మానవ శరీరం ఎంత భారీగా ఉన్నా, గుండె మాత్రం పిడికెడే ఉంటుందిట. అయినప్పటికీ, మనిషి ఆరోగ్యంగా తిరిగేందుకు విశ్రమించకుండా, నిరంతరం పని చేస్తుంది.  నేడు ఎలక్ట్రానిక్‌ ‌నుంచి రక్షణ రంగం వరకూ సూక్ష్మమైన సెమీ కండక్టర్లు కూడా అలాగే పని చేస్తున్నాయనడం అతిశయోక్తి కాదేమో. ఎలక్ట్రానిక్స్, ఆటోమోటివ్‌, ‌టెలికమ్యూనికేషన్లలో పెరుగుతున్న మార్కెట్‌ ‌డిమాండ్‌ ‌సెమీ కండక్టర్ల ఉత్పత్తికి బలమైన డిమాండ్‌ను సృష్టిస్తోంది. అత్యంత సూక్ష్మమైన ఈ చిప్‌లను తయారు చేయడం అంత తేలికైన విషయం కాదు. దానికి ఎంతో నైపుణ్యం కావాలి. అత్యధిక సంఖ్యలో ఇంజినీర్లను తయారు చేస్తున్న యువ దేశమైన భారత్‌ ఈ ‌రంగంలో ప్రపంచ నాయకత్వం వహించాలనుకోవడంలో ఆక్షేపించవలసింది ఏమీ లేదు.

పెరుగుతున్న దేశీయ మార్కెట్టు, ప్రభుత్వ సానుకూల చొరవలు, అత్యధిక సంఖ్యలో ప్రతిభగల యువతతో 2030 నాటికి ప్రపంచ సెమీ కండక్టర్ల పరిశ్రమలో ప్రధాన శక్తిగా భారత దేశం ఎదగగలుగు తుంది. అయితే, సాంకేతికత, నైపుణ్యాల (టెక్నాలజీ – స్కిల్స్) ‌మధ్య ఉన్న గణనీయమైన అంతరాలను అధిగమించడం వంటి సవాళ్లను అది ఎదుర్కోవలసి వస్తుంది. ఆ మేరకు కేవలం మాటలే కాదు, చేతలను కూడా భారత ప్రభుత్వం ప్రారంభించింది.

ఆధునిక ఎలక్ట్రానిక్స్‌కు శక్తినిచ్చే కీలక భాగాలైన సెమీ కండక్టర్లకు ప్రపంచ కేంద్రంగా నిలిచేందుకు భారత్‌ ‌యత్నిస్తోంది. మనం నిత్యం ఉపయోగించే ఎలక్ట్రానిక్‌ ‌వస్తువులు, రక్షణ రంగాలలో సెమీ కండక్టర్లకు పెరుగుతున్న ప్రాముఖ్యత, ఆవశ్యకతలతో ప్రపంచం నేడు వాటి వ్యూహాత్మక ప్రాధాన్యతను గుర్తిస్తోంది. ఒక పక్క ప్రపంచ సరఫరా లంకెలో ఏర్పడిన అవరోధాలు, మరోవైపు సాంకేతికత కోసం ఒకరిపై ఒకరు ఆధారపడి ఉన్న నేపథ్యంలో ఈ కీలక రంగంలో తాను ఒక ప్రధాన శక్తిగా అవత రించేందుకు అవకాశాన్ని భారత్‌ ‌పరిగణిస్తోంది. కాగా, భారత్‌ ‌విజయవంతం కావాలంటే అనేక సాంకేతికత, ప్రతిభకు సంబంధించిన సవాళ్లను పరిష్కరించుకోవాలి. ఈ వ్యాసం భారత్‌ ‌ప్రస్తుత సెమీ కండక్టర్‌ ‌రంగ పరిస్థితిని, పూడ్చవలసిన అంతరా లను, దేశం విజయం సాధించేందుకు తన శక్తిని ఎలా ఉపయోగించాలన్న అంశాన్ని చర్చిస్తుంది.

సెమీ కండక్టర్ల వ్యూహాత్మక ప్రాధాన్యత

అటు ఆర్ధిక స్థిరత్వానికీ, జాతీయ భద్రతకు సెమీ కండక్టర్లు నేడు అత్యవసరం అయ్యాయి. యునైటెడ్‌ ‌స్టేట్స్, ‌జపాన్‌, ‌చైనా వంటి దేశాలు సరఫరా లంకెలను పరిరక్షించుకునేందుకు, బహిర్గత మూలాలపై ఆధారపడడాన్ని తగ్గించుకోవడానికి సెమీ కండక్టర్ల ఉత్పత్తికి ప్రాధాన్యతను ఇచ్చాయి. దాదాపుగా ఇవే లక్ష్యాలతో, ఆత్మనిర్భర్‌ ‌భారత్‌ ‌చొరవకు అనుగుణంగా ఈ రంగంలో 2030 నాటికి ప్రపంచ నాయకుడిగా ఎదగాలన్న లక్ష్యంతో భారత్‌ ‌సెమీ కండక్టర్ల మిషన్‌•ను పారంభించింది.

ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక (పిఎల్‌ఐ) ‌పథకంలో భాగంగా దాదాపు 10 బిలియన్‌ ‌డాలర్ల ఆర్ధిక ప్రోత్సాహకాలు సహా భారీ ఆర్ధిక మద్దతును ఇచ్చేందుకు భారత ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. తన సెమీ కండక్టర్‌ ‌లక్ష్యాలను సాధించేందుకు భారత్‌ ‌మొత్తం చిప్‌ ‌రూపకల్పన, ఉత్పత్తి, కూర్పు, పరీక్షిం చడం, ప్యాకేజింగ్‌ (ఎటిఎంపి) సహా మొత్తం విలువ ఆధారిత లంకెను అభివృద్ధి చేసుకోవలసి ఉంది. అభివృద్ధి చెందుతున్న ఐటి రంగం కారణంగా నమూనా రూపకల్పనలో భారత్‌ ‌బలమైన ఉనికిని కలిగి ఉన్నప్పటికీ, సెమీ కండక్టర్‌ ‌కల్పన లేదా సృష్టిలో, ఉత్పత్తిలో గణనీయమైన సాంకేతిక, నైపుణ్యాల అంతరాలను, లోటును ఎదుర్కొంటోంది.

సాంకేతిక సవాళ్లు

భారత్‌కు అతి పెద్ద సవాలు సెమీ కండక్టర్‌ ‌తయారీ కేంద్రాలు (ఫ్యాబ్స్) ఉనికిలో లేకపోవడమే. ఈ ఫ్యాబ్స్‌ను నిర్మించడానికి అత్యంత స్వచ్ఛమైన నీరు (అల్ట్రా ప్యూర్‌ ‌వాటర్‌), ‌విశ్వసనీయ ఇంధనం (విద్యుత్‌), ఆధునిక సాంకేతికత సహా అత్యాధునిక మౌలిక సదుపాయాలు అవసరం అవుతాయి. అదనంగా, ఒక ఫ్యాబ్‌ను ఏర్పాటు చేయడానికి భారీ ఆర్ధిక పెట్టుబడులు, సాంకేతిక నైపుణ్యం, ముడి సరుకు అందుబాటులో ఉండటం అవసరం. నానో మీటర్‌ (‌మీటరులో వెయ్యి కోట్ల వంతు) స్కేల్‌ (‌దాదాపు 2 నానోమీటర్ల)లో ఫ్యాబ్రికేషన్‌ ‌పని చేయాలి. ఇందుకు భారత్‌ అత్యాధునిక సాంకేతికత లను అభివృద్ధి చేసుకోవలసి ఉంది.

సెమీ కండక్టర్ల రూపకల్పనలో విజయాలున్నప్ప టికీ, భారత్‌ ‌సెమీ కండక్టర్ల విలువ లంకెలో వెనుకబడి ఉంది- అవి వేఫర్‌ ఉత్పాదన, పరీక్ష, ప్యాకేజింగ్‌. ఇం‌దుకు భిన్నంగా, తైవాన్‌, ‌దక్షిణ కొరియా, చైనా సెమీకండక్టర్ల ఉత్పాదనకు చుట్టూ పూర్తి పర్యావరణ వ్యవస్థను (ఈకో సిస్టమ్‌) అభివృద్ధి చేసుకున్నాయి. ఉదాహరణకు ఈ రంగంలో తైవాన్‌ ‌విజయానికి కారణం దాని సమగ్ర పర్యావరణ వ్యవస్థే. ప్యాకేజింగ్‌ ‌సాంకేతికతలు, ముడి సరుకు, డిజైన్‌ ‌సాఫ్ట్‌వేర్‌కు తోడ్పడే ఫ్యాబ్స్‌తో సహా స్థానిక సరఫరా వ్యవస్థ గల సమగ్ర వ్యవస్థే తోడ్పడుతోంది. ఇందులో భారత్‌ ‌పోటీపడాలన్నా, ముందుండాలన్నా అటువంటి నమూనాలను అనుసరించాలి.

నైపుణ్యాల కొరత, విద్య

సెమీ కండక్టర్ల రంగంలో నైపుణ్యం కలిగిన ప్రొఫెషనల్స్ ‌కొరత అనేది మరొక ప్రధాన సవాలు. పరిశ్రమ డిమాండ్‌ను నెరవేర్చేందుకు 2030 నాటికి భారత్‌కు 1.2 మిలియన్ల మంది నైపుణ్యం కలిగిన కార్మికులు కావాలి. ప్రతి ఏడాదీ లక్షలమంది ఇంజినీర్లను భారత్‌ ‌తయారు చేస్తున్నప్పటికీ, కొద్దిమందికి మాత్రమే సెమీకండక్టర్‌ ‌సంబంధిత పాత్రలకు అవసరమైన ప్రత్యేక విజ్ఞానం ఉంటోంది. ప్రస్తుత విద్యా వ్యవస్థ చిప్‌ ‌రూపకల్పన, ఉత్పత్తికి అవసరమైన ఆధునిక ఎలక్ట్రానిక్స్, ‌నానో టెక్నాలజీ, వస్తు పరిశోధన విభాగాలలో వెనుకబడి ఉన్నది.

సెమీకండక్టర్‌ ‌సాంకేతికతలో నాయకత్వం వహిస్తున్న అమెరికా, దక్షిణ కొరియా వంటి దేశాలు ‘స్టెమ్‌’ ‌సాంకేతికతల (సైన్స్, ‌టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, ‌మాథమెటిక్స్) ‌విద్యలో భారీగా పెట్టుబడులు పెడుతు న్నాయి. విద్యకు సంబంధిం చిన ప్రపంచ ర్యాంకింగ్‌ ‌లలో 139వ స్థానంలో ఉన్న భారతదేశం, ఈ నైపుణ్యాల అంతరాన్ని పూడ్చేందుకు భారీ సంస్కరణ లను చేపట్టాల్సిన ఆవశ్యకత ఉంది. ఉపాధి కోసం స్టెమ్‌, ‌నైపుణ్యాల సముపార్జన, విజ్ఞాన జాగృతి ప్రోత్సాహం (సంకల్ప్)‌వంటి కార్యక్రమాలకు నూతన విద్యావిధానం ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ, జరగా ల్సింది మరెంతో ఉంది.

