– సింహంభట్ల సుబ్బారావు, 6300674054

మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం

అనుకున్న కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆదాయం సమృద్ధిగా ఉంటుంది. సేవా కార్యక్రమా లలో పాల్గొంటారు. వ్యాపారులకు లాభాలు అందుతాయి. ఉద్యోగులకు కొత్త పోస్టులు దక్కే అవకాశం. రాజకీయవేత్తలు, కళాకారులకు శుభవార్తలు అందుతాయి. రచయితలకు కొన్ని పురస్కారాలు అందవచ్చు. 4,5 తేదీల్లో దుబారా ఖర్చులు. మానసిక అశాంతి. దూరప్రయాణాలు. ఆంజనేయ దండకం పఠించండి.


వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు

అనుకున్నది సాధించాలన్న తపనతో ముందుకు సాగుతారు. ఊహించని విజయాలు సాధిస్తారు. విద్యార్థులకు ఫలితాలు ఊరటనిస్తాయి. వ్యాపా రస్తులకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు హోదాలు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు నూతనోత్సాహం. పరిశోధకులు,రచయితల యత్నాలు సఫలం. 7,8 తేదీల్లో ఆకస్మిక ప్రయా ణాలు. బంధువులతో తగాదాలు. ఒప్పందాలలో ఆటంకాలు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.


మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు

చిత్రవిచిత్ర సంఘటనలు ఎదురవుతాయి. ఆర్థిక పరిస్థితి గతంకంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో మరింత సఖ్యత నెలకొంటుంది. ఆలో చనలు స్థిరంగాఉండవు. అనుకున్న కార్యక్రమాలు సాఫీగా సాగుతాయి. ఒక ఆహ్వానం సంతోషం కలి గిస్తుంది.  పారిశ్రామిక వేత్తలు, కళాకారులకు కీలక సమాచారం. రచయితలకు అనూహ్యమైన కీర్తి ప్రతిష్ఠలు దక్కుతాయి.9.10 తేదీల్లో ఖర్చులు. ఆరోగ్య సమస్యలు. గణేశాష్టకం పఠించండి.


కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష

మీ అంచనాలు, ఊహలు నిజం కాగలవు. ముఖ్యమైన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. బంధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. చిన్ననాటి స్నేహితులతో ఉత్తరప్రత్యుత్త రాలు సాగి స్తారు. వ్యాపారులు క్రమేపీ లాభాలు ఆర్జిస్తారు. ఉద్యో గులకు పోస్టులు పెరుగుతాయి. కళా కారులకు ఊహించని అవకాశాలు. పరిశోధకులు, రచయిత లకు నూతనోత్సాహం. 4,5తేదీల్లో ఆకస్మిక ప్రయా ణాలు. నవగ్రహస్తోత్రాలు పఠించండి.


సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం

ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతంగా సాగిపోతుంది. రాబడి మరింత పెరుగుతుంది. సన్నిహితుల సాయం అందుతుంది. శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారులకు తగినంత లాభాలు.ఉద్యోగులకు విధుల్లో అవాంతరాలు తొలగుతాయి. రాజకీయవేత్తలు, కళాకారులకు కొత్త అవకాశాలు దగ్గరకు వస్తాయి. క్రీడాకారుల ప్రయత్నాలు ఫలిస్తాయి. 5,6 తేదీల్లో దూర ప్రయాణాలు. కాలభైరవాష్టకం పఠించండి.


కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు

ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సమాజంలో ప్రత్యేక ఆదరణ లభిస్తుంది. భూములు, ఆభరణాలు కొంటారు. ఆదాయానికి ఇబ్బంది లేకుండా గడిచిపోతుంది. వ్యాపారులకు లాభాలు.  ఉద్యోగులు విధుల్లో ప్రతిబంధకాలు అధిగమిస్తారు. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు. రచయితలు, పరిశోధకులకు ఆశాజనకం. 7,8 తేదీల్లో ప్రయాణా లలో మార్పులు. కనకధారా స్తోత్రాలు పఠించండి.


తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు

ఆదాయం ఆశించినంతగా సమకూరి అవసరాలు తీరతాయి. ఆప్తుల సలహాలు, సూచనలు పాటిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారులు లాభపడతారు. ఉద్యోగస్తులకు హోదాలు పెరుగు తాయి. పారిశ్రామికవేత్తల అంచనాలు నిజమవు తాయి. క్రీడాకారులు, పరిశోధకులకు అనుకూలం  6,7 తేదీల్లో ఖర్చులు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.


వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ

మొదట్లో కొన్ని ఇబ్బందులు నెలకొన్నా క్రమేపీ సర్దుబాటు చేసుకుంటారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. వ్యాపారస్తులకు లాభాలు తథ్యం. ఉద్యోగులు విధుల్లో సమస్యలు తీరి ఊరట చెందుతారు. రాజకీయవేత్తల యత్నాలు సఫలం. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు విదేశీ పర్యటనలు చేస్తారు. 9,10 తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు. ఆదిత్యహృదయం పఠించండి.


ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం

కొత్త కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. నిరు ద్యోగులకు ఉద్యోగలాభం కలుగుతుంది. బంధువుల నుంచి ఆసక్తికర సమాచారం అందుతుంది. ఉద్యోగులకు మార్పులు ఉత్సాహాన్నిస్తాయి. రచయితలు, కళాకారులకు ఆహ్వానాలు అందు తాయి. 7,8 తేదీల్లో బంధువులతో తగాదాలు. మానసిక అశాంతి. అదనపు ఖర్చులు. శివపంచాక్షరి పఠించండి.


మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం , ధనిష్ఠ 1, 2 పాదాలు

పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. సమాజంలో గౌరవమర్యాదలు పొందుతారు. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. భూములు, వాహనాలు సమకూర్చుకుంటారు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు రావచ్చు. కళాకారులకు అవకాశాలు. క్రీడాకారులు, పారిశ్రామికవేత్తల కలలు ఫలిస్తాయి. 9,10 తేదీల్లో దూరప్రయాణాలు. కుటుంబంలో సమస్యలు. స్వల్ప అనారోగ్యం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.


కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

ఉద్యోగయత్నాలు సానుకూలం. కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. చేపట్టిన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగులకు విధుల్లో అనుకూల మార్పులు రావచ్చు. రాజకీయవేత్తలు, కళాకారులకు ఊహించని అవకాశాలు. రచయితలు, పరిశోధకులకు నూత నోత్సాహం. 7,8 తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు. ధనవ్యయం. శ్రీకృష్టాష్టకం పఠించండి.


మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

బంధువులు, స్నేహితులతో అకారణంగా తగాదాలు ఏర్పడతాయి. స్థిరాస్తి వివాదాలు నెలకొని సహనాన్ని పరీక్షిస్తాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు. వ్యాపారులు స్వల్ప లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులకు మార్పులు సంభవం. రాజకీయవేత్తలు, కళాకారులకు అంచనాలలో పొరపాట్లు. రచయితల ఆశలు అంతగా ఫలించవు. 4,5 తేదీల్లో శుభవార్తలు, వాహనయోగం. వివాదాల పరిష్కారం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

About Author

By editor

Twitter
YOUTUBE