాష్టకం పఠించండి.


మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు

ముఖ్య సమావేశాలలో పాల్గొంటారు. సమాజంలో పలుకుబడి. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. రాబడి మెరుగ్గా ఉంటుంది. కుటుంబంలో బంధువుల తాకిడి. వ్యాపారులకు అనుకున్న లాభాలు. విస్తరణయత్నాలు కలసివస్తాయి. ఉద్యోగులకు అధికారుల ప్రశంసలు. కళాకారులకు అనుకూల సమాచారం. క్రీడాకారులు, వైద్యులకు ఆహ్వానాలు. 6,7తేదీల్లో వృథాఖర్చులు. కుటుంబంలో సమస్యలు. విష్ణుధ్యానం చేయండి.


కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష

ముఖ్యమైన కార్యక్రమాలు సకాలంలో పూర్తి. దేవాలయాలు సందర్శిస్తారు. ఆకస్మిక ధన లాభాలు. రుణబాధలు తొలగుతాయి. కుటుంబంలో చికాకులు తొలగుతాయి. గృహనిర్మాణాలలో అవాంతరాలు తొలగుతాయి. వ్యాపారులు అభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగులకు పైస్థాయి ఆదరణ లభి స్తుంది. రాజకీయ వేత్తలకు శుభవార్తలు. రచయితలు, క్రీడాకారులకు విదేశీయానం. 7,8 తేదీల్లో దూర ప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. దక్షిణమూర్తి స్తోత్రాలు పఠించండి.


సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం

అనూహ్యమైన రీతిలో కార్యక్రమాలు పూర్తి. దూర ప్రాంతాలనుంచి అందిన సమాచారం సంతోషం కలిగిస్తుంది. కొత్త కాంట్రాక్టులు. తీర్థయాత్రలు. కుటుంబంలో అందరి ప్రేమను పొందు తారు. ఉద్యోగులు విధుల్లో అవాంతరాలు అధిగమిస్తారు. పారిశ్రామికవేత్తలకు ఆహ్వానాలు. కళాకారులు, క్రీడాకారులకు కీలక సమాచారం. 3,4 తేదీల్లో దూరప్రయాణాలు. నవగ్రహస్తోత్రాలు పఠించండి.


కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు

కొత్త కార్యాలు. ఆలోచనలు కార్య రూపం. కొన్ని ఉత్సవాలకు హాజరవుతారు. కుటుంబంలో ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్యం గతంకంటే మెరుగు. వ్యాపారులకు అనుకున్న లాభాలు. ఉద్యోగుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. పారి శ్రామికవేత్తలకు నూతనోత్సాహం. కళాకారులు, క్రీడా కారులకు కొత్త అవకాశాలు. 6,7తేదీల్లో  కుటుంబ సభ్యులతో తగాదాలు. శివస్తోత్రాలు పఠించండి.


తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు

దేవాలయాల సందర్శన. ఇంటినిర్మాణయత్నాలు సాగవు. రావలసిన సొమ్ము సకాలంలో అందదు. అప్పుచేస్తారు. కుటుంబంలో సమస్యలు ఎదు రవుతాయి. వ్యాపారులు సామాన్య లాభాలు అందు కుంటారు. ఉద్యోగులకు కొన్ని మార్పులు ఉండవచ్చు. కొత్త బాధ్యతలు. కళాకారులు, ఐటీ నిపుణులకు ఒత్తిడులు. 5,6 తేదీల్లో ధనలాభం. వాహనయోగం. ఆంజనేయ దండకం పఠించండి.


వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ

అనుకున్న కార్యాలు నిదానంగా పూర్తి చేస్తారు. తీర్థయాత్రలు. దీర్ఘకాలిక రుణాలు తీరతాయి. కుటుంబంలో మీపై ఆదరాభిమానాలు. వ్యాపారులకు అనుకున్నమేర పెట్టు బడులు. ఉద్యోగులకు కొన్ని బాధ్యతల నుండి విముక్తి. కళాకారులు రెట్టించిన ఉత్సాహంగా గడుపుతారు. రచయితలు అనుకున్నది సాధిస్తారు. 7,8 తేదీల్లో దూరప్రయాణాలు. అనారోగ్యం. దేవీస్తుతి పఠించండి.


ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం

కార్యక్రమాలు అనుకున్న రీతిలో కొనసాగు తాయి. స్థిరాస్తి ఒప్పందాలు. వాహనసౌఖ్యం. ఆదాయం ఆశాజనకం. కుటుంబంలో ఉత్సాహ వంతం. వ్యాపారులకు పెట్టుబడులు సకాలంలో అందుతుంది. ఉద్యోగులకు కోరుకున్న మార్పులు జరిగే వీలుంది. కళాకారులకు అనుకూల పరిస్థితి. రచయితలు, వైద్యుల ఆశలు ఫలిస్తాయి. 2,3తేదీలలో ఆకస్మిక ప్రయాణాలు. సోదరులతో తగాదాలు. ఆదిత్య హృదయం పఠించండి.


మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం , ధనిష్ఠ 1, 2 పాదాలు

కార్యక్రమాలు చకచకా పూర్తి చేస్తారు. శుభవార్తలు. ఇతరుల నుంచి రావలసిన సొమ్ము అందుతుంది. కుటుంబంలో సమస్యలు తీరి ఊరట చెందుతారు. వ్యాపారులకు లాభాలు దక్కే సూచనలు. ఉద్యోగులకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. రాజకీయవేత్తల కృషి ఫలిస్తుంది. క్రీడాకారులు, సాంకేతిక నిపుణులకు ఆహ్వానాలు అందుతాయి. 6,7తేదీల్లో దూరప్రయాణాలు. అనారోగ్యం. ఆంజనేయ దండకం పఠించండి.


కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

అనుకున్న కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. రావలసిన సొమ్ము సమకూరి అవసరాలు తీరతాయి. వ్యాపా రులకు లాభాలు. ఉద్యోగులకు ఉన్నతపోస్టులు రావచ్చు. పారిశ్రామిక వేత్తలు సంస్థల విస్తరణలో విజయం సాధిస్తారు. కళాకారులు, రచ యితలకు శుభవార్తలు. 7,8 తేదీలలో మానసిక అశాంతి. స్నేహితులతో తగాదాలు. శివాష్టకం పఠించండి.


మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

సమాజసేవలో భాగస్వాములవుతారు. వివాహ, ఉద్యోగయత్నాలు కలసివస్తాయి.  స్థిరాస్తి వ్యవహా రాలు సర్దుబాటు•. పాతబాకీలు సైతం వసూలు. కుటుంబంలో సంతోరం. శుభకార్యాల రీత్యా ఖర్చులు ఉండవచ్చు. వ్యాపారులకు పెట్టుబడులకు తగిన వాతావరణం నెలకొంటుంది. పారిశ్రామికవేత్తలు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. కళాకారులు, క్రీడాకారులకు వర్తమానాలు. 3,4 తేదీలలో ఆకస్మిక ప్రయాణాలు. శివపంచాక్షరి పఠించండి.

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE