ఆం‌ధప్రదేశ్‌ అభివృద్ధికి, రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఇప్పటికే రాష్ట్ర అభివృద్ధికి పలు ప్రాజెక్టులు మంజూరు చేయగా, రాజధాని నిర్మాణానికి రూ.15,000 కోట్లు సహాయం అందిస్తోంది. అమరావతి చుట్టూ జాతీయ రహదారుల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. అమరావతిలో నూతన రైల్వేలైన్‌ ఏర్పాటుకు గ్రీన్‌ ‌సిగ్నల్‌ ఇచ్చింది. దానితో పాటు పోలవరం నిర్మాణానికి అడ్వాన్సుగా రూ.2 వేల కోట్లు కేటాయించింది. ఇక రాజధానికి కేంద్రం నుంచి భారీ నిధుల హామీ లభించడంతో అమరావతి పునర్నిర్మాణాకి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

రాజధాని అమరావతి పునఃనిర్మాణానికి ప్రభుత్వం తిరిగి పూనుకుంది. గత ఐదేళ్లుగా అర్థంత రంగా నిలిచిపోయిన ప్రభుత్వ భవనాలతో పాటు నగర నిర్మాణాన్ని తిరిగి ప్రారంభించింది. నెలరోజు లుగా జంగిల్‌ ‌క్లియరెన్స్ ‌పనులు పూర్తికావటంతో అమరావతిలో నిర్మాణ పనులపై దృష్టి కేంద్రీక రించింది. ఇందులో భాగంగా రాయపూడి గ్రామంలో నిర్మాణంలో ఉన్న సీఆర్డీఏ, అమరావతి డెవలప్‌ ‌మెంట్‌ ‌కార్పొరేషన్‌ ‌లిమిటెడ్‌ (ఏడీసీఎల్‌), ఇతర ప్రభుత్వ భవనాలకు తుదిమెరుగులు దిద్దే ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రస్తుతం సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంతో పాటు ఏడీసీఎల్‌ ‌విజయవాడలో అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. రాజధాని పునర్ని ర్మాణం నేపథ్యంలో ముందుగా రైతులు, రైతుకూలీలు, రాజధాని గ్రామాల ప్రజల సౌలభ్యం కోసం సీఆర్డీఏ, ఏడీసీఎల్‌ ‌కార్యాలయాలను అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. జీ ప్లస్‌ 7 అం‌తస్తుల ఈ భవనాలను పూర్తి చేసేందుకు రూ. 160 కోట్లు మంజూరు చేసింది.

భవనాల పునర్నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అక్టోబరు 19న భూమిపూజ చేశారు. పనులను ఆరునెలల్లో పూర్తిచేసేలా తొలుత కార్యాచరణ రూపొందించారు. అయితే 120 రోజుల్లో (నాలుగు నెలలు)గా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. రాయపూడిలో ప్రత్యేకంగా చేపట్టిన శంకుస్థాపన కార్యక్రమాన్ని పురపాలకశాఖ మంత్రి పొంగూరు నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌ ‌కుమార్‌, ‌సీఆర్‌డీఏ కమిషనర్‌ ‌కాటంనేని భాస్కర్‌, ఏడీసీఎల్‌ ఎం‌డీ లక్ష్మీపార్థసారథి•, గుంటూరు కలెక్టర్‌ ‌నాగలక్ష్మి పర్యవేక్షించారు. ముఖ్యమంత్రికి సీఆర్డీఏ కమిషనర్‌ ‌నిర్మాణానికి సంబంధించి పవర్‌ ‌పాయింట్‌ ‌ప్రజంటేషన్‌ ఇచ్చారు. రాజధాని అమరావతికి ప్రపంచ బ్యాంక్‌ అం‌దించే రూ.15వేల కోట్ల రుణాలకు కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన నేపథ్యంలో సీఆర్డీఏ పనుల్లో స్పీడ్‌ ‌పెంచింది. రైతులకిచ్చిన రిటర్నబుల్‌ ‌ప్లాట్లలో మౌలిక సదుపాయాలతో పాటు అసైన్డ్ ‌భూముల రైతుల సమస్యలు పరిష్కరించేందుకు కార్యాచరణ రూపాందించింది. జంగిల్‌ ‌క్లియరెన్స్ ‌పూర్తయి పనులు ప్రారంభం కావటంతో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలకు గతంలో కేటాయించిన భూముల్లో కార్యాలయాల ఏర్పాటుకు సుముఖత వ్యక్తమవుతోంది. వివిధ కేంద్ర ప్రభుత్వ కార్యాల యాలు, బ్యాంకులు, జాతీయ విద్యాలయాలకు ఐదేళ్ల క్రితం అప్పటి టీడీపీ ప్రభుత్వం భూకేటాయింపులు జరిపింది. అయితే తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రకటించడంతో పాటు జాతీయ సంస్థల కార్యాలయాల ఏర్పాటుకు ఆసక్తి చూపలేదు. తిరిగి కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో ఏకైక రాజధానిగా అమరావతినే ప్రకటించి అభివృద్ధికి శ్రీకారం చుట్టిన నేపథ్యంలో కేంద్ర సంస్థలతో సీఆర్డీఏ జరిపిన సంప్రతింపులు ఫలించాయి. కార్యాలయాల నిర్మాణానికి సానుకూ లత వ్యక్తమవుతోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వ పరిధిలో విజయవాడ బైపాస్‌ ‌రోడ్డు పనులు చకచక సాగుతున్నాయి. రాజధాని నగర అంతర్గత రహ దార్లు జాతీయ, రాష్ట్ర రహదార్లకు అనుసంధాన మయ్యేలా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. దీంతో పనులు ఊపందుకున్నాయి. అమరావతిని అనుసంధానిస్తూ రైల్వేలైనుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. అమరావతికి చుట్టూతా అవసర మైన రహదారుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