యూనివర్సిటీలలో సెమీ కండక్టర్‌ ‌సాంకేతికతకు సంబంధించి ప్రత్యేక కోర్సులను అందించాలి. పరిశ్రమకు, విద్యారంగానికీ మధ్య భాగస్వామ్యాన్ని మరింత విస్తరించవలసి ఉన్నది. నైపుణ్యాలను పెంచుకోవడానికి ప్రస్తుతమున్న ఫ్యాకల్టీకి శిక్షణ, సాంకేతికత సంస్థలలో పరిశోధనలను పెంచి పోషించడం ఇందుకు అవసరం అవుతాయి. తైవాన్‌, ‌దక్షిణ కొరియా, అమెరికాలతో సమన్వయం కావడం ద్వారా ప్రపంచస్థాయి శిక్షణా కార్యక్రమాలను నిర్వహించడం భారత్‌కు తేలిక అవుతుంది.

ప్రపంచ సవాళ్ల నుంచి పాఠాలు నేర్చుకోవడం

తమ సెమీ కండక్టర్‌ ‌పరిశ్రమలను అభివృద్ధి చేసుకోవడంలో అనేక దేశాలు కష్టాలను ఎదుర్కొన్నాయి. ప్రపంచ వైఫల్యాల నుంచి నేర్చుకో వలసిన కీలక పాఠం ఏమిటంటే, ఇందులో వ్యూహాత్మక ప్రణాళిక, లక్ష్యిత పెట్టుబడి అవసర మని. ఉదాహరణకు, అమెరికా సెమీకండక్టర్ల ఉత్పత్తిలో తన నాయకత్వ హోదాను కోల్పోగా, తైవాన్‌, ‌దక్షిణ కొరియా దాని స్థానాన్ని ఆక్రమించాయి. అమెరికా వైఫల్యానికి కారణం, ఫ్యాబ్రికేషన్‌ ‌సాంకేతికతలో తగినంత పెట్టుబడులు పెట్టకపోవడమే.

అలాగే, తన వద్ద అత్యాధునిక సాంకేతికత ఉన్నప్పటికీ, జపాన్‌ ఈ ‌రెండు దేశాలతో తగినంతగా పోటీపడలేకపోయింది. అందుకు కారణం, సెమీ కండక్టర్ల ఉత్పత్తికి సంబంధించిన అసమగ్ర విధానాలు, పరిశోధన, అభివృద్ధికి ప్రభుత్వ తోడ్పాటు లేకపోవడమే. విలువ లంకెను (వాల్యూ చైన్‌) ‌విడివిడిగా కన్నా మొత్తం సెమీ కండక్టర్‌ ‌పర్యావరణ వ్యవస్థలను రూపొందించడంపై దృష్టి పెట్టడం భారత్‌కు అవసరం. దీనితో పాటుగా దీర్ఘకాలిక సమగ్ర వ్యూహంతో, ఇటువంటి తప్పులను నివారించుకోవాలి. పెట్టుబడులు నిర్దిష్టంగా ఉండాలి, సాంకేతిక ప్రతిభపై ఆధారపడి తమ భాగస్వాములను, ప్రాంతాలను ఎంచుకునే స్వేచ్ఛ ప్రైవేటు రంగానికి ఉండాలి తప్ప రాజకీయ ఇష్టాయిష్టాలకు అనుకూలంగా కాదు. ఇది భారీ ప్రపంచ సాంకేతిక సంస్థల నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షిస్తుంది.

భారత్‌కు గల వ్యూహాత్మక లాభాలు

ఎన్ని సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ, భారత్‌ ‌తన లక్ష్యాలను సాధించేందుకు అనువైన స్థితిలో ఉంది. మొదటగా, సెమీకండక్టర్ల రూపకల్పన కలిగిన ప్రతిభ విషయానికి వస్తే ప్రపంచంలోనే 20 శాతం ప్రతిభ దేశంలోనే ఉండటమే కాక, భారీ సంఖ్యలో సాంకేతికంగా నైపుణ్యం కలిగిన కార్మిక శక్తిని కలిగి ఉంది. అదనంగా, ఎలక్ట్రానిక్స్, ఆటోమోటివ్‌, ‌టెలికమ్యూనికేషన్లలో పెరుగుతున్న మార్కెట్‌ ‌డిమాండ్‌ అన్నది సెమీ కండక్టర్ల ఉత్పత్తికి బలమైన డిమాండ్‌ను సృష్టిస్తుంది. ఇది ఫ్యాబ్‌లను, ఎటిఎంపి యూనిట్లను ఏర్పాటు చేయాలనుకునే బహుళ జాతి సంస్థలకు భారత్‌ ఒక ఆకర్షణీయమైన గమ్యంగా మారుస్తోంది.

