– సింహంభట్ల సుబ్బారావు, 6300674054
మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం
ఆదాయం తగ్గి అప్పులు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. శారీరక రుగ్మతలు. కుటుంబంలో కొన్ని సమస్యలు,ఒత్తిళ్లు ఎదురవుతాయి. వ్యాపారులకు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగులకు ఊహించని మార్పులు ఉండవచ్చు. రాజకీయవేత్తలకు ప్రత్యర్థుల నుంచి ఇబ్బందులు ఎదురుకావచ్చు. 25,26తేదీల్లో పరిచయాలు పెరుగుతాయి. ఆహ్వానాలు అందు తాయి. విందువినోదాలు. శ్రీరామస్తోత్రాలు పఠించండి.
వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు
ఆస్తి వ్యవహారాలలో కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటారు. వాహనయోగం. సోదరులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. విద్యార్థులు, నిరుద్యోగులు కొత్త అవకాశాలు దక్కించుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారులకు అధిక లాభాలు. ఉద్యోగులకు విధి నిర్వహణలో ప్రోత్సాహ కరంగా ఉంటుంది. రచయితలు, క్రీడాకారులు, కళా కారులకు సత్కారాలు. 27,28 తేదీలలో దుబారా ఖర్చులు. అనారోగ్యం. శివాష్టకం పఠించండి.
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఆదాయం మరింత పెరుగుతుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారులకు లాభాలు అందుతాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. కళాకారులు, రచయితలు, పరిశోధకులకు అవకాశాలు పెరుగుతాయి. 29,30 తేదీల్లో అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. శివస్తోత్రాలు పఠించండి.
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. శుభకార్యాలలో పాల్గొంటారు. వాహనసౌఖ్యం. వ్యాపారులు అనుకున్న లాభాలు దక్కించుకుంటారు. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. రాజకీయవేత్తలు, కళాకారులు, రచయితలకు విదేశీ పర్యటనలు. 30, డిసెంబర్ 1తేదీలో శారీరక రుగ్మతలు. కుటుంబంలో ఒత్తిళ్లు. ఆంజనేయ దండకం పఠించండి.
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేసి సత్తా చాటుకుంటారు. విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు. భూములు, వాహనాలు కొనుగోలుచేస్తారు. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి ఆదరణ లభిస్తుంది. కళాకారులు, రచయితలు, పారిశ్రామిక వేత్తలకు విదేశీ పర్యటనలు ఉంటాయి. 28,29 తేదీల్లో అనుకోని ప్రయాణాలు. బంధువిరోధాలు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు
కార్యక్రమాలలో ఆటంకాలు అధిగమిస్తారు. ఆప్తుల నుంచి ముఖ్య సందేశం అందుతుంది. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. స్వల్ప అనారోగ్య సూచనలు. వ్యాపారులకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు మరింతగా అనుకూల సమయం. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు పట్టింది బంగారమే. 29,30 తేదీలలో దూరప్రయాణాలు. వేంకటేశ్వరస్వామి స్తోత్రాలు పఠించండి.
తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కార్యక్రమాలు సకాలంలో పూర్తి. ప్రయా ణా లలో కొత్త పరిచయాలు. విద్యార్థులకు అవకాశాలు దక్కుతాయి. ఆస్తి విషయంలో ఒప్పందాలు. వాహన, కుటుంబసౌఖ్యం.భూలాభాలు.వ్యాపారులకు ఆశించిన విధంగా లాభాలు. ఉద్యోగులకు ఉత్సాహ వంతంగా. పారిశ్రామిక వేత్తలు, కళాకారులు, రచ యితలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. 30,1తేదీల్లో ఖర్చులు. అనారోగ్యం. గణేశాష్టకం పఠించండి.
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ
ఆరోగ్యం కొంత కుదుటపడుతుంది. విద్యార్థులు చేజారిన అవకాశాలు తిరిగి దక్కించుకుంటారు. పరి చయాలు పెరుగుతాయి. లక్ష్యాలు సాధిస్తారు. దేవాలయ దర్శనాలు. వ్యాపారులకు ఆశించిన లాభాలు. ఉద్యోగులకు అనుకూల వాతావరణం. రాజకీయవేత్తలు, పరిశోధకులు, క్రీడాకారులకు కొత్త అవకాశాలు. 28,29తేదీల్లో వివాదాలు. మానసిక ఆందోళన. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.
ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
ముఖ్యమైన కార్యక్రమాలు కొంత జాప్యంతో పూర్తి కాగలవు. అదనపు రాబడి లభిస్తుంది. కొన్ని బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఉద్యోగయత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపారులు లాభాల బాటలో పయనిస్తారు. ఉద్యోగులకు మరింత గుర్తింపు. కళాకారులు, రచయితలు, పరిశోధకులకు నిరుత్సాహమే. 25,26తేదీల్లో ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. వివాదాలు. ఆదిత్య హృదయం పఠించండి.
మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం , ధనిష్ఠ 1, 2 పాదాలు
చేపట్టిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ఆదాయం సమృద్ధిగా ఉంటుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు కొత్త అవకాశాలు దక్కించుకుంటారు. వ్యాపారులకు లాభాలు అందుతుంది. ఉద్యోగుల సేవలకు గుర్తింపు రాగలదు. రాజకీయవేత్తలు, రచయితలు, క్రీడాకారులకు విశేష ఆదరణ. 26,27 తేదీల్లో ఆస్తి వివాదాలు. మనశ్శాంతి లోపిస్తుంది. విష్ణుసహస్ర నామ పారాయణ చేయండి.
కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
అదనపు ఆదాయం. స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. విద్యార్థులు, నిరుద్యోగులకు అవకాశాలు పెరుగు తాయి. గృహం కొనుగోలు చేస్తారు. కోర్టు వ్యవహారా లలో కొంత పురోగతి. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు సానుకూలం. కళాకారులు, క్రీడా కారులకు సన్మానాలు. 28,29 తేదీల్లో దూర ప్రయా ణాలు. సుబ్రహ్మణ్యేశ్వరుని స్తోత్రాలు పఠించండి.
మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
పలుకుబడి పెరుగుతుంది. పోటీపరీక్షల్లో నిరుద్యోగులకు విజయం. ఆస్తి వివాదాలు తీరతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారులకు మరింత లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగులకు విధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలు, రచయితలు, పరిశోధకులకు యత్నాలు సఫలమవుతాయి. 30,1తేదీల్లో దూరప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. నృసింహ స్తోత్రాలు పఠించండి.