సుందరనగరంగా అమరావతి

అమరావతిని అత్యంత సుందరమైన నగరంగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వం తెలిపింది. రాజధాని ప్రాంతాన్ని విశాలమైన రహదారులతో, నీటి సరఫరా, విద్యుత్‌, ఇం‌టర్నెట్‌ ‌కేబుళ్ల వంటివన్నీ భూగర్భంలోనే వెళ్లేలా బెస్ట్ ‌సిటీగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. సీఆర్డీఏ పరిధిలో రాజధాని ప్రాంత పరిధి 8,603 కిలోమీటర్లు కాగా అందులో 217 చదరపు కిలోమీటర్ల పరిధిలో రాజధాని నిర్మిస్తారు. మరో 16.9 చ.కి.మీ పరిధిలో కోర్‌ ‌కేపిటల్‌ ఉం‌టుంది. ఇదంతా అభివృద్ధి చేసేందుకు అమరావతి ప్రాంతంలో 183 కిలో మీటర్ల పరిధిలో ఔటర్‌ ‌రింగ్‌రోడ్డు (ఓఆర్‌ఆర్‌) ఏర్పాటవుతుంది. అమరావతిలో విశాలమైన రోడ్లు, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటవుతుంది.. ఐజీటీ, విద్యుత్‌, ‌వరదనీటి నిర్వహణ వ్యవస్థలతో పాటు బ్లూ, గ్రీన్‌ ‌సిటీగా అమరావతికి డిజైన్లు రూపొందించారు.

గ్రీన్‌ ఎనర్జీకి ప్రాధాన్యత

రాజధానిలో కాలుష్యం లేకుండా గ్రీన్‌ ఎనర్జీకి ప్రాధాన్యమిస్తారు. విద్యుత్‌ ‌వాహనాలను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈవీ స్టేషన్లు, నడక దారులు, సైకిల్‌ ‌ట్రాక్‌లు ఏర్పాటు చేస్తారు. ఎలక్ట్రికల్‌ ‌సైకిళ్లను పెద్ద సంఖ్యలో ప్రోత్స హించి.. 20- 30 కి. మీ.ల దూరంలోని ఆఫీసులకు వాటిపైనే వెళ్లేలా చూడాలనేది లక్ష్యం. జపాన్‌లో ఒక్కో రోడ్డులో ఒక్కో రకం పూల చెట్లు ఉంటాయి. ప్రతి సీజన్‌లోనూ ఏదో ఒక రోడ్డులో కన్నుల పండుగలా అవి పుష్పిస్తూనే ఉంటాయి. అక్కడి కొండల్నీ అలాగే తీర్చిదిద్దారు. వాటిని చూసేందుకే ప్రత్యేకంగా పర్యాటకులు వస్తారు. సెంట్రల్‌ ‌విస్టా ఏర్పాటు చేస్తారు. అమరావతికి దేశంలోని 10 అగశ్రేణి యూనివర్సిటీలు, పదిటాప్‌ ఆస్పత్రులు, 10 అత్యుత్తమ పాఠ శాలలు, 10 టాప్‌ ‌హోటళ్లు తీసుకొస్తామని ప్రభుత్వం ప్రకటించింది.ఇప్పటికే ఎయిమ్స్, ‌విఐటీ, ఎస్‌ఆర్‌ఎం, అమృత వర్శిటీలు రాగా ప్రముఖ విశ్వవిద్యాలయాలైన కేజే, ఎక్టెస్‌ఆర్‌ఐ, ‌బార్‌ ‌కౌన్సిల్‌ ఆఫ్‌ ఇం‌డియా, లా యూనివర్శిటీ, బిట్స్ ‌పిలాని కూడా రానున్నాయి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల కోసం 12 టవర్లు ఐఏఎస్‌, ఐపీఎస్‌ ‌కు ఆరు టవర్లు, ప్రిన్సిపల్‌ ‌సెక్రటరీల కోసం 90 క్వార్టర్లు, గజిటెడ్‌, ‌నాన్‌ ‌గెజిటెడ్‌ అధికారుల కోసం 4 టవర్లు, నాన్‌ ‌గజటెడ్‌ అధికారులకోసం 20 టవర్లు మొదలు పెట్టారు. న్యాయమూర్తుల కోసం 36, మంత్రులకు 35 భవనాల నిర్మాణం పూర్తిచేస్తారు. వీటితో పాటు శాసనసభ, సచివాలయం, హైకోర్టు శాశ్వత భవనాల పనులు కూడా త్వరలో ప్రారంభిస్తారు. హైదరాబాద్‌, ‌చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు దీటుగా అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్ని కలుపుకొని మహానగరంగా అభివృద్ధి చెందాలని, ఇక్కడి కోటి జనాభా ఉండాలని ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది.