భారత ప్రభుత్వ సానుకూల విధానాలు కూడా వృద్ధికి తగిన సమగ్ర వాతావరణాన్ని సృష్టించేందుకు తోడ్పడుతున్నాయి. గుజరాత్‌, అస్సాంలలో సెమీ కండక్టర్‌ ‌ఫ్యాబ్‌లను నిర్మించాలన్న ప్రణాళికలతో పరిశోధన, అభివృద్ధి (ఆర్‌ అం‌డ్‌ ‌డి)కి ఆర్ధిక ప్రోత్సాహకాలు ప్రకటించడం అన్నది బలమైన సెమీ కండక్టర్‌ ‌పర్యావరణ వ్యవస్థను సృష్టించే దిశగా సానుకూల అడుగులు. చైనా నుంచి తమ సరఫరా లంకెలను బహుముఖం చేయాలనుకుంటున్న దేశాల నుంచి తన వ్యూహాత్మక స్థాయిలో ఉన్న భారత్‌ ‌పెట్టుబడులను ఆకర్షించే యత్నం చేయాలి.

లక్ష్య సాధనకు చర్యలు

తన సెమీ కండక్టర్‌ ‌మిషన్‌ను విజయవంతం చేసేందుకు భారత్‌ ‌సాంకేతికత, మానవ పెట్టుబడి సవాళ్లను పరిష్కరించుకోవాలి.

మౌలిక సదుపాయాల అభివృద్ధి:

సెమీ కండక్టర్‌ ‌ఫ్యాబ్‌లను ఆకర్షించేందుకు నీరు, విద్యుత్‌, ‌రవాణా వంటి అత్యవసర మౌలిక సదుపాయాలలో ప్రభుత్వం పెట్టుబడులు పెట్టాలి. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సహకారం కీలకం.

నైపుణ్యాల అభివృద్ధి:

సెమీ కండక్టర్‌ ‌ప్రత్యేక నైపుణ్యాలపై దృష్టి పెట్టి భారత్‌ ‌తన విద్యా వ్యవస్థను పునరుద్ధరించాలి. స్టెమ్‌ ‌విద్యను విస్తరించడం, యూనివర్సిటీలలో విశిష్ట కార్యక్రమాలను అభివృద్ధి చేయడం, పరిశ్రమ- విద్యావేత్తల భాగస్వామ్యాన్ని పెంచి పోషించడం అన్నవి నైపుణ్యాలు కలిగిన కార్మిక శక్తిని నిర్మించేందుకు తోడ్పడతాయి.

పెట్టుబడులను ఆకర్షించడం

కొంతకాలంవరకూ వడ్డీ మనహాయింపు లేదా వడ్డీ తక్కువ రుణాలు వంటి ఆర్ధిక ప్రోత్సాహకాలు విదేశీ సెమీ కండక్టర్‌ ‌కంపెనీలను ఆకర్షిస్తాయి. సాంకేతికత బదలాయింపునకు తైవాన్‌, ‌దక్షిణ కొరియా వంటి దేశాలతో వ్యూహాత్మక భాగస్వామ్యాలు సౌలభ్యాన్ని కలిగిస్తాయి. ఆటంకాలు లేకుండా నిరంతరంగా ఆర్‌ అం‌డ్‌ ‌డీలో పెట్టుబడులు పెట్టడం అన్నది సెమీ కండక్టర్‌ ‌పరిశ్రమలో పోటీతత్వాన్ని నిర్వహించేందుకు కీలకం. అత్యాధునిక చిప్‌ ‌డిజైన్‌, ‌ఫ్యాకేజింగ్‌, ‌ఫ్యాబ్రికే షన్లపై దృష్టి పెట్టి పరిశోధన చేసేందుకు కేంద్రాలను భారత్‌ ఏర్పాటు చేయాలి.

సరఫరా లంకెకు సంబంధించిన పర్యావరణ వ్యవస్థ నిర్మాణం

పరికరాల సరఫరాదారులు, సాఫ్ట్‌వేర్‌ ‌డిజైన్‌ ‌చేసేవారు, ముడి సరుకులు సహా సమగ్రమైన సెమీ కండక్టర్‌ ‌పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడం అన్నది దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి, దేశీయ పరిశ్రమను బలోపేతం చేస్తుంది.

భారత్‌ను ప్రపంచ సాంకేతిక పవర్‌ ‌హౌజ్‌గా మార్చి, ముందుకు తీసుకువెళ్లే సామర్ధ్యాన్ని భారతీయ సెమీ కండక్టర్‌ ‌మిషన్‌కు కలిగి ఉంది. సాంకేతికత, నైపుణ్యాల పరంగా గణనీయమైన అంతరాలు ఉన్నప్పటికీ, పెరుగుతున్న భారత దేశీయ మార్కెట్టు, ప్రభుత్వ సానుకూల చర్యలు, సమృద్ధిగా ఉన్న ప్రతిభగల యువత దాని విజయానికి ఒక బలమైన పునాదిగా నిలుస్తారు. సెమీకండక్టర్‌ ‌పర్యావరణ వ్యవస్థలో వ్యూహాత్మకంగా పెట్టుబడులు పెట్టడం, ప్రపంచ అనుభవాల నుంచి నేర్చుకోవడం ద్వారా భారత్‌ 2030 ‌నాటికి ప్రపంచ సెమీ కండక్టర్‌ ‌మార్కెట్‌లో ఒక ప్రధాన శక్తిగా అవతరించాలన్న లక్ష్యాన్ని సాధించగలదు.

