భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు ప్రజాసమస్యలను శాసనసభ సభలో ప్రస్తావిస్తూ, వాటి పరిష్కారానికి చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే శాసనసభ సమావేశా లకు హాజరౌతానని వైసీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్ది పేర్కొనడమేకాక ఎమ్మెల్యేలనూ పంపకపోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా బీజేపీ ప్రజాశ్రేయస్సుకు కృషిచేస్తోంది. ఆ మేరకు టిడ్కో ఇళ్లు, బోధనాసుపత్రుల నిర్మాణంలో జాప్యం, రుషికొండ ప్యాలస్ నిర్మాణం, 108 సర్వీసులు వంటి పలు అంశాలపై పార్టీ సభ్యులు తమ వాదనలు వినిపిస్తున్నారు.
టిడ్కో హౌసింగ్‌పై లఘు చర్చను పార్టీ శాసన సభా పక్ష నేత విష్ణుకుమార్ రాజు ప్రారంభిస్తూ, ‘వైసీపీ ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిచేయక అబ్ధిదారులకు అన్యాయం చేసింది. విలువైన ప్రజాధనాన్ని వృథా చేసింది. రాష్ట్రానికి 7 లక్షల 14 వందల ఇళ్లను కేంద్రం కేటాయించింది. 5 లక్షలు ఇళ్లకు పరిపాలను అనుమతి మంజూరు చేసి 4 లక్షల 54 వేల 706 ఇళ్లకు టెండర్‌లు పిలిచారు. నా ఎస్సీలు, బీసీలు అంటూ అధికారానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి 2 లక్షల 68 వేల 360 ఇళ్లు రద్దు చేశారు. కాంట్రాక్టర్ లకు చెల్లింపులు ఆపేశారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఎంపిక చేసిన లబ్ధిదారులను కక్ష గట్టి మరీ మార్చేశారు. లబ్ధిదారులు మీద రుణాలు తీసుకుని వాడేసుకున్న వైసీపీ ప్రభుత్వం అడ్వాన్సు లుగా కట్టిన డీడీలను కూడా బ్యాంకుల్లో ఇవ్వకుండా అక్రమాలకు పాల్పడిరది. టిడ్కో ఇళ్లకు మంచి రంగులను చెరిపేసి, వైసీపీ రంగులు వేయించారు’ అని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం అక్రమాలన్నిం టిపై దర్యాప్తునకు ఆదేశించాలని ఆయన డిమాండ్ చేశారు.
కక్షసాధింపు ధోరణితో నాశనం..
2022 కల్లా ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలని 2014-19 మధ్య కాలంలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నిర్ణయించారు. అప్పుటి కేంద్ర పురపాలక, పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడు ఆయనతో పలుమార్లు చర్చలు జరిపి దేశంలో ఇతర రాష్ట్రాల కన్నా ఎక్కువగా 7,01,481 టిడ్కో ఇళ్లు ఆంధ్రప్రదేశ్‌కు మంజూరు చేయించారు. వీటిలో తొలుత 5 లక్షల ఇళ్ల నిర్మాణానికి పరిపాలన అనుమతి ఇచ్చారు. 4,54,704 ఇళ్ల నిర్మాణానికి 2017 జూలైలో టెండర్లు పిలిచి వెంటనే ఆ ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారే సమయానికి అంటే 2019, మే నాటికి 77,371 ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేశారు. అయితే తర్వాత వచ్చిన జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో ఇళ్ల నిర్మాణాన్ని నిలిపివేసింది. టీడీపీ ప్రభుత్వం మంజూరు చేసిన 5 లక్షల ఇళ్లలో 2,38,368 ఇళ్లను రద్దు చేసేసింది.మిగిలిన వాటిలో కేవలం 57 వేల ఇళ్లను మాత్రమే మౌలిక సదుపాయా లతో గత ఐదేళ్లలో పూర్తి చేశారు. అంతకుముందు టీడీపీ ప్రభుత్వ హయాంలో 90 శాతం వరకు పూర్తి చేసిన మరో 1.10 లక్షల ఇళ్లను పూర్తి చేసినట్లు చెబుతున్నా.. అవి పేరుకు మాత్రమే. ఇక మిగిలిన ఇళ్లన్నీ అలాగే వదిలేశారు.
ఇష్టానుసారం మార్చేశారు
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద 365 చదరపు అడుగులు, 430 చదరపు అడుగుల్లో రెండు రకాల ఇళ్లను మొదలుపెట్టారు. మొదటి రకం ఇళ్లకు అడ్వాన్సుగా రూ. 50 వేలు, రెండవ రకానికి రూ. లక్ష చొప్పున లబ్ధిదారులు ముందుగానే చెల్లించాలని అప్పట్లో నిర్ణయించగా, వారు ఆనందంగా ముందుకు వచ్చారు. కానీ వైసీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని నిలిపి వేసింది. అడ్వాన్సు కూడా తిరిగి చెల్లించలేదు. టిడ్కో ఇళ్ల సముదాయాల్లో ఆర్థిక కార్యకలాపాల కాంప్లెక్స్ కోసం కేటాయించిన 5 నుంచి 10 ఎకరాలను కూడా లేకుండా చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో టిడ్కో ఇళ్లకు ఎంపిక చేసిన లబ్ధిదారుల్లో చాలా మందిని వైసీపీ ప్రభుత్వం ఇష్టానుసారం మార్చేసింది. 25 శాతం కంటే తక్కువ పనులు పూర్తయిన ఇళ్లను (52 వేలు) అర్థంతరంగా నిలిపివేయడంతో రూ. 339 కోట్ల ప్రజాధనం వృథా అయ్యింది. పనులు చేసిన కాంట్రాక్టర్లకు రూ. 540 కోట్ల బిల్లులు పెండిరగ్‌లో పెట్టేశారు. కరోనా సమయంలో మొబిలైజేషన్ అడ్వాన్సులపై వీవరింగ్ రూ. 110 కోట్లు, డీవియేషన్ ఆఫ్ ఐటమ్స్ కింద రూ. 1,225 కోట్లు, ప్రైస్ అడ్జెస్ట్‌మెంట్ రూ.189 కోట్లు పెండిరగ్ లో ఉన్నాయి. ఇలా టిడ్కో ఇళ్లను అన్ని విధాలుగా నాశనం చేశారు. దీనిపై అధికారులు విచారణ చేస్తున్నారు. ఇళ్లపై వైసీపీ రంగులు వేయడానికి ప్రభుత్వం నుంచి పరిపాలనాపరమైన అనుమతి లేదు. టెండర్లు పిలవలేదు. కేవలం నోటి మాటతో రూ. 300 కోట్లతో రంగులు మార్చేశారు. పనులు చేసిన కాంట్రాక్టర్లకు ఇంతవరకు డబ్బులు చెల్లించలేదు. నిర్మాణం పూర్తికాకుండానే 40,571 టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల పేర్లతో జగన్ ప్రభుత్వం రుణాలు తీసుకుంది. ఇప్పుడు ఆ రుణాలు చెల్లించాలంటూ బ్యాంకు అధికారులు లబ్ధిదారులపై ఒత్తిడి తెస్తున్నారు. వారి అకౌంట్లు ఎన్‌పీఏలోకి వెళ్లిపోయాయి.
‘ఆవాస్ యోజన’ అవకతవకలపై దృష్టి పెట్టండి
వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అమలులో జరిగిన అవకతవకలపై దృష్టి సారించాలని బీజేపీ శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్‌రాజు, ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్‌కు విజ్ఞప్తి చేశారు.2019-24 మధ్య ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద.. నిర్దేశిత లక్ష్యం మేరకు ఇళ్ల నిర్మాణం జరగకపోయినా లబ్ధిదారుల పేరుతో రుణాలు సేకరించి, నిధులు పక్కదారి పట్టించారని ఆరోపించారు. ఇళ్లు పూర్తికాకపోయినా, వాయిదాలు చెల్లించాలంటూ బ్యాంకులు జారీ చేసిన నోటీసులతోలబ్ధిదారులు మానసిక వ్యథకు గురవు తున్నారని, ఇళ్లు పూర్తి చేసిన కాంట్రాక్టర్లకు చెల్లింపులు జరగక 43 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. అలాగే, కొవిడ్ వల్ల నిర్మాణాలు ఆలస్యమైతే, ధరల పెరుగుదల నిబంధనను ప్రభుత్వం పట్టించుకోక 2019 ముందు ప్రారంభించిన ఇళ్లు కూడా పూర్తి కాలేదని తెలిపారు. ఇళ్లు పూర్తయినట్లు అప్పటి సీఎం జగన్ కేంద్రానికి తప్పుడు నివేదిక ఇచ్చారని వివరించారు. దీనిపై స్పందించిన దినకర్, సమగ్ర సమాచారం సేకరించి, సీఎంకు నివేదిక ఇస్తామని తెలిపారు.
కొత్త మెడికల్ కళాశాలల్లో సౌకర్యాలపై….
రాష్ట్రంలో నూతన వైద్య కళాశాలల నిర్మాణంలో గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ దుయ్యబట్టారు. వైద్యకళాశాలల నిర్మాణం విషయంలో జగన్ పక్షపాతం చూపారని,అన్ని మెడికల్ కళాశాలల నిర్మాణానికి ఒకే విధంగా నిధులు ఖర్చుచేయలేదని మండిపడ్డారు. పులివెందులలో కాలేజీ నిర్మాణానికి రూ.500 కోట్లకుగాను రూ.293కోట్లు ఖర్చు చేసి, గిరిజన ప్రాంత విద్యార్థుల కోసం పాడేరులో కళాశాల నిర్మాణానికి పైసా ఖర్చు చేయలేదన్నారు. మార్కాపురం, ఆదోని, పార్వతీపురం మన్యం ప్రాంతాల్లో కేవలం 10 శాతం నిధుల్ని మాత్రమే ఖర్చు చేయడం వివక్ష కాదా? అని సత్యకుమార్ ప్రశ్నించారు. 2019-24 మధ్య కాలంలో రాష్ట్రానికి కేంద్రం మంజూరు చేసిన 17 వైద్య కళాశాలలకు రూ.8,840 కోట్లు ఖర్చు చేయాలి. ఇందులో రూ.4,950 కోట్లు కేంద్రం, రూ.3,500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలి. గడిచిన ఐదేళ్లలో రూ.2,125 కోట్లు ఖర్చు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి చెల్లింపులు జరగలేదు. అరకొర వసతులు, ఫ్యాకల్టీ కొరత కారణంగా రెండో విడత కొత్త కళాశాలల మంజూరుకు జాతీయ వైద్య మండలి (ఎన్‌ఎంసీ) అభ్యంతరం చెప్పింది. దీంతో రెండో విడతలో కేవలం పాడేరు కళాశాల మాత్రమే 50 సీట్లతో ప్రారంభించింది. కొత్త వైద్య కళాశాలల్లో 70 శాతం బోధన సిబ్బంది లేరని, హాస్టల్స్ నిర్మాణం పూర్తి కాలేదన్నారు. కళాశాలలు ప్రారంభిస్తే విద్యార్థుల్ని చెట్లకింద కూర్చో పెట్టి పాఠాలు చెప్పాలా? అని మంత్రి మండిపడ్డారు. వాస్తవాలు ఇలా ఉంటే కూటమి ప్రభుత్వం వల్లే కొత్తగా వైద్య కళాశాలలు మంజూరు కాలేదని జగన్మోహన రెడ్డి సొంత మీడియాలో అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఏడాదిలో తాడేపల్లి ప్యాలెస్, 26 జిల్లాల్లో ప్రార్టీ కార్యాలయాలు, రిషికొండలో ప్యాలెస్ కట్టుకున్న జగన్.. వైద్య కళాశాలలను ఎందుకు పూర్తి చేయలేకపోయారని ప్రశ్నించారు. పులివెందుల్లో వైద్య ఆస్పత్రి మాత్రమే కట్టారని, ఆడపిల్లలకు హాస్టల్స్ కట్టలేదని, వారు చెట్లకింద కూర్చొని చదువుకోవాలా? అని మంత్రి ఏకిపారేశారు. 15 వైద్య కళాశాలల నిర్మాణం పూర్తికాకపోవడంతో 750సీట్లు ఆగిపోయా యన్నారు. దీనికి బాధ్యత ఎవరిదో వైసీపీ సభ్యులే సమాధానం చెప్పాలని నిలదీశారు. మంత్రి సమాధానం సభను తప్పుదోవ పట్టించేలా ఉందంటూ వైసీపీ ఎమ్మెల్సీలు వాకౌట్ చేశారు.
108 సర్వీసుపై
అరబిందో సంస్థ, 2020 నుంచి రాష్ట్రంలో 108 సేవల ముసుగులో భారీ దోపిడీకి పాల్పడిరదని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆరోపించారు. కాలింగ్ అటెన్షన్ కింద రూల్ 74కింద 108 సేవలపై ఎమ్మెల్యేలు సమాచారం కోరగా, రూ. వందలాది కోట్లు దోచుకొని సకాలంలో రోగులను ఆస్పత్రులకు చేర్చలేక పోయిందని మంత్రి విమర్శించారు. 2005లో ఈఎంఆర్‌ఐ సర్వీసులను108 ప్రారంభిం చిందని గుర్తుచేశారు. సరైన సేవలు ఇవ్వకుండా కోట్లు దండుకుని 108 వ్యవస్ధను దెబ్బతీశారని ధ్వజమెత్తారు. గోల్డెన్ అవర్‌లో వైద్య సర్వీసులు చాలా దారుణంగా ఉన్నాయని అన్నారు. 11 నుంచి 20 శాతం వరకూ మాత్రమే గోల్డెన్ అవర్‌లో రోగులను ఆస్పత్రులకు చేర్చగలిగారని మంత్రి వెల్లడిరచారు.
రిషికొండ ప్యాలెస్‌పై…
విశాఖలోని రిషికొండపై కొత్తగా నిర్మించిన భవనాలు అనే అంశంపై శాసన సభలో బీజేపీ ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, సీహెచ్ ఆది నారాయణ రెడ్డి ప్రశ్నలు లేవనెత్తారు. విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ, ‘గతంలో రిషికొండపై పర్యాటక శాఖ కాటేజీలతోపాటు హోటల్ కూడా ఉండేది. వేర్వేరు ప్రాంతాలకు చెందిన పర్యాటకులు ఇక్కడ బస చేయడంతోపాటు విశాఖ నగరవాసులు హోటల్లో అల్పాహారం తీసుకునేవారు. ఆ తర్వాత కాటేజీలను పడగొట్టడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తే పర్యాటక శాఖ అధికారులు టూరిజం రిసార్టుగా తెలిపారు. తీరా పూర్తయిన తర్వాత చూస్తే రూ. వందల కోట్లతో ప్యాలెస్ నిర్మాణం జరిగింది. సుమారు రూ.500 కోట్లతో వ్యయంలో రూ.434 కోట్లు తన అనుయాయులైన కంట్రాక్టర్లకు దోచిపెట్టారు. నిర్మాణ వ్యయాన్ని పరిశీలిస్తే చదరపు అడుగుకు రూ.28,096 ఖర్చవుతున్నట్లు స్పష్టమవు తోంది. ఇది బలహీన వర్గాలకు చెందిన 27,043 ఇళ్లతో సమానం. అంతమంది పేదలకు ఇవ్వాల్సిన ఇళ్ల సొమ్ముతో ప్యాలెస్ నిర్మించుకొని ఎన్నికల ప్రచారంలో పేదలకు, పెత్తందార్లకు మధ్య పోటీ అంటూ జగన్ చెప్పుకొచ్చారు’అని ఎద్దేవా చేశారు. ఆ ప్యాలెస్ భవనాలను దేనికి వినియోగించాలనే దానిపై నివేదిక ఇచ్చేందుకు కమిటీ నియమిస్తూ గత నవంబర్ 22న జీవో 2282 జారీ చేసింది. ఆ మరుసటి నెల 7న సీఎం నివాసం కోసం కేటాయిస్తు న్నట్లు పేర్కొంటూ, నోట్ ఇచ్చారు. ప్యాలెస్‌లోని పలు వస్తువుల రేట్లను ఈ సందర్భంగా విష్ణుకుమార్ రాజు సభకు వివరించారు.నాటి సీఎం జగన్ ‘‘కమోడ్ కోసం రూ.11,46,840, షవర్ కోసం 5,4,27,317 ఖర్చు చేశారు.
అదేంటంటే ఆటో వాషింగ్ కమోడ్ అంటూ చెప్పారు. ఇంత విలాసవంతమైన ప్యాలెస్ కట్టుకున్న జగన్ పేదవారా? అని ఆయన ప్రశ్నించారు. గతంలో జగన్ అన్న ‘పేదలు, పెత్తందారులు’ మాట లను గుర్తుచేశారు.ఈ ప్యాలెస్ కోసం ప్రజల ధనం దుర్వినియోగం చేసిన జగన్‌ను జీవితాంతం జైలులో తప్పులేదని ఆయన వ్యాఖ్యానించారు. ఇదే అంశంపై మాట్లాడేందుకు ఆదినారాయణ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు అనుమతి కోరగా, ఇది ప్రత్యేకంగా చర్చించ దగిన అంశం అంటూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు చర్చను అప్పటికి ముగించారు.
- తురగా నాగభూషణం
సీనియర్ జర్నలిస్ట్