సెల్ఫ్ ‌ఫైనాన్స్ ‌ప్రాజెక్టు

‘అమరావతి సెల్ఫ్ ‌ఫైనాన్స్ ‌ప్రాజెక్టు. ఉపాధికి కేంద్రంగా, పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు అవసరమైన ఆదాయం సృష్టించే వనరుగా ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వం పెట్టాల్సిన పెట్టుబడి చాలా తక్కువ. మొత్తం 54 వేల ఎకరాల్లో రైతులకు స్థలాలు కేటాయిచంగా 10-12 వేల ఎకరాలు మిగులుతుంది. దానిలో మౌలిక వసతులకు కొంత తీసేసినా, మిగిలిన భూమిని విక్రయించి ఆ నిధులతో అమరావతి నిర్మాణం పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం వచ్చాక అమరావతితో పాటు, రాష్ట్ర వ్యాప్తంగా భూముల ధరలు పెరిగాయి. విజయవాడ పశ్చిమ బైపాస్‌ ‌నిర్మాణం దాదాపు కొలిక్కి వచ్చేసింది. తూర్పు బైపాస్‌ ‌నిర్మాణం కూడా త్వరగా పూర్తిచేస్తే చిన్న రింగ్‌రోడ్డు ఏర్పాటవుతుంది. అమరావతికి అవుటర్‌ ‌రింగ్‌ ‌రోడ్డు కూడా ఏర్పాటవుతుంది. రాజధానిలో ప్రధాన రహదారుల్ని దానితో అనుసంధానం చేస్తేనే ఈ ప్రాంతం మొత్తం అభివృద్ధి చెందుతుందని, దాని నిర్మాణం వల్ల కేంద్ర ప్రభుత్వానికీ ఆదాయం పెరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటుంది. అమరావతికి భూసమీక రణలో భూములిచ్చిన రైతులకు, ఇటు ప్రభుత్వానికి ప్రయోజనం చేకూరుతోంది. అదే స్ఫూర్తితో ఓఆర్‌ఆర్‌కి కూడా రైతులు సహకరించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. రాజధాని అమరావతిలో విజయవాడ పశ్చిమ బైపాస్‌ ‌రహదారి వంతెన మీదినుంచి సీడ్యాక్సెస్‌ ‌రోడ్డు పైకి వాహనాలు దిగేలా కనెక్షన్‌ ఉం‌డాలని, ఆ మేరకు డిజైన్‌లో మార్పులు చేయాలని జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్‌ఎఐ) అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. విజయవాడ తూర్పు బైపాస్‌కు అనుసంధానిస్తూ మహానాడు జంక్షన్‌ ‌నుంచి నిడమనూరు వరకు 6 లేన్‌ల ఫ్లై ఓవర్‌ ‌నిర్మాణానికి కేంద్రం ఆనుమతిం చింది. రూ.800 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించే ఈ ప్రాజెక్టుకు త్వరలో టెండర్లు పిలిచి, వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చిలో నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. రెండున్నరేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలనేది లక్ష్యం. మహానాడు ఫ్లై ఓవర్‌, ‌విజయవాడ ఈస్ట్ ‌బైపాస్‌తో బెజవాడ ట్రాఫిక్‌ ‌కష్టాలకు చెక్‌ ‌పడనుంది. విజయవాడ నుంచి నిడమానూరు వెళ్లే మార్గంలో ప్రభుత్వాసుపత్రి జంక్షన్‌, ‌రామవరప్పాడు జంక్షన్‌, ఇన్నర్‌రింగ్‌ ‌జంక్షన్‌, ‌ప్రసాదంపాడు, ఎనికేపాడు వరకు మొత్తం కలిపి 27 ట్రాఫిక్‌ ‌జంక్షన్‌ ‌పాయింట్లు ఉన్నాయి. ప్రస్తుతం ఎన్‌హెచ్‌-16 ‌నాలుగు వరసలతో ఉంది. వాహనాల రాకపోకలతో మాటిమాటికీ ట్రాఫిక్‌ ఆగిపోతోంది. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే ప్రధానమార్గం కావటం వల్ల ఇక్కడ నెలకొన్న ట్రాఫిక్‌ ‌సమస్యకు నిడమానూరు ఫ్లై ఓవర్‌ ‌చక్కటి పరిష్కారం.