సెమీ కండక్టర్‌ ఉత్పత్తికి కేంద్రంగా ఉండాలన్న ఆకాంక్ష

  • ప్రస్తుతం ప్రపంచ సెమీకండక్టర్‌ ‌డిజైన్‌ ‌ప్రతిభలో 20 శాతం భారత్‌దే.
  • రానున్న సంవత్సరాలలో పరిశ్రమలో పని చేసేందుకు సిద్ధంగా ఉండే టెక్నీషియన్లను, ఇంజినీర్లు, ఆర్‌ అం‌డ్‌ ‌డి నిపుణులు సహా 85,000 మంది నైపుణ్యం కలిగిన ప్రొఫెషనల్స్‌తో కార్మికశక్తిని సృష్టించాలని భారత ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది.
  • భారతదేశ పరిశోధనా సామర్ధ్యాలను పెంచుకు నేందుకు అనుసంధాన్‌ ‌నేషనల్‌ ‌రీసెర్చ్ ‌ఫౌండేషన్‌ ‌కింద రూ 1 ట్రిలియన్‌ ‌పరిశోధన నిధిని భారత్‌ ఏర్పాటు చేసింది.
  • రాష్ట్ర ప్రభుత్వాలు చురుకుగా పక్రియలో పాలుపంచుకుంటూ ఏర్పాటు చేసే సెమీ కండక్టర్‌ ఉత్పత్తి కేంద్రాలకు 50శాతం ఆర్ధిక మద్దతుతును ప్రభుత్వం అందిస్తోంది.
  • సెమీ కండక్టర్‌ ‌పరిశ్రమకు కీలకమైన ఖనిజాలను సేకరించి, భద్రపరిచేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
  • దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహిస్తూ, విదేశాల నుంచి కూడా ఈ ఖనిజాలను సేకరించేందుకు ప్రభుత్వం క్రిటికల్‌ ‌మినరల్‌ ‌మిషన్‌ను ప్రారంభించింది.
  • జపాన్‌, అమెరికా సహా పలు దేశాలతో భారత్‌ ‌సన్నిహితంగా కలిసి పని చేస్తోంది.
  • క్వాడ్‌ ‌సెమీ కండక్టర్‌ ‌సరఫరా లంకె చొరవలో భారత్‌ ‌కీలక భాగస్వామి. ఇందులో భాగంగా, ప్రపంచ సెమీ కండక్టర్‌ ‌సహకారాన్ని బలోపేతం చేసేందుకు పలు ఒప్పందాలపై సంతకాలు చేసింది.
  • ఈ దశాబ్దం ఆఖరు నాటికి ఎలక్ట్రానిక్స్ ‌రంగాన్ని 500 బిలియన్‌ ‌డాలర్ల స్థాయికి పెంచి, 6 మిలియన్‌ ఉద్యోగాలను సృష్టించాలని భారత్‌ ‌లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో సెమీకండక్టర్‌ ‌ముఖ్య పాత్ర పోషించనుంది.

దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వ చర్యలు

  • భారతదేశ సెమీ కండక్టర్‌ ‌మార్కెట్‌ 2023 ‌నాటికి 38 బిలియన్‌ ‌డాలర్లుగా ఉండగా, 2030 నాటికి 109 బిలియన్‌ ‌డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. సెమీ కండక్టర్ల దేశీయ ఉత్పత్తిని  ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది.
  • దేశంలో సెమీ కండక్టర్ల అభివృద్ధి, డిస్ల్పే ఉత్పత్తి పర్యావరణ వ్యవస్థ కోసం మొత్తం రూ. 76,000 కోట్ల పెట్టుబడితో సెమికాన్‌ ఇం‌డియా కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం ఆమోదించింది. సెమీ కండక్టర్లు, డిస్ప్లే ఉత్పత్తి, డిజైన్‌ ‌పర్యావరణ వ్యవస్థలో పెట్టుబడి పెట్టే కంపెనీలకు ఆర్ధిక మద్దతునివ్వాలన్నది ఈ కార్యక్రమ లక్ష్యం.
  • బ్రౌన్‌ ‌ఫీల్డ్ (‌పునరుద్ధరించిన) ఫ్యాబ్‌గా మొహాలీ లోని సెమీ కండక్టర్‌ ‌ప్రయోగశాలను ఆధునీక రించేందుకు ప్రభుత్వం ఆమోదాన్ని తెలిపింది.

సెమీ కండక్టర్‌ ఉత్పత్తిలో పెట్టుబడులు

  • ప్యాకేజింగ్‌, ‌పరీక్షించే యూనిట్‌తో పాటుగా డిస్ప్లే యూనిట్‌తో సెమీ కండక్టర్‌ ‌ఫ్యాబ్‌ను ఏర్పాటు తొలి దశలో వేదాంత గ్రూప్‌ 5 ‌బిలియన్‌ ‌డాలర్లను పెట్టుబడి పెట్టనుంది.
  • భారత్‌లో ఒఎస్‌ఎటి (ఒసాట్‌) ‌ప్లాంట్‌ ‌కోసం హెచ్‌సిఎల్‌తో కలిసి చేపట్టనున్న ఇంకా పేరు పెట్టని సెమీ కండక్టర్‌ ‌జాయింట్‌ ‌వెంచర్‌ (‌జేవీ)లో ఫాక్స్‌కాన్‌ ‌సంస్థ రూ. 4.24 బిలియన్లు పెట్టుబడి పెట్టనుంది.
  • గుజరాత్‌లోని ధొలేరాలో అదనంగా రెండు ఫ్యాబ్రికేషన్‌ ‌కేంద్రాలు (ఫ్యాబ్స్)‌తో తన సెమీ కండక్టర్‌ ఉత్పత్తి సామర్ధ్యాలను టాటా ఎలక్ట్రానిక్స్ ‌విస్తరించనుంది. తైవాన్‌కు చెందిన పిఎస్‌ఎం‌సి భాగస్వామ్యంతో తలపెట్టిన మొదటి ఫ్యాబ్‌ ‌ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. ఇది ఆటోమేటివ్‌, ఎఐ, ‌వైర్‌లెస్‌ ‌కమ్యూనికేషన్ల రంగాలకు అవసరమైన చిప్స్‌ను ఇది ఉత్పత్తి చేస్తుంది. ఈ కేంద్రం 2026 నాటికి ఉత్పత్తిని ప్రారంభించి, నెలకు 50,000 వేఫర్లను తయారు చేస్తుందని అంచనా.
  • ఇజ్రాయెల్‌కు చెందిన టవర్‌ ‌సెమీ కండక్టర్‌, ‌భారత్‌ అదానీ గ్రూప్‌ ‌మధ్య 10 బిలియన్‌ ‌డాలర్ల విలువైన సంయుక్త సెమీకండక్టర్‌ ‌ఫ్యాబ్‌ ‌ప్రతిపాదన ప్రస్తుతం భారత్‌ ‌సెమీ కండక్టర్‌ ‌మిషన్‌లో (ఐఎస్‌ఎం) ‌భాగంగా సమీక్ష కింద ఉంది.
  • భారత్‌లో 2027నాటికి 15 ఉత్పత్తులను రూపకల్పన చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుని, ఫ్యాబ్‌లేని చిప్‌ ‌కంపెనీని ఏర్పాటు చేసేందుకు 300 మిలియన్‌ ‌డాలర్లు పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నట్టు లార్సన్‌ అం‌డ్‌ ‌టుబ్రో కంపెనీ ప్రకటించింది.
  • గుజరాత్‌, అస్సాంలో గల తన సెమీ కండక్టర్‌ ‌కేంద్రాలకు పరికరాలను, సేవలను కొనుగోలు చేసేందుకు భారత్‌కు చెందిన టాటా ఎలక్ట్రానిక్స్ ‌టోక్యో ఎలక్ట్రాన్‌ (‌టిఇఎల్‌)‌తో ఎంఒయుపై సంతకాలు చేసినట్టు సెప్టెంబర్‌9, 2024‌న వార్తలు వచ్చాయి. ఈ భాగస్వామ్యం కార్మికశక్తి శిక్షణ, ఆర్‌ అం‌డ్‌ ‌డి, సెమీ కండక్టర్‌ ‌మౌలిక సదుపాయాల పెంపుపై దృష్టి పెడుతుంది.
  • సెప్టెంబర్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సింగపూర్‌లో పర్యటించినప్పుడు సెమీ కండక్టర్‌ ‌క్లస్టర్‌ అభివృద్ధి, సెమీ కండక్టర్‌ ‌డిజైన్‌, ఉత్పత్తి ప్రతిభను అలవరచుకోవడం సహా పలు అంశాలలో భారత్‌, ‌సింగపూర్‌ ‌బహుళ ఒప్పందాలపై సంతకాలు చేశాయి.

పెరుగుతున్న ఎగుమతులు

  • 2022లో భారతీయ సెమీ కండక్టర్‌ ‌మార్కెట్‌ ‌విలువను 26.3 బిలియన్‌ ‌డాలర్లుగా విలువ కట్టారు, 2032 నాటికి 26,3 శాతం సిఎజిఆర్‌ ‌విస్తరణతో 271.9 బిలియన్‌ ‌డాలర్లకు పెరుగుతుందని అంచనా వేశారు.
  • 2017లో భారత్‌ ‌నుంచి సెమీ కండక్టర్‌ ఎగుమతులు 0.21 బిలియన్‌ ‌డాలర్లుగా ఉండగా, దిగుమతులు 4.65 బిలియన్లకన్నా ఎక్కువగా ఉన్నాయి.
  • 2019లో ఎగుమతులు 0.33బిలియన్లకు పెరగ్గా, దిగుమతులు 3.15 బిలియన్లకు పడిపోయాయి.
  • 2020లో కొవిడ్‌ ‌మహమ్మారి, ప్రపంచ ఆర్ధిక విధ్వంసం ప్రభావంతో ఎగుమతులు, దిగు మతులు రెండూ తిరోగమనంలో ఉన్నాయి.
  • 2022లో భారత్‌ ‌నుంచి ఎగుమతులు ఎన్నడూ లేనివిధంగా 0.52 బిలియన్లకు పెరిగాయి.

విదేశీ  కీలక పెట్టుబడిదారులు

  • మైక్రాన్‌ ‌టెక్నాలజీ
  • అప్లైడ్‌ ‌మెటీరియల్స్
  • అడ్వాన్స్‌డ్‌ ‌మైక్రో డివైజెస్‌
  • ఫాక్స్‌కాన్‌
  • కార్నింగ్‌

‌భారత కీలక సంస్థలు

  • వేదాంత
  • టాటా ఎలక్ట్రానిక్స్
  • హీరానందానీ
  • రిలయన్స్ ఇం‌డస్ట్రీస్‌ ‌లిమిటెడ్‌
  • లార్సెన్‌ అం‌డ్‌ ‌టుబ్రో (ఎల్‌ అం‌డ్‌ ‌టి)
  • మురుగప్ప

‘శక్తి’కి ప్రోత్సాహం

అమెరికాతో కలిసి భారత్‌ ‌భద్రతా రంగంలో ఏర్పాటు చేస్తున్న  తొలి సెమీ కండక్టర్ల ఫ్యాబ్రికేషన్‌ ‌కేంద్రం భవిష్యత్‌ ‌యుద్ధ తంత్రంలో మనకు సాంకేతిక ప్రయోజనాన్ని అందించనుంది.

రక్షణ లేదా భద్రతా సెమీ కండక్టర్లపై భారత్‌- అమెరికాల మధ్య జరిగిన ఒప్పందం పై ప్రపంచంలో సంచలనం రేకెత్తడానికి కారణం లేకపోలేదు. ఈ ఒప్పందం యుద్ధ రంగంలో భారత్‌ ‌వినియోగించనున్న సైనిక హార్డ్‌వేర్‌కు ఆధునిక గ్రాహకత, సమాచారం, హైవోల్టేజ్‌ ‌విద్యుత్‌ ఎలక్ట్రానిక్స్‌లో భారీ ప్రయోజనాన్ని ఇవ్వనుంది.

ఈ మల్టీ మెటీరియల్‌ (‌బహుళ- పదార్ధ) చిప్పుల ఉత్పత్తి ప్లాంట్‌ ‌చైనా పాకిస్తాన్‌లు సహా దక్షణి, ఆగ్నేయ ఆసియాలో భవిష్యత్‌ ‌యుద్ధాలలో మనకు అదనపు రక్షణను అందిస్తుంది.

అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌, ‌భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన ‘విల్మింగ్టన్‌ ఒప్పందం’ అన్నది భారత్‌ ‌ప్రత్యర్ధులకు సందేశాన్నివ్వడంలో గణీయమైన ప్రాధాన్యతను కలిగి ఉంది. ఈ వార్త వచ్చిన తక్షణమే వెలువడిన స్పందనలను పరిశీలిస్తే,  చైనా కమ్యూనిస్టు పార్టీ, అధ్యక్షుడి  జీ జిన్‌ ‌పింగ్‌ ఈ ‌కీలక ఒప్పందం పట్ల అనాసక్తి ప్రదర్శించడం కనిపిస్తుంది.

కాగా, యుఎస్‌ ‌స్పేస్‌ ‌ఫోర్స్, ‌జనరల్‌ అటామిక్స్‌తో భారత్‌ ‌సెమీ, 3వ సాంకేతిక భాగస్వామ్యానికి ‘ఇండియా సెమీ కండక్టర్స్ ‌మిషన్‌’ ‌తోడ్పాటునందిస్తుంది. ఇన్‌‌ఫ్రారెడ్‌, ‌గాలియం నైట్రైడ్‌, ‌సిలికాన్‌ ‌కార్బైడ్‌ ‌సెమీకండక్టర్ల ఉత్పత్తి అనేది మన భద్రతా రూపావళిలో ఎంతో తోడ్పడుతుంది.

రక్షణలో సెమీ కండక్టర్ల ఒప్పందాన్ని కొందరు విశ్లేషకులు పౌర అణు ఒప్పందంతో పోల్చడం అన్నది భారతీయ భద్రతా/రక్షణ ఉపకరణాలను మరొక స్థాయికి తీసుకువెడతోంది.  పౌర అణు ఒప్పందం సమయంలో నాటి మన్మోహన్‌ ‌సింగ్‌ ‌ప్రభుత్వాన్ని దాదాపు గద్దె దింపేంతగా దేశం లోపల, బయట కూడా రకరకాల హోదాలలో ఉన్న కమ్యూనిస్టు మిత్రులు గొంతులు చించుకున్నట్టుగా ఇప్పుడు కూడా చేసే అవకాశం ఉంది. ప్రధాని మోదీ తాజా అమెరికా పర్యటనలో  ఈ ఒప్పందం కచ్చితంగా ఒక కేంద్ర బిందువే.

అత్యద్భుతమైన సాంకేతిక నైపుణ్యం, ఆవిష్కరణ సామర్ధ్యాలు కలిగిన భారతదేశం ప్రతి ఏడాదీ భద్రతా సెమీకండక్టర్‌ ‌చిప్‌లను సేకరించేందుకు ఒక బిలియన్‌ ‌డాలర్లను వెచ్చించడంలో అర్థం లేదు. ఈ క్రమంలోనే భారత్‌- అమెరికా ఒప్పందంలో భాగంగా కోల్‌కతా విద్యుత్‌ ‌కేంద్రంలో గ్లోబల్‌ ‌ఫౌండ్రీస్‌ ‌ఫెసిలిటీని ఏర్పాటు  చేయడం అన్నది చిప్స్ ఉత్పత్తి సామర్ధ్యాలను విస్తరింప చేయనుంది.

తమ వాణిజ్య, ఉత్పాదక ప్రయోజనాల కోసం చైనాకు చెందిన సెమీకండక్టర్ల విలువ లంకె (వాల్యూచైన్‌) ‌నుంచి తప్పుకోవడానికి సంకేతంగా ఈ ఒప్పందాన్ని చెప్పవచ్చు. సెమీకండక్టర్లకు భారత్‌ ఇస్తున్న ప్రాధాన్యత కారణంగా, దేశంలోనే పారి శ్రామిక అనువర్తనలు తదితరాల కోసం చిప్‌లను ఉత్పత్తి చేసేందుకు అంతర్జాతీయ సంస్థలకు నూతన అవకాశాలు ఏర్పడతాయి. ఉన్నత నాణ్యత కలిగిన చిప్‌లను ప్రతి ఏడాదీ ఉత్పత్తి చేసేందుకు యుఎస్‌, ‌యూరోప్‌, ‌తైవాన్‌, ‌సింగపూర్‌కు చెందిన కంపెనీ లలో భారత్‌ ఎం‌తో చాతుర్యంతో భాగస్వామి అయింది.

ప్రతి రోజూ ఏడు కోట్ల చిప్‌లను ఉత్పత్తి చేసేందుకు రూ. 1.5 లక్షల కోట్లను పెట్టుబడిగా ప్రభుత్వం పెడుతున్నది. విస్తరణవాద చైనా నుంచి విడివడి ప్రత్యామ్నాయ సరఫరా లంకెలను ఏర్పాటు చేయాలన్న విస్తృత లక్ష్యంలో భాగమిది.

ప్రపంచంలోని ఉన్నత శ్రేణి ఐదు భారీ సంస్థల్లో ఒకటిగా ఉద్భవించేందుకు భారత్‌ ‌నాలుగు అత్యాధునిక ఫ్యాబ్రికేషన్‌ ‌ప్లాంట్లను ఏర్పాటు చేస్తోంది. సెమీ కండక్టర్‌ ‌చిప్స్ ‌తయారీ కోసం కేన్స్ ‌సెమీకాన్‌, ‌సిజి పవర్‌ ‌వంటి భారీ కంపెనీలు గుజరాత్‌లోని సనంద్‌లో రెండు కేంద్రాలను ఏర్పాటు చేస్తుండగా, మిగిలిన రెండింటిలో ఒకటి గుజరాత్‌లోని ధడేరా లోనూ, మరొకటి అస్సాంలోని మోరేగాంవ్‌ ‌లోనూ టాటా ఎలక్ట్రానిక్స్ ఏర్పాటు చేయనుంది.

నూతన సెమీకండక్టర్ల పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేసే సామర్ధ్యం గురించి 2021లో భారత్‌ ఒక అవగాహనకు వచ్చింది. సెమీకండక్టర్‌ ‌చిప్స్ ఉత్పతిని, పక్రియలను, అభివృద్ధి, మొత్తం పర్యావరణ వ్యవస్థ పరిణామాన్ని ప్రోత్సహించేందుకు ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక పథకం కింద రూ. 76వేల కోట్లు అందించాలని నిర్ణయించింది. భారత్‌లో సెమీ కండక్టర్ల మార్కెట్టు 2030 నాటికి ప్రస్తుతమున్న 38 బిలియన్‌ ‌డాలర్ల వాణిజ్య అవకాశాల నుంచి 109 బిలియన్‌ ‌డాలర్లకు విస్తరిస్తుందని అంచనా.

సెమీకండక్టర్లనేది అధిక ప్రభావం చూపగల వ్యాపార కార్యకలాపం. అది కేవలం దేశ జీడీపీకి బిలియన్ల డాలర్లను చేర్చడమే కాక, అత్యున్నత నైపుణ్యం కలిగిన మిలియన్ల కొద్దీ ఉద్యోగాలను సృష్టించగల సంభావ్యతను (పొటెన్షియల్‌) ‌కలిగి ఉంది.  దిగుమతులపై ఆధారపడడం తగ్గడమే కాదు, క్రమంగా భారత్‌ ‌పారిశ్రామిక అనువర్తనలు, ఆటోమొబైళ్లు, మొబైల్‌ ‌పరిశ్రమ సహా పలు రకాల పరిశ్రమలకు సెమీకండక్టర్‌ ‌చిప్స్ ‌నికర సరఫరా దారుగా ఉద్భవించనుంది.

భారత్‌ ‌గత కొద్ది ఏళ్లగా చేసుకున్న అనేకానేక ఒప్పందాల వరుసలో విద్యుత్‌ ‌సరఫరా, పారిశ్రామిక జోన్లు, మౌలిక సదుపాయాల సంబంధ లాజిస్టిక్స్‌కు కూడా ప్రోత్సాహం లభించనుంది. ఈ పరిస్థితుల్లో  సెమీకండక్టర్ల నిపుణులకు డిమాండ్‌ ‌సహజంగానే పెరుగుతుంది కనుక విశిష్ట విద్యా కార్యక్రమాలు, నూతన నైపుణ్యాల అభివృద్ధి చొరవలను రూపొం దించి, అమలు చేయవలసి ఉంది.

సెమీకండక్టర్ల సరఫరాకు హామీ ఇవ్వడం ద్వారా ఎలక్ట్రానిక్స్ ‌తయారీ, టెలికమ్యూనికేషన్లు, ఆటోమేటివ్‌ ‌పరిశ్రమ విస్తరణను సృష్టించవచ్చు. భద్రతా ఉపకరణాలు, భవిష్యత్‌ ‌యుద్ధాలు లేక సంఘర్షణలలో సెమీకండక్టర్లకు గల ప్రాధాన్యత కారణంగా భారత్‌ ‌భౌగోళిక-రాజకీయ ప్రభావం కూడా విస్తరించ నుంది. ఇప్పటికే, వినూత్న ప్రాజెక్టు లను చేపట్టేందుకు సెమీకండక్టర్ల వ్యాపారంలో భారీ స్టార్టప్‌ల నెట్‌వర్క్ ‌ప్రారంభం అయింది.

కనుక, గత వైఫల్యాలను పక్కకు పెట్టి, ముందుకు తోసుకుపోవలసిన బాధ్యత భారత్‌పైనే ఉంది.

(- ఆర్గనైజర్‌ ‌నుంచి)

About Author

By editor

Twitter
YOUTUBE