రూ.2,245 కోట్లతో అమరావతి రైల్వే లైన్‌

అమరావతి నూతన రైల్వేలైన్‌కు రూ.2,245 కోట్లతో కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. గంటకు 160 కి.మీ.వేగంతో రైళ్లు వెళ్లేలా లైనును పటిష్టంగా నిర్మిస్తారు. మూడేళ్లలో దీని నిర్మాణం పూర్తిచేస్తారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు 57 కిలోమీటర్ల మేర నిర్మిస్తారు. పెద్దాపురం, చెన్నారావుపాలెం, గొట్టు ముక్కల, పరిటాల, కొత్తపేట, వడ్డమాను, అమరా వతి, తాడికొండ, కొప్పురావూరు స్టేషన్లు నిర్మిస్తారు. అమరావతి, పెద్దాపురం, కొప్పురావూరు స్టేషన్లు పెద్దగా ఉంటాయి. గుంటూరు జిల్లా పెద కాకాని మండలం కొప్పు రావూరు, పెదకాకాని.. తాడికొండ మండలంలోని కంతేరు, మోతడక, తాడికొండ.. తుళ్లూరు మండలంలోని వడ్డమాను, పెదపరిమి గ్రామాల్లో భూసేకరణకు నోటీఫికేషన్‌ ఇచ్చారు. పరిటాల వద్ద ఎక్కువ సంఖ్యలో గూడ్స్ ‌రైళ్లు నిలిపేందుకు వీలుగా నిర్మాణాలు చేస్తారు. కొత్తపేట – వడ్డమాను మధ్య కృష్ణానదిపై 3.2 కి.మీ.మేర వంతెన నిర్మిస్తారు. విజయవాడ-గూడూరు మధ్య మూడో లైన్‌ ‌దాదాపు పూర్తయింది. రద్దీని దృష్టిలో ఉంచుకొని, నాలుగో లైన్‌ ‌కూడా ఏర్పాటు చేయనున్నారు.

పోలవరానికి అడ్వాన్స్ ‌నిధులు

పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర జలశక్తి శాఖ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.2 వేల కోట్లను అడ్వాన్స్‌గా విడుదల చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నిర్ణయం రాష్ట్రానికి భారీ ఊరటగా భావించవచ్చు. 2014 రాష్ట్ర విభజన చట్టం ప్రకారం పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. అప్పటి నుంచి ప్రాజెక్టు నిర్మాణ ఖర్చులు తొలుత రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తే.. ఆ తరువాత కేంద్రం ఆ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తోంది. అయితే, కొంత కాలంగా పోలవరం నిర్మాణంలో చోటు చేసుకున్న పరిణామాలు.. ఒక సీజన్‌ ‌నష్ట పోకుండా పనులు చేయాలంటే ముందుగా అడ్వాన్స్ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం పదే పదే కేంద్రాన్ని కోరుతోంది. పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనాలకు కొద్ది రోజుల క్రితమే కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. అందులో భాగంగా ప్రస్తుతం పోలవరం పనుల కోసం రూ 2,000 కోట్లు అడ్వాన్స్ ‌గా విడుదల చేసింది. అదే సమయంలో రీయంబర్స్ ‌మెంట్‌ ‌కింద మరో రూ 800 కోట్లను ప్రభుత్వం విడుదల చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో, పోలవరం ప్రాజెక్టుకు ఇంత భారీ మొత్తంగా ఏకంగా రూ 2,800 కోట్లు విడుదల చేయటంతో ఏపీ ప్రభుత్వానికి పెద్ద వెసులుబాటు దక్కనుంది.

-తురగా నాగభూషణం

సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE